చేజర్ల(సోమశిల), న్యూస్‌లైన్: ప్రజాసేవకే తన పూర్తి జీవిత కాలాన్ని అంకితం చేయనున్నట్టు ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. చేజర్ల మం డలంలోని మడపల్లి, చేజర్ల, బోడిపాడు గ్రామాల్లో పాదయాత్ర సాగింది. మడపల్లి, చేజర్ల గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ఎన్ని కిలోమీటర్లు నడిచాననే దానికంటే ప్రతి కిలోమీటరుకు ఎంత మంది గుండెచప్పుళ్లు విన్నానా అనేదే ప్రధానమైందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధికారం చేపట్టగానే ప్రతి యువకుడికీ ఉద్యోగం లభించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో యువకు లు, మహిళలు, ప్రజల దీవెనలే తనకు రక్ష అన్నారు. ఎక్కడికిపోయినా ప్రజలు రాజన్న రాజ్యం కోరుతున్నారన్నారు.
జగన్‌ను ఒంటరి చేసి రాజకీయంగా ఎదుర్కొనలేక అక్రమ కేసులు బనాయించారన్నారు. జగనన్న జైల్లో ఉన్నప్పుడు తాను కలిసేందుకు వెళ్లగా ప్రజలున్నారని పదేపదే చెప్పేవారన్నా రు. ప్రజల ఆదరణ, అభిమానం ముం దు కుట్రలు, కుతంత్రాలు బలాదూర్ అవుతాయని తెలిపారన్నారు. టీడీపీ నాటకాలు ఆడుతోందన్నారు. సీమాం ధ్రలో సమైక్య రాగం, తెలంగాణలో విభజన రాగం పాడుతోందన్నారు. ఆ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. నాయకులు పూనూరు రామమనోహర్‌రెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, బూద ళ్ల వీరరాఘవరెడ్డి, గడ్డం మస్తాన్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎ స్సార్‌సీపీ నాయకులు బాలగంగాధర్‌రెడ్డి, కంటిరెడ్డి, సిద్ధారెడ్డి, చలమల సుబ్బారెడ్డి, గుండుబోయిన నారాయణ, ఎ.వెంకటరెడ్డి, ఎస్‌డీ నాయబ్, సన్నపరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, బి.సుధాకర్‌రెడ్డి, ఎన్.సుందరరామిరెడ్డి, కె.శ్రీని వాసులునాయుడు, ఇనకుర్తి సింహాద్రినాయుడు, డాక్టర్ ఎన్‌వీ రమణారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ,ఎస్టీ నాయకులు వై.పెంచలయ్య, ఎస్.పెంచలరెడ్డి, ఎస్. దయాకర్‌రెడ్డి, జి.వేణుగోపాల్‌రెడ్డి, వి. రవీంద్రారెడ్డి, సీతారామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, హరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సేవకే అంకితం
Published Tue, Jan 21 2014 1:51 AM | Last Updated on Tue, Oct 16 2018 4:32 PM
Advertisement
Advertisement