![Mekapati Vikram Reddy Files The Nomination For Atmakur By Election - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/2/vikram-reddy.jpg.webp?itok=CI5tflia)
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బుధవారం బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి.. నేడు నామినేషన్ దాఖలు చేశారు. విక్రమ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్‌కు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్‌గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
చదవండి👉 సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment