bjym
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం దాడి
సాక్షి, అమరావతి/భవానీపురం: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు రెచ్చిపోయారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై ఆదివారం దాడికి తెగబడ్డారు. రాళ్లు, రంగు డబ్బాలు విసురుతూ భయోత్పాతాన్ని సృష్టించారు. ఉన్మాదులను తలదన్నే రీతిలో వీరంగమాడారు. నిలువరించబోయిన పోలీసులు, భద్రతా సిబ్బందిపై సైతం దాడికి యత్నించి పోలీసు ఔట్ పోస్టు అద్దాలను ధ్వంసం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి విదితమే. తాము కూడా చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తామని.. తమకంటూ సిద్ధాంతాలు లేవనే రీతిలో బీజేవైఎం కార్యకర్తలు ఉదయం 11.30 గంటల సమయంలో వైఎస్సార్సీపీకి ప్రధాన కార్యాలయంపైకి దాడికి సాహసించారు.చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవాలను గ్రహించకుండా గుంపు కట్టి నినాదాలు చేస్తూ రాళ్లు విసిరారు. అంతటితో ఆగకుండా పార్టీ కార్యాలయ గోడలు, తలుపులపై రంగు ప్యాకెట్లు చల్లారు. మూసివున్న గేట్లు ఎక్కి లోపలకు దూకేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రధాన గేటు ముందు కూర్చుని పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగు ప్యాకెట్లను పార్టీ కార్యాలయం లోపలకు విసరగా అవి లోపల వైపున ఉన్న సెక్యూరిటీ గదికి సమీపంలో పడ్డాయి.సుమారు 20 మందికిపైగా యువమోర్చా కార్యకర్తలు దాడికి యత్నించడంతో పాటు కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ ఫ్లెక్సీని చించి తగులపెట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం తాపీగా వచ్చిన పోలీసులు ఆందోళనకారుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.టీడీపీ దారిలోనే బీజేవైఎంగడచిన వంద రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరి స్థాయిలో వారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుండటంతో బీజేవైఎం కూడా అదే దారిపట్టింది. ఈ దాడులు చూస్తేంటే ఏపీలో ఉన్నామా? బీహార్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోలీసులకు ఫిర్యాదువైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన దాడిపై తాడేపల్లి పోలీసులకు వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బీజేవైఎం కార్యకర్తలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఈశ్వర్, ఆర్ఎస్ఐ వీరేష్, కానిస్టేబుల్ రవీంద్రరెడ్డి, డి.ఖాజాలను దుర్భాషలాడుతూ పార్టీ కార్యాలయంలోకి చొరబడేందుకు విశ్వప్రయత్నం చేసినట్టు తెలిపారు.బీజేవైఎం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన బీజేవైఎం కార్యకర్తల ఉన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాశ్, పోతిన మహేష్‌తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తల దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని కోరారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఇళ్లపై దాడులు చేసేస్థాయి నుంచి పార్టీ కార్యాలయంపై దాడులు చేసే స్థాయికి రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందన్నారు. చంద్రబాబు డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక భావం ఉందని, అందుకే దళితులను ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారన్నారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేయడం ప్రపంచమంతా చూసిందని, దీనిని పవన్ ఖండించకపోగా ప్రాయశ్చిత దీక్ష చేస్తుండటం సిగ్గుచేటన్నారు. కాగా, బీజేపీ ముసుగులో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాడి సరికాదు: సీపీఎంతిరుమల లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని బీజేపీ అనుబంధ బీజేవైఎం కార్యకర్తలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగాఖండించింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘ్ పరివార్ శక్తులు ఒక పథకం ప్రకారం తిరుపతి లడ్డూ సమస్యను ఆసరాగా చేసుకుని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. -
పార్టీ కార్యాలయంపై దాడికి యత్నం.. పోలీసులకు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: బీజేవైఎం కార్యకర్తల దాడికి యత్నం ఘటనపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు.ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ గ్రీవెన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నాగ నారాయణ మూర్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దాడి ఘటనకు సంబంధించిన ఆధారాల్ని పోలీసులకు అందించారు. కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడులకు యత్నించారు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరిన బీజేవైఎం కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులపై దాడికి యత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది గదిని బీజేవైఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు.చదవండి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి యత్నం -
జార్ఖండ్ సీఎం నివాసాన్ని ముట్టడించిన BJYM నేతలు
-
TGPSC వద్ద హైటెన్షన్
-
ఎక్కడికక్కడే అరెస్టులు.. టీజీపీఎస్సీ వద్ద హైటెన్షన్
హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు. బీజేవైఎం, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. -
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
-
BJP: కాఫీ విత్ యూత్
సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్ యూత్’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ మోర్చా నేతలు కొత్త ఓటర్లను అడుగుతున్నారు. ముంబైలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో వీటిని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. యువ ఓటర్ల నాడి తెలుసుకుని, వారిని బీజేపీ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి... ముంబైలో ఇటీవల పలుచోట్ల దాదాపు 300 మంది యువ ఓటర్లతో బీజేపీ యువ మోర్చా నేతలు ‘కాఫీ పే చర్చ’ నిర్వహించారు. పదేళ్ల్లలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వారికి వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఈ చర్చలను విస్తరిస్తున్నారు. ప్రతి భేటీలో కనీసం 150 నుంచి 200 మంది యువ ఓటర్లుండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘కాఫీ పే చర్చ’లో బూత్ స్థాయి కార్యకర్త మొదలు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని దాకా పాల్గొంటారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలోని కనీసం 10 మంది కొత్త, యువ ఓటర్లను ఈ చర్చకు తీసుకొస్తున్నారు. రెస్టారెంట్లు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వినూత్నంగా దీన్ని నిర్వహిస్తున్నారు. మోదీ పేర్కొన్న ‘విజన్ 2047’ లక్ష్యంతో చర్చ సాగుతోంది. ‘రాబోయే ఐదేళ్లలో దేశంలో యువత పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏం చేస్తే యువతకు దగ్గరవుతుంది? అన్ని రంగాల్లోనూ ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరాలంటే ఏం చేయాలి? అవినీతి నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, పేదరికం లేని ఇళ్లు’ తదితర అంశాలపై రెండు నుంచి మూడు గంటల పాటు కార్యక్రమం జరుగుతోంది. యువ ఓటర్ల సలహాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. -
బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని ఎంపీ ఫైర్..
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ యూత్ వింగ్ నాయకుడు ప్రవీణ్ కమ్మార్ దారుణ హత్యకు గురయ్యాడు. ధార్వాడ్ జిల్లా కొట్టూరు గ్రామ పంచాయితీలో మంగళవారం రాత్రి ఓ ఆలయం వద్ద ఊరేగింపు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో ఆపేందుకు ప్రయత్నించిన ప్రవీణ్‌ను ప్రత్యర్థి వర్గం కత్తితో పొడిచింది. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రవీణ్ వర్గంతో గొడవపడిన వర్గం తాగినమత్తులో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కాగా.. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేసజ్వీ సూర్య ఆరోపించారు. ప్రత్యర్థి వర్గం కుట్రపన్నే ఈ దారుణ హత్యకు ఒడిగట్టారని మండిపడ్డారు. పోలీసులు మాత్రం ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఊరేగింపు సమయంలో జరిగిన గొడవే హత్యకు దారీతీసిందని చెప్పారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: బార్బడోస్‌లో గుండెపోటుతో ఖమ్మం విద్యార్థి మృతి.. శోకసంద్రంలో ఎస్సై కుటుంబం -
బీజేపీ నేత దారుణ హత్య.. అక్కడి నుంచే ప్లాన్ జరిగింది!
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లాలో సంఘ పరివార్, బీజేపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ నెట్టార్ హత్య కేసులో మహమ్మద్ షఫిక్, జాకీర్ అనే ఇద్దరు నిందితులను మంగళూరు పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. అనుమానంతో మరో 21 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో 7 మంది ఎస్డీపీఐకి చెందిన కార్యకర్తలున్నారు. హత్య కేసును ఏడీజీపి అలోక్‌కుమార్, పశ్చిమ విభాగం ఐజీ దేబజ్యోతి, ఎస్పీ రుషికేశ్ సోనావణెతో పాటు సీనియర్ అధికారులు గురువారం సమీక్షించారు. సీఐడీ ఎస్పీ అనుచేత్, హాసన్ ఎస్పీ హరిరామ్ శంకర్లను మంగళూరుకు పిలిపించి సమాచారం తీసుకున్నట్లు అలోక్‌కుమార్ విలేకరులకు తెలిపారు. హత్య జరిగిన సుళ్య దగ్గరి బెళ్లారెలో 144 సెక్షన్ కొనసాగుతోంది. దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితి ఉండగా, పలుచోట్ల పోలీసు కవాతులు జరిగాయి. హతుని తల్లిదండ్రులు శేఖర పూజారి, రత్నావతి, భార్య నూతన్‌లను అలోక్‌కుమార్ కలిసి పలు వివరాలను సేకరించారు. ప్రతీకార హత్యగా అనుమానం బెళ్లారెలోని ఎస్డీపిఐ కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. వారంతా అమాయకులని ఎస్డీపీఐ పేర్కొంది. కాగా ప్రధాన నిందితుడు బెళ్లారె బూడు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. ప్రవీణ్ హత్యకు కేరళలో కుట్ర జరిగిందని, ఇటీవల బెళ్లారెలో కేరళ యువకుని హత్యకు ప్రతీకారంగా ప్రవీణ్‌ను హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన బైకు కేరళ రిజిస్ట్రేషన్‌దని తెలిసింది. నా కొడుకు ఈ హత్య చేయలేదు. హత్య చేసినవారికి శిక్ష పడాలని నిందితుడు షఫీక్ తండ్రి చెప్పాడు. 50 మంది కార్యకర్తలు సుళ్యలో ఒక వర్గానికి చెందిన షాపులపై దాడి చేశారు. వస్తువులను చెల్లాచెదరు చేశారు. శుక్రవారం రాత్రి వరకు సుళ్య, పుత్తూరు, కడబ, బంటా్వళలో మద్యం అమ్మకాలను కలెక్టర్ బంద్ చేయించారు. కేరళ డీజీపీతో మాట్లాడాము.. నిందితులు వినియోగించిన మొబైల్ నంబర్లను ట్రాక్ చేసి ఆచూకిని పసిగట్టినట్లు డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. హత్య తరువాత నిందితులు కేరళకు పరారయ్యారు. వారిని అరెస్ట్ చేయడానికి కేరళ డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు. ఎన్ఐఎకి అప్పగించాలి: ప్రవీణ్ భార్య ఈ హత్య కేసు విచారణను ఎన్ఐఎకి అప్పగించాలని హతుని భార్య నూతన డిమాండ్ చేశారు. నా భర్త ఎవరికీ అన్యాయం చేయలేదు, సమాజం కోసం శ్రమిస్తున్నారు. మా కుటుంబానికీ ప్రవీణ్ ఒక్కరే దిక్కు. ఆయనను పొట్టన పెట్టుకున్నారు. హత్య కేసును ఎన్‌ఐఎతో దర్యాప్తు చేయించాలి, అప్పుడే న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. పార్టీ నుంచి 25 లక్షల పరిహారం, ఇల్లు.. ప్రవీణ్ కుటుంబానికి పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు రూ.25 లక్షల పరిహారం ఇస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి అశ్వర్థనారాయణ తెలిపారు. బెంగళూరులో మాట్లాడుతూ ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. హత్యకు నిరసనగా దక్షిణ కన్నడ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది యువ మోర్చా పదాధికారులు రాజీనామాలు ప్రకటించారు. సీఎం బొమ్మై పరామర్శ హత్యకు గురైన ప్రవీణ్ నెట్టారు ఇంటికి గురువారం సాయంత్రం సీఎం బసవరాజు బొమ్మై చేరుకున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. సీఎం సహాయనిధి నుంచి రూ. 25 లక్షల చెక్‌ను వారికి అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రవీణ్ హత్య అత్యంత హేయమని, ఇదొక ముందస్తు ప్రణాళికలో జరిగిన హత్య అని చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లాలో గత పదేళ్లలో అసాంఘిక శక్తుల అకృత్యాలు పెచ్చుమీరాయని తెలిపారు. కేరళ నుంచి కూడా ఈ విధమైన అకృత్యాలకు ప్రోత్సాహం అందుతోందన్నారు. హత్య కేసులో ఇప్పుడే దర్యాప్తు ప్రారంభమైందని, అతి త్వరగా నిందితులందరిని అరెస్టు చేస్తామన్నారు. ఈ కేసును ఎన్ఐఏ విచారణకు ఇచ్చే యోచన ఉన్నట్లు తెలిపారు. ప్రవీణ్ అంత్యక్రియల సందర్భంగా లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఇదే సమయంలో పక్కనే ఉన్న ప్రజలు సీఎంను కోరారు. దొడ్డబళ్లాపురం: బీజేపీ, సీఎం బసవరాజ బొమ్మై ఎంతో భారీఎత్తున జరుపతలపెట్టిన బల ప్రదర్శన సభ... జనోత్సవ రద్దయింది. బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు గురికావడమే రద్దుకు కారణం. దొడ్డబళ్లాపురంలో గురువారంనాడు అంగరంగ వైభవంగా జనోత్సవ సభను నిర్వహించాలని సుమారు నెల నుంచి ఏర్పాట్లు చేశారు. రద్దు వల్ల కొన్ని కోట్ల రూపాయలు వ్యర్థమయ్యాయి. లక్ష మంది కోసం వేసిన భారీ కటౌట్లు, సెట్టింగులు, బ్యానర్లు, బంటింగ్స్ తొలగించారు. నేతలు, కార్యకర్తల తరలింపు కోసం బస్సులు, వీఐపీల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలు అన్నీ రద్దయ్యాయి. సమావేశం స్థలి వద్ద భారీ వంటశాలలో సుమారు వందమంది చేయితిరిగిన వంట మనుషులు 25 వేలమందికి ఉదయం ఉపాహారంగా పలావ్, పులిహోర వండారు. మధ్యాహ్నం లక్ష మంది కార్యకర్తల కోసం భోజనం తయారీకి బియ్యం, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు స్వీట్లు సిద్ధం చేశారు. తీరా సభ లేదనగానే స్థానిక బీజేపీ నేతలు షాక్‌కు గురయ్యారు. తరువాత తేరుకుని వండిన ఆహారం వృథా కాకూడదని తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు పంపించారు. రెండు టన్నుల కూరగాయలను ఘాటిలోని గోశాలకు తరలించారు. చాలా ఆలస్యంగా సభ రద్దు నిర్ణయం తీసుకొన్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నారు. -
మంత్రి సబితా కాన్వాయ్ ను అడ్డుకున్న BJYM కార్యకర్తలు
-
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం యత్నం
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్పీఎస్సీ) కార్యాలయం ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు. పెద్ద ఎత్తున బీజేవైఎం కార్యకర్తలు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు రంగంలోకి దిగి పలువురు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేశారు. తెలంగాణ వెంటనే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా బీజేవైఎం అధ్యక్షుడు భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, రోజురోజుకు నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ కోసం కమిటీ వేసిన ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అన్ని జిల్లా కలెక్టర్ల ముందు నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. చదవండి: వ్యూహాత్మక అడుగులు: వ్యతిరేకులు, సీనియర్లతో భేటీ -
కోల్‌కతాలో యుద్ధ వాతావరణం
కోల్‌కతా/హౌరా: బీజేపీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం సందర్భంగా గురువారం కోల్‌కతా, హౌరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఘర్షణల్లో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కోల్‌కతా, హౌరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్లపై ఎక్కడ చూసినా.. కాల్చిన టైర్లు, రువ్విన రాళ్లు కనిపించాయి. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా, వేలాది కార్యకర్తలు మధ్నాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సచివాలయం వైపునకు వెళ్లడం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ మార్చ్ ప్రారంభించారు. వారిని మాలిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కార్యకర్త నుంచి బుల్లెట్లతో ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తమపై నాటు బాంబులు వేశారని పోలీసులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు నేతృత్వంలో సాగిన మార్చ్‌ను సాంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడా ఘర్షణ జరిగింది. పోలీసులతో ఘర్షణల్లో బీజేపీ నేత రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో గాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్ఘీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌ల నేతృత్వంలో సాగిన చలో సెక్రటేరియట్ మార్చ్‌ను కోల్‌కతాలోని హాస్టింగ్స్–ఖిద్దర్‌పోర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు తమపై దాడి చేశారని విజయ్‌వర్ఘీయ ఆరోపించారు. దాదాపు వంద మందికి పైగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం తలపెట్టిన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమత సర్కారును సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మమత బెనర్జీ అవినీతిమయ, హింసాత్మక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారన్నారు. మమత పాలనకు బీజేపీ అంతం పలకడం ఖాయమన్నారు. ‘మమత తన సచివాలయాన్ని మూసివేసుకునేలా ధీరులైన మా బీజేవైఎం కార్యకర్తలు పోరాడారు. ఆమె ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారనేందుకు ఇదే ఉదాహరణ’ అని నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే విషయంలో మాత్రం గత వామపక్ష ప్రభుత్వం కన్నా మమత సర్కారు మెరుగ్గా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త -
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : సంచిత
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీమంత్రి అశోక గజపతిరాజు సోదరుడి కుమార్తె, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సంచిత హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆమె అన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంచిత గజపతిరాజు.. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వెనుకబడిన కర్నూల్లో హైకోర్టు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. రాజధాని పేరుతో రైతుల వద్ద చంద్రబాబు నాయుడు బలవంతంగా లాకున్న భూమిని తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ముందే ఎందుకు పారిపోయి వచ్చారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ రాజధానిపై పూర్తి నివేదిక ఇవ్వకుండానే అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధపడిందని సంచిత ఆరోపించారు. అమరావతి అనేది చట్టవిరుద్ధం నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీని ప్రజలు ఎప్పడో తిరస్కరించారని, రాజధానిపై మాట్లాడే కనీస హక్కు చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు. అలాగే అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సంచిత ప్రశంసించారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పడూ సహకారంగా ఉంటారని, దీనిలో రాజకీయం చేసే దురాలోచన ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. కాగా రెండేళ్ల క్రితమే ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలోని అక్రమ కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరకట్టపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు చేరువులు, దేవాలయాల భూములు కబ్జా చేశారని రమేష్ నాయుడు ఆరోపించారు. వీటిన్నంటిని కూడా కూల్చివేయాలని.. అలా చేస్తే జగన్‌కు పుష్పాభిషేకం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూల్చివేయాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. విభజనలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు రమేష్ నాయుడు. ఏపీ విషయంలో కేసీఆర్ కొంత పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరారు. రాయల సీమ కరువుతో అల్లాడుతోందన్నారు. నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తింప జేయాలని.. ప్రైవేట్ స్కూల్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. -
కరవుపై తక్షణమే చర్యలు తీసుకోండి: బీజేపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీజేపీ యువ మోర్చా ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. ప్రతీ ఏటా కరవు బారిన పడుతున్న రాయలసీమను శాశ్వతంగా ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గాలపై చర్చ జరగాల్సి ఉందని, గ్రామాలలో కనీసం తాగడానికి మంచి నీరు కూడా దొరకడం లేదని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల మేత దొరకని పరిస్థితి ఏర్పడిందని, పశువులను కబేళాలకు తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వలసలు వెళ్తున్న రైతాంగాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవాలని కోరారు. వేరుశెనగ, జొన్న, సజ్జలు, రాగి, మొక్కజొన్న పంటలు పండించే రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలని కోరారు. గతంలో మీరు అట్టహాసంగా ప్రారంభించిన రెయిన్ గన్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని మరోసారి హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. -
నాడు వాజ్‌పేయ్.. నేడు మోడీ
రామగిరి: నరేంద్రమోదీ పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని, నాడు వాజ్‌పేయ్, నేడు మోడీ పాకిస్తాన్ కుట్రలను తిప్పికొట్టి భారత్ సత్తాను ప్రపంచ దేశాలకు చూపించారని బీజేపీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి రేండ్ల సనత్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని కల్వచర్లలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, పైస్థాయి నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 42మంది జవానులు హతమార్చడంతో ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేసి 300 మందికిపైగా తీవ్రవాదులను మట్టుబెట్టడంలో భారత్ విజయం సాధించడం, అభినందన్ విడుదలలో మోడీ కీలక భూమి పోషించారని వివరించారు. రానున్న పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో తర్డ్ ఫ్రంట్, పోర్ట్ ప్రంట్ అంటూ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఆరోపించారు. బీజేపీలో పూర్తి స్థాయిలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, రానున్న కొద్ది రోజుల్లోనే నియోజకవర్గానికి సంబధించిన అన్ని కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన వివరించారు. ముందుగా ఆయన ఇంటిపైన బీజేపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ విస్తారక్ మహేష్, జిల్లా కార్యదర్శి మహావాది రామన్న, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల శశి, నియోజకవర్గ కో కన్వీనర్ తూండ్ల క్రాంతి కుమార్, రామగిరి ఇన్చార్జి బత్తిని నర్సయ్య, మహదేవ్పూర్, కాటారం మండలాల అధ్యక్షులు ఆకుల శ్రీదర్, భాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మారెపల్లి శ్రీనివాస్, నాయకులు బండి రంజిత్ కుమార్, మల్లారపు అరుణ్‌కుమార్, జంగెపల్లి అజయ్ పాల్గొన్నారు. -
‘తెలంగాణ బిడ్డను.. ఆంధ్రా కోడలిని’
హైదరాబాద్: నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ‘విజయ లక్ష్యం 2019 యువ మహాధివేశన్’ పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి నిన్న(శనివారం) కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలినని తెలిపారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో కమలం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2019లో విజయ లక్ష్యమే మన సంకల్పమని, ఈ సమ్మేళనం ఉద్దేశ్యం కూడా అదేనన్నారు. డిసెంబర్ 11న తెలంగాణలో కమలోదయం జరగనుందని జోస్యం చెప్పారు. -
బీజేవైఎం జాతీయ సమ్మేళనం
-
‘భగత్‌సింగ్ కలలుగన్న సుపరిపాలన అందిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... యువ శక్తి ఎక్కువగా ఉన్న ఏకైక దేశం కేవలం భారత్ మాత్రమేనని అన్నారు. దేశాభివృద్ధి లో యువతను భాగస్వామి చేసి మోదీ సర్కారు.. భగత్ సింగ్ కలలు కన్న సుపరిపాలనను అందిస్తోందన్నారు. విశ్వంలో దేశం పేరు నిలబెట్టిన స్వామి వివేకానంద కూడా యువకుడేనని.. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ పూర్తి మెజార్టీ పొందిన బీజేపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీ అన్ని వర్గాలకు సమన్యాయం అందించేందుకు కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని రాజ్‌నాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి జాతి హితం కన్నా రాజకీయ హితమే ముఖ్యమని అందుకే ప్రజలకు మంచి జరుగుతుంటే వారు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. మోదీని, బీజేపీని ఓడించడమే తప్ప విపక్షాలకు దేశ అభివృద్ధి ఎజెండా లేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టుకట్టే పార్టీ లు తర్వాత.. మీటూ.. ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. 2019లో భారత్ విశ్వగురువుగా అవతరించాలంటే.. 350 సీట్లు గెలిచేంత వరకు కార్యకర్తలు నిద్ర పోవద్దని పిలుపునిచ్చారు. కాగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ పూనమ్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్’ పేరుతో ఈ సమ్మేళనం రెండు రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో సమ్మేళనం నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షించవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు(ఆదివారం) జరుగునున్న యువభేరీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. -
భవిష్యత్తు కార్యాచరణపై బీజేవైఎం మహాసమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసేందుకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తొలిసారి హైదరాబాద్‌లో జాతీయ యువ సమ్మేళనం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్’ పేరుతో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించనున్నారు. మూడేళ్లకోసారి నిర్వహించే ఈ సదస్సులో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, నైపుణ్య కల్పనకు ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, యువతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించనున్నారు. తొలిరోజైన శనివారం ఉదయం 10 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు అస్సాం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్‌దేవ్, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్, పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు ప్రసంగించనున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సభలను హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో ఈ సమావేశాలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమ్మేళనంలో పార్టీ రాజకీయ వ్యూహాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సమ్మేళనం నిర్వహణకు చర్యలు చేపట్టారు. సమ్మేళనాన్ని తెలంగాణలో నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 50 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇక రెండో రోజైన ఆదివారం ముగింపు కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తదితరులు ప్రసంగించనున్నారు. అలాగే రెండో రోజు మధ్యాహ్నం భారీగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లోనే నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సభకు దాదాపు 2 లక్షల మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యువతకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలు: లక్ష్మణ్ రానున్న పార్లమెంటు ఎన్నికలకు యువత ను సమాయత్తం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. యువతను మేల్కొలిపేలా, వారికి స్ఫూర్తినిచ్చేలా 2రోజుల కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, బీజేవైఎం నాయకులతో కలసి లక్ష్మణ్ శుక్ర వారం బీజేవైఎం సమ్మేళనం ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలను దేశవ్యాప్తంగా విస్తృతపరిచేలా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ యువత మోదీ నాయకత్వా న్ని నమ్ముతోందని, మోదీ అభివృద్ధిని, మార్గానిర్దేశకత్వం గురించి ఈ సభల్లో యువతకు వివరిస్తామని చెప్పారు. బీజేవైఎం సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. 2014లో మోదీ నిజాం కళాశాల నుంచి ఎన్నికల శంఖారావం పూరించారని, 2019 పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడినుంచే విజయభేరిని మోగించి విజయం అందుకుంటామని అన్నారు. -
బీజేవైఎం యువ సమ్మేళనానికి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి యువ సమ్మేళనానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి 28 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ హైదరాబాద్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 26న అన్ని రాష్ట్రాల నుంచి బీజేవైఎం మండల బాధ్యులు, జిల్లా, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు దాదాపు 2 లక్షల మంది రానున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్, జాతీయ కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు వెల్లడించారు. ఈ సభ రాబోయే ఎన్నికలకు యుద్ధభేరి మోగిస్తుందని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. సమ్మేళనంలో భాగంగా మొదటి రోజు ప్రతినిధుల రాక, రిజిస్ట్రేషన్ల కార్యక్రమం కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి సభ్యుడికి క్యూఆర్ కోడ్ కలిగిన కార్డు ఇస్తారు. బార్ కోడ్ రీడ్ చేయగానే ఆయా అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలు, ఎక్కడ ఏయే సమావేశం ఉంటుందనే వివరాలు, బస ఏర్పాట్ల వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేలా ఏర్పాటు చేశారు. 27వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 28న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో 10 మంది కేంద్ర మంత్రులు, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ప్రధానంగా నితిన్ గడ్కారీ, ఉమాభారతి, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, రాజ్‌ప్రతాప్ రూఢీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొననున్నారు. -
శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం
విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఏపీ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..మంత్రి గంటా విడుదల చేసిన శ్వేత ప్రతం అంతా తప్పుల తడక అని విమర్శించారు. అది శ్వేత పత్రం కాదు..నల్ల పత్రం అని దుయ్యబట్టారు. అందులో ఉన్నదంతా బూతేనని మండిపడ్డారు. పెట్రోలియం విశ్వవిద్యాలం కోసం సబ్బవరం భూవివాదాన్ని పరిష్కరించలేని చేతగాని మంత్రి గంటా శ్రీనివాసరావని ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాసంస్థలపై మాట్లాడే హక్కు గంటాకు లేదన్నారు. ఐఐఎంకు సంబంధించి ప్రారంభోత్సవంలో హడావుడిగా బోర్డు తగిలించి ప్రభుత్వానికి చూపించేశారని విమర్శించారు. అక్కడ కరెంటు, వాటర్ ఇవ్వకుండా నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు నెలల్లో 33 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు..అందులో 70 శాతం గంటా వియ్యంకుడు పి. నారాయణకు చెందిన నారాయణ కాలేజీల్లోనే జరిగాయని..దీనికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. కేంద్ర విద్యాసంస్థలపై విడుదల చేసిన శ్వేతపత్రం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. -
నిరుద్యోగభృతి కాదు..ఎన్నికల భృతే !
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబ్ వస్తుందని, రుణమాఫీ చేస్తానని ప్రచారం చేశారు..అధికారంలోకి వచ్చాక మాట తప్పారని బీజేవైఎం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు వచ్చే అక్టోబర్ నుంచి ఇచ్చేది నిరుద్యోగ భృతి కాదని, ఎన్నికల భృతి మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు నిరుద్యోగులకు చేసిన మోసాన్ని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తామని వివరించారు. ఇంటికొక ఉద్యోగ హామీ ఊసే లేదు..రాష్ట్రంలో 2 లక్షల 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. బాబు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 10 లక్షల మందికే నిరుద్యోగ భృతి అంటూ షరతులు విధించారని మండిపడ్డారు. -
అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తాం
కామేపల్లి : అర్హులైన లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించే ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ పొయ్యిలు అందిస్తామని, నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని చేస్తుందని బీజేపీ అనుబంధ సంఘం బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రేష్మా రాథోడ్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కామేపల్లిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద మంజూరైన గ్యాస్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెల్లరేషన్ కలిగి గ్యాస్ కనెక్షన్ లేని లబ్ధిదారులందరికీ కేంద్రప్రభుత్వం ఉచితంగా గ్యాస్ అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని, కేంద్ర ఇచ్చే నిధులతో సోకులుపడుతుందన్నారు. ప్రజా సమస్యలను విస్మరించదని, మాటలతో ప్రభుత్వాన్ని కేసీఆర్ నడిపిస్తున్నారని, కేసీఆర్ మాటల గారడీకి వచ్చే ఎన్నికల్లో తాళం పడకతప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు భూక్యా శ్రీనివాస్ నాయక్, బీజీపీ మండల అధ్యక్షుడు పోలూరి రాంచంద్రయ్య, నాయకులు హతిరాం నాయక్, జె.నర్సింగ్, భద్రయ్య, కె.వీరయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.