- దేశభక్తి పెంపొందించేందుకే తిరంగయాత్ర
- 1 నుంచి రెండు విడతలుగా బైక్‌ర్యాలీ
- బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి
త్యాగధనుల జన్మస్థలాలు స్ఫూర్తికేంద్రాలు
Published Mon, Aug 29 2016 6:56 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
ముకరంపుర : బానిస బతుకుల నుంచి విముక్తి కలిగించిన త్యాగధనుల జన్మస్థలాలను స్ఫూర్తికేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు పి.విక్రమ్‌రెడ్డి తెలిపారు. భావితరాల్లో దేశభక్తి, జాతీయవాదం పెంపొందించేందుకే తిరంగయాత్రను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. స్వాత్రంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఆర్థిక, సామాజిక అసమానతలతో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నైజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17ను విమోచనదినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణవ్యాప్తంగా పర్యటించి కొమురం భీం మొదలుకుని చాకలి ఐలమ్మ వరకు త్యాగధనుల జీవిత చరిత్రను వివరిస్తామన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు రెండు విడతలుగా బైక్‌ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. 9న కరీంనగర్‌లో ముగింపు సభ ఉంటుందని, రాష్ట్ర, జాతీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు గంటల రమణారెడ్డి, కన్నం అంజయ్య, కరండ్ల మధుకర్, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, మురళీకృష్ణ, గడ్డం ప్రశాంత్‌రెడ్డి, ఆర్.ప్రసాద్, కె.జ్యోతిబసు, ఎ.శ్రీనాథ్‌రెడ్డి, జి.రంజిత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎం.కుమార్, కిషోర్, లవన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement