Breadcrumb
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
Published Thu, Jun 23 2022 6:59 AM | Last Updated on Fri, Jun 24 2022 8:28 AM
Live Updates
ఆత్మకూరు బైపోల్
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పటిష్ట బందోబస్తు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 64.17 శాతం ఓట్లు పోలయ్యాయి. 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఆత్మకూరు ఉప ఎన్నిక: ముగిసిన పోలింగ్
ఆత్మకూరు ఉప ఎన్నికకు జరుగుతున్న పోలింగ్ పక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు. ఈనెల 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఆత్మకూరు ఉప ఎన్నిక: సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం పోలింగ్
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5.30 గంటల వరకు ఆత్మకూరులో 2.88 శాతం, చేజర్లలో 62.5 శాతం, సంగంలో 65.52 శాతం, ఏఎస్ పేటలో 65.75 శాతం, అనంతసాగరంలో 64.68 శాతం, మర్రిపాడులో 63.68 శాతం పోలింగ్ నమోదైంది.
ఆత్మకూరు ఉప ఎన్నిక: మధ్యాహ్నం 3 గంటల వరకు 54.66 శాతం పోలింగ్
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 54.66 శాతం పోలింగ్ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మ.3 గంటల వరకు 51.3శాతం పోలింగ్ నమోదైంది.
ఒంటి గంట వరకు 44 శాతం పోలింగ్
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గపు ఉప ఎన్నిక కోసం జరుగుతున్న పోలింగ్‌లో మధ్యాహ్నం ఒంటి వరకు 44.14 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఉదయం 11గం. కల్లా 24 శాతం ఓటింగ్
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ గట్టి బందోబస్తు నడుమ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల కల్లా 24.92% శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఉదయం నుంచి పోలింగ్ బూత్‌లకు ఓటర్లకు క్యూ కట్టడం గమనార్హం.
ఓటేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
ఉదయం తొమ్మిదికల్లా 11 శాతం పోలింగ్
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఉదయం 9 గంటలు ముగిసేనాటికి 11శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ ప్రకటించింది.
ఓటేసిన మేకపాటి విక్రమ్‌రెడ్డి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఉదయమే బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన తల్లి మణి మంజరి ఇతర కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సంగంలో ఓటర్ల సందడి
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా.. సంగం మండలంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ప్రజలు
ఆత్మకూరు పోలింగ్‌లో ఊత్సాహంగా ఓటర్లు
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచేబారులు తీరారు ఓటర్లు. మహిళలు ,వృద్దులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్ పోలింగ్ నడుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
ఆత్మకూరు బరిలో ఎవరంటే..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రారంభం అయ్యింది. బైపోల్ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైఎస్సార్సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి జి.భరత్ కుమార్, బీఎస్పీ ఎన్.ఓబులేసు.. మరో ఐదు మంది గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఆత్మకూరులో పోలింగ్ ప్రారంభం
ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రారంభం
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం అయ్యింది. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ వెబ్‌కాస్టింగ్ ద్వారా జరగనుంది. 26న ఫలితాలు వెలువడుతాయి.
గట్టి భద్రత ఏర్పాటు
ఆత్మకూరు ఉప ఎన్నికకు 1339 మంది పోలింగ్ సిబ్బంది, 1032 మంది పోలీస్, ఏ.ఆర్.పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్పీఎఫ్ రెండు కంపెనీలు, సీఐఎస్ఎఫ్ ఒక కంపెనీ.. బలగాలు ఉపఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు నియోజకర్గంలో 2,13,138 మంది ఓటర్లు, వీరిలో 1,07,367 మంది మహిళలు, 1,05,960 మంది పురుష ఓటర్లు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు. ఉదయం ఆరు గంటలకు పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో మాక్ పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికల్లో.. 82.44 శాతంగా పోలింగ్ నమోదు.
ఆత్మకూరు బైపోల్‌కు రెడీ
ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. ఆత్మకూరు నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలు, వీటిలో 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు అధికారులు.
Related News By Category
Related News By Tags
-
ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం
ఆత్మకూరు: మూడేళ్లుగా కులమతాలకు అతీతంగా పారదర్శకంగా లక్షలాది కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం న...
-
ఆత్మకూరు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు(అర్బన్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. సో...
-
‘కమలం కమిలిపోయే మెజార్జీ వైఎస్సార్సీపీకి ఇవ్వాలి’
నెల్లూరు జిల్లా: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి ఆర్కే రోజా మరోసారి గుర్తుచేశారు. చేజార్ల మండలం యనమదల, ఎర్రబల్లిలోమేకపాటి విక్రమ్‌రెడ్డికి మద్ద...
-
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ తొండాట..
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొండాట ఆడుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో సంప్రదాయం ప్రకారం పోటీకి దూరమంటూ ప్రచారం చేసుకుంటూనే మరో వైపు ఓట్లు మాత్రం పక్...
-
ఆత్మకూరు ఉప ఎన్నిక: వైఎస్సార్సీపీ ఇంచార్జిల నియామకం
నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్సార్సీపీ ఇంచార్జిలను నియమించింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. దీనిలో భాగంగా ఇంచార్జిలను...
Comments
Please login to add a commentAdd a comment