సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు..! | Good Ranks for all four | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు..!

Published Thu, Jun 1 2017 3:17 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

Good Ranks for all four

నలుగురికి మంచి ర్యాంకులు
ఐఆర్‌ఎస్‌కు ఎంపిక  


వైవీయూ: బుధవారం రాత్రి విడుదల చేసిన సివిల్‌ సర్వీస్‌ (మెయిన్స్‌) ఫలితాల్లో జిల్లావాసులు నలుగురు మంచి ర్యాంకులు సాధించారు. కడప నగరం బాలాజీనగర్‌కు చెందిన గడికోట బాలకృష్ణారెడ్డి (ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం), రాజేశ్వరి దంపతుల కుమారుడైన గడికోట పవన్‌కుమార్‌రెడ్డి సివిల్స్‌ ఫలితాల్లో ఆలిండియా 353వ ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. గతంలో ఐఎఫ్‌ఎస్‌లో 26వ ర్యాంకు సాధించిన ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అటవీశాఖలో డీఎఫ్‌ఓగా పనిచేస్తున్నారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం రామాపురంలో, హైస్కూల్‌ విద్య కడప నగరంలోని నాగార్జున హైస్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ చిత్తూరు వెంకటేశ్వర జూనియర్‌ కళాశాలలో చదివారు. అనంతరం ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకు సాధించి   కడప నగరంలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తిచేశారు. ముంబై ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేశారు. అనంతరం సివిల్‌ పరీక్షలపై దృష్టిసారించిన ఆయన ఐఎఫ్‌ఎస్‌లో 26వ ర్యాంకు, తాజాగా విడుదలైన సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో 353వ ర్యాంకు సాధించారు. పవన్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలోని వాజీరాం కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందారు.

మెరిసిన మేరువ సునీల్‌కుమార్‌రెడ్డి..
కడప నగరం అక్కాయపల్లెకు చెందిన ఎం.ఎస్‌. వెంకటరెడ్డి (ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు మేనేజర్, పెండ్లిమర్రి), నిర్మల దంపతుల కుమారుడైన మేరువ సునీల్‌కుమార్‌రెడ్డి సివిల్స్‌ ఫలితాల్లో 354వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లా గుత్తిలో పదోతరగతి పూర్తిచేసిన సునీల్‌ ఇంటర్మీడియట్‌ విజయవాడ శ్రీచైతన్యలో చదివారు. అనంతరం బీటెక్‌ను పశ్చి మబెంగాల్‌లోని దుర్గాపూర్‌ నిట్‌లో పూర్తిచేశారు. అనంతరం రిలయన్స్‌ జియోలో ఒక ఏడాదిపాటు ఇంజినీర్‌గా సేవలందించారు. ఇటీవలే ఐఎఫ్‌ ఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ను సాధించడమే తన లక్ష్యమని తెలిపార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement