atmakur by election
-
జనం.. వైఎస్సార్సీపీ పక్షం
సాక్షి, అమరావతి: ఎన్నిక ఏదైనా పోటీ ఏకపక్షమే.. ఘన విజయం వైఎస్సార్సీపీదే.. ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ప్రజాదరణతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ సహా ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడుతున్నాయి. ఇదీ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాన్ని సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు అసలైన నిర్వచనం చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి సామాజిక న్యాయానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ఓట్ల శాతం ► పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. మూడేళ్లలో జరిగిన తిరుపతి లోక్‌సభ.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లోనూ ఏకపక్షంగా ఘన విజయం సాధించింది. ► 2019లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో 13,16,473 ఓట్లు (79.76 శాతం) పోలైతే.. వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ 7,22,877 ఓట్లు (55.03 శాతం) సాధించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 4,94,501 (37.65 శాతం) ఓట్లు దక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ 2,28,376 ఓట్ల ఆధిక్యంతో అప్పట్లో విజయం సాధించారు. ► బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి 2021 ఏప్రిల్ 27న ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో 11,05,468 (64.60 శాతం ఓట్లు పోలైతే.. వైఎస్సార్సీపీకి 6,26,108... 56.67 శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీకి 3,54,516 (32.09 శాతం.. బీజేపీ–జనసేన అభ్యర్థికి 5.17 శాతం) ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి 2,71,592 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ► తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో చావు దెబ్బ తినడంతో.. ఆ తర్వాత జరిగిన బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబు దూరంగా ఉన్నారు. సవాల్ విసిరినా స్వీకరించలేని దైన్యం ► టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో.. సంప్రదాయానికి భిన్నమైనా.. బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ సవాల్ విసిరితే, ఘోర పరాజయం తప్పదనే భయంతో చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారు. ► నేరుగా బరిలోకి దిగకుండా వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి.. మెజార్టీ తగ్గించేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు పలుకుతూ.. ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. ► బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య హఠాన్మరణం వల్ల జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య డాక్టర్ సుధను వైఎస్సార్సీపీ బరిలోకి దించింది. టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ–జనసేన పొత్తుతో పోటీ చేశాయి. ఎన్నికల్లో తమ ఏజెంట్లను బూత్‌ల్లో పెట్టి పరోక్షంగా వారి అభ్యర్థికి టీడీపీ పరోక్షంగా మద్దతు పలికింది. ► 2021 అక్టోబరు 30న ఎన్నికలు జరిగితే నంబర్ 2న ఫలితాలు వెల్లడించారు. అంటే ప్రభుత్వం ఏర్పాటైన సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 90,533 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 76.25 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయి. ► 2019 ఎన్నికలతో పోల్చితే.. వైఎస్సార్సీపీకి 15.33 శాతం ఓట్లు పెరిగాయి. అప్పట్లో పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీకి 60.89 శాతం రాగా.. 44,734 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 14.27 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ► 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి గౌతమ్ రెడ్డి 22,276 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పట్లో పోలైన ఓట్లలో 53.22 శాతం ఓట్లు సాధించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో అతని సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. బీజేపీ అభ్యర్థి తరఫున పలు గ్రామాల్లో ఆ పార్టీ నేతలను పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా కూర్చోబెట్టి.. పరోక్షంగా మద్దతు పలికింది. ► అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం (1,02,241) ఓట్లు సాధించిన విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ కేవలం 14.1 శాతం ఓట్లకు పరిమితమై.. డిపాజిట్ కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రక విజయాలు ► పంచాయతీ.. మండల పరిషత్, జిల్లా పరిషత్.. మున్సిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికల్లో నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డను అడ్డు పెట్టుకుని.. వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయని కుట్ర లేదు. ఆ కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. రాష్ట్రంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10,536 పంచాయతీలను వైఎస్సార్సీపీ మద్దతుదారులు దక్కించుకుంటే.. టీడీపీ మద్దతుదారులు కేవలం 2,100 పంచాయతీలకు పరిమితమయ్యారు. ► రాష్ట్రంలో 649 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 637 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. కేవలం 9 స్థానాలకు టీడీపీ పరిమితమైతే.. జనసేన ఒక స్థానంలో ఉనికిని చాటుకుంది. దాంతో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఒక రాష్ట్రంలో అన్ని జిల్లా పరిషత్‌లను ఒకే పార్టీ కైవసం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ► రాష్ట్రంలో 9,654 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 8,264 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తే.. టీడీపీ కేవలం 955 స్థానాలకు చిక్కిపోయింది. జనసేన కేవలం 182 స్థానాలకు, బీజేపీ 32 స్థానాలకు పరిమితమైంది. ► రాష్ట్రంలో 87 మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహిస్తే 84 స్థానాల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. 13 కార్పొరేషన్లలోనూ క్లీన్ స్వీప్ చేసింది. -
వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలో భాగంగా ఈ నెల 23న పోలింగ్ నిర్వహించారు. 1,37,289 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 64.26 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు ప్రతి రౌండ్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధిక్యత సాధించారు. సరాసరి ప్రతి రౌండ్లో 4 వేల ఓట్ల ఆధిక్యత దక్కించుకున్నారు. అధికార పార్టీకి బీజేపీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్లో సైతం వైఎస్సార్సీపీ సత్తా చాటింది. 208 పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీకి 167 ఓట్లు లభించాయి. బీజేపీకి 21, నోటాకు 3, బీఎస్పీకి 7, ఇతరులకు 10 ఓట్లు లభించాయి. ఫ్యాన్ గాలికి బీజేపీ గల్లంతు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ సునామీకి బీజేపీ గల్లంతయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్, కేంద్ర మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ నేతలు ఆత్మకూరులో తిష్టవేసి కోలాహలంగా ఎన్నికల ప్రచారం చేశారు. అధికార వైఎస్సార్సీపీపై అనేక అభాండాలు వేస్తూ ప్రచారం సాగించారు. బీజేపీ ఆరోపణలను ప్రజలు నిర్మొహమాటంగా తోసిపుచ్చారు. కేవలం 19,353 ఓట్లు మాత్రమే దక్కించుకుని 14.1 «శాతానికి ఆ పార్టీ పరిమితమైంది. తిరుపతి పార్లమెంటు, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్టు కోల్పోయిన బీజేపీ.. తాజాగా మూడోసారి ఆత్మకూరులోనూ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా కూర్చొన్నప్పటికీ వారి ఆటలు సాగలేదు. ఓటర్లు ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ.. అనైతిక మద్దతుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఎన్నికల అధికారి హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకుంటున్న మేకపాటి విక్రమ్‌రెడ్డి అపారంగా పెరిగిన ఓటర్ల మద్దతు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటర్ల మద్దతు ఆపారంగా పెరిగింది. పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయినప్పటికీ మంచి మెజార్టీ సాధించడం ద్వారా నేతలు సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో 83.38% పోలింగ్ అయ్యింది. ఈ ఉప ఎన్నికలో కేవలం 64.26 శాతానికే పోలింగ్ పరిమితమైంది. ఓటర్లు పోలింగ్‌కు వెళితే వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తారనే కారణంగా టీడీపీలోని ఓ సామాజిక వర్గం నేత, తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ట్రాక్టర్లలో నెర్రవాడ వెంగమాంబ తిరునాళ్లకు తరలివెళ్లేలా ప్రేరేపించారు. మర్రిపాడు, సంగం, ఆత్మకూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున తిరునాళ్లకు వెళ్లడంతో ఓటింగ్ శాతం భారీగా పడిపోయింది. అయినప్పటికీ పోలైన ఓట్లలో 74.47 శాతం వైఎస్సార్సీపీకి దక్కాయి. 2019లో 53.22 శాతం ప్రజలు మద్దతుగా నిలిస్తే, ఇప్పుడు అందుకు అదనంగా 21.25 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై 5,337 ఓట్ల మెజార్టీని సాధించారు. ఈ పరంపర తుది రౌండ్ వరకు కొనసాగింది. ఆత్మకూరు పరిధిలోని 6 మండలాల్లో గణనీయమైన మెజార్టీ దక్కింది. గౌతమ్ అన్న పేరు నిలబెడతా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, పేదల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పట్ల ప్రజలు చూపిన ఆదరణే నా విజయానికి కారణం. ప్రణాళికా బద్ధంగా ఆత్మకూరు ఉన్నతికి కృషి చేస్తాను. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. నా విజయం కోసం విశేషంగా కృషి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులకు ధన్యవాదాలు. – మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆత్మకూరు -
‘విషం మద్యంలో లేదు.. మీ బుర్రలో ఉంది’
సాక్షి, అమరావతి: ఎన్నిక ఏదైనా ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయంపై ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడారు. చదవండి: ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్.. ‘‘తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయింది. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలుస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ ప్రజలు భారీ మెజార్టీ అందిస్తున్నారు. మధ్యవర్తి ప్రమేయం లేకుండా రాష్ట్రంలో నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయి. మద్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. మద్యంలో కాదు.. టీడీపీ మెదడులోనే విషం ఉంది. టీడీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఈ కుట్రలు. టీడీపీ విష ప్రచారంతో మాపై ఉన్న అభిమానం తగ్గిపోదు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు’’ అని అంబటి రాంబాబు అన్నారు. ‘‘మద్యంపై దుష్ట చతుష్టయం విష ప్రచారం చేస్తోంది. మద్యంలో విషపూరిత పదార్థాలు లేవని గతంలోనే తేలింది. విషం మద్యంలో లేదు.. మీ బుర్రలో ఉంది. ప్రజలను వైఎస్సార్సీపీ పార్టీకి దూరం చేయాలని ప్రతిపక్షాలు కుట్ర. బూమ్‌బూమ్, ప్రెసిడెంట్ మెడల్స్ చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. మేము వచ్చాక ఒక్క డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు. సంక్షేమ కార్యక్రమాలు ఆపడానికే టీడీపీ కుట్రలు. ఎన్ని కుట్రలు చేసినా ఆత్మకూరులో మా విజయాన్ని ఆపలేకపోయారని’’ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. -
ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
సాక్షి, తాడేపల్లి: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్‌ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామ రక్ష అంటూ సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష! (2/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022 -
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు -
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: 82 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ విజయం
-
ఆత్మకూరులో టీడీపీ వక్ర బుద్ధి బయటపడ్డ ఫోటోలు, వీడియోలు
-
ఆత్మకూర్ బైపోల్.. 62 శాతం పోలింగ్
-
ఆత్మకూరు పోలింగ్: బయటపడ్డ టీడీపీ బండారం
సాక్షి, నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. సాంప్రదాయ పద్దతంటూ పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ.. బద్వేల్ తరహాలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. పోలింగ్ రోజు టీడీపీ బండారం బయటపడింది. ఆత్మకూరు, అనంత సాగరం, మర్రిపాడు, సంగం, ఏఎస్ పేట, చేజర్ల మండలాల్లో పలు చోట్ల టీడీపీ నేతలు.. బీజేపీ ఏజెంట్ల అవతారమెత్తారు. చదవండి: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్ పోలింగ్ జరిగింది. పోలింగ్ పక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఈనెల 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలు
-
ఓటేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రారంభం
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
-
కాసేపట్లో ఆత్మకూరు పోలింగ్
-
పోలింగ్ కు సర్వం సిద్ధం
-
ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి
ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాల్లో ఏపీఎస్పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్ స్టాఫ్ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్ అధికారులు 38 మంది మాస్టర్ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు. ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటరు స్లిప్‌లు పంపిణీ జరిగిందన్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డు ఓటరు ఐడీ లేదా ఆధార్ బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, విద్యుత్ వసతులు ఏర్పాటు చేసినట్లు, సజావుగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడంతో అధికారుల ఆదేశాల మేరకు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నియోజకవర్గయేతరులు వెళ్లిపోవాలని ఆర్వో, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. పక్షం రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టంగా చేపట్టాయి. వైఎస్సార్సీపీ మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పనితీరు, సంక్షేమ పాలనకు దర్పంగా ఆత్మకూరు తీర్పు ఉండాలని ప్రజల్ని కోరారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అండగా నిలిచినట్లే ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆశీర్వదించాలని గ్రామాలను చుట్టేస్తూ ప్రజల్ని కోరారు. అర్హతే ప్రామాణికంగా అందించిన సంక్షేమ పాలన కారణంగా ఘనమైన మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. సంకటస్థితిలో బీజేపీ తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తరహాలో ఆత్మకూరులోనూ బీజేపీ అగ్రనేతలంతా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ వ్యవహారాల ఇన్చార్జితో పాటు, రాజ్యసభ సభ్యులు,, మాజీ కేంద్ర మంత్రులు ఆత్మకూరులో తిష్ట వేసి ఆ పార్టీ శ్రేణులను నడిపించారు. బీజేపీ అభ్యరి్థని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాగా అభ్యర్థి భరత్‌కుమార్ నాన్‌లోకల్ కావడంతో ఆ సమస్య బీజేపీని వెంటాడుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీస పరువు నిలుపుకునే స్థాయిలో ఓట్లు దక్కితే చాలు అన్నట్లు ఆ పార్టీ నేతల వైఖరి కనిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీరికి ఈ దఫా బీఎస్పీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. గతంలో కాస్తా తక్కువ ఓట్లతో బీజేపీ కంటే వెనుకబడిన బీఎస్పీ ఈ దఫా అధిగమించేందుకు విశేషంగా ప్రయత్నించింది. ఆ మేరకు ప్రజల చెంతకు చేరి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. మెజార్టీపైనే అందరి అంచనాలు నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జి భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థి ఎన్ ఓబులేసులు ప్రధానంగా తలపడుతుండగా బరిలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరిగి పార్టీ అమలు చేస్తున్న నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 2,13,138 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా 1,07,367 కాగా, పురుష ఓటర్లు 1,05,960 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం ఓ ట్లు పోల్ కాగా, ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదు అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం -
రేపు ఆత్మకూరు ఉపఎన్నికల పోలింగ్
-
ఆత్మకూరు ఉపఎన్నికల్లో ముగిసిన ప్రచారం
-
సంక్షేమ పథకాలై విక్రమ్ ను గెలిపిస్తాయి
-
ప్రజలు నాకు అడుగడుగునా మద్దతుగా నిలుస్తున్నారు
-
రిగ్గింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది ??
-
నెల్లూరు ఉప ఎన్నిక.. ముగిసిన ప్రచార పర్వం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. 23న జరగనున్న పోలింగ్‌పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్‌లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
సీఎం జగన్ కు ఈ విజయం కానుకగా ఇస్తాం
-
ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం
ఆత్మకూరు: మూడేళ్లుగా కులమతాలకు అతీతంగా పారదర్శకంగా లక్షలాది కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని, దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కలలు కన్న అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు మంత్రులు అన్నారు. ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో సోమవారం పార్టీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ, జోగి రమేష్, రాజ్య సభ్యుడు బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీతో పట్టణం జనసంద్రమైంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జెండాలు చేతబట్టి వేలాదిగా పాల్గొనడంతో రోడ్లు కిక్కిరిశాయి. బంగ్లా సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా ఎల్‌ఆర్‌పల్లి, జేఆర్‌పేట, సోమశిల రోడ్ సెంటర్, బస్టాండ్, వైశ్య బజారు మీదుగా సత్రం సెంటర్ వరకు సాగింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రజల సమస్యలను అతి తక్కువ కాలంలో దగ్గరగా పరిశీలించారని, వాటి పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజలు ఇప్పటికే పార్టీ గుర్తు ఫ్యాన్‌కు వేసేందుకు స్థిర నిర్ణయం తీసుకున్నారని మెజార్టీ లక్షకుపైగా సాధించేందుకు తాము ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి లేనిలోటు తీర్చేలా విక్రమ్‌రెడ్డి పని చేస్తారని ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉందని, మచ్చలేని రాజకీయాలు చేస్తున్న వారిని ఆదరించి అభిమానించాలన్నారు. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగేలా భారీ మెజార్టీని అందివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి మంచి తనం చూసి ఆయన సోదరుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీలతో పాటు బీసీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌తో పాటు అన్ని వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్, రాజకీయంగా పదవులు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందన్నారు. అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు తనకు కొత్త అయినా పైనుంచి దీవిస్తున్న అన్న ఆశీర్వాదాలు, ప్రజల అభిమానం, ముఖ్యమంత్రి, మంత్రుల అండదండలు, సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపుతానన్నారు. గత నెల రోజులుగా చేస్తున్న ప్రచారంలో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, సంతృప్తి కనిపిస్తున్నాయని, అమలు అవుతున్న నవరత్నాల పథకాలే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులురెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ జి వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, షేక్ సర్ధార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు జితేంద్రనాగ్‌రెడ్డి, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న ఆత్మకూరు ఉపఎన్నిక ప్రచారం
-
ఆత్మకూరు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు(అర్బన్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. సోమవారం ఆయన నెల్లూరు కలెక్టరేట్లో నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చక్రధర్‌బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులుండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేశామన్నారు. 279 పోలింగ్ స్టేషన్లలో ఎక్కడైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. దొంగ ఓట్లు పడకుండా.. ఓటర్ల జాబితాలను పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించాలని ఆదేశించినట్లు తెలిపారు. 123 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని.. వాటి వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు మైక్రో అబ్జర్వు, వీడియో, వెబ్ కాస్టింగ్ లైవ్ తదితరాలను సిద్ధం చేశామని చెప్పారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. వలంటీర్లు కరపత్రాలు పంచినా, ప్రచారం నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్, ఎస్పీ విజయరావు, డీఎఫ్‌వో షణ్ముఖకుమార్, మునిసిపల్ కమిషనర్ జాహ్నవి, ఏఎస్పీ హిమవతి, సెబ్ జేడీ శ్రీలక్ష్మి, డీఆర్వో వెంకటనారాయణమ్మ, డీఎంహెచ్‌వో డాక్టర్ పెంచలయ్య, డీపీవో ధనలక్ష్మి, డీసీవో తిరుపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ తొండాట..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొండాట ఆడుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో సంప్రదాయం ప్రకారం పోటీకి దూరమంటూ ప్రచారం చేసుకుంటూనే మరో వైపు ఓట్లు మాత్రం పక్క పార్టీలకు వేయించాలని రెండు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీని బలహీనపర్చాలని ఓట్లు వేయొద్దని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీకి దూరమంటూనే ఓట్లు వేసేందుకు పోటీలో ఉన్న ఇతరులకు వేసేందుకు లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో ఓ వర్గం మాత్రం బీఎస్సీ అభ్యర్థికి వేయాలని తీర్మానించుకోగా , మరో వర్గం మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓటు విషయంలో కూడా వర్గరాజకీయాలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులే నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార ఘట్టం తారాస్థాయికి చేరుకుంది. ఈ నెల 23న పోలింగ్ కావడంతో 21వ తేదీకే ప్రచార ఘట్టం ముగియనుంది. వైఎస్సార్సీపీ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తోంది. నియోజకవర్గంలో ఆరు మండలాలు, ఒక మున్సిపాల్టీ ఉండగా మండలానికో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్‌లుగా నియమించడంతో ఎవరికి వారు ప్రజాక్షేత్రంలో ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఎన్నిక రోజున ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మెజార్టీపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించి ఆ దిశగా పనిచేస్తున్నారు. టీడీపీ ఓట్లు హోల్‌సేల్ ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణుల పరిస్థితి ఇరకాటంగా మారింది. ఆ పార్టీలో ఇప్పటికే వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థి పోటీ చేయలేదు. అధికార పార్టీ వైఎస్సార్సీపీతో పాటు బీజేపీ, బీఎస్పీ, మరో పదకొండు మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ శ్రేణులు మాత్రం ఎవరికి ఓటు వేయాలని సందిగ్ధంలో ఉంటే.. ఆ పార్టీ ఓట్లను ఇతరులకు వేసేందుకు హోల్‌సేల్ బేరం మాట్లాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీలో మూడు వర్గాలు నడుస్తున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో ఆ ముగ్గురు నేతలు తెరపైకి రావడంతో ఆధిష్టానం ఎటూ తేల్చలేక ఇన్చార్జి నియామకం నిలిపేసింది, ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం టీడీపీలో ఓ వర్గ నేత మాత్రం బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయమని తన అనుచర వర్గానికి ఆదేశాలు ఇచ్చారు. మరో వర్గ నేత మాత్రం ప్రస్తుత ఎన్నికల బరిలో తన సొదరుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. టీడీపీ తరఫున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికై ఉన్నాడు. అతనే ఈ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలో దిగడంతో ఆ పార్టీ కూడా అతన్ని సన్పెండ్ చేసింది. అయితే పార్టీ నుంచి బయటకు పంపినా ఆయన ఓ వర్గనేతకు సొదరుడు కావడంతో లోలోన తన సోదరుడికి ఓట్లు వేయించాలని ప్రయత్నాలు మమ్మురం చేసినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.. దీంతో టీడీపీ శ్రేణులు పోలింగ్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీ బలం పెరిగితే నష్టమని.. ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయొద్దని టీడీపీ నేతలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఓట్లు బీజేపీకి పడితే ఆత్మకూరులో ఆ పార్టీకి ఓటు బలం పెరిగిందని వారు చెప్పుకొస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరితే ఈ ఓటింగ్ బలం చూపి పొత్తులో భాగంగా సీటు అడిగే ప్రమాదం ఉందని, బీజేపీకి రెండో స్థానం దక్కకుండా ఉండాలని బీఎస్సీకి ఓటు వేయండని ఆ నేత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2004 ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించారు. అలాంటి పరిస్థితి మరోసారి రాకుండా ఉండాలంటే టీడీపీ ఓటింగ్ బీజేపీకి దూరండా ఉండాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన మాత్రం బీజేపీతో దోస్తితో ఉండడంతో వారు బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. -
జోరుగా ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారం
-
‘కమలం కమిలిపోయే మెజార్జీ వైఎస్సార్సీపీకి ఇవ్వాలి’
నెల్లూరు జిల్లా: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి ఆర్కే రోజా మరోసారి గుర్తుచేశారు. చేజార్ల మండలం యనమదల, ఎర్రబల్లిలోమేకపాటి విక్రమ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఆర్కే రోజా.. ఈనెల 23వ తేదీ ఆత్మకూరు ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కమలం కమిలిపోయేలా మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారని, అమ్మ ఓడి పథకం పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి రోజా. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా నుంచి క్యాన్సర్ వరకూ ఉచిత వైద్యం అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. -
ఆత్మకూరు ఉపఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ప్రచారం
-
సీఎం వైఎస్ జగన్ ను ప్రజలు ఇంటి బిడ్డలా వ్యవహరిస్తున్నారు
-
Atmakur Byelection: బీజేపీ బేజార్.. అభ్యర్థి ఎంపికే మైనస్
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ పరిస్థితి ‘ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లు’గా ఉంది. రెండున్నర దశాబ్దాల క్రితం గెలుపు అంచు వరకు ఓట్లు సాధించిన ఆ పార్టీ భావసారూప్యం లేని పార్టీలతో జతకట్టి తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ కనీస ఓట్లను రాబట్టుకోలేపోయింది. రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామంటూ బీరాలు పలికి చతికిల పడింది. ఇప్పుడు ఆత్మకూరులోనూ నేల విడిచి సాము చేస్తోంది. సాక్షి, నెల్లూరు: భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులకు ఇంచుమించు రెండు.. మూడు వేల ఓట్లు కూడా పోల్ కాలేదు. వరుస ఓటమిలను చవిచూస్తున్నా.. గుణపాఠాలు నేర్వడం లేదు. ఉత్తరాది నేతల పెత్తనంతో స్థానికంగా ఉన్న పరువు కూడా గంగలో కలుస్తోందని ఆ పార్టీ నేతలే బాహాటంగా అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ గెలిచిన ధీమాతో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో సైతం కాషాయ జెండా ఎగురువేస్తామంటూ బీరాలు పలికింది. జాతీయ స్థాయి నేతలతో తాహతుకు మించి ప్రచారం చేసినా అక్కడి ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఆ తర్వాత బద్వేలు ఉప ఎన్నికల్లో సైతం అదే ఫలితం దక్కింది. ఈ పరిస్థితులల్లో ఆత్మకూరులో బరిలో నిలవకపోవడం మంచిదని జిల్లా నాయకత్వం సూచించింది. వీరి సూచనను పరిగణలోకి తీసుకుండా అభ్యర్థిని పోటీలో నిలుపుతామని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పార్టీ నాయకత్వ నిర్ణయం, అభ్యర్థి ఎంపిక ఆ పార్టీ పరిస్థితి బేజారుగా మారింది. చదవండి: (రాజాం అబ్బాయి.. అమెరికా అమ్మాయి) స్థానిక కేడర్ నిర్లిప్తత ఉప ఎన్నికల్లో తమ నిర్ణయానికి వ్యతిరేకంగా నాన్‌లోకల్ వ్యక్తిని అభ్యర్థిగా నిలపడంపై ఆ పార్టీ శ్రేణులు నిర్లిప్తంగా ఉన్నాయి. పోటీలో 14 మంది ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీకి మాత్రమే రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు చెందిన నాయకులు ఆత్మకూరులో తిష్టవేసి ప్రచారంలో మునిగిపోయారు. అయితే అభ్యర్థి భరత్‌కుమార్ నాన్‌లోకల్ అనే విషయం అడుగడుగునా వినిపిస్తోంది. ఎక్కడికెళ్లినా ప్రజా మద్దతు దక్కకపోవడంతో ఒకింత ఆవేదన బీజేపీ నేతల్లో గూడు కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు బీజేపీ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా అభ్యర్థి భరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ‘ఉత్త’ర ప్రగల్భాలే బీజేపీలో ఉత్తరాది నేతల పెత్తనంతో సిద్ధాంతాలు గాలిలో కలిసిపోయాయి. వాపును చూసి బలం అనుకోవడంలో వారికి వారే సాటిగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బలం లేకపోయినప్పటికీ దుబ్బాక ఫలితం పునరావృతం అవుతోందని అటు తిరుపతి, ఇటు బద్వేలులో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ ఊదరగొట్టారు. తాజాగా ఆత్మకూరు బరిలో నిలిచి అదే తరహా ప్రచారాల్లో మునిగిపోయారు. ఆత్మకూరులో బీజీపీని నాన్‌లోకల్ ఫీవర్ వెంటాడుతుంది. ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏ నేత సుముఖంగా లేకపోవడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న గుండ్లపల్లి భరత్‌కుమార్‌ను ఆఖరి క్షణంలో రాష్ట్ర అధిష్టానం పెద్దలు బరిలో నిలిపారు. అయితే భరత్‌కుమార్ ఆత్మకూరుకు స్థానికేతరుడు కావడంతో స్థానిక నేతలే నిర్లిప్తంగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ ఘోరంగా ఓటమి చేసి పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీకి పోల్ అయిన ఓట్లలో కేవలం 1.33 శాతం అంటే 2,314 ఓట్లు మాత్రమే వచ్చాయి. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలు ఒక విషాదకరమైన పరిస్థితుల్లో వచ్చాయి. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దివంగతులు కావడంతో ఆ స్థానంలో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఓట్లు లభిస్తాయా? కనీసం పరువు నిలుస్తుందా? అని బీజేపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ నుంచి అభ్యర్థి ఎంపిక వరకు జిల్లా నాయకత్వంతో నిమిత్తం లేకుండా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పరువు కాపాడుకునేందుకు కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు పార్టీ శ్రేణులు తిష్టవేశాయి. -
ఆత్మకూరులో జోరుగా ఎన్నికల ప్రచారం
-
విక్రమ్‌రెడ్డి మెజార్టీ చరిత్రలో నిలవాలి: ఆర్కే రోజా
చేజర్ల–నెల్లూరు(దర్గామిట్ట): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మరణంతో జరుగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు, వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి సాధించే మెజార్టీ చరిత్రలో నిలిచిపోయేలా ప్రజలు తీర్పు వెలువరించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఆదివారం చేజర్ల మండలంలోని పాతపాడు, ఓబులాయపల్లి, కొండలరాయుడు కండ్రిక, గొల్లపల్లి గ్రామాల్లో ఆమె మేకపాటి విక్రమ్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ మంచి నాయకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ.1.40 లక్షల కోట్లు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన ఘనత మన సీఎందేనన్నారు. ప్రతిపక్షనేతలు చేసే కువిమర్శలను తాము పట్టించుకోబోమని, అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకుసాగుతోందని తెలిపారు. గతంలో అ«ధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చెయ్యని వాళ్లు, నామమాత్రంగా పార్టీ నడుపుతున్న వాళ్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. చదవండి: (అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి) గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూస్తే, ఎవరు ప్రజల కష్టాలను దూరం చేశారో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకుందని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో అందరూ ప్యాన్ గుర్తుకు ఓటేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బలపరిచిన మేకపాటి విక్రమ్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. -
టీడీపీ ఆరిపోయే దీపం: మంత్రి జోగి రమేష్
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిందని.. టీడీపీ ఆరిపోయే దీపం లాంటిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం ఆయన ఏఎస్‌పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కోసం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చదవండి: తాకట్టు పెట్టిన పుస్తెల తాడు ఇంటికి తెస్తానన్నావ్.. కానీ నువ్వు చేసిందేమిటి?’ బద్వేల్ తరహాలోనే ఆత్మకూరు పరిస్థితి ఉంటుందని.. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. పోటీ నుంచి తప్పుకున్నా లోపాయికారి మద్దతివ్వడం టీడీపీకి అలవాటు. జన్మభూమి కమిటీతో చంద్రబాబు రాష్ట్రాన్ని కర్మభూమిగా మార్చాడు. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రం పయనిస్తోందని మంత్రి జోగి రమేష్ అన్నారు. -
Atmakur Bypoll: ఆత్మకూరు బరిలో 14 మంది అభ్యర్థులు
ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ గురువారంతో ముగిసిందని రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ హరీందర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరులో ఇన్చార్జ్ ఆర్డీవో బాపిరెడ్డితో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికకు మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయని.. వివిధ సాంకేతిక కారణాలతో 13 నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు. చదవండి: 12న కావలికి సీఎం వైఎస్ జగన్ స్వతంత్ర అభ్యర్థి ఒకరు గురువారం నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. మిగిలిన 14 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారని చెప్పారు. బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులున్నాయని.. ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన వివిధ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అభ్యర్థులందరూ సహకరించాలని కోరారు. -
AP: ఆత్మకూరు ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. ఈ మేరకు వివరాలను వెల్లడించారు రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్. ఇవాళ(మంగళవారం) 28 నామినేషన్లకు స్క్రూట్ని ప్రక్రియ జరిగిందని, వివిధ కారణాల వల్ల 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రస్తుతానికి పదిహేను మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఈ నెల 9వ తేదీ మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. చదవండి: రాజకీయాల్లో మచ్చలేని కుటుంబం అది! -
మెజార్టీని చూసి ప్రతిపక్షాలు భయపడాలి
నెల్లూరు (సెంట్రల్): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి వచ్చే మెజార్టీ చూసి రాజకీయ పార్టీలు రానున్న రోజుల్లో ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా తీర్పు ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే మీ ఆత్మీయ నాయకుడు గౌతమ్‌కు ఇచ్చే భారీ నివాళి అని చెప్పారు. సోమవారం ఉప ఎన్నికల్లో కార్యాచరణపై ఆత్మకూరులో అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సమన్వకర్త, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గంగుల బిజేంద్రరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పి అనిల్‌కుమార్, మానుగుంట మహిధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తితో కలిసి నియోజకవర్గంలోని ప్రధాన నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చదవండి: (పవన్ కల్యాణ్‌కు కేఏ పాల్ భారీ ఆఫర్.. రూ.1000 కోట్ల నజరానా) ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. అయితే మనకు వచ్చే మెజార్టీపైనే దృష్టి పెట్టాలన్నారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీ తీసుకుని వచ్చి దివంగత మేకపాటి గౌతమ్ ఆత్మకు శాంతి చేకూరేలా నివాళి అర్పిద్దామన్నారు. ఆత్మకూరు వైఎస్సార్సీపీకి అడ్డాగా చేద్దామన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ పోటీ చేయడానికి కూడా ఇతన పార్టీ నేతలు వెనుకాడే విధంగా ఒక చారిత్రాత్మక తీర్పును ఇద్దామని పిలుపునిచ్చారు. మేకపాటి కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని, కాని అనుకోని విషాదంతో జరుగుతున్న ఎన్నికలన్నారు. విక్రమ్‌రెడ్డి రాజకీయాలకు కొత్త అయినా.. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ ముందుకు పోతున్నారన్నారు. ప్రజలు కూడా తక్కువ కాలంలోనే విక్రమ్‌రెడ్డిని ఆదరిస్తున్నారని కొనియాడారు. బద్వేలు కంటే ఎక్కువగా మెజార్టీ ►బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఉప ఎన్నికలు అత్యంత విషాదం కారణంగా జరుగుతున్నాయని, ఈ ఉప ఎన్నికల్లో బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువగా ఉండాలని మాజీ మంత్రి, జిల్లా సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గౌతమ్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో బాగా పనిచేస్తూ ముఖ్యమంత్రి వద్ద మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. ఆత్మకూరుకు కూడా ఎంతో పని చేశారని, మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా విక్రమ్‌రెడ్డి ప్రజలకు సేవ చేస్తారన్నారు. ప్రజలు సైతం గౌతమ్‌రెడ్డి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకున్నారన్నారు. ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి గౌతమ్‌కు ఘన నివాళి అర్పించాలని కోరారు. గౌరవ ప్రదమైన మెజార్టీ ►మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ ఉప ఎన్నిక ఎంత విషాదం తరువాత వచ్చిందో ప్రతి ఒక్కరికీ తెలుసునని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న గౌతమ్‌రెడ్డి అకాల మరణంతో ఎన్నిక అనివార్యంగా జరుగుతుందన్నారు. గతంలో తిరుపతి పార్లమెంట్, బద్వేలు ఉప ఎన్నికలు జరిగాయని, వాటిలో వైఎస్సార్ సీపీకి ఎంత భారీ మెజార్టీ వచ్చిందో అందరం చూశామన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కూడా గౌరవ ప్రదమైన మెజార్టీని నియోజకవర్గ ప్రజలు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. గౌతమ్ ఏ విధంగా మీకు పని చేశారో, ఏఏ పనులు చేశారో మీకు తెలుసని, విక్రమ్ కూడా గౌతమ్ అడుగు జాడల్లో నడుస్తారన్నారు. విక్రమ్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ దొంతు శారద, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, డీఏఏబీ చైర్మన్ నిరంజన్‌బాబురెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, మేరిగ మురళీధర్, పోట్టేళ్ల శిరీషా, షేక్ సైదాని, వావిలేటి ప్రసన్న, ఆసిఫా, కిషోర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: వైఎస్సార్సీపీ ఇంచార్జిల నియామకం
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్సార్సీపీ ఇంచార్జిలను నియమించింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. దీనిలో భాగంగా ఇంచార్జిలను నియమించించింది వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ నుంచి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆత్మకూరు ఉఎ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఇంచార్జిల నియామకం ఇలా.. అనంతసాగరం మండలం- మంత్రి మేరుగ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎఎస్‌పేట మండలం- మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి ఆత్మకూరు అర్బన్- మంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ ఆత్మకూరు రూరల్- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి చేజర్ల మండలం- మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని మర్రిపాడు- మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంగం మండలం: మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి -
‘లక్షకు పైగా మెజారిటీ సాధిస్తాం’
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకలాంటిదని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ పాలనకు జనం నీరాజనాలు పలుకుతున్నారని ఈ సందర్భంగా కాకాణి పేర్కొన్నారు. ‘దివంగత మంత్రి గౌతం రెడ్డిపై నియోజకవర్గ వాసుల్లో చెక్కుచెదరని అభిమానం ఉంది. అలాగే సీఎం జగన్ పాలనకు జనం నీరాజనాలు పడుతున్నారు. ఈ రెండు అంశాలు విక్రమ్‌రెడ్డి ఘన విజయానికి సోఫానాలు కాబోతున్నాయి. కొన్ని పార్టీలకు అభ్యర్థులు కూడా చిక్కని పరిస్థితి వచ్చింది. లక్షకు పైగా మెజారిటీ సాధిస్తాం’ అని కాకాణి తెలిపారు. కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. ఆత్మకూరు ఉప ఎన్నికకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు కాగా, చివరిరోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తండ్రి అండ.. అన్న ఆశయం నీడ
తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం, సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇచ్చిన ఆత్మకూరు ప్రజల అండదండలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నామని చెప్పుకోవడం మినహా, ప్రధాన పార్టీలకు స్థానిక అభ్యర్థులు కరువయ్యారు. ఆత్మకూరులో బీజేపీ స్థానికేతరుడైన భరత్‌కుమార్ యాదవ్‌ను బరిలోకి దింపాల్సి వచ్చింది. మరో వైపు విక్రమ్‌రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాభిమానాన్ని చూరగొన్న దివంగత గౌతమ్‌రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని పోలింగ్ తేదీ కోసం తహతహలాడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అతి తక్కువ సమయంలో ప్రజల అభిమాన పాత్రుడు అయ్యాడు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిపై గూడుకట్టుకున్న అభిమానాన్ని ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి పట్ల చాటుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి విక్రమ్‌రెడ్డి సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. తన అన్నపై పెంచుకున్న అభిమానం, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గౌతమ్‌రెడ్డి ఆశయాలు నెరవేరుస్తానని ఘంటాపథంగా చెబు తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీ–ఫారం ఇచ్చిన తర్వాత ఈ నెల 2న నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రెండు రోజుల్లో 18 పంచాయతీల ప్రజల దరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి చేరారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయినప్పటికీ స్థానికులతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూనే ప్రభుత్వ ఆవశ్యకతను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోరుతున్న ప్రభుత్వాన్ని బలపర్చాలని, సోదరుడు గౌతమ్‌రెడ్డి ఆశయ సాధన కోసం అంతా ఏకమై తీర్పు చెప్పాలని కోరుతున్నారు. గ్రామాల్లో అనూహ్య మద్దతు లభిస్తోండడంతో మరింత ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక రెఫరెండమ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి స్థానికేతరుడే దిక్కు భారతీయ జనతా పార్టీకి ఆత్మకూరులో అభ్యర్థి కరువయ్యారు. నోటిఫికేషన్ ప్రకటించక మునుపే ముందే పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఒకప్పుడు ఆత్మకూరులో బీజేపీ గణనీయమైన మద్దతు లభించింది. 1985, 89ల్లో స్వల్ప ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓటమి పాలైంది. అటువంటి నియోజకవర్గంలో ఈ దఫా డిపాజిట్లు కాదు కదా.. కనీస ఓట్లు కూడా పడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూకుమ్మడిగా దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డికి ఓటు రూపంలో నివాళులర్పించాలని ప్రజలు పార్టీలకతీతంగా భావిస్తున్నారు. ఈ తరుణంలో స్థానిక నాయకులు పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి బాహాటంగా ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికేతరులే దిక్కయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌ను బరిలోకి దింపారు. అపార మద్దతు లభిస్తోంది – మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రభుత్వం నుంచి రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సోదరుడు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు ప్రజల్లో ఒక్కరుగా మమేకమయ్యారు. ఆత్మకూరును అన్నీ విధాలు అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకెళ్లారు. ఆయన మృతితో రాజకీయాలకు వర్గాలకతీతంగా ప్రజల నుంచి అపార మద్దతు లభిస్తోంది. అనంతసాగరం మండలం మినగల్లు పంచాయతీలో ప్రచారం అనంతరం వెంకటరెడ్డిపల్లె స్థానిక నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించాను. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలతో ముందుకు వెళ్తున్నాను. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ ప్రజాజీవితానికి అంకితం కానున్నట్లు ప్రకటించారు. సోదరుడి ఆశయసాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైనికుడిగా పని చేయనున్నట్లు వివరించారు. తన తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవాలను అనుసరించి ప్రజల కోసమే పని చేస్తాను. స్థానిక సమస్యలను ప్రణాళికా బద్ధంగా పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తాను. విక్రమ్ అన్నలో గౌతమన్నను చూసుకుంటున్నాం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం జీర్ణించుకోలేనిది. ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిలో గౌతమ్ అన్నను చూసుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో గౌతమన్న ఆశయాల సాధన కోసం విక్రమ్‌రెడ్డి ద్వారా సాధించుకోవాలని ప్రజలు ఆకాంక్షతో పోలింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. – పెయ్యల సంపూర్ణమ్మ, అనంతసాగరం ఎంపీపీ భారీ మెజార్టీయే గౌతమన్నకు ఘన నివాళి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే ఘనమైన నివాళి. గౌతమన్న ప్రత్యేక పంథాతో వివాద రహితుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని దీవించి భారీ మెజార్టీతో గెలిపించినప్పుడే గౌతమన్న ఆత్మ సంతోషిస్తుంది. – రాపూరు వెంకటసుబ్బారెడ్డి, అనంతసాగరం జెడ్పీటీసీ సభ్యుడు -
ఆ కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేదు: బాలినేని
సాక్షి, నెల్లూరు: మేకపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆ కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ మేరకు బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మకూరు అభ్యర్థి ఎంపికకు సంబంధించి రాజమోహన్‌రెడ్డి నిర్ణయానికి సీఎం జగన్ వదిలేశారు. లక్ష ఓట్ల మెజారిటీ తీసుకువచ్చి గౌతమ్‌కు ఘనమైన నివాళి ఇస్తాము. రెండేళ్లు మరింత కృషి చేసి 2024 ఎన్నికల్లో మరింత మెజారిటీ సాధిస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: (ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి) -
ఆత్మకూరు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విక్రమ్‌రెడ్డి
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విక్రమ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బుధవారం బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి.. నేడు నామినేషన్ దాఖలు చేశారు. విక్రమ్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్‌కు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్‌గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి👉 సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి