Vikram reddy
-
Roti Kapada Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: రోటి కపడా రొమాన్స్నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులునిర్మాణ సంస్థ: లక్కీ మీడియానిర్మాత: బెక్కెం వేణుగోపాల్దర్శకత్వం: విక్రమ్ రెడ్డివిడుదల తేది: నవంబర్ 28, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapada Romance Movie Telugu Review). వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నేడు(నవంబర్ 28) రిలీజైంది. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘రోటి కపడా రొమాన్స్’ కథేంటంటే..?ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష(హర్ష నర్రా), సాఫ్ట్వేర్ రాహుల్(సందీప్ సరోజ్), ఆర్జే సూర్య(తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ప్రెండ్‌గా ఉండి ఫిజికల్‌గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత(మేఘలేఖ) పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్‌ది మరో విచిత్రం. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? ప్రేమలో పడి మళ్లీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నలుగురు కుర్రాళ్లు.. స్నేహం.. లవ్, బ్రేకప్..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికి తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్‌స్టోరీని చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తూ.. ప్రస్తుతం యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీయువకుల ఆలోచన ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.గోవా ట్రిప్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియాల లవ్‌స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ- శ్వేతల లవ్‌స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్‌స్టోరీ చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. ద్వితియార్థంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించినవారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి ఫెర్పార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.75/5 -
అవకాశం ఇస్తే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమా చేస్తా : డైరెక్టర్ విక్రమ్ రెడ్డి
ఏ డైరెక్టర్ అయినా తొలిసారే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతాలు సృష్టించడు. అంత గొప్ప సినిమాలు తీసిన రాజమౌళి కూడా ఫస్ట్‌టైం స్టూడెంట్ నెం.1 లాంటి చిన్న సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేశాడు. రాజమౌళికి స్టూడెంట్ నెం.1 సినిమా ఎలానే నాకు రోటీ కపడా రొమాన్స్ చిత్రం కూడా అంతే. ఆయనకు ఇచ్చినట్లే నాకు స్పెస్ ఇస్తే.. భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీస్తా. అలాంటి గొప్ప కథలు నా దగ్గర ఉన్నాయి. కానీ తొలి చిత్ర దర్శకుడిని నిలబడే ఛాన్స్ ఇవ్వండి.. చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వండి’ అని కోరారు దర్శకుడు విక్రమ్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విక్రమ్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను సినీ రంగంలోకి రావడానికి కారణం మా అమ్మ. ఆమె నాకు ఇన్స్పిరేషన్. ప్రతి శుక్రవారం విడుదలైన ప్రతి సినిమా తన లేడీ గ్యాంగ్‌తో కలిసి చూసేది. అమ్మతో పాటు నేను కూడా వెళ్లేవాడిని. అలా నాకు తెలియకుండానే సినిమాపై ఇష్టం ఏర్పడింది. ఇక ఎలాగైనా సినిమా రంగంలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాను. అయితే దర్శకుడు తేజ 'చిత్రం' సినిమా పోస్టర్‌పై ఆయన పేరు చూసిన తరువాత దర్శకుడిని అవ్వాలని నిర్ణయించుకున్నాను.→ ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్ దర్శకుడిగా జాయిన్ కావాలని అనుకుని ప్రయత్నించాను కానీ కుదరలేదు. కానీ పూరి జగన్నాథ్ ఇచ్చిన సలహాతో అసిస్టెంట్‌గా చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకుని.. సినిమాలు చూడటం మొదలుపెట్టి.. సినిమాలు చూడటమే పనిగా అనుకుని సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌లపై గ్రిప్ వచ్చిన తరువాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ తరుణంలో నేను చెప్పిన కథ బెక్కం వేణుగోపాల్‌కు నచ్చి ఈ రోజు దర్శకుడిగా మీ ముందు ఉన్నాను.→ రొటీ కపడా రొమాన్స్ ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్, కామెడీ, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. నలుగురు అబ్బాయిల లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తరువాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏమిటి అనేది సినిమా. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిన పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఇది. సినిమాలోని పతాక సన్నివేశాలు పదిహేను నిమిషాలు అందరి హృదయాలకు హత్తుకుంటాయి. అందరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు.→ ఫస్ట్ ఈ సినిమా దిల్ రాజు చేద్దామని అనుకున్నారు. అయితే ఆయన కథలో మార్పులు చేయమని అడిగారు. ఆ మార్పుల వల్ల నా కథకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత కూడా కథలో నేను ఎలాంటి మార్పులు చేయలేదు.నా కథకు నేనే క్రిటిక్‌ని . కథపై నాకున్న నమ్మకం అలాంటిది. ఈ విషయాన్ని రాజు గారు కూడా స్వాగతించారు. అంతే కాదు నా చిత్రానికి 'రోటి కపడా రొమాన్స్ అనే టైటిల్ కూడా దిల్ రాజు ఇచ్చారు.→ ఈ సినిమాకు సంబంధించి నాకళ్ల ముందు చూసినవి.. నా ఫ్రెండ్ష్ లైఫ్‌లో జరిగిన ఇన్సిండెంట్స్ ఇన్స్పిరేషన్.. ఇందులో వున్న నాలుగు విభిన్న ప్రేమకథలు చేయడం చాలా కష్టం ఇలాంటి సినిమాలు చేసినప్పుడే దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఈ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్లంతా ఓ కొత్త దర్శకుడిలా సినిమా తీయలేదు అని అభినందించారు.→ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా నేచురల్‌గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఉన్నది ఉన్నట్లుగా ఉంటాయి. అప్పుడే సినిమాకు ఆ వైబ్ ఉంటుంది ఈ సినిమాలో రొమాన్ష్ శృతి మించి ఉండదు. ఈ సినిమా ఎక్స్ పీరియన్స్ చేసిన తరువాత మీకు మంచి కిక్ వస్తుంది. ఈ సినిమా ఒక్కరైనా బాగా లేదు అంటే నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తాను. ఈ సినిమా నా బేబి.. లాంటింది ఈ సినిమాపై నాకున్న నమ్మకం అలాంటిది. పది మంది వచ్చి చూసి బాగాలేదు అంటే రిటైర్మెంట్ ఇస్తాను. నా సినిమాతో మల్లీప్లైక్ థియేటర్స్ అన్ని మాస్ థియేటర్లు అవుతాయి.చిరంజీవి, రామ్‌చరణ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలి అది నా అల్టీమేట్ గోల్. దాని కోసం నేను కష్టపడతా. వాళ్లిద్దరి కోసం నా దగ్గర కథ కూడా రెడీగా ఉంది. -
విలేజ్ మేనిఫెస్టోతో ప్రజలముందుకు ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రంరెడ్డి
-
సినిమా యాక్టర్ ని తెచ్చాడు..ఢిల్లీకి పరిగెత్తాడు..
-
నలుగురు స్నేహితుల కథ
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విక్రమ్ రెడి మాట్లాడుతూ– ‘‘నలుగురు స్నేహితుల కథే ‘రోటి కపడా రొమాన్స్’. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లో కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ టైటిల్ లోగో రిలీజ్ చేసిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నాను. కొత్త కంటెంట్ ఉన్న చిత్రాలను మన ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఇదే కోవలో ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు వేణుగోపాల్, విక్రమ్. -
జగనన్న సురక్ష పథకం గురించి వివరించిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
-
ప్రతిసవాల్‌ను స్వీకరించని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి
ఉదయగిరి/ఆత్మకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విసిరిన సవాల్‌కు వైఎస్సార్సీపీ నాయకులు ప్రతిస్పందించారు. అయితే ఆయన మాత్రం వారి సవాల్‌ను స్వీకరించలేదు. ఉదయగిరికి రాలేదు. వివరాలిలా ఉన్నాయి. పార్టీకి అన్యాయం చేసిన చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరిలో అడుగుపెడితే ఒప్పుకోబోమని సొసైటీ మాజీ అధ్యక్షుడు మూలె వినయ్‌రెడ్డి గురువారం ఉదయం హెచ్చరించారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్‌రెడ్డి సాయంత్రం ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని ‘నేను బస్టాండ్‌లో ఉన్నాను.. ఏం చేస్తారో రా..’ అంటూ సవాల్ చేశారు. ఈ విషయం తెలిసిన వినయ్‌రెడ్డి.. తన అనుచరులతో బస్టాండ్ వద్దకు చేరుకునేలోపు ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ రాత్రి, రేపు ఉదయగిరి బస్టాండ్‌లోనే ఉంటా.. దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి’ అని ఎమ్మెల్యే సవాల్‌కు ప్రతిసవాల్ చేశారు. శుక్రవారం ఉదయం ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తమ అనుచరులతో బస్టాండ్‌కు వచ్చి అక్కడే ఉన్న వినయ్‌రెడ్డికి సంఘీభావంగా నిలిచారు. వారు ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా.. ఆయన ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత అక్కడి వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. సీఎంను, పార్టీ పెద్దలను ఒక్క మాట అన్నా సహించేది లేదని హెచ్చరించారు. కాగా, ఉదయగిరి బస్టాండ్ వద్ద సీఐ వి.గిరిబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనారోగ్యంగా ఉన్నాను ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన సోదరుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళుతున్నానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనపై సవాల్ చేసిన వారి గురించి మాట్లాడతానని చెప్పారు. 2024లో తన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పారు. పార్టీకి భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో 3 సంవత్సరాలుగా తాము దూరంగా ఉంటున్నామని, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. మేకపాటి కుటుంబం పట్ల సీఎం జగన్, వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆదరణగా ఉంటున్నారని తెలిపారు. సస్పెండైన వారు వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టంలేదని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని చానెల్స్ విషప్రచారం చేశాయని, వాస్తవాలు తెలుసుకోకుండా అలా ప్రసారం చేయడం సరికాదన్నారు. -
ఎంజీఆర్ సంగం బ్యారేజీ ఆత్మకూరుకే తలమానికం
నెల్లూరు (సెంట్రల్): ఆత్మకూరు నియోజకవర్గానికే ఎంజీఆర్ సంగం బ్యారేజీ తలమానికమని, బ్యారేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో సంగం, ఏఎస్‌పేట, చేజర్ల మండలాల ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటి నుంచో కలలు కంటున్న ఎంజీఆర్ సంగం బ్యారేజీ ప్రారంభం ఈ నెల 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితం కాబోతుందన్నారు. ముఖ్యంగా ఈ బ్యారేజీకి మన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా నామకరణం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అటువంటి మంచి కార్యక్రమానికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం’’ అని అన్నారు. అనంతరం.. మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. మహానేత వైఎస్ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వం అవసరం. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల’’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు -
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం సాధించింది. కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. -
ఆత్మకూరు ఉప ఎన్నిక: 82 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ విజయం
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలు
-
ఓటేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
-
ఆత్మకూరు ఉపఎన్నిక.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
-
ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి
ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయి సామగ్రిని అందించామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాల్లో ఏపీఎస్పీ కేంద్ర బలగాలతో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తును నియమించామన్నారు. మొత్తం జనరల్ స్టాఫ్ 1,339 మంది, పోలీసులు 1,032 మంది, మైక్రో అబ్జర్వర్లు 142 మంది, సెక్టార్ అధికారులు 38 మంది మాస్టర్ ట్రెయినీలు 10 మంది, వీడియో గ్రాఫర్లు 78 మంది పోలింగ్ జరిగేంత వరకు విధుల్లో ఉంటారన్నారు. ఇప్పటికే ఓటర్లకు, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్ఓలు, వలంటీర్ల సహకారంతో ఓటరు స్లిప్‌లు పంపిణీ జరిగిందన్నారు. ఓటర్లు తప్పనిసరిగా స్లిప్‌లతో పాటు గుర్తింపు కార్డు ఓటరు ఐడీ లేదా ఆధార్ బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్ట్ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి చూపాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండు విడతలుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్, విద్యుత్ వసతులు ఏర్పాటు చేసినట్లు, సజావుగా పోలింగ్ జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ! -
ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడంతో అధికారుల ఆదేశాల మేరకు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నియోజకవర్గయేతరులు వెళ్లిపోవాలని ఆర్వో, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. పక్షం రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టంగా చేపట్టాయి. వైఎస్సార్సీపీ మండలానికి ఒక మంత్రిని ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పనితీరు, సంక్షేమ పాలనకు దర్పంగా ఆత్మకూరు తీర్పు ఉండాలని ప్రజల్ని కోరారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అండగా నిలిచినట్లే ఆయన సోదరుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆశీర్వదించాలని గ్రామాలను చుట్టేస్తూ ప్రజల్ని కోరారు. అర్హతే ప్రామాణికంగా అందించిన సంక్షేమ పాలన కారణంగా ఘనమైన మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. సంకటస్థితిలో బీజేపీ తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తరహాలో ఆత్మకూరులోనూ బీజేపీ అగ్రనేతలంతా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ వ్యవహారాల ఇన్చార్జితో పాటు, రాజ్యసభ సభ్యులు,, మాజీ కేంద్ర మంత్రులు ఆత్మకూరులో తిష్ట వేసి ఆ పార్టీ శ్రేణులను నడిపించారు. బీజేపీ అభ్యరి్థని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాగా అభ్యర్థి భరత్‌కుమార్ నాన్‌లోకల్ కావడంతో ఆ సమస్య బీజేపీని వెంటాడుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీస పరువు నిలుపుకునే స్థాయిలో ఓట్లు దక్కితే చాలు అన్నట్లు ఆ పార్టీ నేతల వైఖరి కనిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీరికి ఈ దఫా బీఎస్పీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. గతంలో కాస్తా తక్కువ ఓట్లతో బీజేపీ కంటే వెనుకబడిన బీఎస్పీ ఈ దఫా అధిగమించేందుకు విశేషంగా ప్రయత్నించింది. ఆ మేరకు ప్రజల చెంతకు చేరి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. మెజార్టీపైనే అందరి అంచనాలు నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జి భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థి ఎన్ ఓబులేసులు ప్రధానంగా తలపడుతుండగా బరిలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్సార్సీపీ అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరిగి పార్టీ అమలు చేస్తున్న నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 2,13,138 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా 1,07,367 కాగా, పురుష ఓటర్లు 1,05,960 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం ఓ ట్లు పోల్ కాగా, ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదు అవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం -
సంక్షేమ పథకాలై విక్రమ్ ను గెలిపిస్తాయి
-
ప్రజలు నాకు అడుగడుగునా మద్దతుగా నిలుస్తున్నారు
-
రిగ్గింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది ??
-
అత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి భంగపాటు తప్పదు: కాకాణి
-
ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం
ఆత్మకూరు: మూడేళ్లుగా కులమతాలకు అతీతంగా పారదర్శకంగా లక్షలాది కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని, దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి కలలు కన్న అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు మంత్రులు అన్నారు. ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో సోమవారం పార్టీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్‌కృష్ణ, జోగి రమేష్, రాజ్య సభ్యుడు బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీతో పట్టణం జనసంద్రమైంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జెండాలు చేతబట్టి వేలాదిగా పాల్గొనడంతో రోడ్లు కిక్కిరిశాయి. బంగ్లా సెంటర్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా ఎల్‌ఆర్‌పల్లి, జేఆర్‌పేట, సోమశిల రోడ్ సెంటర్, బస్టాండ్, వైశ్య బజారు మీదుగా సత్రం సెంటర్ వరకు సాగింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రజల సమస్యలను అతి తక్కువ కాలంలో దగ్గరగా పరిశీలించారని, వాటి పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. ప్రజలు ఇప్పటికే పార్టీ గుర్తు ఫ్యాన్‌కు వేసేందుకు స్థిర నిర్ణయం తీసుకున్నారని మెజార్టీ లక్షకుపైగా సాధించేందుకు తాము ప్రచారంలో పాల్గొంటున్నామన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి లేనిలోటు తీర్చేలా విక్రమ్‌రెడ్డి పని చేస్తారని ఆ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉందని, మచ్చలేని రాజకీయాలు చేస్తున్న వారిని ఆదరించి అభిమానించాలన్నారు. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగేలా భారీ మెజార్టీని అందివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి మంచి తనం చూసి ఆయన సోదరుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ మైనార్టీలతో పాటు బీసీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌తో పాటు అన్ని వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్, రాజకీయంగా పదవులు అందించిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందన్నారు. అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు తనకు కొత్త అయినా పైనుంచి దీవిస్తున్న అన్న ఆశీర్వాదాలు, ప్రజల అభిమానం, ముఖ్యమంత్రి, మంత్రుల అండదండలు, సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపుతానన్నారు. గత నెల రోజులుగా చేస్తున్న ప్రచారంలో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం, సంతృప్తి కనిపిస్తున్నాయని, అమలు అవుతున్న నవరత్నాల పథకాలే శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులురెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ జి వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ కేవీ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, షేక్ సర్ధార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు జితేంద్రనాగ్‌రెడ్డి, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న ఆత్మకూరు ఉపఎన్నిక ప్రచారం