రుణమాఫీ పథకంపై రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల్లోపే ఆ పథకాన్ని వర్తింపజేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సూచించారు.
అనంతపురం: రుణమాఫీ పథకంపై రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల్లోపే ఆ పథకాన్ని వర్తింపజేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సూచించారు. సోమవారం ఆయన అనంతపురంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో టీడీపీ అలసత్వం ప్రదర్శిస్తే ప్రజా క్షేత్రంలో పోరాటానికి తాము వెనకాడమని హెచ్చరించారు.
నరేంద్ర మోడీ హవా నడిచినందునే రాష్ట్రంలో టీడీపీ- బీజేపీ కూటమి విజయం సాధించిందని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని, రాష్ట్రంలోనూ నిర్మాణాత్మక పాత్రను పోషించి ఎన్నికల హామీలు అమలయ్యేలా చూస్తామని చెప్పారు. ‘అనంత’ను ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చడానికి నరేంద్ర మోడీకి తమ పార్టీ తరఫున ప్రత్యేక ప్రణాళికను అందజేసినట్లు తెలిపారు.