
సాక్షి, తాడేపల్లి: బీజేవైఎం కార్యకర్తల దాడికి యత్నం ఘటనపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. ఆదివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ గ్రీవెన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నాగ నారాయణ మూర్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాడి ఘటనకు సంబంధించిన ఆధారాల్ని పోలీసులకు అందించారు.
కాగా, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడులకు యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment