civil service
-
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్‌ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్‌ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్‌తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
యూట్యూబ్ సాయంతో గవర్నమెంట్ జాబ్..
ఒరిస్సాలోని గిరిజన తెగ. కోచింగ్‌కు డబ్బులు లేవు. ఇంట్లో ఇంటర్నెట్ రాదు.కాని జీవితంలో ఏదైనా సాధించాలి. ఇంటికి, ఊరికి దూరంగా వెళ్లి మరీ సిగ్నల్ ఉన్న చోట కూచుని యూట్యూబ్ వీడియోల సాయంతో ‘ఒరిస్సా సివిల్ సర్వీసెస్’లో ఉద్యోగం సాధించింది బిని ముడులి. సోషల్ మీడియా వల్ల కలిగిన మేలు ఇది. ఒరిస్సాలో బోండా తెగ నుంచి స్టేట్ సివిల్స్‌లో ఉద్యోగం సాధించిన మొదటి మహిళ బిని పరిచయం...ఒక్కొక్కరూ ఒక్కొక్కరూ వస్తూ ఉంటే కాసేపటికి ఆ బోండా ఘాట్ జనాలతో నిండిపోయింది. అందరూ బిని ముడులిని చూసి అభినందించేవారే. దిష్టి తీసేవారే. కారణం ఆ అమ్మాయి తమ బోండా తెగ గౌరవాన్ని పెంచింది. తమ తెగ నుంచి ‘ఒరిస్సా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్’ (ఓపిఎస్‌సి)లో ర్యాంక్ సాధించి గవర్నమెంట్ అధికారి అవుతున్న మొదటి అమ్మాయి బిని ముడులి. ‘నాకు ఉద్యోగం వస్తే నా కంటే మావాళ్లే ఎక్కువ ఆనందిస్తున్నారు’ అంటుంది 24 ఏళ్ల బిని ముడులి. మొన్నటి శనివారం విడుదలైన ఓపిఎస్‌సి ఫలితాల్లో ఎస్.టి. కోటాలో 596వ ర్యాంకు పొంది ఉద్యోగానికి అర్హత సాధించింది బిని. ఓపిఎస్‌సి 2022–23 పరీక్షకు మొత్తం 92,194 మంది అభ్యర్థులు ΄ోటీ పడితే వారిలో 683 మంది అర్హత సాధించారు. విశేషం ఏమిటంటే టాప్ టెన్ ర్యాంకుల్లో ఐదు మంది అమ్మాయిలున్నారు. అర్హత సాధించిన వారిలో 258 మంది అమ్మాయిలే.యూట్యూబ్ పాఠాలతో2020లో ఓపిఎస్‌సి పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యింది బిని. ‘నా ప్రిపరేషన్ సరి΄ోదని నాకు అర్థమైంది. కాని కోచింగ్‌కు వెళ్లేందుకు డబ్బు లేదు. అదీగాక నేను సంపాదించి ఇంటికి సాయపడాల్సిన సమయం. అందుకే ఆయుర్వేదిక్ అసిస్టెంట్‌గా పని చేయడం మొదలెట్టాను. మా ఊరిలో ఇంటర్నెట్ ఉండదు. అందుకే దగ్గరిలోని గోవిందపల్లి టౌన్‌కు వచ్చి అక్కడ యూట్యూబ్‌లో దొరికే పాఠాలతో ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్లో దొరికే మెటీరియల్‌ను చదువుకున్నాను. అనుకున్నది సాధించాను’ అంది బిని.అమ్మాయిలను స్కూళ్లకు పంపండి‘ఆడపిల్లలను బాగా చదివించండి అనేదే నా పిలుపు. చదువులోనే వారి అభివృద్ధి ఉంది. డబ్బు లేక΄ోయినా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఉచితంగా అనేక కోర్సులు, కోచింగ్‌లు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నేను అధికారి అయ్యాక స్త్రీల స్వయంసమృద్ధి కోసం పని చేస్తాను. అంతేకాదు మా బోండా తెగ కోసం వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల కోసం పని చేస్తాను’ అంది బిని.వంటలు చేస్తూ పెంచాడుఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో ముదులిపడ అనే చిన్న బోండాల ఊరు బిని ముడులిది. తండ్రి మధుముడిలి అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటచేస్తాడు. తల్లి సునమణి ఊళ్లో అంగన్వాడి కార్యకర్తగా పని చేస్తోంది. ఒరిస్సాలో మొత్తం 13 గిరిజన తెగలు అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే వాటిలో ఒకటి బోండా తెగ. ఆ తెగ నుంచి తాను బాగా చదువుకుని పైకిరావాలనుకుంది బిని ముడులి. జేపోర్లోని బిక్రమ్దేబ్ యూనివర్సిటీలో జువాలజీలో ఎంఎస్సీ చేసింది. ప్రభుత్వ అధికారి అయి ప్రజలకు సేవ చేయాలనేది బిని కల. (చదవండి: వీధుల్లో బిక్షాటన చేసే అమ్మాయి నేడు డాక్టర్‌గా..!) -
సివిల్ సర్వీసెస్ రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్ధులకు ఉచితంగా మెటిరియల్ పంపిణీ చేసింది. నాట్స్ తాజా మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతి చొరవతో ఈ 50 వేల పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు రూపొందించిన ఈ పుస్తకాలను గుంటూరులో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల ఆవిష్కరించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం పోటీ పడే పేద విద్యార్ధులకు సాయం చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టిందని రాజేంద్ర మాదల అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్ధులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. పేద విద్యార్ధుల కోసం బాపు నూతి చూపిన చొరవ ప్రశంసనీయమని, నాట్స్ చేపడుతున్న సేవ కార్యక్రమాలు సమాజంలోని యువతలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయన్నారు.50 వేల పుస్తకాలను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసే పేద విద్యార్ధులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన బాపు నూతి, రాజేంద్ర మాదలకు నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం) -
Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్‌లో ఖేద్కర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
కోచింగ్ సెంటర్లను నియంత్రించాలి!
భారీ వర్షాల కారణంగా మురుగు కాలువ పొంగిపొర్లి, ఢిల్లీలో ఒక సివిల్ సర్వీస్ శిక్షణా సంస్థలో ఉన్న నేలమాళిగ గ్రంథాలయంలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించిన దుర్ఘటనలో ముగ్గురు విద్యా ర్థులు జల సమాధి కావటం యావత్ దేశాన్ని కలచివేసింది. చని పోయిన ముగ్గురిలో ఒకరు బిహార్ లోని ఔరంగాబాద్‌కు చెందిన తానియా సోనీ తండ్రి మంచిర్యాల సింగరేణిలో సీనియర్ మేనేజర్ కావడంతో తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానియా సోనీ మృతదేహాన్ని తరలించడంలో తండ్రి విజయ్ కుమార్‌కు సహాయ సహకా రాలు అందించాల్సిందిగా ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు ఆదే శాలు జారీ చేశారు.ఢిల్లీలోని పలు కోచింగ్ సెంట ర్లలో కనీస సౌకర్యాలు లేవనీ, కోచింగ్ సెంటర్లు నరక కూపాలుగా ఉన్నా యనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి అవినాష్ దూబే అనే సివిల్స్ ఆశావహ అభ్యర్థి లేఖ రాయటంతో అందరి దృష్టి కోచింగ్ సెంటర్లపై పడింది. ప్రధానంగా మన తెలంగాణ రాజధాని హైదరా బాద్‌లో అనుమతి లేని పలు కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇవి వరంగల్, ఇతర జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల మూలంగా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్ పేట్ నిరుద్యోగుల కూడళ్ళుగా పేరుపొందాయి. దేశవ్యాప్తంగా సుమారు 80 వేల పైచిలుకు కోచింగ్ సెంటర్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. సంవత్సరానికి 70 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగు తున్నట్లు అంచనా.అడ్డూ అదుపూ లేని కోచింగ్ సెంటర్లపై మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టింది. కోచింగ్ సెంటర్లను సేవారంగంలోకి తెచ్చి వాటిపై పన్నులు వేశారు. 2024 జనవరి 18న కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. అత్యధిక కోచింగ్ సెంటర్లకు ఎటువంటి అనుమతులు ఉండవు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నామ మాత్రపు రుసుముతో ఒక వ్యాపార సంస్థగా నమోదు చేసుకుంటారు. భవన యజమానులు అగ్నిమాపక శాఖ విధించిన రక్షణ నిబంధనలు పాటించరు. గృహ అవస రాలకు అని అనుమతి తీసుకుని ఆ భవనాలనే కోచింగ్ సెంటర్లుగా వాడుతూ విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందు తున్నారు, ఎంతెంత ఫీజులు చెల్లిస్తున్నారు అనే లెక్కలు ఉండవు. తరగతి గదిలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి పైన జీఎస్టీ వంటి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. పైగా వెలుతురు లేని గదుల్లో 100 మంది కూర్చోవాల్సిన చోట 500 మందికి బోధిస్తున్నారు. కనీస మౌలిక సౌకర్యాలు ఉండవు. వీటి కన్నా కన్నా జైళ్ళు నయమనే భావన కలుగుతుంది. జైళ్ళలో మరుగుదొడ్లు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా జైలు గదుల్లో వెలుతురు ఉంటుంది. నిబంధనల ప్రకారం గదిలో లెక్కకు మించి ఖైదీలను ఉంచరు.అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ సరైన భద్రతా ప్రమా ణాలు పాటించని కోచింగ్ సెంటర్లను నియంత్రించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇటీవల హరి యాణా ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నమోదు నియంత్రణ బిల్లు–2024ను తెచ్చి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసింది. అట్లాగే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చట్టం తెచ్చి, తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా విద్యార్థి నిరు ద్యోగుల శ్రేయస్సుకు పాటుపడాలి.– కోటూరి మానవతా రాయ్, వ్యాసకర్త టీపీసీసీ అధికార ప్రతినిధి; తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, 90009 19101 -
యూపీఎస్సీపై మరక తొలగేదెలా?
ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ వివాదం యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియలోని లోపాలను ఎత్తిచూపింది. పదవిలో ఉన్నప్పుడే కాకుండా, పదవీ అనంతరం కూడా ఎన్నో అత్యున్నత నియామకాలను సివిల్ సర్వీసెస్ వాళ్లు పొందుతున్నారు. అలాంటప్పుడు ఇందులోకి ఎలాగోలా ప్రవేశించడానికి న్యాయమో, అన్యాయమో ఒక కోటాను వాడుకోవడానికి అవకాశం ఉంది. బుగ్గకారు, అధికారిక వసతి వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే స్వార్థపరులకు ఈ వ్యవస్థ తలుపులు తెరిచి ఉంచింది. అన్ని దశలలో క్లిష్టమైన మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే సివిల్ సర్వీస్ కోసం వైకల్యం కోటాలో మానసిక వైకల్యాన్ని అనుమతించడంలోని హేతుబద్ధతను సిబ్బంది–శిక్షణా సంస్థ(డీఓపీటీ) తప్పనిసరిగా వివరించాలి. వ్యవస్థను సంస్కరించడానికీ, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికీ నిర్మాణాత్మకమైన బహుముఖ విధానం అవసరం.ఐఏఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ చుట్టూ అలుముకున్న వివాదం ఏమిటంటే, ట్రెయినీ ఐఏఎస్‌గా పుణె కలెక్టరేట్లో నియమితురాలైన ఆమె బంగ్లా, కారు లాంటివి కావాలని అల్లరి చేయడమే! ఇది తెలిసి మన అత్యున్నత శిక్షణా విభాగం అంతా బాగానే ఉందా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. నేడు అందరి దృష్టీ ఖేడ్కర్ మీద ఉంది. కానీ ఈ ఉదంతంపై త్వరలోనే సిబ్బంది, శిక్షణా విభాగం(డీఓపీటీ) అదనపు కార్యదర్శి నివేదిక వెల్లడించిన తర్వాత, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) స్వయంగా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ ఉదంతాన్ని ఖేడ్కర్తో ప్రారంభించాలంటే, రెండు వేర్వేరు పేర్లతో వైకల్య ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆమె మనస్సులో ఏముంది అనేది ఆలోచించాలి. ఆమె మొదటి సందర్భంలో ఏ విభాగపు వైకల్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు? కొన్ని మీడియా వార్తలు సూచించినట్లుగా ఆమె వాస్తవానికి మరొకదానికి మారారా లేక మరో వక్రమార్గాన్ని జోడించారా? ఆమె తండ్రి ప్రకటించిన వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల గరిష్ఠ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, నాన్–క్రీమీలేయర్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ధ్రువీకరణను ఎలా పొందగలిగారు? అక్కడి తహసీల్దార్ కూడా ఖేడ్కర్ తండ్రీ కూతుళ్ల కోరిక మేరకు ఈ సృజనా త్మక రచనలో తన సముచిత వాటాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.వైకల్యాలున్న వ్యక్తుల హక్కుల (ఆర్పీడబ్ల్యూడీ) చట్టం– 2016, దీర్ఘకాలిక ప్రాతిపదికన ఒక నిర్దిష్ట విభాగంలో కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లుగా, వైద్యాధికారి ధ్రువీకరించిన వ్యక్తినే ‘బెంచ్‌మార్క్ వైకల్యం’ ఉన్న వ్యక్తిగా నిర్వచించింది. ‘మానసిక వికలాంగుల’ విభాగంలో ఉపాధి కోసం ఆమోదించబడిన వైకల్యపు కనీస శాతం 35. ఖేడ్కర్ ఉదంతంలో చాలామంది ఆమె 35 శాతం మానసిక వైకల్యం సమీపంలో కూడా లేదనీ, తన కేసును ముందుకు తీసుకు రావడానికి ఆమె ఉదహరించిన రెండు వైకల్యాల్లో ఇది ఒకటనీ హామీపూర్వకంగా చెబుతున్నారు.పూజా ఖేడ్కర్ కేసు సముద్రంలో నీటిబొట్టంతే కావచ్చు. సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ నిస్సందేహంగా, కొన్ని వందల ఉద్యోగాల కోసం లక్షకుపైబడిన వార్షిక దరఖాస్తుదారులతో తీవ్రాతితీవ్రమైన పోటీతో కూడి ఉంటుంది. అభ్యర్థులు వాస్తవానికి, డబ్బు, సమయం పరంగా భారీగా పెట్టుబడి పెడతారు. సగటున, వారు తమ అమూల్య మైన కాలంలో రెండు–మూడు సంవత్సరాలు కేవలం సన్నాహకాల్లోనే గడుపుతారు. ఉత్తమంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, దానిని సాధించే విషయంలో అత్యంత చురుకైన వారికి కూడా ఎలాంటి హామీ ఉండదు. అటువంటి అత్యున్నత ప్రయోజనాలతో కూడిన వ్యవస్థలో న్యాయమో, అన్యాయమో వైకల్యం సహా వివిధ కోటాలను పోస్టుకు హామీగా ఉపయోగించుకోవడానికి చాలామంది ఆకర్షితులు కావచ్చు. విచారణ పరిధిని విస్తరించడానికి అన్ని వైకల్య కేసులను ఈ దృక్కోణం నుండి చూడటం సిబ్బంది–శిక్షణా సంస్థ(డీఓపీటీ)కి మంచిది.సివిల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించడానికి అభ్యర్థులు ఎంత దూరమైనా వెళతారు అనేందుకు తగు కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది సర్వీసులో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా ప్రతిష్ఠాత్మకమైన, సవాలుతో కూడిన కెరీర్ ఎంపికలను వాగ్దానం చేస్తుంది. చాలామంది మాజీ సివిల్ సర్వెంట్లను ప్రభుత్వం ట్రిబ్యునళ్లు, కమిషన్లు, రెగ్యులేటరీ అథారిటీలు, గవర్నర్ పదవులకు కూడా నియస్తుంటుంది. పలువురు వ్యక్తులు ప్రైవేట్ రంగంలో కూడా అత్యున్నత నియామకాలను అందుకుంటారు. అతి పెద్ద కన్సల్టింగ్ సంస్థలు ఇప్పుడు నయా ట్రెండ్! ప్రభుత్వం లోపల తమ నెట్వర్క్ లను ప్రభావితం చేయాలనే ఆశ వీరికుంటుంది.సర్వీసులో ఉండగానే వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. ఇరవైల మధ్య నుండి చివరి వరకు మాత్రమే వయస్సు గల ఒక వ్యక్తి తరచుగా చిన్న ఐరోపా దేశాల పరిమాణంలో ఉన్న జిల్లాకు ప్రపంచంలో మరెక్కడైనా నాయకత్వం వహించగలరా?అన్ని దశలలో క్లిష్టమైన మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే సివిల్ సర్వీస్ కోసం వైకల్యం కోటాలో మానసిక వైకల్యాన్ని అనుమ తించడంలోని హేతుబద్ధతను సిబ్బంది, శిక్షణా సంస్థ(డీఓపీటీ) తప్పనిసరిగా వివరించాలి. కీలకమైన మరొక ప్రశ్న ఏమిటంటే యూపీఎస్సీ పరీక్ష సమర్థత గురించి! పునరావృత అభ్యసన, అరగంట ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇవ్వడమే అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఉత్తమమైన మార్గమా? సమగ్రత, సహానుభూతి, సాను కూల నాయకత్వం, సమస్య పరిష్కారం వంటి లక్షణాలను అస్సలు అంచనా వేయలేము. డిఫెన్స్ సర్వీసెస్ విషయంలో లాగా కాకుండా, ఇక్కడ యోగ్యతా పరీక్ష లేదు. తత్ఫలితంగా, మన సివిల్ సర్వీసులను నిర్వహించే విషయంలో ప్రస్తుత సందర్భంలో లాగా, మనకు తక్కువ భావోద్వేగాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. బుగ్గకారు, అధికారిక వసతి వంటి అప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే స్వార్థపరులకు ఈ వ్యవస్థ తలుపులు తెరిచి ఉంచింది.దరఖాస్తుదారులకు ప్రయోజనాలను తగ్గించడానికీ, తద్వారా మోసం, రిగ్గింగ్ అవకాశాలను తగ్గించడానికీ ఒక మార్గం ఏమిటంటే ఎంపిక ప్రక్రియ వ్యవధిని తగ్గించడం. బహుశా సాంకేతికతను ఉపయోగించడం. ప్రతి దశలో మూల్యాంకన ప్రమాణాలు, మార్కింగ్ ప్రమాణాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేయడం ద్వారా పారదర్శకతను పెంచడం అవసరం. తద్వారా సవాళ్లు అధిగమించబడతాయి, పరిష్కరించబడతాయి. వాస్తవానికి, అడ్మినిస్ట్రేటివ్ స్థానాల్లోకి అధిక అర్హత కలిగిన నిపుణులు, డొమైన్ నిపుణుల ప్రవేశం కేవలం పేరును బట్టి ఉండకూడదు. బలమైన పార్శ్వ ప్రవేశ ప్రక్రియ సివిల్ సర్వీసును దాని యధాస్థానంపై నిలిపి ఉంచుతుంది.యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత దేశ సివిల్ సర్వెంట్లు వారి ఉద్యోగాల కోసం శిక్షణ పొందే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ భారీ పాత్రను పోషించాలి.రెండు సంవత్సరాల శిక్షణ ఒక అధికారి భవిష్యత్తుకు, ఆమె/అతను పరిస్థితులతో వ్యవహరించే విధానానికి పునాది వేస్తుంది. పేద గిరిజన రైతు జక్తు గోండ్‌పై కార్యకర్త హర్‡్ష మందర్ చేసిన కేస్ స్టడీలు నేటికీ చాలామంది మనస్సులలో నిలిచిపోయాయి. పేదరికానికి సంబంధించిన సమస్యలతో వ్యవహరించడంలో ఇవి ఒక తరం అధికారులను ప్రభావితం చేస్తూ వచ్చాయి.విచ్ఛిన్నమైన వ్యవస్థలతో పోరాడటం కంటే మనం వాటిని సరిదిద్దాలి. ఒక ప్రక్రియపై, దాని న్యాయబద్ధతపై మనకు విశ్వాసం ఉంటే, మనం ఫలితాలను ఆమోదించగలము. ఏదైనా వ్యవస్థను సంస్కరించడానికీ, ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించడానికీ నిర్మాణాత్మకమైన బహుముఖ విధానం అవసరం. రోజులు గడు స్తున్నకొద్దీ, ఎంపిక ప్రక్రియను మోసగించిన అధికారుల ప్రవేశానికీ, ఇటీవలి నీట్ వైఫల్యానికి దారితీసిన లోపాలకూ మధ్య వింతైన సారూప్యత నొక్కి చెప్పబడుతోంది. ఫలితంగా ఈ దేశవ్యాప్త పరీక్షలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటివి జరగకుండా చేయలేని మన లాంటి విశాల దేశానికి ఇది దురదృష్టకరం. వ్యవస్థను సరిగ్గా అమర్చడంలో, దానిపై విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో డీఓపీటీ, యూపీఎస్సీ సరిగ్గా వ్యవహరిస్తాయని ఆశిద్దాము.– అశోక్ ఠాకూర్ ‘ కేంద్ర మాజీ విద్యా కార్యదర్శి– ఎస్.ఎస్. మంథా ‘ ‘ఏఐసీటీఈ’ మాజీ చైర్మన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Smita Sabharwal: ‘ఏఐఎస్‌కు దివ్యాంగులెందుకు?’
సాక్షి, హైదరాబాద్: ‘వైకల్యం కలిగిన పైలట్‌ను ఏదైనా విమానయాన సంస్థ ఉద్యోగంలో తీసుకుంటుందా? వైకల్యం కలిగిన శస్త్రచికిత్స నిపుణుడిపై మీరు నమ్మకం ఉంచుతారా? మరీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సేవల (ఏఐఎస్) (ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఎస్ తదితర) ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?’అని సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ‘ఎక్స్’వేదికగా ఆదివారం ప్రశ్నించారు. ఉద్యోగ స్వభావ రీత్యా అఖిలభారత సేవల అధికారులు క్షేత్రస్థాయిలో గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ప్రజల విన్నపాలను నేరుగా వింటూ పనిచేయాల్సి ఉంటుందని, దీనికి శారీరక ఆరోగ్యం అవసరమని స్పష్టం చేశారు. స్మితా వ్యాఖ్యలు సరికాదు.. వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, మేధోశక్తిపై ప్రభావం చూపవని సీనియ ర్ సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ, బ్యూరోక్రాట్లు తమ సంకుచిత స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతు ర్వేది విమర్శించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదని ఆమె వారికి క్షమాపణ చెప్పాలని, వికలాంగుల కమిషన్ ఆమెపై కేసు నమోదు చేయాలని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ కనీ్వనర్ నారా నాగేశ్వరరావు ఆదివారం ప్రకటనలో వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. -
సివిల్స్‌లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఓ మోడల్ గ్లామర్ రంగంలో రాణిస్తూ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఎగ్జామ్ వైపుకి అడుగులు వేసింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గ్లామరస్ రోల్‌కి విభిన్నమైన రంగంలోకి అడుగుపెట్టడమే గాక ఎలాంటి కోచింగ్ లేకుండా విజయ సాధించి అందరికీ స్పూర్తిగా నిలిచింది ఈ మోడల్. ఆమె ఎవరంటే..రాజస్థాన్‌కు చెందిన ఐశ్వర్య షియోరాన్ సైనిక నేపథ్య కుటుంబానికి చెందింది. అందువల్లే ఆమె దేశానికి సేవ చేసే ఈ సివిల్స్ వైపుకి మళ్లింది. ఆమె తన ప్రాథమిక విద్యనంతా చాణక్యపురిలోని సంస్కతి పాఠశాల్లో పూర్తి చేసింది. ఇంటర్లో ఏకంగా 97.5 శాతం మార్కులతో పాసయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మోడలింగ్ పోటీల్లో పాల్గొంది. అలా మొదలైన ఆమె ప్రస్థానం పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొనడంతో సాగిపోయింది. ఆ విధంగా ఆమె 2015లో మిస్ ఢిల్లీ కిరీటం, 2014లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్, 2016లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ మోడలింగ్ అనేది ఆమె అమ్మకల అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది ఐశ్వర్య. ఆ తర్వాత కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2018లో ఐఐఎం ఇండోర్‌కు ఎంపికైన తాను సివిల్స్ వైపే దృష్టి సారించినట్లు తెలిపారు. అలా 2018-2019లో సివిల్స్ ప్రిపరేషన్లో మునిగిపోయింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తనకు తానుగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నలోనే సివిల్స్ 2019లో విజయం సాధించి..93వ ర్యాంక్ సాధించారు. తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ..ఇక తాను ఈ సివిల్స్ ప్రిపరేషన్ కోసం 10+8+6 టెక్నిక్ ఫాలో అయ్యానని చెప్పారు. అంటే పదిగంటలు నిద్ర, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర కార్యకలాపాలు. ఇక కోచింగ్ దగ్గర కొచ్చేటప్పటికీ వారి వ్యక్తిగత అభిరుచికి సంబధించింది అని అన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు సాధించగలమా లేదా అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే దిగాలి అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. ఇక ఆమె తండ్రి విజయ్ కుమార్ ఆర్మీలో కల్నల్. ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి. రాజస్థాన్‌లో జన్మించిన ఐశ్వర్య ఢిల్లీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈ మధ్యే తెలంగాణలో రాష్ట్రం కరీంనగర్‌కు బదిలీ అయ్యింది. కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ప్రస్తుతం ఐశ్వర్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. మోడల్ నుంచి ప్రజలకు సేవ చేసే అత్యున్నత రంగంలోకి రావడమే గాక కేవలంలో ఇంట్లోనే జస్ట్ పదినెల్లలో ప్రిపేర్ అయ్యి సివిల్స్‌లో విజయం సాధించింది. తపన ఉంటే ఎలాగైనా సాధించొచ్చు అనేందుకు స్ఫూర్తి ఐశ్వర్యనే అని చెప్పొచ్చు కదూ..!(చదవండి: కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!) -
Wardah Khan: ఇంట్లో ప్రిపేరయ్యి విజేతల వీడియోలు చూసి
యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్ సివిల్స్ కల కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గతంలో ర్యాంక్ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా వార్దా ఖాన్‌ను ‘మాక్ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్ రెండో అటెంప్ట్‌లోనే సివిల్స్‌ను సాధించింది. 18వ ర్యాంక్ సాధించి సగర్వంగా నిలుచుంది. ఇంటి నుంచి చదువుకుని వార్దాఖాన్ది నోయిడాలోని వివేక్ విహార్. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్‌కు ప్రిపేర్ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్ అయ్యింది. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్. ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్‌కు ప్రిపేర్ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్ కొట్టినప్పుడు ఈ సిలబస్ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్‌ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె. పది లక్షల మందిలో 2023 యు.పి.ఎస్.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్ రాశారు. 14,624 మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా. -
సెల్యూట్ టు కల్నల్ స్వప్న రాణా
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్‌లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్‌లాంటి బాలీవుడ్ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న ఆ తరువాత సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతూనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీ సర్గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్లు ఎన్నో అందుకుంది. -
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత సరీ్వసులకు ఉద్యోగుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన యూపీఎస్సీ–2023 మెయిన్స్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మెయిన్స్ పరీక్షలను గత సెపె్టంబర్లో నిర్వహించడం తెలిసిందే. గత మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలను దాదాపు 13 లక్షల మంది రాశారు. 15 వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో దాదాపు 2,500 మంది తాజాగా ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్టు సమాచారం. ఇంటర్వ్యూ తేదీలతో త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి మొత్తం 1,105 మందిని సివిల్ సరీ్వసులకు యూపీఎస్సీ ఎంపిక చేయనుంది. -
సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు.. తేల్చేసిన యూపీఎస్సీ?
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. కాగా యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులకు ఒకే ర్యాంక్ వచ్చింది. ముందుగా సివిల్స్‌కు ఎంపిక అవ్వడంతో అంతులేని ఆనందానికి లోనయ్యారు. తమ శ్రమ ఫలించిందనుకున్నారు. ఇంతలోనే తన పేరు, ర్యాంకు, రోల్ నంబర్లతో మరో అమ్మాయి ఉందని తెలియడంతో నిర్ఘాంతపోయారు. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. ఒకే పేరుతో ఇద్దరు దేవాస్ జిల్లాకు చెందిన ఆయేషా ఫాతిమా (23), అలీరాజ్‌పూర్‌కు చెందిన ఆయేషా మక్రాని (26) ఇద్దరూ ఇటీవల వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాల్లో అర్హత సాధించారు. వారిరువురికీ 184వ ర్యాంకు వచ్చింది. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా ఒకటే. దీంతో అసలు సమస్య వచ్చిపడింది. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ ఇద్దరూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు చేశారు. చదవండి: చితికి చేరుతున్న చీతాలు.. ‘ప్రాజెక్ట్ చీతా’పై కొత్త కమిటీ తేల్చేసిన యూపీఎస్సీ వారిద్దరి అడ్మిట్ కార్డులను గమనిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింది. వీరిద్దరికీ ఏప్రిల్ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. అయితే.. మక్రానీ అడ్మిట్‌కార్డులో గురువారం ఉండగా.. ఫాతిమా కార్డులో మంగళవారం అని స్పస్టంగా ఉంది. క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్‌కార్డులో యూపీఎస్సీ వాటర్ మార్కుతోపాటు క్యూఆర్ కోడ్ సైతం ఉంది. మక్రానీ అడ్మిట్‌కార్డుపై ఇవేం లేవు. దీంతో యూపీఎస్సీ అధికారులు ఫాతిమానే అసలు అభ్యర్థి అని పేర్కొన్నారు. మరోచోట కూడా మరోవైపు తుషార్ అనే పేరుతోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. తమకు 44వ ర్యాంక్ వచ్చిందని హరియాణాకు చెందిన తుషార్, బిహార్‌కు చెందిన తుషార్ కుమార్ చెప్పారు. దీంతో దర్యాప్తు చేపట్టిన యూపీఎస్పీ.. బిహార్‌కు చెంది తుషార్ కుమార్ నిజమైన అభ్యర్థిగా గుర్తించింది. ఆయేషా మక్రాని (26)తో సహా బిహార్‌కు చెందిన తుషార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు యూపీఎసీ పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షల్లో మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగబోవని హామీ ఇచ్చారు. చదవండి: లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ -
యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలు ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఇంటర్వ్యూలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలను మే 22వ తేదీలోపు ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి యూపీఎస్సీ 861 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేయగా, ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 2,529 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలు విడుదలైన తర్వాత టాప్ ర్యాంకర్ల ఇంటర్వ్యూలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
సివిల్ సర్వీస్ అధికారులపై బీజేపీ నేత ‘బందిపోటు’ కామెంట్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీపీఎస్సీ) ద్వారా నియమితులైన అధికారుల్లో చాలామంది బందిపోట్లే అంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోడి దొంగకు అయినా శిక్ష పడుతుందేమో గానీ మినరల్ మాఫియాను నడుపుతున్న అధికారులను అస్సలు టచ్ చేయలేం అన్నారు. ఈ మేరకు బాలాసోర్ జిల్లాలో బలియాపాల్‌లోని ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒడిశా ఎంపీ, గిరిజన వ్యవహారాలు, జలశక్తి సహాయ మంత్రి బిశేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను ఢిల్లీలో ఉండగా సివిల్ సర్వీస్ కార్యాలయం తన నివాసం వెనకాలే ఉండేదని, దానిపట్ల ఎంతో గౌరవం ఉండేదన్నారు. అప్పట్లో తనకు ఆ సర్వీస్ ద్వారా నియమితులైన వారందరూ అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులని, ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉంటారనే భావన ఉండేదన్నారు. కానీ ఇప్పుడు తన ఆలోచన మారిందన్నారు. అక్కడ నుంచి వచ్చిన వారిలో చాలామందిని బందిపోటు దొంగలుగా భావిస్తున్నానని చెప్పారు. అలా అని నూటికి నూరు శాతం అందరూ అలానే ఉన్నారని చెప్పడం లేదు. కొంతమంది మాత్రం అలానే ఉంటున్నారని నొక్కి చెప్పారు. మన విద్యా వ్యవస్థలో నైతికత లేకపోవటం వల్లే ఇలాంటి చదువుకున్న వ్యక్తుల అవినీతిని సమాజం భరించాల్సి వస్తోందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: జంషెడ్‌డ్‌పూర్‌లో ఘర్షణ..రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) -
శతమానం భారతి: లక్క్ష్యం 2047 సివిల్ సర్వీసులు
రాజ్యాంగ నిర్మాణ సభలో ఆనాటి సభ్యులు చాలామంది ఐసీఎస్‌ను రద్దు చేయాలని సూచించారు! పాలనకు ఆయువు పట్టయిన భారత సివిల్ సర్వీసు (ఐసీఎస్) లను రద్దు చేయాలని వారు సూచించడానికి తగిన కారణమే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఉన్న ఈ వ్యవస్థలో ఆనాటి ఐసీఎస్ అధికారులు అనేకమంది నిరంకుశంగా తమ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజలపై పెత్తనం సాగిస్తుండేవారు. అయితే రద్దు అనేది పరిష్కారం కాదనీ, ఐసీఎస్‌ను కొనసాగించడమే మేలని సర్దార్ వల్లభాయ్ పటేల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐసీఎస్ ఒక్కటే కాదు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఓఎస్ వంటి సర్వీసులను కూడా సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక, సామాజిక, మానవహక్కుల సాధన సుళువు అవుతుందని పటేల్ భావించారు. బ్రిటిష్ ఇండియాలో ఐసీఎస్ 1854లో ప్రారంభం అయింది. అందుకు నేపథ్యం.. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసే అధికారులను ఇండియన్ సివిల్ సర్వీసులలో నియమించాలని బ్రిటిష్ అధికారి మెకాలే ప్రతిపాదించడం. ఆ ప్రతిపాదనతో ఆయన పార్లమెంటుకు నివేదికను సమర్పించిన అనంతరం సివిల్ సర్వీస్ కార్యరూపం దాల్చింది. 1855లో బ్రిటన్‌లో తొలి ఐసీఎస్ పరీక్ష జరిగింది. తర్వాత 1922 లో తొలిసారి భారతదేశంలోనే ఈ పరీక్షను నిర్వహించారు. అమృతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో సివిల్ సర్వీసుల వ్యవస్థను మరింత మెరుగ్గా ప్రజాప్రయోజనార్థం సంస్కరించేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. (చదవండి: నేను నమ్ముతున్నాను) -
సీసీజీ లేఖ రాజకీయ ప్రేరేపితం
న్యూఢిల్లీ: దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల రాసిన బహిరంగ లేఖలో మాజీ సివిల్ సర్వీస్ అధికారులు చేసిన ఆరోపణలను మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ మాజీ అధికారులు తీవ్రంగా ఖండించారు. వారి లేఖ రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. కానిస్టిట్యూషన్ కాండక్ట్ గ్రూప్(సీసీజీ) పేరిట 108 మంది మాజీ సివిల్ సర్వీసు అధికారులు రాసిన లేఖలో నిజాయతీ లేదని తేల్చిచెప్పారు. మోదీకి అండగా నిలుస్తున్న ప్రజల పట్ల వారి ఆక్రోశం ఇందులో వ్యక్తమవుతోందన్నారు. ఈ మేరకు ‘కన్సర్న్డ్ సిటిజెన్స్’ పేరిట 8 మంది మాజీ న్యాయమూర్తులు, 97 మంది మాజీ ఉన్నతాధికారులు, 92 మంది మాజీ సైనికాధికారులు ప్రధాని మోదీకి తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీసీజీ లేఖలోని ఆరోపణలను ఇందులో తిప్పికొట్టారు. సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కన్వల్ సిబల్, శశాంక్, ‘రా’ మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి తదితరులు ఇందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేష బీజాలు నాటే కుతంత్రలు సాగవని తేల్చిచెప్పారు. -
ఒక క్లిక్‌తో ఏపీఐఐసీ సేవలు..14 సేవలు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ఇకపై ఫైళ్లు పట్టుకొని వారాలు, నెలలు పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే వారికి అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఏపీఐఐసీ ఆన్లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గడువులోగా పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు తక్షణమే ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి జోనల్ మేనేజర్లు కలిసి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 14 సేవలకూ ఒకటే అప్లికేషన్ సింగిల్ విండో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఏపీఐఐసీకి చెందిన అన్ని సేవలను పొందవచ్చని ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. తొలిదశలో 14 సేవలను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలో ఏ సేవ పొందాలన్నా ఆన్లైన్లో ఒకే అప్లికేషన్ ఫామ్ నింపితే సరిపోతుందన్నారు. పరిశ్రమ పేరు మార్చుకోవడం, కేటాయింపుల బదిలీ, ఇతర మార్పులు, లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ , 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టు అమలుకు గడువు పెంపు, ముందస్తు చెల్లింపుల గడువు పెంపు వంటి 14 సేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వీటిని 15 రోజుల నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ప్రస్తుతం చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతోందని, దాని నియంత్రణ కోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: సందడిగా కలెక్టరేట్లు.. వేలాది మందితో భారీ ర్యాలీలు..ఊరూరా పండుగ వాతావరణం) -
అడవిబిడ్డలకు ఉన్నత విద్యను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
స్వాతంత్య్ర సమరయోధుల గ్రామంలో మరో ఇద్దరు తెలుగు తేజాలు
సివిల్ సర్వీసెస్.. ఎంతోమందికి తీరని కల. ఎందరో తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒక్కరైనా దీనిని సాధించాలని ఆశ. మరి అలాంటి కల ఒకే ఇంట్లో అన్నదమ్ములిద్దరూ ఒకేసారి సాధిస్తే.. వారి ఆనందానికి, తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉంటాయా? అయితే ఈ అరుదైన ఘనతను గుండుగొలనుకు చెందిన అన్నాదమ్ములు జగత్‌సాయి, వసంతకుమార్ సాధించారు. సాక్షి, భీమడోలు(పశ్చిమ గోదావరి): సివిల్స్‌లో 32వ ర్యాంక్‌తో అన్న ఐఏఎస్, 170వ ర్యాంక్‌తో తమ్ముడు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా మంచి సంపాదన ఉన్నా ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగాలను వదిలి సివిల్స్ బాట పట్టారు. నాలుగు సార్లు విఫలమైనా ఐదో ప్రయత్నంలో అన్న, రెండో ప్రయత్నంలోనే తమ్ముడు విజేతలుగా నిలిచి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. అన్నదమ్ములిద్దరూ ‘సాక్షి’తో తమ మనోగతాన్ని ఇలా పంచుకున్నారు. సివిల్స్‌లో నాలుగుసార్లు విఫలమైనా.. ఇప్పుడు నేరుగా ఐఏఎస్‌కి ఎంపికవడం ఏమనిపిస్తోంది? జగత్‌సాయి : చాలా సంతోషంగా ఉంది. 2015 నుంచి 2021 వరకు సివిల్స్ పరీక్షలు రాశా. సరైన మార్గదర్శకులు లేక తొలి విడత ప్రాథమిక పరీక్షల్లో విఫలమయ్యా. తర్వాత ఇంటర్వ్యూ దశకు వెళ్లినా అతి విశ్వాసం, ఇతర పొరపాట్ల వల్ల ర్యాంకు సాధించలేకపోయా. అయినప్పటికీ అమ్మ, నాన్న నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో 32వ ర్యాంకుతో ఐఏఎస్‌ను సాధించి తల్లిదండ్రుల కలను సాకారం చేశా. 2014లో బీటెక్ పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికై విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పూనే, చైన్నైలో పనిచేశా. జీతం బాగున్నా నాకు సంతృప్తినివ్వలేదు. కొన్ని నెలలే పనిచేసి రిజైన్ చేశా. సాధన ఏలా సాగింది? జగత్‌సాయి : సివిల్స్‌లో ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ముఖాముఖి మూడు దశలూ ముఖ్యమే. ప్రాథమిక పరీక్షల్లో అన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. సన్నద్ధత సమయంలో అలాంటివి సాధన చేసేవాడిని. ఎక్కువగా నమూనా పత్రాలు వేగంగా పూర్తి చేసేవాడిని. దీంతో ఏ సబ్జెక్టుకు సంబంధించి వాటిలో బలహీనంగా ఉన్నమో తెలుసుకుని అందుకు అనుగుణంగా సాధన చేశా. మెయిన్స్‌లోని వ్యాసరూప పరీక్షల్లో చరిత్ర, ఆర్థికం, రాజనీతి, భూగోళశాస్త్రం అంశాలపై ఎక్కువగా అవగాహన పెంచుకున్నాను. రెండో ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. ఎలా సాధ్యమైంది ? వసంతకుమార్ : నాన్న విద్యుత్ శాఖ ఏఈగా పని చేస్తుండడంతో నేను ఇంజినీర్ కావాలని అనుకున్నా. అన్నయ్య కార్పొరేట్ సెక్టార్లో పనిచేసి రిజైన్ చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండటంతో తన బాటలో నడిచా. సివిల్స్‌లో పట్టు సాధించడం ఎలాగో అన్నయ్య నుంచి నేర్చుకున్నా. ఇద్దరం కలిసి అనేక అంశాలపై చర్చించుకునేవాళ్లం. తొలి ప్రయత్నంలో ప్రిలిమినరీలో విఫలమయ్యా. రెండో ప్రయత్నంలో 170వ ర్యాంకు సాధించి ఐపీఎస్ సాధించడం సంతోషంగా ఉంది. సివిల్స్‌లో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి? జవాబు : సమాజ సేవ, సంస్కృతి, సత్సంబంధాలు తదితర అంశాలు ఉన్న సబ్జెక్ట్ కావడంతో ఇద్దరం ఆంత్రోపాలజీని ఎంచుకున్నాం. హైదరాబాద్‌లో నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్నాం. ఢిల్లీలో నిపుణుల ఇంటర్వ్యూలు ఎదుర్కొనడం, మెలకువలు, ఇతర అంశాలపై శిక్షణ తీసుకున్నాం. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో క్లాస్‌లు విన్నాం. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు స్టడీ నడిచేది. 11, 12 తరగతుల సీబీఎస్ఈ పాఠ్యపుస్తకాలు, రోజూ దినపత్రికలు చదివేవాళ్లం. ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కొన్నారు? జవాబు : ఇంటర్వ్యూలో అభ్యర్థిని అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. సమకాలీన అంశాలపైనే ప్రశ్నలు ఎక్కువ. వీటికి సమాధానాలు మనోనిబ్బరంతో సూటిగా, స్పష్టంగా చెబుతున్నదీ లేనిదీ పరిశీలిస్తారు. ఏపీ నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లడంతో స్థానిక సమస్యలపై ప్రశ్నలు అడిగారు. వ్యవసాయం, ఆక్వా కల్చర్, మూడు రాజధానులపై అభిప్రాయాలు అడిగారు. జిల్లా, గ్రామం ప్రాధాన్యత వివరాలు చెప్పాం సివిల్స్ కోసం సిద్ధమవుతున్న యువతకు మీరిచ్చే సూచనలు ? జవాబు : సివిల్స్ రాసేందుకు చక్కని తరీ్ఫదు అవసరం. మార్గదర్శకుల సూచనల మేరకు సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ పొందాలి. సివిల్స్ ర్యాంకు సాధించాలన్న తపన, కఠోర శమ, పట్టుదలతో రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధిస్తారు. ప్రజలకు ఎలా సేవ చేయాలనుకుంటున్నారు? జగత్‌సాయి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తుంటాయి. వాటిని అర్హులైనవారి చెంతకు సకాలంలో అందేలా యంత్రాంగం సహకారంతో కృషి చేస్తాను. పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తాను. ప్రజలకు సేవ చేయలన్నదే నా లక్ష్యం. నేరాల అదుపును ఏ విధంగా చేస్తారు? వసంతకుమార్ : సమాజంలో నేరాలు మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు నన్ను తీవ్రంగా కలిచివేస్తాయి. శాంతిభద్రతల రక్షణపై ప్రత్యేక దృష్టిసారిస్తాను. సివిల్స్ పరీక్షలు రాయాలన్న ప్రేరణ ఎవరి నుంచి కలిగింది ? అమ్మానాన్నలు గుండుగొలను జెడ్పీ ఉన్నత పాఠశాలలోనే చదివారు. టెన్త్‌లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యారు. తల్లి అనసూయకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండేది. అయితే అది సాధ్యపడలేదు. నాన్న భీమేశ్వరరావు ఎలక్ట్రికల్ ఏఈగా పని చేయడం, ప్రజలతో మమేకమై ప్రజల ఇబ్బందులు పరిష్కరించడం చూశాం. దీంతో తామూ ప్రభుత్వ సర్వీస్‌ల్లోకి రావాలన్న కోరిక కలిగింది. అమ్మ మాలో స్ఫూర్తిని నింపి పోటీ పరీక్షలు రాసేలా ప్రోత్సహించింది. విద్యాభ్యాసం ఏలా సాగింది ? జగత్‌సాయి : నాన్న విద్యుత్ శాఖలో ఇంజినీర్ కావడంతో మా చదువు ఉభయగోదావరి జిల్లాల్లో సాగింది. 1 నుంచి 7వ తరగతి వరకు ఐ.పోలవరం, తాడేపల్లిగూడెంల్లో సాగింది. 8 నుంచి ఇంటర్ వరకు శశి వెలివెన్నులో చదివాం. తమిళనాడులోని రాయవల్లూరులోని విట్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. క్రికెట్ ఆడటం చాలా ఇష్టం. కళాశాల టీమ్‌కు నేను కెప్టెన్. వసంతకుమార్ : చిన్నతనం నుంచి గుండుగొలనులో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకున్నా. 1 నుంచి 7 వరకు, 8 నుంచి ఇంటర్ వరకు ప్రైవేటు పాఠశాల, కళాశాలల్లో చదివా. వైజాగ్ మధురవాడలోని గాయత్రి పరిషత్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రికల్ పూర్తి చేశా. నాకూ క్రికెట్ ఆడటం ఇష్టమే. ప్రజాసేవకు మించి ఉన్నతమైనది లేదన్నాం... తల్లిదండ్రులు: అందరి తల్లిదండ్రుల్లాగానే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావించాం. వారిపై పెద్ద గోల్స్‌ను రుద్దలేదు. ఉన్నత చదువుల అనంతరం పెద్దబ్బాయి నాలుగు సార్లు సివిల్స్‌లో విఫలమైనా నిరాశ చెందవద్దని, మరింత శ్రద్ధ పెట్టి పట్టుదలతో సాధించాలని ప్రోత్సహించాం. ప్రజాసేవ చేసేందుకు ఇంతకు మించిన అవకాశం లేదని వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాం. ఐదేళ్ల పాటు మాకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాన్ని సాధించారు. అన్నదమ్ములు జగత్‌సాయి, వసంతకుమార్ -
సివిల్స్-2020 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సివిల్స్-2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 ఓబీసీ, 122 ఎస్సీ, 61 ఎస్టీ, 86 మంది ఈడబ్య్లూఎస్ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్-2020 తుది ఫలితాల్లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు రాగా, భోపాల్ నిట్ నుంచి బీటెక్(ఎలక్రికల్ ఇంజనీరింగ్) చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు వచ్చింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలవడం విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ► పి. శ్రీజకు 20వ ర్యాంకు ►మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు ►జగత్ సాయికి 32వ ర్యాంకు ►దేవగుడి మౌనికకు(కడప) 75వ ర్యాంకు ►రవి కుమార్‌కు 84వ ర్యాంకు ►యశ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకు సివిల్స్-2020 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఐఏఎస్ కల చెదిరి.. చాయ్‌వాలాలుగా మారి.. ఏడాదికి రూ. 100కోట్లు
సాక్షి, వెబ్‌డెస్క్: ఆ ముగ్గురు మిత్రులకు సివిల్ సర్వెంట్ జాబ్ అంటే పిచ్చి. దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివారు. కానీ దురదృష్టం కొద్ది కోరుకున్న కొలువు చేజారింది. తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ ఎన్నాళ్లిలా ఉంటాం.. జీవితం అంటే ఇదే కాదు కదా అని వారికి వారే ధైర్యం చెప్పుకున్నారు. మరోసారి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే ఆలోచన లేదు.. అలాగని.. ప్రైవేట్ కొలువు చేసే ఉద్దేశం కూడా వారికి లేదు. ఆ సమయంలో తట్టిన ఆలోచన వారి జీవితాలను మార్చేసింది. వంద కోట్ల రూపాయల వ్యాపారవేత్తలుగా నిలబెట్టింది. ఆ మిత్రత్రయం విజయగాథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ విరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన అనుభవ్ దూబే, ఆనంద్ నాయక్, మరో మిత్రుడితో కలిసి సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. కానీ దురదృష్టం కొద్ది ఉద్యోగం రాలేదు. ప్రైవేట్ జాబ్ చేయడం వారికి ఇష్టం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. వారికి ఓ ఐడియా వచ్చింది. ఈ క్రమంలో 2016లో అనుభవ్ దూబే తన స్నేహితులిద్దరితో కలిసి ‘చాయ్ సుత్త బార్’ అనే టీ దుకాణం ప్రారంభించాడు. 3 లక్షల రూపాయలతో ప్రారంభించిన ఈ టీ దుకాణం అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యింది. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 165 ఔట్‌లెట్స్‌తో ఏడాదికి 100 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేంతగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మన దేశంతో పాటు దుబాయ్, ఒమన్లలో కూడా ‘‘చాయ్ సుత్త బార్’’ శాఖలున్నాయి. ప్రత్యేకతలేంటంటే.. ‘‘చాయ్ సుత్త బార్’’ టీ షాప్‌లో పలు రకాల ఫ్లేవర్ల చాయ్‌లు లభిస్తాయి. అది కూడా కేవలం 10 రూపాయలకే. ఇక టీ షాప్ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ చాయ్‌ని మట్టి కప్పులో సర్వ్ చేస్తారు. ఈ ఆలోచనతో పర్యావరణానికి మేలు చేయడమే కాక కుమ్మరి సామాజిక వర్గానికి ఉపాధి కల్పిస్తుంది చాయ్ సుత్త బార్. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇక్కడ పొగ తాగడం నిషేధం. ఈ సదర్భంగా చాయ్ సుత్త బార్ డైరెక్టర్ అనుభవ్ దూబే మాట్లాడుతూ.. ‘‘మా టీ దుకాణాలలో చాయ్‌ని మట్టి కప్పులో సర్వ్ చేస్తాం. ప్రతిరోజూ మేము దాదాపు 3 లక్షల మట్టి కప్పులను ఉపయోగిస్తున్నాం. దీని వల్ల వేలాది మంది కుమ్మర్లకు ఉపాధి లభిస్తుంది. ఇక మా ‘చాయ్ సుత్త బార్’ బ్రాండ్ దేశవ్యాప్తంగా 165 అవుట్లెట్లను కలిగి ఉంది, దీనిలో రూ .100 కోట్లకు పైగా టర్నోవర్ ఉంది. దీనిలో దాదాపు 2.5 కోట్ల కంపెనీ సొంత అవుట్లెట్ల టర్నోవర్ ఉంది’’ అని తెలియజేశారు. -
సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020 అక్టోబర్‌లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయలేక చివరి ప్రయత్నం(లాస్ట్ అటెంప్ట్) సైతం కోల్పోయిన వారికి మరో అవకాశం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల 2020లో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతూ సివిల్ సర్వీసెస్‌లో ‘చివరి ప్రయత్నం’ దాటిపోయిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఎ.ఖన్వీల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. ఈ మేరకు 40 పేజీల తీర్పును వెలువరించింది. ఇలా లాస్ట్ అటెంప్ట్‌లో పరీక్ష రాయలేకపోయినవారికి మరో అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, సివిల్స్ అభ్యర్థుల వయో పరిమితిలోనూ ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సడలింపులు ఇవ్వడం ఇతర అభ్యర్థులపై వివక్ష చూపినట్లే అవుతుందని స్పష్టం చేశారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 6 సార్లు సివిల్స్ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 32 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు సివిల్స్ రాయొచ్చు. వయో పరిమితి 35 సంవత్సరాలు. ఇక ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా ఈ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 37 ఏళ్లు. గత ఏడాది కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల 10,000 మందికిపైగా అభ్యర్థులు నష్టపోతారని అంచనా. -
సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్ విజేతలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన పది మంది విజేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్‌కు ఎంపికైన పది మందిని సీఎం జగన్ అభినందించారు. వృత్తిలో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఏ రాష్ట్ర క్యాడర్లో పనిచేసినా మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జగన్ ఆకాంక్షించారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మిషన్ కర్మయోగి’ పేరిట సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సివిల్ సర్వీసులపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. పౌర అధికారులను మరింత సృజనశీలురుగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా ఉండేలా దేశ భవిష్యత్ కోసం వారిని దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్ కర్మయోగిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. వారు మరింత ఉత్తేజంగా, సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు. ప్రపంచంలో అత్యంత మెరుగైన విధానాలను ఒంటబట్టించుకునే పౌర అధికారులు భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగా వాటిని మెరుగుపరిచే క్రమంలో సామర్థ్య పెంపు దోహదపడుతుందని తెలిపారు. ఇక జమ్ము కశ్మీర్లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ, ఉర్దు, ఇంగ్లీష్‌లను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. మరోవైపు జపాన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని తెలిపారు. చదవండి : షూటింగ్స్ ప్రారంభించుకోండి! -
అసమర్థ ఉద్యోగులను పంపేయండి
న్యూఢిల్లీ: ముప్పయ్యేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని, అసమర్థ, అవినీతి అధికారులకు ముందస్తు రిటైర్మెంటు ఇచ్చి ఇంటికి పంపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 కింద 56 (జె), 56 (ఐ), 48 (1)(బి) నిబంధనల ప్రకారం... ఉద్యోగి పనితీరును పరిశీలించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా అతనికి రిటైర్మెంట్ ఇచ్చి పంపే సంపూర్ణ హక్కు సంబంధిత పై అధికారికి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు రిటైర్మెంట్ ‘శిక్ష’కాదని వివరించింది. ఉద్యోగి 50 లేదా 55 ఏళ్లకు చేరుకున్నాక, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నాక... ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా సదరు ఉద్యోగిని ఇంటికి పంపించవచ్చని పేర్కొంది. ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని సర్వీసులో కొనసాగించడంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అవుతుంటాయని, ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల విషయంలో మరింత స్పష్టత ఇవ్వడానికి, అమలులో ఏకరూపత తేవడానికి తాజా ఆదేశాలు జారీచేశామని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. రిటైర్ చేయదలచుకున్న ఉద్యోగికి మూడు నెలల నోటీసు ఇవ్వాలని, అలాకాని పక్షంలో మూడునెలల వేతనం ఇచ్చి పంపాలని తెలిపింది. 50 లేదా 55 ఏళ్లకు చేరుకుంటున్న, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న ఉద్యోగులందరి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను ప్రతిశాఖలో నిర్వహించాలని, ఏడాదికి నాలుగుసార్లు ఈ జాబితాను మదింపు చేయాలని ఆదేశించింది. డిజిటల్ లాకర్లోకి పెన్షన్ ఆర్డర్ రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించిన పత్రాల కోసం నిరీక్షించే బాధ తప్పనుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఎలక్ట్రానిక్ రూపంలో ఇకపై నేరుగా ఉద్యోగుల డిజిటల్ లాకర్‌కు పంపనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు. పెన్షన్ ప్రక్రియలో ఇక ఆలస్యానికి తావుండదని, అలాగే పెన్షన్ ఆర్డర్ పత్రాలను పోగొట్టుకునే ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. పౌరులు తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవడానికి డిజిటల్ లాకర్ ఉపకరిస్తుంది. -
సివిల్స్ ర్యాంకర్లకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్ ట్వీట్ చేశారు. (చదవండి : సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా) కాగా, ఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2019 ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్ పోస్టులకు, గ్రూప్ఏ, గ్రూప్ బి సర్వీసులకు ఎంపికయ్యారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను.#CivilServicesResults — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2020 -
సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కడప ఎడ్యుకేషన్/మైదుకూరు: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2019 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విజయఢంకా మోగించారు. 100లోపు ర్యాంకుల్లో ఐదుగురు తెలుగువారున్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్ పోస్టులకు, గ్రూప్ఏ, గ్రూప్ బి సర్వీసులకు ఎంపికయ్యారు. సొంత ప్రణాళికలతోనే.. సొంతంగా ప్రిపేర్ అవుతూ ఆర్సీ రెడ్డి టెస్ట్ సిరీస్ రాశాను. సొంత ప్రణాళికను రూపొందించుకొని 76వ ర్యాంక్ సాధించా. – మల్లవరపు సూర్యతేజ, గుంటూరు, (76వ ర్యాంక్) నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమ ర్యాంక్ సివిల్స్ మూడో ప్రయత్నం (2017)లో ఐఆర్ఎస్ సాధించాను. సివిల్స్ కోసం రోజూ 8 నుంచి 9 గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాను. – రుషికేశ్‌రెడ్డి, కడప (95 ర్యాంకు) మంచి సేవ చేయొచ్చనే.. నాలుగో ప్రయత్నంలో 103వ ర్యాంకు సాధించాను. సివిల్స్ ద్వారా దేశానికి మంచి సేవ చేయవచ్చు. –సత్యసాయి కార్తీక్, కాకినాడ ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంకు మాది.. వ్యవసాయ కుటుంబం. ఐదుసార్లు సివిల్స్ రాసినా ఫలితం దక్కలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంక్ సాధించాను. – రాహుల్‌కుమార్ రెడ్డి, పెండ్లిమర్రి, వైఎస్సార్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా.. మా నాన్న.. రైతు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. – శివగోపాల్‌రెడ్డి, (263వ ర్యాంక్) మైదుకూరు -
సచివాలయ ఉద్యోగులకు రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయమే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుతున్న పౌర సేవలను స్వయంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరు కార్యాలయ పనివేళలకు ముందుగానే తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తమ పరిధిలో పర్యటించి ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. నవరత్నాలతో పాటు ఇతర సేవలన్నీ వలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే అందించే లక్ష్యంలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం జాబ్ చార్ట్‌లను కూడా రూపొందించింది. జాబ్ చార్ట్ ఇలా... - క్షేత్రస్థాయి పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య పనులు, పారిశుధ్య కార్మికుల హాజరు, పనితీరును పరిశీలించాలి. - మంచినీటి సరఫరా, వీధిలైట్ల పనితీరు, స్పందనలో అందిన వినతులు, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. - క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన సమస్యలపై మధ్యాహ్నం నుంచి చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ వివరాలతో పాటు వలంటీర్ల పనితీరు గురించి తెలుసుకోవాలి. - ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఉద్యోగులు సచివాలయ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి. - ఉద్యోగులు రోజువారీ డైరీని నిర్వహించాలి. - ఉద్యోగులంతా పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలకు హాజరవ్వాలి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో భాగస్వాములు కావాలి. - నవరత్నాలతోపాటు ఇతర సేవలను ప్రజల ముంగిటకు సమర్థంగా, సకాలంలో చేర్చడంపై గ్రామ సచివాలయం దృష్టి సారించాలి. - నవరత్నాలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. - ప్రతి రోజూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అభ్యర్థనలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలి. - ప్రభుత్వ, గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలి. - 1956 కల్తీ ఆహార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. - తూనికలు, కొలతల్లో అక్రమాలను నిరోధించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, దశలవారీగా మద్యనిషేధం, గృహ హింస చట్టం అమలుకు కృషి చేయాలి. - వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, పంపిణీపై సమీక్షించాలి. - లే అవుట్లు, తాగునీటి కనెక్షన్లు, వ్యాపార లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను తనిఖీ చేయాలి. -
ఇష్టపడి..కష్టపడి
తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. సాధారణంగా వీరికుమారుడు కూడా డాక్టరవుతాడు. ఇది సాధారణం.ఎంబీబీఎస్ చదివినా అతని మనసు మాత్రం సివిల్ సర్వీసు వైపే ఉంది. అదే ధ్యేయంగా పెట్టుకుని పట్టుదలతో సాధించాడు నందలూరుకు చెందిన డాక్టర్ బి. ధీరజ్‌కుమార్.. ఈయన గతేడాది ప్రిలిమినరీ పరీక్షల్లో పాసై తర్వాత మెయిన్స్‌లో విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిఇంటర్వ్యూ అనంతరం సివిల్‌సర్వీసుకు ఎంపికయ్యాడు. 559వ ర్యాంకు సాధించాడు. ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. సివిల్ సర్వీసులకు అధికంగా ఎంపికవుతున్న నందలూరు నుంచే ఈయన కూడా సెలెక్ట్ కావడం విశేషం. మాంటిసోరిలో శిక్షణ పొందుతూ స్వస్థలం వచ్చిన ఈయన్ను సాక్షి పలకరించింది. పేరు : బి ధీరజ్‌కుమార్ తల్లిదండ్రులు: విజయభాస్కర్..విజయభారతి వీరి వృత్తి: తండ్రి రైల్వేలో మెడికల్ ఆఫీసర్..తల్లి ప్రభుత్వ వైద్యురాలు విద్యాభ్యాసం: ఎంబీబీఎస్(ఎస్వీ మెడికల్ కళాశాల సివిల్‌సర్వీస్ బ్యాచ్: 2018 సాక్షి: డాక్టర్ల ఇంట పుట్టారు..సివిల్స్ æవైపు ఎందుకు మొగ్గు చూపారు ధీరజ్: ఔను..అమ్మా నాన్న ఇద్దరు డాక్టర్లే. మొదట్లో నేను కూడా డాక్టర్ కావాలనుకున్నాను. అందుకే ఎంబీబీఎస్ చదివాను. కానీ తర్వాత సివిల్ సర్వీసుకు ఎంపికై ప్రజాసేవ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని భావించాను .అందుకే ఆదిశగా ప్రయత్నించాను. సాక్షి: మీకు సివిల్స్ ప్రేరణ ఎలా కలిగింది ధీరజ్: నేను పుట్టి పెరిగిన నందలూరు నాకు ప్రేరణ. ఈ ఊరి నుంచి ఐదుగురు ఐఎఎస్‌కు ఎంపికయ్యారని తెలుసుకున్నాను. ఒకరకంగా ఇదే నా ఆలోచన మార్చిందేమో. నేను కూడా వారి లాగే ఐఎఎస్‌కు ఎంపిక కావాలనుకున్నాను. మొత్తంమీద ఐపీఎస్ వచ్చింది. కానీ పట్టుదల వదల్లేదు. ఐఎఎస్ కావాలని మళ్లీ పరీక్షలు రాస్తున్నాను. సాక్షి: ఎంబీబీఎస్ తర్వాత వైద్య వృత్తి చేపట్టినట్లు లేదు.. ధీరజ్: నిజమే. ఎంబీబీఎస్ పూర్తి అయిన పోటీల పరీక్షలకు హాజరయ్యాను. ఐఆర్పీఎస్ సాధించాను., హైదరాబాదు డివిజన్లో పర్సనల్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో పట్టుదల రెట్టించి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివాను. ఫలితంగా గతేడాది సివిల్స్ సర్వీసు పరీక్షలలో 559 ర్యాంకు పొందాను. ఆ ఫలితమే ఐపీఎస్. సాక్షి: తొలి పోస్టింగ్ ఎక్కడ వస్తుందనుకుంటున్నారు. ధీరజ్: మహారాష్ట్ర క్యాడర్ వచ్చింది. అందువల్ల ఆ రాష్ట్రంలో పోస్టింగ్ వస్తుందని ఆశిస్తున్నాను. సాక్షి: నేటి యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు ధీరజ్: యువత విద్యకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏ పనైనా ఇష్టపడి చేస్తే బాగుంటుంది. చదువు కూడా అంతే. నచ్చిన కోర్సు కోసం క్రమశిక్షణతో ప్రిపేరవ్వాలి. దీనివల్ల ఏ పోటీ పరీక్షలలో అయినా విజేతగా నిలవగలం. ఓటమితో కుంగిపోకూడాదు. పట్టుదల వదలకూడదు. -
పౌరుడే ‘పుర’పాలకుడు
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో పౌరుడే పాలకుడని, నూతన పుర చట్టం స్ఫూర్తి ఇదేనని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పౌర సేవలు పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించామని తెలిపారు. వ్యక్తి కేంద్రీకృతంగా ఉన్న పాత చట్టం స్థానంలో వ్యవస్థ కేంద్రీకృతంగా నూతన చట్టం తీసుకొచ్చామన్నా రు. కొత్త మున్సిపల్ చట్టంపై మున్సిపల్ కమిషనర్ల రెండ్రోజుల సదస్సు ముగింపు సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలతో మమే కమై రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజలకు అవసరమైన పలు సంస్కరణలను ఈ చట్టం ద్వారా అందుబాటులోకి తెచ్చారని, 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయడం, భవన నిర్మాణాల కోసం సెల్ఫ్ సరి్టఫికేషన్ వంటి నూతన నిబంధనలు ఈ స్ఫూర్తిలోంచి వచి్చనవేనని తెలిపారు. జాతీయ స్థాయి గుర్తింపు పొందేలా.. సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్, సూర్యాపేట, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు ఇప్పటికే వివిధ అంశాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కేటీఆర్ కమిషనర్లకు సూచించారు. దీంతో పాటు జాతీయస్థాయిలో పురపాలనలో వినూత్నమైన, అదర్శవంతమైన పద్ధతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు పంపుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం జోడించడం ముఖ్యం గా సామాజిక మాధ్యమాలను వినియోగించడం ద్వారా పురపాలనను సాగించవచ్చన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన కమిషనర్లకు మంత్రి కేటీఆర్ పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్ సర్వీస్ ఉద్యోగాలకో దండం
సాక్షి, బెంగళూరు: పని ఒత్తిళ్లు ఓ వైపు.. కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నామనే ఆవేదన మరోవైపు వేధిస్తున్న కారణంగా సివిల్స్ సర్వీస్ అధికారులు తమ పదవులకు రాజీనామా చేయడం రాష్ట్రంలో సాధారణ విషయమైంది. ఐదు నెలల్లో ఒక ఐపీఎస్, మరో ఐఏఎస్ రాజీనామా చేయగా, ఒక ఐఎఫ్ఎస్ (అటవీ) అధికారి ఏకంగా ఆత్మహత్యే చేసుకున్నారు. దీంతో అఖిల భారత సర్వీస్ అధికారుల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. తరువాతి రాజీనామా ఏ అధికారిదోనని ఆ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. విధానసౌధలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మధ్య ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యువ ఐపీఎస్ అన్నామలైతో ఆరంభం కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన బెంగళూరు సౌత్ డీసీపీ కె.అన్నామలై ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు మే 28వ తేదీన రాజీనామా చేశారు. అప్పటి సీఎం హెచ్డీ కుమారస్వామిని స్వయంగా కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఉద్యోగం వదిలేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. అన్నామలై 2011 బ్యాచ్ యువ ఐపీఎస్ అధికారి. తమిళనాడులోని కరూర్ ప్రాంతానికి చెందినవారు. 2013లో కార్కళ ఏఎస్పీగా కెరీర్ మొదలుపెట్టారు. కుటుంబంతో గడపలేకపోతున్నానని, బంధువుల పెళ్లిళ్లకు, చావులకు కూడా హాజరు కాలేని పరిస్థితి ఉందని అప్పట్లో ఆవేదన వ్యక్తంచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు జరిపిన హిమాలయాల పర్యటన నా కళ్లు తెరిపించిందని, జీవితం గురించి తెలుసుకోవడానికి ఈ యాత్ర దోహదపడిందని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి సెంథిల్ సంచలనం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం. ఏళ్ల తరబడి అహోరాత్రులు చదివి సాధించిన సివిల్ సర్వీస్ ఉద్యోగాలను చివరికి పూచికపుల్లతోసమానంగా భావించి తప్పుకోవడం, ఆరునెలల్లో ఇలాంటి సంఘటనలు రెండు జరగడం గమనార్హం. విధుల్లో రాజీ పడలేకపోతున్నామంటూ అధికార దండాన్ని పక్కన పెట్టేస్తున్నారు. తమిళనాడుకే చెందిన ఐఏఎస్ అధికారి, దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్ శశికాంత్ సెంథిల్ ఈ నెల 6వ తేదీన రాజీనామా సమర్పించారు. ప్రజాస్వామ్య విలువలు రాజీపడుతున్న ఈ సమయంలో ఐఏఎస్‌గా కొనసాగడం అనైతికమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యన ప్రకటించారు. అందరి జీవితాలను మెరుగుపరిచేందుకు నా కృషిని కొనసాగిస్తా’ అని సెంథిల్ తెలిపారు. 40 ఏళ్ల సెంథిల్ తమిళనాడులోని తిరుచీ్చకి చెందినవారు. 2009లో ఆయ న ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన రాజీనామా దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. ఐఎఫ్ఎస్ అవతార్‌సింగ్ ఆత్మహత్య! కర్ణాటక అటవీ అభివృద్ధి మండలి సంస్థ ఎండీ, ఐఎఫ్ఎస్ అధికారి అవతార్ సింగ్ (52) ఈనెల 8వ తేదీన బెంగళూరు యలహంకలోని తన అపార్టుమెంటు ఫ్లాటులో ఉరివేసుకున్న స్థితిలో మరణించారు. ఇది ఆత్మహత్య కావచ్చని, తీవ్రమైన పని ఒత్తడి కారణంగా ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హరియాణాకు చెందిన అవతార్ సింగ్ మరణానికి సంబంధించి విధుల పరంగా ఆయన కొద్ది రోజుల సెలవు తర్వాత ఈనెల 7వ తేదీన చేరారు. అంతలోనే ఇలా తీవ్ర నిర్ణయం తీసుకోవడం సహచర అధికారులను నిశ్చేషు్టలను చేసింది. ప్రభుత్వం ఉలికిపాటు ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ రాజీనామాతో కర్ణాటకలోని బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ ఎందుకు రాజీనామా చేశారు?, అసలు ఏం జరిగింది? ఇలాంటి సంఘటనలు తన ప్రభుత్వంలో మరోసారి జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు. -
సివిల్స్ వయోపరిమితి 27 ఏళ్లు ఎందుకు?
సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్ష వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 32 ఏళ్ల నుంచి 27 ఏళ్లకు తగ్గించాలని నీతి ఆయోగ్ సూచించిన విషయం చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీఎస్ స్వాన్ కమిటీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 2016 ఆగస్టు 9న సమర్పించిన నివేదికలో సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షలకు వయోపరిమితిని 26 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదిస్తూ.. సివిల్స్ పరీక్ష పద్ధతిలో కొన్ని మార్పులను సూచించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ఇప్పుడున్న 37 సంవత్సరాల వయోపరిమితిని కొనసాగించాలని పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్స్కూల్ ఆఫ్ బిజినెస్, యూసీ బెర్క్లీ హౌస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సివిల్ సర్వీసెస్‌పై తాజా అధ్యయనం చేశాయి. అర్హత ప్రవేశ పరీక్షకు వయోపరిమితి తగ్గించడం వల్ల అధికారుల సేవలను ఎక్కువగా వినియోగించుకునే అవకాశాన్ని నొక్కి చెప్పాయి. ఎక్కువ వయసులో సివిల్ సర్వీసెస్‌లోకి అడుగు పెట్టిన వారికి పదోన్నతిలో అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు సివిల్ సర్వీసెస్‌లో అత్యున్నత పదవి అయిన చీఫ్ సెక్రటరీ, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా చేరుకునేందుకు కనీసం పాతిక నుంచి 30 ఏళ్ల సర్వీస్ ఉండాలి. ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్ల లోపే ఇదంతా జరగాల్సి ఉంటుంది. కానీ 30 ఏళ్లకో, 32 ఏళ్లకో ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తికి ఆ పదవి చేరుకునే అవకాశమే ఉండదు. సివిల్ సర్వీసెస్‌లో చేరే నాటికి వారి వయసును బట్టి వారి పనితీరు సామర్థ్యంలోనూ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ వయసులో సివిల్ సర్వీసెస్ ఉద్యోగంలో చేరిన వారు ఆ రంగంలో అత్యున్నత వేతనాన్ని అందుకుంటున్న పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. 22 ఏళ్లకే సివిల్స్ రంగంలోకి అడుగిడిన వారిలో దాదాపు 80 శాతం మంది చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవుతున్నారు. అయితే 29–30 ఏళ్ల మధ్య సర్వీస్‌లోకి ప్రవేశించిన వారికి మాత్రం ఈ అవకాశమే లేదని తెలుస్తోంది. ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారనేది ఏ వయసులో విధుల్లో చేరుతున్నారనేదానిపై కూడా ఆధారపడి ఉంటుందని తేల్చారు. దీంతో సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షకు అంతిమ వయ సు 27 ఏళ్లకు తగ్గించాలన్న అభిప్రాయానికి కారణమయ్యాయి. ఈ మార్పుల వల్ల ఎక్కువ మందికి అత్యున్నత హోదాకు చేరుకునే అవకాశం ఉంటుందన్నది పలువురి వాదన. అలాగే ఈ మార్పులో దళితులకు, ఆదివాసీలకు ఐదేళ్ల మినహాయింపు కొనసాగుతుంది. -
సివిల్స్‌కు 27 ఏళ్లే!
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్ష వయో పరిమితి తగ్గింపుతోపాటు దిగువ కోర్టుల్లో జడ్జీల ఎంపికపై కేంద్ర ప్రభుత్వ ‘థింక్ ట్యాంక్’ నీతి ఆయోగ్ పలు కీలక చర్యలను ప్రతిపాదించింది. 2022–23 సంవత్సరానికి సాధించాల్సిన లక్ష్యాలను, చేపట్టాల్సిన చర్యలతో కూడిన ‘స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియాః75’ పత్రాన్ని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసింది. ‘సివిల్ సర్వీసెస్ జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 30 ఏళ్ల నుంచి 2022–23కల్లా దశలవారీగా 27 ఏళ్లకు తగ్గించాలి. ప్రస్తుతమున్న 60కి పైగా కేంద్ర, రాష్ట్ర సర్వీసులను హేతుబద్ధీకరణ ద్వారా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ అవసరాలు, కావల్సిన నైపుణ్యాన్ని బట్టి సెంట్రల్ పూల్ నుంచే అభ్యర్థుల కేటాయింపు జరగాలి. దీనివల్ల సివిల్ సర్వీసెస్‌లో ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఒక్క పరీక్ష నిర్వహిస్తే సరిపోతుంది. ఈ సెంట్రల్ పూల్‌ను వినియోగించుకునేలా రాష్ట్రాలను ప్రోత్సహించాలి. అంతేకాకుండా, సివిల్ సర్వీసెస్‌లో సంస్కరణలు నిరంతరం కొనసాగాలి. ఈ దిశగా ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది’ అని నీతి ఆయోగ్ ఆ పత్రంలో తెలిపింది. జడ్జీల ఎంపికకు ఆల్ ఇండియా పరీక్ష దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి దేశ వ్యాప్తంగా ఒకే ఎంపిక నిర్వహించాలని నీతి ఆయోగ్ సూచించింది. ప్రతిభావంతులైన యువ న్యాయ అధికారులను ప్రోత్సహించేందుకు, వారిలో జవాబుదారీతనం పెంచేందుకు ఈ చర్య దోహదపడుతుందని అభిప్రాయపడింది. ‘అఖిల భారత స్థాయిలో నిర్వహించే ర్యాంకింగ్ ఆధారిత పరీక్ష వల్ల న్యాయవ్యవస్థలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పవచ్చు. దిగువ స్థాయి కోర్టుల్లో జడ్జీలకు, కేంద్ర, రాష్ట్ర న్యాయ సేవల విభాగాలు, ప్రాసిక్యూటర్లు, న్యాయ సలహాదారులు తదితర అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిష¯Œ (యూపీఎస్సీ)కు అప్పగించాలి. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకుగాను ఆయా పోస్టులకు ఎంపికైన వారంతా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది’ అని ఆ పత్రంలో నీతి ఆయోగ్ పేర్కొంది. జడ్జీల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసేందుకు రాష్ట్రాలవారీగా సూచికలు తయారు చేయాలంది. సత్వర న్యాయం కోసం కోర్టుల్లో వీడి యో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, వినియోగం కూడా పెరగాల్సిన అవసరం ఉందని తెలిపింది.ప్రస్తుతం జడ్జీల ఎంపిక కోసం వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు, సివిల్ సర్వీస్ కమిషన్లు పరీక్షలు చేపడుతుండగా అఖిల భారత స్థాయిలో ఈ పరీక్షలను చేపట్టాలన్న ప్రతిపాదన 1960ల నుంచే ఉంది. అయితే, దీనిని తొమ్మిది హైకోర్టులు తిరస్కరించగా 8 హైకోర్టులు పలు మార్పులను ప్రతిపాదించాయి. అయితే, నీట్ లాగానే దేశవ్యాప్తంగా జడ్జీల ఎంపిక పరీక్ష చేపట్టాలన్న ఆలోచనను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న దిగువస్థాయి న్యాయస్థానాల్లో 20,502 పోస్టులకు గాను 2015 నాటికి 16,050మంది మాత్రమే పనిచేస్తున్నారు. -
సివిల్స్ ‘రిజర్వు’ అభ్యర్థుల సిఫార్సు..
న్యూఢిల్లీ: 2016లో నిర్వహించిన సివిల్స్ పరీక్ష ద్వారా భర్తీకాని స్థానాల కోసం రిజర్వు జాబితాలోని 109 మంది అభ్యర్థుల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సిఫార్సుచేసింది. గతేడాది నిర్వహించిన ఈ పరీక్షలో 1209 ఖాళీలకు 1099 పోస్టులు భర్తీ అయ్యాయి. సివిల్స్ సర్వీస్ నిబంధనల ప్రకారం ఈ జాబితాతో పాటు తర్వాతి స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల రిజర్వు జాబితాను యూపీఎస్సీ తయారుచేయాలి. కేంద్ర సిబ్బంది, శిక్షణాసంస్థ కోరడంతో 87 జనరల్ కేటగిరి అభ్యర్థులు, 19 మంది ఓబీసీ, 1 ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్థుల రిజర్వు జాబితాను సిఫార్సు చేసింది. ఎం.వరలక్ష్మీ(రోల్ నం. 0335242) అనే అభ్యర్థి ఫలితాలను మాత్రం నిలిపేసింది. -
సివిల్ సర్వీసెస్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2018 శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://studycircle.cgg.gov.in/tstw వెబ్సైట్లో జాబితాను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 3న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హిమాయత్ సాగర్ రోడ్‌లోని మానస హిల్స్ వైటీసీలో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు. శిక్షణా తరగతులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇతర వివరాలకు 040–27540104, 7799886980, 8522914704 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. -
ఐఏఎస్‌లు నిష్పాక్షికంగా పనిచేయాలి
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన - పేదల అభ్యున్నతికి పనిచేయాలి - పరిపాలనా నైపుణ్యాలు పెంచుకోవాలి - అవినీతికి దూరంగా ఉంటూ కర్తవ్య పాలన చేయాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసు అధికారులు సమర్థంగా, నిష్పాక్షికంగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అవినీతికి తావులేకుండా స్వచ్ఛపాలనకు మార్గదర్శకులు కావాలని పిలుపునిచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం అఖిల భారత సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల 92వ ఫౌండేషన్ కోర్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు సేవలందించడంతో పాటు పరిపాలనా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సివిల్ సర్వెంట్లు పేదల అభ్యున్నతికి పనిచేసే లక్ష్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. పేదల సమస్యల పట్ల సహా నుభూతి, సామర్థ్యం, నిష్పాక్షికత కలిగి ఉండటంతో పాటు అవినీతికి దూరంగా ఉండటం వంటి ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని కర్తవ్య పాలన చేయాలని వివరించారు. అత్యంత పేద ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఉత్తమ పనితీరు కనబర్చాలి.. ఎల్లప్పుడూ మహాత్మాగాంధీ మాటలను దృష్టిలో ఉంచుకోవాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విధానాలను కార్యరూపంలోకి తీసుకురావాలంటే అధికారుల సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని, అధికారులు పాలనాపరమైన నైపుణ్యాలను అలవరచుకొని అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలన్నారు. ‘సంస్కరించు, ఉత్తమమైన పనితీరు కనబరుచు.. తద్వారా పరివర్తనకు కృషి చేయి’అని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ప్రభుత్వ అధికారులకు ప్రేరణను ఇవ్వాలన్నారు. ప్రజలతో కలసి పని చేసేటప్పుడు వారి మాతృ భాషకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎలాంటి భయానికి, పక్షపాతానికి చోటివ్వకుండా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. సరికొత్త భారత్‌కు ప్రేరకులుగా.. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి వారు బోధించిన ప్రకారం సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని చెప్పారు. అంత్యోదయ స్ఫూర్తిని అమలు చేయాలని అధికారులకు హితవు పలికారు. సరికొత్త భారత్‌కు ప్రేరకులుగా ఐఏఎస్ అధికారులు నిలవాలని పిలుపునిచ్చారు. హుందాతనంతో వ్యవహరించి ఓర్పుతో విని, సమ దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలని, ఐఏఎస్‌లు అధికార దురహంకారాన్ని, దురుసుతనాన్ని దూరంగా ఉంచాలని సూచించారు. అవినీతి వ్యవస్థ శక్తివంతమైన దేశపు బలాన్ని హరిస్తుందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. చిత్తశుద్ధితో పాటు నైతిక ప్రవర్తనకు ‘న్యూ ఇండియా’లో పెద్దపీట వేయాలన్నారు. అలా చేస్తేనే అభివృద్ధి ఫలాలను అందరికీ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని వివరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య పాల్గొన్నారు. -
సోనియాగాంధీ పౌరసత్వ వ్యవహారం
-
సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు..!
నలుగురికి మంచి ర్యాంకులు ఐఆర్ఎస్కు ఎంపిక వైవీయూ: బుధవారం రాత్రి విడుదల చేసిన సివిల్ సర్వీస్ (మెయిన్స్) ఫలితాల్లో జిల్లావాసులు నలుగురు మంచి ర్యాంకులు సాధించారు. కడప నగరం బాలాజీనగర్‌కు చెందిన గడికోట బాలకృష్ణారెడ్డి (ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం), రాజేశ్వరి దంపతుల కుమారుడైన గడికోట పవన్‌కుమార్‌రెడ్డి సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 353వ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. గతంలో ఐఎఫ్ఎస్లో 26వ ర్యాంకు సాధించిన ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖలో డీఎఫ్ఓగా పనిచేస్తున్నారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం రామాపురంలో, హైస్కూల్ విద్య కడప నగరంలోని నాగార్జున హైస్కూల్లో, ఇంటర్మీడియట్ చిత్తూరు వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదివారు. అనంతరం ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకు సాధించి కడప నగరంలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశారు. ముంబై ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశారు. అనంతరం సివిల్ పరీక్షలపై దృష్టిసారించిన ఆయన ఐఎఫ్ఎస్లో 26వ ర్యాంకు, తాజాగా విడుదలైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో 353వ ర్యాంకు సాధించారు. పవన్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలోని వాజీరాం కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. మెరిసిన మేరువ సునీల్‌కుమార్‌రెడ్డి.. కడప నగరం అక్కాయపల్లెకు చెందిన ఎం.ఎస్. వెంకటరెడ్డి (ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు మేనేజర్, పెండ్లిమర్రి), నిర్మల దంపతుల కుమారుడైన మేరువ సునీల్‌కుమార్‌రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 354వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లా గుత్తిలో పదోతరగతి పూర్తిచేసిన సునీల్ ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీచైతన్యలో చదివారు. అనంతరం బీటెక్‌ను పశ్చి మబెంగాల్లోని దుర్గాపూర్ నిట్‌లో పూర్తిచేశారు. అనంతరం రిలయన్స్ జియోలో ఒక ఏడాదిపాటు ఇంజినీర్‌గా సేవలందించారు. ఇటీవలే ఐఎఫ్ ఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ను సాధించడమే తన లక్ష్యమని తెలిపార -
కడగండ్లు దాటి కలెక్టరయ్యాడు
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం/కాశీబుగ్గ(పలాస): కార్పొరేట్ స్కూల్ కాదు ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం.. పాఠశాలకు బస్సులో కాదు నాలుగు కిలోమీటర్లు కాలినడకనే రోజూ రాకపోక... అమ్మానాన్న ఆర్థికంగా స్థితిమంతులు కాదు ఓ సాధారణ వ్యవసాయ కూలీలు... గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు, అడుగడుగునా అడ్డంకులు... ఇవేవీ ఆయన లక్ష్యం ముందు దూదిపింజల్లా ఎగిరిపోయాయి! ప్రజలకు సేవ చేయడానికి ఉన్నతాధికారి కావాలనే దృఢ సంకల్పం ముందు అవన్నీ మంచుముక్కల్లా కరిగిపోయాయి! దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్ సర్వీసు ఐఏఎస్‌ను రెండో ప్రయత్నంలోనే మూడో ర్యాంకుతో సాధించి సిక్కోలు సత్తా చాటాడు! అతనే పలాస–కాశీబుగ్గ పట్టణానికి సమీపంలోని పారసంబ గ్రామానికి చెందిన రోణంకి గోపాలకృష్ణ. అంతేకాదు ఇప్పుడు అందరూ చిన్నచూపు చూస్తున్న మాతృభాష ‘తెలుగు’కు వన్నెలద్దాడు. తెలుగు మాధ్యమంలోనే చదివి... తెలుగు సాహిత్యాన్నే ఒక సబ్జెక్టుగా తీసుకొని సివిల్స్‌లో మేటి ర్యాంకరుగా నిలిచాడు. మాతృభూమికి, మాతృభాషకు, తల్లిదండ్రులకు గర్వంగా నిలిచిన ఆయన జీవిత విశేషాలు ఒక్కసారి చూస్తే... పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పారసాంబ గోపాలకృష్ణ సొంత గ్రామం. రోణంకి అప్పారావు, రుక్మిణమ్మ దంపతుల రెండో సంతానం గోపాలకృష్ణ. వారి పెద్ద కుమారుడు కోదండరావు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె ఊర్వశి డిగ్రీ చదివింది. గోపాలకృష్ణ స్వగ్రామంలోని ఎంపీపీ పాఠశాలలోనే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువు పూర్తి చేసాడు. ఇంటర్మీడియెట్ పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. 2006 సంవత్సరంలో టీటీసీ ర్యాంకు సాధించి పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల డైట్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. వెంటనే డీఎస్సీ–2007లో ప్రతిభ చూపించి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తొలుత శిలగాం పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం పలాస మండలం రేగులపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. మరోవైపు విజయనగరంలోని మహారాజా కళాశాల నుంచి బీఎస్సీ (ఎంపీసీ) దూరవిద్య విధానంలో పూర్తి చేశారు. కుటుంబం అండగా.... గోపాలకృష్ణ కుటుంబం పాతికేళ్లుగా గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాటన్నింటినీ అధిగమిస్తూనే అప్పారావు దంపతులు తమకున్న అర ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ముగ్గురు పిల్లలను అనేక కష్టాలకోర్చి చదివించారు. తమ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలన్నా, సమాజంలో అలాంటివారికి అండగా ఉండాలన్నా గ్రూప్–1 అధికారి కావాలనేదీ గోపాలకృష్ణ లక్ష్యం. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల వల్ల ఆయన దృష్టి సివిల్స్‌పైకి మళ్లింది. అలాంటి దృఢ సంకల్పం ఉండటం వల్లే పదేళ్ల వయస్సులోనే బ్రాహ్మణతర్లా గ్రామంలోని హైస్కూల్‌కు రానుపోను నాలుగు కిలోమీటర్లు కాలినడకనే వెళ్లివచ్చేవారు. ఐదేళ్లు అదే ప్రయాణం. వర్షాకాలంలో గెడ్డలు పొంగింతే తండ్రి భుజాలను పట్టుకొని మరీ పాఠశాలకు వెళ్లేవారు. 19 ఏళ్లకే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చినా మరో పదేళ్ల పాటు తన కృషిని కొనసాగించి సివిల్స్‌లో 3వ ర్యాంకును గోపాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఆయన విజయంతో పారసాంబ గ్రామంలో సందడి నెలకొంది. కుటుంబం, బంధువులు, స్నేహితుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాభ్యాసం... ప్రాథమిక విద్య: ఎంపీపీ పాఠశాల, పారసాంబ, పలాస మండలం ఉన్నత విద్య: జడ్పీ హైస్కూల్, బ్రాహ్మణతర్ల, పలాస మండలం ఇంటర్మీడియెట్ : గవర్నమెంట్ జూనియర్ కళాశాల, పలాస డిగ్రీ (బీఎస్సీ): మహరాజా కళాశాల, విజయనగరం (దూరవిద్య) విజయాల పరంపర... టీటీసీ(2006): డైట్, దూబచర్ల, పశ్చిమ గోదావరి జిల్లా డీఎస్సీ (2007): ఉపాధ్యాయుడిగా ఎంపిక. రేగులపాడు ఎంపీపీ స్కూల్లో ఉద్యోగం గ్రూప్–1 (2011): మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వూ్య వరకూ వెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఆ ఫలితాలు ఆగిపోయాయి. సివిల్స్ (2014): గ్రూప్–1 వదిలేసి సివిల్స్ వైపు దృష్టి. హైదరాబాద్‌లో కోచింగ్ సివిల్స్ (2015): ప్రిలిమినరీ దశలోనే ఆటంకం. తొలి ప్రయత్నం విఫలం సివిల్స్ (2016): ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వూ్య దిగ్విజయంగా దాటుకొని దేశంలోనే 3వ ర్యాంకుతో విజయం న్యాయం కోసం పోరాడాలి ‘‘ప్రస్తుత రోజుల్లో అన్యాయాలు, అక్రమాలు అధికంగా జరుగుతున్నాయి. వీటిపైన మా కుమారుడు కలెక్టర్ హోదాలో ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది. మా గ్రామంలోనే గ్రామ కంఠాలు ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇటువంటివి అరికట్టాలి. పేద ప్రజలకు నా కొడుకు సేవలందించాలి. అదే మాకు గర్వకారణం.’’ – రోణంకి అప్పారావు, రుక్మిణమ్మ దంపతులు -
గ్రూప్–1, 2కు కామన్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసులైన గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామకాలకు దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి అమలు కానుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సులో సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రతిపాదించగా.. యూపీఎస్సీ చైర్మన్ డేవిడ్ రీడ్ సిమ్లెతోపాటు వివిధ రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరు అధ్యయన సబ్‌కమిటీ చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి.. టీఎస్పీఎస్సీని నమూనాగా తీసుకుని ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతిపాదిత అంశాలివే.. ► దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీ మాదిరిగా గ్రూప్–1, గ్రూప్–2 భర్తీలో ఒకే విధానం, ఒకే సిలబస్‌ను అనుసరించాలి. ► సిలబస్‌లో 70 శాతం ఒకేరకంగా ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఉంటే సరిపోతుంది. ► అన్ని రాష్ట్రాలు యూపీఎస్సీ మోడల్‌నే అనుసరించాలి ► ఇప్పటికే టీఎస్పీఎస్సీ చాలా వరకు యూపీఎస్సీ విధానాన్నే అమలు చేస్తోంది. ► పీఎస్సీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలన్నీ డిజిటలైజేషన్ చేయాలి. ► దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపులు తదితర కార్యక్రమాలు ఆన్లైన్ పద్ధతిలోనే జరగాలి. -
రాష్ట్ర సివిల్ సర్వీసెస్ క్రికెట్ జట్టు ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్: ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకూ రాయ్‌పూర్(చత్తీస్గడ్)లో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రికెట్ జట్టును రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి శనివారం ప్రకటించారు. జట్టులో ఎస్.సుబ్రహ్మణ్యం(కెప్టెన్), పి.అరుణ్‌బాబు(అడిషనల్ మున్సిపల్ కమిషనర్, విజయవాడ), ఎస్.నాగరాజు(సూపరింటెండెంట్), కె.రమేష్(అడిషనల్ వీసీ, ఉడా, విశాఖపట్నం), టి.చంద్రశేఖర్(సీనియర్ అసిస్టెంట్, సీటీవో), ఎం.రాఘవరావు (టైపిస్ట్, డీపీవో, గుంటూరు), కేవీ నాగరాజు(ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్, పీఈటీ), జి.బాపిరాజు(డెప్యూటీ తహసీల్దార్, రాజమండ్రి), కేవీ రాజేష్(సీనియర్ అసిస్టెంట్, కలెక్టరేట్, గుంటూరు), ఎ.సాయికుమార్(ఏఎస్ఓ), ఎం.మురళీమోహన్(అటెండర్, ఏడీఏ, కడప), ఎస్.శ్రీధర్(సీనియర్ అసిస్టెంట్, డీఎంఅండ్‌హెచ్‌వో, కర్నూలు), ఎస్కే ఫజుల్ రెహమాన్(జీటీవో, నెల్లూరు), ఆర్.కిషోర్‌ప్రభు(సీనియర్ అసిస్టెంట్, కలెక్టరేట్, గుంటూరు), టి.భాస్కర్(ఏసీటీవో, గుంటూరు), ఎం.ప్రవీణ్‌కుమార్(ఎస్జీటీ, వీరుపల్లి, అనంతపురం) ఎంపికయ్యారు. జట్టు మేనేజర్‌గా కేవీ సతీష్‌కుమార్‌రెడ్డి (ఏఎస్ఓ, ఏపీ సెక్రటేరియట్), కోచ్‌గా ఎంఎస్ ఉమాశంకర్(డీఎస్డీవో, వైఎస్సార్ కడప) వ్యవహరిస్తారు. -
మంచి చదువు కొందరికేనా?
మద్యం అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తున్న ప్రభుత్వాలు, భక్తుల నుంచి వేల కోట్లు ముడుపులుగా అందుకుంటున్న ఆలయ ధర్మకర్తలు కేంద్రీయ స్కూళ్ల స్థారుు చదువులు అందరికీ అందించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? అందరికీ చదువు అందని సరుకుగా మారింది. కొందరు సంపన్నుల పిల్లలకు విలాస వంతమైన భవనాల్లో ఏసీ తర గతి గదుల్లో చదువు. ఇక సివిల్ సర్వీసు పరీక్షలు పాసై ఉన్నతా ధికారులైన వారి పిల్లలకు కేంద్రీయ విద్యా సంఘటన్ (కేవీఎస్) ద్వారా ప్రభుత్వమే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా సేవలను అందిస్తుంది. పైస్థారుు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారు ప్రైవేటు బడుల భారీ వసూళ్లతో సత మతమవుతూ ఉంటారు. అటు ప్రైవేటు చదువులను అందుకోలేని, సర్కారీ చదువులు చదువుకోలేని సందిగ్ధం పేదలది. ప్రైవేటు స్కూళ్లు 25 శాతం సీట్లను వెనుకబడిన వారికివ్వాలని విద్యా హక్కు చట్టం నిర్దేశించింది. అయితే దాన్ని అరకొరగానే అమలు చేస్తున్నారు. ఒక వంక ప్రభుత్వాలు అందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కుకు హామీని ఇస్తూ రాజ్యాంగాన్ని మార్చి, చట్టాన్ని తెచ్చాయి అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. మరో వంక కేవీఎస్ స్థారుు నాణ్యమైన విద్యను సర్కారీ ఉన్న తాధికారుల పిల్లలకే పరిమితం చేసి, మిగతా వారిని చదువుల దుకాణాల మేతకు వదిలేయడం ఎంత వరకు న్యాయం? రాజ్యాంగంలోని అధికరణం 14 అందరికీ సమానతను నిర్దేశిస్తున్నది. మతం, కులం, జాతి ధనం తేడా లేకుండా అందరికీ సమాన, సమున్నత ప్రమా ణాల చదువు ఎందుకు చెప్పడం లేదు? మద్యం అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తున్న ప్రభుత్వాలు, భక్తిని పెంచి భక్తుల నుంచి వేల కోట్ల రూపాయల ముడుపులు అందుకుంటున్న ఆలయ ధర్మకర్తలు కేవీఎస్ స్థారుు చదువులు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఎన్నికలు రాగానే అనేక ఉచిత పథకాలు ప్రక టించే పార్టీలు అందరికీ ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తామని ఎందుకు ప్రమాణం చేయడం లేదు? ప్రభుత్వ అధికారుల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠ శాలలకే పంపాలని ఆదేశించాలని అలహాబాద్ హైకోర్టు ఆ మధ్య సూచించింది. వినడానికి ఈ ఉత్తర్వు బాగానే ఉంది. కాని ప్రభుత్వమే కేవీఎస్ బడులను వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు ఈ తీర్పు అమలు కావడం సాధ్యం కాదు. దానికన్నా కేవీఎస్ స్థారుు చదు వులు అందరికీ అందించాలనడం న్యాయం కదా! మంచి జీతాలు ఇచ్చి, అర్హులైన ఉపాధ్యాయులను పార దర్శకంగా, న్యాయంగా ఎంపిక చేసి, మంచి భవనాలు నిర్మించి, అందులో శుభ్రమైన శౌచాలయాలను ఏర్పాటు చేసి, పుస్తకాలు తదితర అవసరాలు తీర్చి చదువులు చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కాదు. ప్రభుత్వాలు ఈ పనులు చేయకపోవడం వల్ల ప్రైవేటు కార్పొరేటు బడి దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారుు. ప్రైవేటు చదువును ఒక విలాసవంత మైన సరుకుగా మార్చేశారు. భారీ ిఫీజులను వసూలు చేసినా అందుకు తగ్గట్టు ఉన్నత ప్రమాణాలు గల విద్యను అందిస్తున్నారా? అని అడగడానికి వీల్లేదు. సమాచారం అడిగితే మేం ఆర్టీఐ కిందికి రాబోమం టారు. ప్రభుత్వ విద్యాశాఖ అడిగితే చెప్పకుండా దాటే స్తారు లేదా రిట్లే స్తారు. వీటిని అదుపు చేసేదెవరు? వీరి విరాళాల వసూళ్ల ఆగడాలకు కళ్లెం వేసేదెవరు? ఫీజు చెల్లించలేదని ఢిల్లీలో ఒక ప్రైవేటు స్కూలు వారు పిల్లలను లైబ్రరీలో బంధించి, ఒకరోజు కదల నివ్వలేదని వార్తలు వచ్చారుు. తల్లిదండ్రులు తమ డిమాండ్లు నెరవేరే దాకా ఫీజు చెల్లించమని హెచ్చ రించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కూడిన ఒక కమిటీ ఉండాలనీ, విపరీత ఫీజులు వసూలు చేయ రాదని, తీసుకున్న అధిక మొత్తాలు తిరిగి ఇవ్వాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రైవేట్ విద్యాలయాల ఆగ డాలను తట్టుకోవడానికి మూడు చట్టాలను తెచ్చింది. కానీ సంకుచిత రాజకీయాల వల్ల అవి చట్టాలుగా మారి, అమలయ్యే అవకాశం లేదు. ఢిల్లీ పాఠశాల విద్యా సవ రణ బిల్లు... ప్రవేశాలకు ఇంటర్వ్యూలను, భారీ విరాళా లను నిషేధించింది. ఢిల్లీ పాఠశాలల లెక్కల పరిశీలన, అధిక ఫీజుల వాపస్ బిల్లు తప్పు చేసిన బడులకు అంతకు పదింతల మొత్తాన్ని జరిమానాగా విధిస్తుంది. మూడు నుంచి 5 ఏళ్ల జైలు శిక్షలను కూడా నిర్దేశించింది. విద్యా హక్కు చట్టాన్ని సవరించి విద్యార్థులు 9వ తరగతి వరకు ఏటా ఉత్తీర్ణతను సాధించడాన్ని తప్పనిసరి చేసేలా పథకాలు రూపొందించారు. చునౌతీ 2018 అంటే 2018 సవాల్ పేరుతో ఒక సంస్కరణను ప్రతిపాదించారు. కొన్ని భౌగోళిక మండ లాలకు పరిమితమైన టైంటేబుల్ రూపొందించాలని, కొందరు అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులను ఎంచుకుని తరగతి గదుల్లో వెనుకబడిన వారి నేర్చుకునే శక్తిని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. 6, 7, 8 తరగతుల పిల్లలకు నిశిత అనే పథకాన్ని, 9వ తరగతి పిల్లలకు విశ్వాస అనే పథకాన్ని రూపొందించారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆలోచించవలసిన విషయం ఇది. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈ-మెయిల్: professorsridhar@gmail.com -
స్లాట్.. రెడీ..
► నేటి నుంచి ఆర్టీఏ ఆన్లైన్ సేవలు ► 57 రకాల పౌరసేవలు ఇక ఆన్లైన్లోనే ► పూర్తిగా కాగిత రహిత, నగదు రహిత సేవలు ► ఈ సేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లలో నమోదు సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ సేవలు ఇక పూర్తిగా ‘ఆన్లైన్లో’కి వచ్చేశాయి. రవాణాశాఖ అందజేసే సుమారు 58 రకాల పౌరసేవలు మంగళవారం నుంచి ఆన్లైన్లోనే లభించనున్నాయి. ఇందుకోసం నేటి నుంచి స్లాట్ (సమయం, తేదీ) ప్రకారమే పౌరసేవలను అందజేస్తారు. నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకొనేందుకు, అక్కడిక్కడే ఫీజు చెల్లించేందుకు ఇక ఏ మాత్రం అవకాశం ఉండదు. నగదు రహిత, కాగిత రహిత సేవలు పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి. వినియోగదారులు తమకు కావలసిన సేవల కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకున్న 24 గంటలలోపు నెట్ బ్యాంకింగ్ లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించాలి. తమకు లభించిన స్లాట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్లతో వెళ్లి అధికారులను సంప్రదించాలి. వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం అధికారులు సంతృప్తి చెందితే వినియోగదారుల నుంచి డిజిటల్ సంతకం, ఫొటో, బొటన వేలి ముద్ర తీసుకొని పంపేస్తారు. ఆ తరువాత స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారులు ఆశించిన పౌరసేవలు ఇంటికి చేరుతాయి. వినియోగదారులు అందజేసే డాక్యుమెంట్లలో ఏవైనా తక్కువ ఉంటే ఆ పనిని పెండింగ్‌లో ఉంచుతారు. సరైన ధృవపత్రాలతో వచ్చినప్పుడే పెండింగ్ పని పూర్తవుతుంది. ఏ రకమైన పౌర సేవ కోసం ఏయే డాక్యుమెంట్లు అందజేయాలనే సమాచారం స్లాట్ బుకింగ్ సమయంలోనే వినియోగదారుల మొబైల్ ఫోన్‌కు అందుతుంది. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్ ఆన్లైన్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు వివిధ రూపాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 1400 ఈ సేవా కేంద్రాల్లో నమోదు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1400 ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా రవాణాశాఖ సేవల కోసం స్లాట్ నమోదు చేసుకొని, అక్కడే ఫీజు చెల్లించవచ్చు. స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోలేని వాళ్లు, ఇళ్లల్లో ఇంటర్నెట్ సదుపాయం లేని వాళ్లకు ఇది చక్కటి అవకాశం. తెలంగాణ అంతటా 4 వేల ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ సదుపాయం లభిస్తుందని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, బదిలీలు, పలు ధృవపత్రాల రెన్యూవల్స్, పన్నులు, అపరాధ రుసుముల చెల్లింపులు వంటి అన్ని రకాల పౌరసేవల కోసం వినియోగదారులు ఇక నుంచి స్లాట్ (సమయం, తేదీ) ప్రకారమే సంప్రదించవలసి ఉంటుంది. అన్ని సేవలకు కేరాఫ్ ఆన్లైన్... లెర్నింగ్ లైసెన్సు (ఎల్ఎల్ఆర్) కోసం స్లాట్ నమోదు చేసుకోవడంతో పాటు, కాలపరిమితి ముగిసిన ఎల్ఎల్ఆర్ కోసం కూడా స్లాట్ నమోదు చేసుకోవలసి ఉంటుంది. డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్సు, ఫెయిల్ అయిన వారు మరోసారి టెస్ట్‌కు హాజరుకావాలన్నా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్, రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతించే బ్యాడ్జ్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్సులో చిరునామా మార్పు, కొత్త ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డూప్లికేట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, త్రైమాసిక పన్ను, గ్రీన్‌ట్యాక్స్ వంటి పన్నులు, వాహనాలపై విధించే అపరాధ రుసుములు సైతం ఆన్లైన్ ద్వారానే చెల్లించవలసి ఉంటుంది. వాహనం నమోదు, హైర్ పర్చేస్ అగ్రిమెంట్, హైర్ పర్చేస్ టర్మినేషన్, యాజమాన్య బదిలీ, డూప్లికేట్ ఆర్సీ, ఆర్సీ రెన్యూవల్ చేసుకోవడం, చిరునామా మార్పు, వాహనానికి అదనపు హంగులు సమకూర్చుకోవడం, ఎన్ఓసీ తీసుకోవడం వంటి అన్ని రకాల సేవల కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ ఇలా.... ► ఇంటర్నెట్లో ‘తెలంగాణ రవాణాశాఖ వెబ్సైట్’ ఓపెన్ చేయగానే ఎడమ వైపున ‘ఆన్లైన్ సర్వీసెస్’ అని ఎరుపు రంగులో కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మొత్తం సేవల వివరాలు డిస్ప్లే అవుతాయి. ► కావలసిన సేవలపైన ‘క్లిక్’ చేస్తే ఒక కేలండర్ డిస్ప్లే అవుతుంది. అందులో వినియోగదారులు తమకు అనువైన తేదీ, సమయం బుక్ చేసుకోవాలి. ఆ తరువాత వివరాలను నమోదు చేయాలి. వెంటనే మొబైల్ నెంబర్‌కు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్, ఆర్టీఏలో అందజేయవలసిన డాక్యుమెంట్ల వివరాలు ఎస్సెమ్మెస్ ద్వారా అందుతాయి. ► పేమెంట్ ఆప్షన్లో అభ్యర్ధులు నెట్‌బ్యాంకింగ్ లేదా ఈసేవా, మీ సేవా, క్రెడిట్, డెబిట్ కార్డులను ఎంపిక చేసుకొని ఫీజు చెల్లించవచ్చు, ► ఆన్లైన్ సేవలను నమోదు చేసుకున్న 24 గంటల వ్యవధిలో ఫీజు చెల్లించాలి. -
కేడర్ కేటాయింపులు చట్టవిరుద్ధం
సివిల్ సర్వీస్ అధికారుల పంపిణీపై క్యాట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీలకు సివిల్ సర్వీస్ అధికారులను కేటాయించేందుకు నియమించిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ రూపొందించిన నియమ నిబంధనలను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తప్పుబట్టింది. ఆ నిబంధనలు లోపభూయిష్టమని స్పష్టం చేసింది. కేడర్ కేటాయింపులను సవాల్ చేస్తూ పదిహేను మంది అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను క్యాట్ అనుమతించింది. వారి కేటాయింపుల ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు ఎం.వెంకటేశ్వర్రావు, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కుమార్తె, అల్లుడు కేడర్ కేటాయింపుల్లో ఉన్నారని, అలాంటప్పుడు ప్రత్యూష్‌సిన్హా కమిటీలో సభ్యుడిగా మహంతిని నియమించడమేమిటని ప్రశ్నించింది. కేడర్ కేటాయింపుల నిబంధనలన్నీ చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే కేడర్ కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో క్యాట్‌ను ఆశ్రయించిన వారికే తమ ఆదేశాలను పరిమితం చేస్తున్నామని పేర్కొంది. కాగా, ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులు సోమేష్‌కుమార్, జి.అనంతరాము, ఎస్ఎస్ రావత్, ఆమ్రపాలి కాట, రోనాల్డ్‌రాస్, కరుణ వాకాటి, ఎ.వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు సంతోష్‌మెహ్రా, అభిలాష్ బిస్త్, అంజనీకుమార్‌లను తెలంగాణకు కేటాయించాలని క్యాట్ ఆదేశించింది. మరోవైపు తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లు హరికిరణ్, శివశంకర్ లాహోటి, శ్రీజన గమ్మల, ఐపీఎస్ రంగనాథ్‌ను ఏపీకి క్యాట్ కేటాయించింది. -
రాజకీయాల్లోకి రండి
సహాయానికి యువత ఆహ్వానం చేతులు కలుపుదామని పిలుపు సాక్షి, చెన్నై : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటూ ఐఏఎస్ అధికారి సహాయం కు యువత ఆహ్వానం పలుకుతోంది. రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తూ, తమ సీఎం సహా యం అన్న నినాదంతో ఇలక్కు(లక్ష్యం,టార్గెట్) పేరిట తిరుచ్చికి చెందిన సంస్థ చెన్నైలో ఆది వారం ర్యాలీ నిర్వహించింది. ‘సహాయం ఐఏఎస్’- పేరు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్మోగుతున్న విషయం తెలిసిందే. అవినీతికి వ్యతిరేకిగా, సంచనాల అధికారిగా ముద్ర పడ్డ సహాయం ఉద్యోగ పయనం బదిలీల పర్వం తోనే సాగుతూ వస్తున్నది. పుదుకోట్టైలో జన్మించిన ఆయన సివిల్ సర్వీసు ఉత్తీర్ణత సాధించినా, ఐఏఎస్ పదవిని ఎంపిక చేసుకోలేదు. తమిళనాడు పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా 1991లో దిండుగల్ జిల్లా ఒట్టన్ చత్రం సబ్ డివిజన్ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద సమరమే చేస్తూ వస్తున్నారు. తదుపరి కాంచీపురం జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరించి ఇసుక మాఫియా గుండెల్లో నిద్రించడమే కాకుండా, ఓ కోలా సంస్థకు వ్యతిరేకంగా వ్యవహరించి, ప్రజల దాహార్తిని తీర్చారని చెప్పవచ్చు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌గా సివిల్ సప్లయ్ విభాగంలో రేషన్ మాఫియాకు దడ పుట్టించారు. ఎక్కడ విధులు నిర్వర్థించినా అక్కడల్లా సంచలనమే. ఇందుకు ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన కానుక బదిలీ పర్వం. ఇప్పటి వరకు ఈయన 20 సార్లకు పైగా బదిలీల ఉత్తర్వుల్ని అందుకున్నారని చెప్పవచ్చు. నామక్కల్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యాక, మరో సంచలనం సృష్టిస్తూ ఐఎఎస్‌ల నెత్తిన గుది బండగా మారారు. తన ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించి ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి తాను వత్తాసు పలికేది లేదని చాటుకున్నారు. ఈ సమయంలో సహాయంకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంచి గుర్తింపును ఇచ్చింది. మదురై జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ అక్కడి అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఈ సమయంలో ఎన్నికల విధులతో పాటుగా, అక్కడి గ్రానైట్ మాఫియా కుంబకోణాల్ని తవ్విన సహాయం సంచలన ప్రకటన చేశారు. వేల కోట్ల మేరకు సాగిన ఈ స్కాం చివరకు కోర్టుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రానైట్ మాఫియా స్కాంలపై విచారించాలంటూ పదుల సంఖ్యల్లో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎన్నికల అనంతరం ప్రాధాన్యత లేని శాఖలో పడి ఉన్న సహాయంకు హైకోర్టు అండగా నిలిచింది. మదురై కేంద్రంగా సాగిన గ్రానైట్ స్కాం విచారణ బాధ్యతల్ని ఆయనకే అప్పగించింది. ఎన్నో ఒడి దొడుగులు, బెదిరింపులు, హత్యా హెచ్చరికలు వచ్చినా ఏ మాత్రం తగ్గకుండా, సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించిన సహాయం, కీలక సలహాలు సూచనలు సైతం ఇచ్చారని చెప్పవచ్చు. ఎక్కడ కెళ్లినా వేదికల మీద అవినీతికి వ్యతిరేకంగా, ప్రజా హితం లక్ష్యంగా ప్రసంగాలు చేసే సహాయం ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమ కారులకు, కొందరు యువతకు హీరోగా కన్పిస్తున్నట్టున్నారు. అవినీతి ఊబిలో కూరుకు పోయిన ఏలిన వాళ్లను, ఏలుతున్న వాళ్లను కడిగేద్దాం...చేతులు కలుపుదాం...మన సీఎం సహాయం అన్న నినాదాన్ని అందుకునే పనిలో పడ్డారు. ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించే నినాదాన్ని అందుకున్నారు. ఆహ్వానం : తిరుచ్చికి చెందిన ఇలక్కు( లక్ష్యం లేదా టార్గెట్) అనే సంస్థ సహాయం రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తూ సోషల్ మీడియా ద్వారా అవినీతి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్లను, యువతను ఏకం చేసిందని చెప్పవచ్చు. తమ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా సహాయం ద్వారానే రాష్ట్రం సమగ్రాభివృద్ధి అన్న నినాదంతో ముందుకు సాగే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆదివారం చెన్నైలో భారీ ర్యాలీకి యత్నించారు. సుమారు వెయ్యి మంది వరకు తరలి వచ్చిన యువత, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లు చేతిలో ప్లకార్డులు బట్టి ఆయనకు ఆహ్వానం పలికే యత్నం చేశారు. ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం ఆవరణలో ఏకమైన వీరందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు చేయకూడదంటూ వారించారు. అయినా, తగ్గేది లేదన్నట్టుగా కాసేపు అక్కడే అటూ ఇటూ తిరుగుతూ నినాదాలతో హోరెత్తించారు. సహాయం రాజకీయాల్లోకి రావాలని, చేతులు కలుపుదాం..మన సీఎం సహాయం అన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయంగా ఇలక్కు నిర్వాహకుల్ని కదిలించగా, అవినీతికి వ్యతిరేకంగా, నిజాయితీకి మారు పేరుగా ఉన్న సహాయం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీ వాల్ ఏ విధంగా సీఎం పగ్గాలు చేపట్టేందుకు పరిస్థితులు అనుకూలించాయో, అలాంటి పరిస్థితులే రాష్ట్రంలోనూ ఉన్నాయని పేర్కొన్నారు. సహాయం రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. -
ఈ-పంచాయతీలకు శ్రీకారం
కామారెడ్డి: పల్లె గడపకు పౌరసేవలు సులభంగా అందిచేందుకు ఈ-పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జనన, మరణ ధ్రువపత్రాల నుంచి పహాణీలు, కరెంట్ బిల్లుల చెల్లింపుల దాకా ఎన్నో సేవలను వీటిద్వారా పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాబోయే రోజుల్లో పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులు సైతం అక్కడే లభిస్తాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేటలో శుక్రవారం ఈ-పంచాయతీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పల్లె గడపకు పౌరసేవలు అందించేందుకే ఈ-పంచాయతీలను ప్రారంభిస్తున్నామని, ఈ రోజు 104 పంచాయతీల్లో ప్రారంభించి, నెలాఖరుకు 700 గ్రామాలకు విస్తరిస్తామని చెప్పా రు. ఈ-పంచాయతీ అంటే ఎలక్ట్రానిక్, ఈజీ, ఎఫీషియెన్సీ పంచాయతీ అని వివరించారు. రాష్ట్రంలో 8,770 పంచాయతీలు, 25 వేల జనావాసాలు ఉన్నాయని.. 60 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని పేర్కొన్నారు. వారంతా తమకు కావలసిన సేవల కోసం మండల కేంద్రాలకు తిరగాల్సిన పని లేకుండా గ్రామాల్లోనే అన్నిరకాల సేవలు పొందవచ్చని మంత్రి చెప్పారు. సమర్థవంతమైన సేవలందించేందుకే ఈ-పంచాయతీలను ప్రారంభించామన్నారు. వీటి నిర్వహణకు ఆయా గ్రామాల మహిళలను నియమిస్తున్నామని... వారికి కనీసం రూ.5 వేలకు తగ్గకుండా ఆదాయం కల్పించనున్నామని తెలిపారు. ఇక్కడ 60 రకాల పౌరసేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సిగ్గులేకుండా విమర్శలు ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలే అయింది. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానం పొందుతుంటే... ఓర్వలేని కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారు..’’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నేళ్లుగా పాలించినోళ్ల పాపాలను కడిగేస్తూ, ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. సభకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అధ్యక్షత వహించగా, మంత్రి పోచారం, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
2న ఈ- పంచాయత్ ప్రారంభం
తొలి దశలో జనన, మరణ ధ్రువపత్రాలు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం తల పెట్టిన ఈ-పంచాయత్ వ్యవస్థను గాంధీ జయంతి రోజు(అక్టోబర్ 2)న ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దీనిద్వారా గ్రామీణ ప్రజలకు ఈ-గవర్నెన్స్ ఫలాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-పంచాయత్‌ల ఏర్పాట్లకు సంబంధించి పంచాయతీరాజ్, ఐటీశాఖ అధికారులతో శుక్రవారం కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో జనన, మరణ ధ్రువపత్రాల వంటి పౌరసేవలను అందిస్తారని, ఆపై జాతీయ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులు, ఆసరా పింఛన్ల పంపిణీ అందించనున్నట్లు చెప్పారు. ఆర్థిక సేవల విషయమై పలు బ్యాంకులతో చర్చిస్తున్నామని, ప్రభుత్వం తరఫున బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ-పంచాయత్‌ల నిర్వహణ నిమిత్తం విలేజ్ లెవల్ ఎంట్రెప్రెన్యూర్ (వీఎల్ఈ)లను నియమిస్తామని, ఆయా గ్రామాల్లో డిగ్రీ అర్హత కలిగిన మహిళలకే వీఎల్‌ఈలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. ఈ- పంచాయత్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ పూర్తయిందని, ఐటీశాఖ ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీఎల్ఈలకు శిక్షణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంట ర్నెట్ ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా వాటర్‌గ్రిడ్ పనులతోపాటు ఫైబర్ ఆ ప్టిక్ కేబుల్ వేయాలని, ఇందుకోసం త్వరగా పూర్తిస్థాయి డిజైన్‌ను రూపొందించాలన్నా రు. సమావేశంలో పంచాయతీరాజ్ ము ఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
సివిల్స్‌కు ఎంపికైన ముగ్గురు
ప్రొద్దుటూరు, వీరబల్లి, నందలూరు : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నివసిస్తున్న పాతకోట విజయభాస్కర్‌రెడ్డి 462వ ర్యాంక్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయభాస్కర్‌రెడ్డి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో చదివాడు. 2001లో పదవ తరగతి పరీక్షలో 468 మార్కులు సాధించాడు. తర్వాత విజయవాడలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో (ఎంపీసీ) ఇంటర్ చదివి 921 మార్కులు పొందాడు. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 77 శాతం మార్కులతో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన అనంతరం చెన్నైలోని సీటీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు పనిచేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో చదివాడు. దిల్లీలోని వాజీరామ్ అండ్ రవి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. మూడేళ్లుగా వరుసగా సివిల్స్పరీక్షలు రాస్తున్నాడు. సోషియాలజి సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలువడిన ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్ష ఫలితాలలో ఆలిండియాలో 85వ ర్యాంక్ సాధించాడు. శనివారం వెలువడిన సివిల్స్ పరీక్ష ఫలితాల్లో 462వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా ఈయనకు ఐపీఎస్, ఐఆర్ఎస్, కస్టమ్స్ ఆఫీసర్లలో ఏదో ఒక పోస్టు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయభాస్కర్‌రెడ్డి తల్లిదండ్రులు పెద్ద సుబ్బారెడ్డి, వెంకటమ్మలు మైలవరం మండలంలోని బాక్రాపేట గ్రామానికి చెందిన వారు. వీరిది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. అయితే మైలవరం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో గ్రామం ముంపునకు గురికావడంతో ప్రొద్దుటూరుకు వచ్చి స్థిరపడ్డారు. తర్వాత కాలంలో పెద్ద సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు. సివిల్ ర్యాంకర్ విజయభాస్కర్‌రెడ్డికి విజయలక్ష్మిదేవి, ప్రమీల దేవి, శశిరేఖ అనే అక్కచెల్లెల్లు ఉన్నారు, వారికి వివాహం అయింది. వైద్య వృత్తి నుంచి సివిల్స్‌లోకి.. వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామం రూకావాండ్లపల్లెకు చెందిన డాక్టర్ ఏ.సురేష్‌రెడ్డి సివిల్ సర్వీసెస్‌లో 525వ ర్యాంకు సాధించారు. రైతు కుటుంబానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, ధర్మాదేవిల కుమారుడు. ప్రస్తుతం వీరు రాయచోటిలోని ఎన్జీఓ కాలనీలో ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకు శ్రీనికేతన్(రాయచోటి), ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకు (ఆంగ్లో ఇండియన్, రాయచోటి), తొమ్మిదవ తరగతి(రాజు స్కూల్), పది నుంచి ఇంటర్ వరకు(రత్నం కళాశాల, నెల్లూరు), ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. రెండు సంవత్సరాలుగా రోయచోటిలో బీడీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశాలలో డాక్టర్‌గా పని చేస్తూ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. ఇతను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం పట్ల తన సొంత గ్రామమైన నూకావాండ్లపల్లెలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యువత ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. ఆ లక్ష్యం సాధనకు సమయం కేటాయించుకుని పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా చదివితే లక్ష్యం చేరడం కష్టం కాదని చెప్పారు. ఐఏఎస్ కోసం మరోసారి ప్రయత్నిస్తా : డా.ధీరజ్ నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ బి.ధీరజ్‌కుమార్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 1177వ ర్యాంకు సాధించారు. ధీరజ్‌కుమార్ తండ్రి బి.జయభాస్కర్రావ్ వృత్తి రీత్యా రైల్వేలో వైద్యుడిగా పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించారు. ప్రస్తుతం ఈయన గుంటకల్ రైల్వే డివిజన్లో అసిస్టెంట్ చీప్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ధీరజ్ తల్లి ఎం.విజయభారతి రాష్ట్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ డి.ఎమ్.డబ్లు.ఒ.గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పట్టుదలతో ప్రయత్నించి సివిల్స్‌లో విజయం సాధించారు. ఇతని సోదరుడు దీపక్‌కుమార్, సోదరి దీప్తిలు సైతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నందలూరులోని శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్లో పదవ తరగతి, నెల్లూరులోని రత్నం కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. సివిల్స్ కోసం హైదరాబాద్, ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఈ ఫలితం పట్ల తాను పెద్దగా సంతృప్తి పడటం లేదన్నారు. ఈ ర్యాంక్‌తో ఐఆర్ఎస్ రావచ్చని, తన లక్ష్యం ఐఏఎస్ అని చెప్పారు. ఆ లక్ష్యం కోసం మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహకం అధికంగా ఉందని అన్నారు. -
కోర్సు ఏదైనా.. విజ్ఞానం అనంతం
మచిలీపట్నం (ఈడేపల్లి) : విద్యార్థి లోకానికి ఇ- లైబ్రరీలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. సమయాన్ని, డబ్బును ఆదా చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తుకోసం కలలు కనే నేటి యువతరానికి డిజిటల్ లైబ్రరీలు అండగా నిలుస్తున్నాయి. తమ కలల్ని సాకారం చేసుకునేలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న లక్షల మంది అభ్యర్థులకు ఇప్పుడు డిజిటల్ లైబ్రరీలు కల్పతరువుగా మారాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కూడా ఈ సదుపాయం వరంగా మారుతోంది. 21వ శతాబ్దపు నవనాగరికత, అత్యాధునిక జీవనవిధానానికి ఇంటర్నెట్ వినియోగం ప్రతీక అనడం అతిశయోక్తి కాదు. మారుతున్న విజ్ఞానానికి అనుగుణంగా.. జిల్లాకు సంబంధించి.. విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, లంకపల్లి, పెడన, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో పలు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో వేలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా తమ పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని పుస్తకాలు కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక వేళ కొందామన్నా.. కావాల్సిన పుస్తకాలు లభ్యమవుతాయని ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ఈ కోవకు చెందిన విద్యార్థులంతా ఎక్కువ శాతం ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. చదువుల్లో దూసుకుపోతున్నారు. అలాగే ప్రాజెక్టువర్క్ సమయంలో వివిధ అంశాలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవడానికి డిజిటల్ లైబ్రరీలు సౌలభ్యంగా ఉంటున్నాయి. మారుతున్న బోధన పద్ధతులు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా కళాశాలల యాజమాన్యాలు కూడా డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపుతున్నాయి. పోటీపరీక్షలకు.. పోటీ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు డిజిటల్ లైబ్రరీలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు పోటీ పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారం మెటీరియల్ రూపంలో దొరకడం చాలా కష్టం. ప్రస్తుతం ఆ భయం లేదు. యూపీఎస్సీ పరీక్షలు మొదలుకొని గ్రూప్-1, గ్రూప్-2 ఇలా అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు, సాధన పత్రాలు, మోడల్ పేపర్సు.. ఇలా కావాల్సిన వన్నీ సబ్జెక్టుల వారీగా క్షణాల్లో ఇంటర్నెట్ ద్వారా లభ్యమవుతున్నాయి. వీటితో పాటుగా వివిధ పత్రికలు ప్రతిరోజూ ప్రచురించే సాధన పత్రాలు కూడా అందుబాటులో ఉండడంతో అభ్యర్థుల కెంతో సమయం ఆదా అవడంతో పాటు ప్రయోజనం చేకూరుతోంది. కోర్సు ఏదైనా.. విజ్ఞానం అనంతం పాఠ్యాంశాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు, వైజ్ఞానిక అంశాలను క్రోడీకరించుకుని సొంతంగా నోట్సు తయారుచేసుకునేందుకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కేవలం వృత్తి విద్యాకోర్సులు చదివే వారికి మాత్రమే కాక ఇంటర్, డిగ్రీ చదివే వారు కూడా ఇ-లైబ్రరీలపై ఆధారపడి తమ జ్ఞానాన్ని మెరుగుపర్చుకుంటున్నారు. లాసెట్, డైట్‌సెట్, ఎంమ్సెట్, ఎడ్‌సెట్ ఇలా పలు ఎంట్రన్స్ పరీక్షలకు హాజరయ్యేవారు మోడల్ ప్రశ్నపత్రాలకోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ నుంచి పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా అవసరమైన సమాచారం పొందవచ్చు. శేషు సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. మధ్యతరగ తి కుటుంబం కావడంతో అధునాతన మెటీరియల్స్, మోడల్ పేపర్స్ సంపాదించడం కష్టం. కానీ ఇంటర్నెట్ ద్వారా అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సమాచారం అందిపుచుకో గలుగుతున్నాడు. మనోజ్ సాహిత్యాభిమాని. ఆంగ్ల రచయిత షేక్స్పియర్, ప్రముఖ హిందీ కవి సుమిత్రానంద్ పంత్ రచనలంటే వల్లమాలిన అభిమానం. వీరి ప్రఖ్యాత రచనలు కొన్ని పుస్తకాలు బుక్‌షాపుల్లో ఎంత వెతికినా దొరకలేదు. అంతర్జాలం ద్వారా ఒకే ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాలు కళ్లముందు తళుక్కుమన్నాయి. వాటిని సీడీల్లోకి డౌన్లోడ్ చేసుకుని ఆనందించాడు. రమేష్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలన్నీ కొనుగోలు చేయాలంటే ఎంతో ఆర్థిక భారం. అందుకే ఇంటర్నెట్ను వినియోగించుకుని కావాల్సిన పుస్తకాలను చదివి, పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపాడు. కృష్ణావర్సిటీ పరిధిలోడిజిటల్ లైబ్రరీలు ఎలక్ట్రానిక్ డిజిటల్ లెర్నింగ్ రిసోర్సెస్ పాత్ర నేటి విద్యావిధానంలో కీలకంగా మారింది. త్వరలో యూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. పాఠ్యాంశాలకు అవసరమైన డిజిటల్ గ్రంథాలయాల వివరాల్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తున్నాం. 2002లోనే యూనిసెఫ్ ‘ఓపెన్ ఎడ్యుకేషన్’ మూవ్మెంట్ ప్రారంభించింది.www.oc.w,www.open education.com వెబ్సైట్లలో ఆ వివరాలు ఉన్నాయి. www.mit.ebu.com సైట్లోనే రెండు వేల కోర్సులకు సంబంధించిన గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయి. - వి.వెంకయ్య, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి -
..స్వేచ్ఛగా పనిచేస్తున్నా!
ఆయన సుదీర్ఘకాలం సమాచార వారధి. అలుపెరగని ఆధ్యాత్మిక భావజాల సారధి. మూడు పదుల సివిల్ సర్వీస్‌లో తెలుగు భాషా వికాసం కోసం తపించారు. మలిదశలో ఇదే భావజాలంతో ముందడుగు వేస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక సలహాదారుగా కొత్త ప్రభుత్వంలో క్షణం తీరికలేకుండా గడుపుతున్న కేవీ రమణాచారి తన సెకండ్‌లైఫ్ విశేషాలను ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ఆశయాలు గొప్పవైనప్పుడు.. ఆచరణే మార్గమైనప్పుడు వయో పరిమితితో పనేముంది. లక్ష్య సాధనకు అవిశ్రాంత పోరాటం తథ్యమని భావిస్తాను. అందుకే రిటైరైనా తీరిక లేకుండా ఉన్నాను. ఉద్యోగంతో ఉన్న అనుబంధం వేరు.. ప్రస్తుత సామాజిక జీవనం వేరు. వృత్తిగతంలో అంతర్లీనంగా కొంత ఘర్షణ పడేవాణ్ని. ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేస్తున్నా. విశ్రాంత ఉద్యోగి సమయం కుటుంబానిదే అని చాలా మంది అంటారు. ఆ వెలితి నా ఇంట్లో కనిపించడం లేదు. నా భార్య అర్థం చేసుకుంది. దేవుడ్ని పాలించే వాళ్లమా! సలహాదారుడు అనే పదం గొప్పది. సరైన దారిలో నడిపించే వాడని నా భావన. సలహాలు తీసుకునే వారే లేనప్పుడు సలహాలు ఎవరికివ్వాలి? ఏమివ్వాలి? రిటైరయ్యాక నాలో అంతర్మథనం. కారణాలనేకం ఉండొచ్చు. కానీ, ఒకటే బలీయమైనది. పాలకమండళ్ల చేతిలో పెట్టి ధార్మిక వ్యవస్థను పాలకవర్గాలు విచ్ఛిన్నం చేశాయి. దీన్ని మొదట్నుంచీ వ్యతిరేకించాను. భగవంతుడిని పాలించే సంస్కృతేమిటని నిలదీశాను. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విసిగి స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశాను. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భాధ్యతలు చూడటం ఓ వరంగా భావిస్తాను. ఇప్పటికీ ఆ స్వామి కృప ఉందని భావిస్తాను. తెలంగాణలో పాలకమండళ్లు ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం భరోసా ఇవ్వడం నాలో ఆశావాహ దృక్పథాన్ని పెంచింది. భాషా వికాసానికి కృషి.. సాంస్కృతిక సలహాదారు బాధ్యతలు కీలకమైనవనే అనుకుంటున్నాను. నిర్వహణలో నవయవ్వన ఆలోచనలు ఉండాలనేది నా అభిప్రాయం. సర్వీసులో ఉన్నప్పుడు సింహభాగం సమాచార శాఖనే నిర్వహించడం వల్ల చాలామందితో అనుబంధం ఉంది. వాళ్ల అనుభవాలతో బంధం ఉంది. ఇప్పుడు వాళ్లంతా నాకు ప్రధాన సలహాదారులు. భాషా వికాసానికి వారి భావజాలంతో వారధి కడుతున్నారు. ఈ కర్తవ్య దీక్ష వెనుక ఓ బలమైన సంఘటన ఉంది. ప్రపంచ తెలుగు భాషా ఉత్సవాలు వేడుకగా మిగిలిపోవడం కలచివేస్తోంది. తీసుకున్న నిర్ణయాలేవీ అమలుకు నోచుకోకపోవడం కష్ట పెట్టింది. అందుకే తెలుగు భాష కోసం నిరంతం శ్రమించాలనే కోరిక ఉంది. దీని కోసం మరికొన్ని గంటలు పనిచేయాలనిపిస్తుంది. అనుభవాలే మార్గన్వేషణ లు.. ఓ సివిల్ సర్వీస్ ఉద్యోగి ఏంటి...? ప్రాంతీయ పార్టీలో చేరడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. దానికి కచ్చితమైన సమాధానం లేకపోయినా.. విద్యార్థి దశలోనే ఉన్న ప్రేరణలే కారణాలుగా చెబుతాను. సిద్దిపేటలో 16 ఏళ్ల విద్యార్థిగానే తెలంగాణ కోసం పోరాడి అరెస్టయ్యాను. అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉండేది. కాకపోతే డిగ్రీలో గోల్డ్ మెడల్ కొట్టడంతో రాజకీయం మార్గం కాదన్పించింది. సివిల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నాను. తెలుగు భాషంటే ప్రాణం. తెలుగు వికాసం కోసం ఎవరు వేదిక ఏర్పాటు చేసినా వెళ్లేవాణ్ని. సంస్కృతి, సంప్రదాయాలపై అనర్గళ ఉపన్యాసం ఇచ్చేవాణ్ని. ఆ అనుభవాలే ఇప్పుడు మార్గాన్వేషణలు. ఏదేమైనా రాత్రికి ఇంటికే సాయంసంధ్య నాన్నగారు దీపారాధన చేస్తారు. ఆ తర్వాత అంతా కలిసి రాత్రిపూట భోజనం చేయడం అలావాటు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. 85 ఏళ్ల నాన్నకు నలుగురు సోదరులు. ఇప్పటికీ మాట జవదాటరు. అంతగా గౌరవించే నాన్నను నా పనులు ఇబ్బంది పెడతాయా? కొత్త జీవితం అడ్డంకిగా ఉంటుందా ? రాజకీయాల్లోకి చేరాక పక్కా ప్రణాళిక అనుసరిస్తున్నాను. రాత్రి 9 గంటలకు ఇంటికొస్తాను. అందరితో కలిసి భోజనం చేస్తాను. రిటైరైనా.. యంగే నాలుగేళ్ల కిందటే పదవీ విరమణ చేయాలనుకున్నా.. వీలు పడలేదు. ఇపుడు రిటైర్ అయ్యాక మాత్రం ఆ భావమే నాలో కన్పించడం లేదు. అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి టీఆర్ఎస్లో చేరడం, కేవలం రెండు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం.. మరచిపోలేని కల. సంస్కృతి కాపాడలన్న మనోభీష్టం నెరవేరేందుకు ఇంకా అడ్డంకి ఏంటి? సలహాదారుగా సంతృప్తినిచ్చే జీవితం మలిదశలో వచ్చినప్పుడు ఇంతకన్నా ఆనందం ఏమిటి? అందుకే నౌవ్ అయామ్... యంగ్... నా ఆలోచనలు, అభీష్టాలు, ఆశయాలు యంగ్..! - వనం దుర్గాప్రసాద్ కేవీ రమణాచారి, ఐఏఎస్ అధికారి (రిటైర్డ్) -
ప్రజా సంక్షేమమే ధ్యేయం కావాలి
సివిల్ సర్వెంట్లకు రాష్ట్రపతి పిలుపు ఐఐపీఏ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ప్రణబ్‌ముఖర్జీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో సివిల్ సర్వీసులు కీలక భూమికను పోషిస్తున్నాయని, సివిల్ సర్వెంట్లు ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ) గోల్డెన్ జూబ్లీ వేడుకలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపర్చాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజాసేవలో నాణ్యత ప్రమాణాలు పాటించడం అత్యంత ముఖ్యమని సూచించారు. ప్రజలు మరింత ప్రభావవంతమైన పాలనను కోరుకుంటున్నారని, వారు పరిపాలన వ్యవహరాల్లో లోపాలను ఎంతమాత్రం క్షమించబోరని అన్నారు. త్వరితగతిన అభివృద్ధి సాధించాలంటే నిర్ణయాలు తీసుకోవడంలోనూ వేగాన్ని కనబర్చాలన్నారు. అయితే ఆ నిర్ణయాలు సహేతుకంగా ఉండాలన్నారు. దీటైన భారతదేశాన్ని నిర్మించడంలో పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలే ముఖ్య పాత్ర పోషిస్తాయని, అందుకే ఐఐపీఏ వంటి సంస్థలు ఉత్తమ పనితీరును కనపర్చాలని ఆకాంక్షించారు. పబ్లిక్ సర్వెంట్లను తీర్చిదిద్దడంలో ఐఐ పీఏ పనితీరు ఎంతో సంతృప్తికరంగా ఉందని అభినందించారు. అనంతరం ‘ఇండియన్ గవర్నెన్స్ రిపోర్ట్-2012’ , ‘జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్’ పుస్తకాలను రాష్ట్రపతి ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసినందుకుగాను రాష్ట్రపతి ప్రణబ్‌కు రిటైర్డ్ ఐఆర్ఎస్, ఐఐపీఏ గోల్డెన్ జూబ్లీ కమిటీ చైర్మన్ బి.వి. కృష్ణకుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇతర అతిథులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐఐపీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, డెరైక్టర్, ఫేకల్టీ, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా సేవకే అంకితం
చేజర్ల(సోమశిల), న్యూస్‌లైన్: ప్రజాసేవకే తన పూర్తి జీవిత కాలాన్ని అంకితం చేయనున్నట్టు ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. చేజర్ల మం డలంలోని మడపల్లి, చేజర్ల, బోడిపాడు గ్రామాల్లో పాదయాత్ర సాగింది. మడపల్లి, చేజర్ల గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ఎన్ని కిలోమీటర్లు నడిచాననే దానికంటే ప్రతి కిలోమీటరుకు ఎంత మంది గుండెచప్పుళ్లు విన్నానా అనేదే ప్రధానమైందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధికారం చేపట్టగానే ప్రతి యువకుడికీ ఉద్యోగం లభించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో యువకు లు, మహిళలు, ప్రజల దీవెనలే తనకు రక్ష అన్నారు. ఎక్కడికిపోయినా ప్రజలు రాజన్న రాజ్యం కోరుతున్నారన్నారు. జగన్‌ను ఒంటరి చేసి రాజకీయంగా ఎదుర్కొనలేక అక్రమ కేసులు బనాయించారన్నారు. జగనన్న జైల్లో ఉన్నప్పుడు తాను కలిసేందుకు వెళ్లగా ప్రజలున్నారని పదేపదే చెప్పేవారన్నా రు. ప్రజల ఆదరణ, అభిమానం ముం దు కుట్రలు, కుతంత్రాలు బలాదూర్ అవుతాయని తెలిపారన్నారు. టీడీపీ నాటకాలు ఆడుతోందన్నారు. సీమాం ధ్రలో సమైక్య రాగం, తెలంగాణలో విభజన రాగం పాడుతోందన్నారు. ఆ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. నాయకులు పూనూరు రామమనోహర్‌రెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, బూద ళ్ల వీరరాఘవరెడ్డి, గడ్డం మస్తాన్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎ స్సార్సీపీ నాయకులు బాలగంగాధర్‌రెడ్డి, కంటిరెడ్డి, సిద్ధారెడ్డి, చలమల సుబ్బారెడ్డి, గుండుబోయిన నారాయణ, ఎ.వెంకటరెడ్డి, ఎస్డీ నాయబ్, సన్నపరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, బి.సుధాకర్‌రెడ్డి, ఎన్.సుందరరామిరెడ్డి, కె.శ్రీని వాసులునాయుడు, ఇనకుర్తి సింహాద్రినాయుడు, డాక్టర్ ఎన్వీ రమణారెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ,ఎస్టీ నాయకులు వై.పెంచలయ్య, ఎస్.పెంచలరెడ్డి, ఎస్. దయాకర్‌రెడ్డి, జి.వేణుగోపాల్‌రెడ్డి, వి. రవీంద్రారెడ్డి, సీతారామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, హరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాజకీయ జోక్యం నుంచి సివిల్ సర్వెంట్లకు రక్షణ
-
ఐఏఎస్‌లపై రాష్ట్రాల అధికారంలో మార్పునకు నో!
సస్పెన్షన్ అధికారం ఉపసంహరణకు కేంద్రం విముఖత న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసు అధికారులను సస్పెండ్ చేసే అధికారాన్ని రాష్ట్రాల నుంచి వెనక్కి తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అయితే రాష్ట్రాలు క్రమశిక్షణ చర్యల పేరుతో అన్యాయంగా వ్యవహరిస్తే వారికి తగిన రక్షణ కల్పించేందుకు కొత్త నిబంధనల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. ఐఏఎస్, ఇండిఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు తగిన రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రస్తుత సర్వీస్ నిబంధనలను ప్రభుత్వం పునస్సమీక్షిస్తోందని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే తమ పరిధిలో పనిచేసే సివిల్ సర్వీస్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలకున్న అధికారంపై పరిశీలనేదీ చేయట్లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయా అధికారులను బదిలీ, సస్పెండ్ చేసే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయి. వారిని రాష్ట్రాల నుంచి తొలగించాలన్న డిమాండ్ ఇటీవల ఐఏఎస్ అధికారి దుర్గాశక్తిని సస్పెండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. -
దుర్గాశక్తి... బహువచనం!
సంపాదకీయం : చదువులో చురుగ్గా ఉన్నారని, నాయకత్వ లక్షణాలు దండిగా ఉన్నాయని, సమకాలీన సమస్యలపై అవగాహన ఉన్నదని, అవి అపరిష్కృతంగా మిగిలిపోతున్న వైనంపై ఆగ్రహం ఉన్నదని, అందుకోసం ఏదో చేయాలన్న తపన వారి అంతరాంతరాల్లో జ్వలిస్తున్నదని అనుకునే యువతీయువకులు సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని చాలా మంది సలహాలిస్తుంటారు. సవాళ్లను స్వీకరించే తత్వమూ, సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను వెదకగల సామర్ధ్యమూ, అంకితభావంతో పనిచేసే సంసిద్ధతా ఉండేవారివల్ల ఈ సమాజం మెరుగుపడుతుందని అందరూ నమ్ముతారు. సివిల్ సర్వీస్ అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే జటిలమైన పరీక్షలకెళ్లేవారంతా ఈ లక్షణాలన్నీ తమకున్నాయని, ఇందులో కృతార్థులమై తమ సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి వచ్చే దురహంకారంతో తమ మాటే శాసనంగా చలామణీ కావాలని ఆశించే పాలకులున్నప్పుడు ఇలాంటి యువతరం కలలన్నీ కల్లలుగా మిగిలిపోతాయి. వివిధ రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో కొందరు ఐఏఎస్ అధికారులపై అధికారంలో ఉన్నవారు సాగిస్తున్న ధాష్టీకం చూస్తే కలిగే అభిప్రాయం ఇదే. ఇలాంటివారి ఏలుబడిలో ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యేవారికి రెండే ప్రత్యామ్నాయాలుం టున్నాయి-అలాంటి పాలకుల అభీష్టానికి తలవంచడం లేదా వారి ఆగ్రహానికి గురై ఎలాంటి ప్రాధాన్యతా లేని పోస్టుల్లో వృధాగా పొద్దుపుచ్చడం. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా జిల్లా గౌతంబుద్ధ నగర్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగపాల్ని సస్పెండ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐఏఎస్‌ల పరిస్థితిని మరోసారి కళ్లకు కడుతోంది. యమునా నదిలో అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్న మాఫియా ముఠాలపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ ప్రాంతం నుంచి నెలకు కనిష్టంగా చూస్తే రూ.200 కోట్ల విలువైన ఇసుక తరలి పోతోందని ఒక అంచనా. ఇసుక తవ్వకాలవల్ల యమునా నది కోతకు గురై పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఎందరో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పర్యవసానంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పరిచింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తీరా దుర్గాశక్తి చర్యకు ఉపక్రమించేసరికి ఆమెను సస్పెండ్ చేసింది. గౌతంబుద్ధ నగర్లో ఒక మసీదు కోసం నిర్మించిన గోడను కూల్చేయడంవల్లా, ఆ చర్య మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందువల్లా ఆమెను సస్పెండ్ చేయాల్సివచ్చిందని అఖిలేష్ ఇస్తున్న సంజాయిషీ వాస్తవాలను ప్రతిబింబించదు. ఆ ఉదంతంతో సంబంధమున్న అధికారి పేరు జేవర్ అని తాజా సమాచారం వెల్లడిస్తున్నది. అఖిలేష్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ఐఏఎస్‌లను 800 సార్లు బదిలీ చేశారు. అంటే, సగటున నెలకు 50 బదిలీలన్నమాట. యూపీలో ఇది అఖిలేష్ పాలనతోనే ప్రారంభమైన ధోరణికాదు. అంతక్రితం పాలించినవారూ ఈ తరహాలోనే ప్రవర్తించారు. నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే ఐఏఎస్, ఐపీఎస్‌లపై కొంచెం హెచ్చుతగ్గుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల పాలకుల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రాకూ, రియల్ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కూ మధ్య సాగిన లావాదేవీలపై కూపీ లాగిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో బదిలీలతో ఎలా వేధించిందో ఈ దేశం చూసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై పాత కేసును తిరగదోడారన్న నెపంతో రాజస్థాన్ ప్రభుత్వం జైసల్మేర్ జిల్లా ఎస్పీని రెండురోజులక్రితం బదిలీచేసింది. ఆ బదిలీపై ఆ జిల్లా భగ్గుమంటోంది. జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్‌ది మరో కథ. ఢిల్లీలో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆమెను రెండు నెలలు తిరక్కుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఇందుకు కారణం చాలా చిన్నది. ప్రణాళికా సంఘంతో చర్చలకోసం ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆమె ఖరీదైన భోజనం పెట్టించలేదని, ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేయలేదని ఆరోపణలు. మన రాష్ట్రం విషయానికే వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనాకాలంలో కీలకపదవుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను ఇప్పుడు ఎలా వేధిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. తగిన ఆధారాలున్న అధికారులపై చర్య తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే దర్యాప్తు పేరిట సీబీఐ తమను అవినీతిపరులుగా, ప్రజాధనాన్ని అపహరించినవారిగా మీడియాకు లీకులు ఇస్తున్న తీరు సమంజసంగా లేదని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యవర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. అక్రమ నిర్ణయాలనుకున్న ప్రాజెక్టులను కొనసాగిస్తూ, అందులో భాగస్వాములమైన తమను మాత్రం అక్రమాలకు పాల్పడ్డవారిగా చిత్రించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు, తమ భాగస్వామ్యపక్షాల ప్రభుత్వాలు ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇంతగా వేధిస్తుంటే ఏనాడూ నోరెత్తని సోనియాగాంధీ దుర్గాశక్తి విషయంలో ఎక్కడలేని ఆసక్తినీ ప్రదర్శించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని కోరడం మన నేతల ద్వంద్వ నీతికి నిదర్శనం. ఖేమ్కా విషయంలోనూ ఆమె ఇలాగే స్పందించివుంటే అందరూ హర్షించేవారు. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఈ సర్వీసులకు ఎంపికైన అధికారులు స్వతంత్రంగా, నిర్భయంగా వ్యవహరించ గలిగితేనే పటిష్టమైన దేశం నిర్మాణమవుతుందని అభిలషించారు. కానీ, అలాంటి అధికారులను పాలకులు వేధించే సంస్కృతి రాను రాను పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట పడకపోతే, నిజాయితీగా వ్యవహరించే అధికారులను ఆదరించకపోతే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుందని మన నేతలు గ్రహించడం అవసరం. -
సివిల్స్ మెయిన్స్ దరఖాస్తు తేదీల ప్రకటన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 1న జరిగే మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం తెలిపింది. ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 10 వరకూ అభ్యర్థులు తమ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)లను ఆన్లైన్లో సమర్పించాలి. ఇలా సమర్పించిన డీఏఎఫ్ను ప్రింట్ తీసుకోవాలని, ఆ నకలుపై అభ్యర్థి సంతకం చేసి, సంబంధిత డాక్యుమెంట్లు, ఫీజును జత చేసి సెప్టెంబర్ 18లోగా కమిషన్‌కు పంపాలని సూచించింది. అదనంగా 100 ఐఆర్ఎస్ పోస్టులు: ఆదాయపన్ను శాఖను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని కేడర్లలోనూ భారీ సంఖ్యలో కొత్త పోస్టులు భర్తీ చేయనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అదనంగా 100 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాబోయే యూపీఎస్సీ నోటిఫికేషన్లో వీటిని అదనంగా కలుపుతారు. అలాగే ఆదాయపన్ను శాఖలో దిగువ స్థాయి వివిధ కేడర్లలో 20,751 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు.