Vishnuvardhan Reddy
-
కాంగ్రెస్ మాయ చేస్తోంది...
ప్రాంతీయ పార్టీల ఉనికిని జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దానితోపాటు మరికొందరూ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా జమిలి ఎన్నికలే జరుగుతున్న ఆంధ్రప్రదేశ్నే ఓ కేస్ స్టడీగా తీసుకుందాం: ఇక్కడ జాతీయ పార్టీలు ఈ కారణంగా బలం పుంజుకున్నాయా? ప్రాంతీయ పార్టీలు ఏమైనా బలహీన పడ్డాయా? ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజలు ఎంచుకునే అంశాల ఆధారంగానే ఓటింగ్ జరుగుతుంది. అంతే కాని జమిలి ఎన్నికల వల్ల కాదని ఈ ఉదాహరణతో అర్థమవుతోంది.‘వన్ నేషన్ – వన్ ఎల క్షన్’ను వ్యతిరేకిస్తున్న పార్టీల్లో డీఎంకే, టీఎమ్సీ, సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి. జమిలీ ఎన్నిక లను ఆ పార్టీలు వ్యతిరేకించడా నికి ప్రధాన కారణం బీజేపీ వ్యతి రేక ధోరణి మాత్రమే. బీజేపీ ఏ పని చేసినా వ్యతిరేకిస్తుంది టీఎమ్సీ. సమాజ్ వాదీ పార్టీదీ అదే ధోరణి. దేశంలో మొదటి మూడు ఎన్నికలు జమిలీనే. అప్పుడు ఎందుకు అవి దేశానికి నష్టమనీ, ప్రజాస్వామ్యానికి హానికరమనీ కాంగ్రెస్ ప్రచారం చేయలేదు? చాలా ప్రాంతీయ పార్టీలు ఈ జమిలి బిల్లును సమర్థిస్తూండటం ఇతర పార్టీల వాదనల్లో పస లేదనడానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్, బీజేడీ సహా అత్యధిక పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. గతంలో లా కమి షన్కే తమ అనుకూలత తెలిపాయి. మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు లేని భయం... కాంగ్రెస్ మాయలో ఉన్న పార్టీలకు ఉండటానికి కారణం ఏమిటి? ఆ బిల్లును తీసుకొస్తోంది బీజేపీ, ప్రధాని మోదీ కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. కానీ వారు దేశ ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దేశంలో ఐదేళ్ల పాటు... ప్రతి ఏడాదీ జరుగుతున్న ఎన్నికలకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయిపోతోంది. అదే పదే పదే ఎన్నికలు లేకపోతే రాజకీయ అవినీతి కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చి, దేశమంతటా ఎన్నికలు ఒకేసారి పూర్తి అయితే... అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పాలన మీద, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్ట డానికి వీలవుతుంది. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ కేతువులా పట్టి పీడిస్తోంది. దేశం అంతా తమ గుప్పిట్లోనే ఉండాలని చెప్పి అన్ని రకాల వ్యవస్థ లనూ చెరబట్టింది. ఎమర్జెన్సీ విధించడమే కాదు సుప్రీంకోర్టు అధికా రాలనూ తగ్గించడానికి ప్రయత్నించింది. దేశ ప్రజ లను... మతాలు, కులాల వారీగా విభజించి తమ పబ్బం గడుపుకునేందుకు అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ మాయలో ప్రాంతీయ పార్టీలు పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది.ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రా యమే బలమైన పునాది అని ప్రధాని మోదీ నమ్మతారు. అది బీజేపీ మూల సిద్ధాంతం కూడా. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపించారు. ఇప్పుడు అన్ని పార్టీలూ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. జమిలి ఎన్నికల విధానం మరింత మెరుగ్గా తీర్చిదిద్దేలా సలహాలు ఇవ్వొచ్చు. అలా చేయడం దేశభక్తి అవుతుంది. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాయ నుంచి బయటకు రావాలి. నిజం తెలుసుకోవాలి. దేశం కోసం జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతివ్వాలి.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు -
సీఎం జగన్ సమక్షంలో YSRCPలోకి కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి
తిరుపతి, సాక్షి: ఎన్నికల ప్రచారం నడుమ అందరినీ కలిసే పరిస్థితి ఉండట్లేదని.. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోవాలని చేరికల కోసం వస్తున్న స్థానిక నాయకుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం ఉదయం ఎనిమిదవ రోజు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు జరిగాయి. ఎద్దల చెరువు వద్ద బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరారు. సీఎం జగన్ విష్ణుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ YSRCP తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నా. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా.. .. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. నన్ను కలవలేకపోయామే అని బాధపడొద్దు. మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. .. ఈ నెల 6వ తేదీన కావలిలో మేమంతా సిద్ధం సభ కూడా మీ పరిధిలోనే జరుగుతుంది. అప్పుడు మీ అందరినీ వీలైనంతవరకు నేను కలుస్తా. విష్టు దగ్గరుండి ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు’’ అని సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చేరికల కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు. కాగా, 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేశారు విష్ణువర్ధన్ రెడ్డి. వారం రోజుల కిందట వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మధ్యలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. -
కాంగ్రెస్‌పై బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి ఫైర్
సాక్షి, కర్నూలు: పక్క రాష్ట్రాల్లో తరిమేసిన వారిని కాంగ్రెస్ అధ్యక్షులను చేసిందంటూ.. ఆ పార్టీపై బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షర్మిలను అద్దెకు తెచ్చి పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆంధ్రా ద్రోహులను తెచ్చి ఏపీపై దండెత్తుతారా? అంటూ ధ్వజమెత్తారు. రాయలసీమకు నీరు ఇవ్వకూడదని తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన సీఎంను తెచ్చి తిరుపతిలో మునిఫెస్టో విడుదల చేయిస్తారట ధ్వజమెత్తారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాజెక్ట్‌లపై వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ పీసీసీ.. తెలంగాణ కాంగ్రెస్‌ను కోరాలంటూ విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని -
బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్
-
హైదరాబాద్ : కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి (ఫొటోలు)
-
ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారానే ప్రతీపశక్తులకు గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ నేత రాంపుల్లారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత కొత్త జైపాల్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరగ్గా, దేవుడి దయతో బతికి బయటపడ్డారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఎప్పుడూ ఇలాంటి హేయమైన రాజకీయాలు లేవని, హింసకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. నాగం చేరికతో పెరిగిన బీఆర్ఎస్ బలం నాటి తెలంగాణ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చేరికతో బీఆర్ఎస్ పార్టీ బలం మరింత పెరిగిందని కేసీఆర్ అన్నారు. పాలమూరులో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలో నాగం ఇంటికి వెళ్లి మరోమారు ఆయన అనుచరులతో భేటీ అవుతానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి తన కుటుంబసభ్యుడి లాంటి వాడన్నారు. విష్ణు తండ్రి పి.జనార్దన్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన రాజకీయ భవిష్యత్తు తన బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. -
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నాగం జనార్ధన్‌రెడ్డి
-
కాంగ్రెస్ లో నాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు: విష్ణు
-
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై వీడని ఉత్కంఠ!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మొహమ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు. తమకే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఇదివరకే వారు నియోజకవర్గంలో తమ ప్రచారాలను చేసేసుకుంటున్నారు. ఎవరికివారే తమకే టికెట్ ఖారారు అయిందని, డివిజన్ల నేతలతో మీటింగ్‌లు, బస్తీలు, కాలనీల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొదటి జాబితాలో తన పేరు వస్తుందని ఆశించిన ఇద్దరికీ నిరాశే ఎదురైంది. మరో రెండు రోజుల్లో తమకే టికెట్ అని నేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే గురువారం కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ ఎంపీ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అధిష్టానం అజహరుద్దీన్ సీటు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అవినీతి మరకతో ఎన్నికల బరిలోకి దిగితే ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తాయనే ఆందోళన.. ఆలోచనలో పడింది. దాదాపు లక్షకుపైగా మైనార్టీ ఓట్లు ఉన్న నియోజకవర్గంలో అజహరుద్దీన్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ కలిసివస్తుందని, సెటిలర్లు సైతం తమకే మొగ్గు అనే సంబరాల్లో ఉన్న అజహరుద్దీన్ టీం ఇప్పుడు ఇరకాటంలో పడిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికే టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం మరో ట్విస్ట్‌కు తెరలేపింది. ఎంఐఎం నుంచి ఒకసారి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవీన్‌యాదవ్‌కు ఢిల్లీకి పిలిపించింది. యువనేతగా బలమైన పోటీనిచ్చే వ్యక్తిగా బలాన్ని తెలుసుకొని పిలిపించారని సమాచారం. అయితే టికెట్ ఇస్తేనే కాంగ్రెస్‌లో ఉంటానని, లేకుండా ఎంఐఎం లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ధీమాగా వారికి చెప్పారని రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సారి తమకు మద్దతు ఇవ్వాలని, ఎంపీ అవకాశం ఇస్తామని చెప్పారట. ఎమ్మెల్యేగానే అవకాశం ఇవ్వాలని కోరారట. కాంగ్రెస్ అధిష్టానం విష్ణు వైపు మొగ్గు చూపుతుందా... మైనార్టీల బలంతో అజహరుద్దీన్‌కే టికెట్ ఇస్తారా.. లేక.. పోటీలో ఉన్న ఇద్దరినీ కాదని.. కొత్త వ్యక్తి ప్రత్యర్థితో బలంగా నిలబడే నవీన్‌యాదవ్ లాంటి వ్యక్తికి చాన్స్ ఇస్తుందా అనే విషయంలో త్వరలో తేలిపోతుంది. -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పుత్రశోకం
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(35) గురువారం అనారోగ్యంతో మృతిచెందారు. మూడురోజుల క్రితం గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా కామెర్లు సోకాయి. వైద్యులు డయాలసిస్ కూడా చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు ఆస్పత్రికి చేరుకొని ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. సాయంత్రం ఇక్కడ నిర్వహించిన అంత్యక్రియల్లో మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, జగ్గారెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వెన్నవరం భూపాల్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
వలంటీర్ల సేవలకు సలాం
సంబేపల్లె : జగనన్న నవరత్నాల పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారని ఎంపీపీ ఆవుల నాగశ్రీలక్ష్మి చెప్పారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ సొంత నిధులు రూ.4.75 లక్షలను వలంటీర్లకు గ్రామ కార్యదర్శుల ద్వారా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలంటీర్లు చేస్తున్న సేవలకు కొంతైనా వారి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మండలంలోని 190 మంది వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున నగదును పంపిణీ చేశారు. -
రూ.రెండు వేల కోట్లు ఇచ్చినా అసెంబ్లీ కూడా కట్టలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన చేతగాని పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని బీజేపీ ఆరోపించింది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ రూ.వెయ్యి కోట్లతో కొద్దినెలల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేస్తే.. కేంద్రం నుంచి రూ.2 వేల కోట్లు తీసుకున్న చంద్రబాబు కనీసం శాసనసభకు శాశ్వత నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించింది. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ కారణంగా రాష్ట్రంలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిందన్నారు. వివిధ సంధర్బాల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పదులకొద్దీ ప్రజలు మరణించినా ఆ పార్టీలో ఎటువంటి మార్పు లేకుండా అదే తరహాలో కార్యక్రమాలు కొనసాగించడం వల్లే ప్రభుత్వం అప్రజాస్వామిక జీవో నంబరు 1 తీసుకొచ్చిందని విమర్శించారు. మూడు దశాబ్దాలు రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల పొత్తులు పెట్టుకుని బీజేపీ నష్టపోయిందని వ్యాఖ్యానించారు. -
ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటనపై బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్స్
-
రాష్ట్రాన్ని టీడీపీ నాశనం చేసింది
చిత్తూరు (కార్పొరేషన్): ఆంధ్రప్రదేశ్‌ను టీడీపీ నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం టీడీపీ సొంత ప్రయోజనాలే తప్ప ప్రజావసరాలను పట్టించుకోవడం లేదన్నారు. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా ప్రజల కోసం వారు ఎటువంటి పోరాటాలు చేయడంలేదని విమర్శించారు. వందేళ్లుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు బూజు పట్టిన సిద్ధాంతాలతో వెంటిలేటర్‌పై ఉన్నాయని తెలిపారు. వారు ఎందుకు ఇంకా అధికారంలోకి రాలేదని ప్రశ్నించారు. సినీ నటుడు ఎన్టీఆర్, నితిన్ బీజేపీకి ఆకర్షితులయ్యారన్నారు. తెలంగాణ వాసులు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారని తెలిపారు. ఎంఐఎం మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ అని, వాటిని నిషేధించాలన్నారు. సీపీఎస్ రద్దును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కప్పం ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. రంజాన్, క్రిస్మస్కు లేని నిబంధన ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి కోలా ఆనంద్, మాజీ ఎంపీ దుర్గారామకృష్ణ పాల్గొన్నారు. -
రేవంత్‌పై పరువు నష్టం దావా వేస్తా: మాజీ ఎమ్మెల్యే విష్ణు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పబ్ లైంగిక దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఆవరణలో మైనర్‌నపై లైంగికదాడి జరిగిందని ఆరోపించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను ఆలయ ట్రస్ట్ సభ్యులు ఖండించారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్దమ్మ గుడి ఆలయ ట్రస్ట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. మరోవైపు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత విష్ణువర్దన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాలయంలో ఎలాంటి ఆసాంఘిక కార్యక్రమాలు జరగలేదన్నారు. రేవంత్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఆలయ ఆవరణలో బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. సీపీ క్లారిటీ ఇచ్చినా రేవంత్ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పార్టీ వ్యవహారం కాదని.. పెద్దమ్మ తల్లి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు తప్పు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్‌పై టెంపుల్ తరపున పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.. పెద్దమ్మ టెంపుల్‌పై మాట్లాడేముందు తనను రేవంత్ కనీసం సంప్రదించలేదని పేర్కొన్నారు. -
పవన్, ఎన్టీఆర్ లకు సమానమైన గౌరవం ఇస్తాం - విష్ణువర్థన్ రెడ్డి
-
‘పెగసస్‌పై గతంలోనే బీజేపీ ఫిర్యాదు’
కదిరి: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో జరిగిన పెగసస్ స్పైవేర్ బాగోతంపై రాష్ట్ర బీజేపీ పెద్దలు అప్పుడే ఫిర్యాదు చేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమగుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. వ్యక్తిగత సమాచారం చోరీ, ఓట్ల తొలగింపుతో పాటు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానం ఉందని అప్పట్లోనే బీజేపీ పేర్కొందని గుర్తుచేశారు. అనంతపురం జిల్లా కదిరిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెగసస్‌పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో సమగ్ర విచారణ జరిపేలా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. -
పూల సాగు.. గిరిజన రైతులకు వరం
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: గిరిజన ప్రాంతాల్లో పూల సాగును చేపట్టేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణ పరిస్థితులు, భూమి ఇందుకు అనువుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిన పూలు, కూరగాయల సాగు చేపడితే హార్టీకల్చర్ విభాగంతో పాటు.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇతోధికంగా తోడ్పడుతుందని వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. విశాఖ ఏజెన్సీ రైతులు తరతరాలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, రాజ్మా, చిక్కుళ్లు, వలిశలు వంటి ఆహార పంటలను, అల్లం, మిరియాలు, కాఫీ వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అధిక వర్షాలతో ఈ పంటలు ఆశించిన ఆదాయాన్ని ఇవ్వలేకపోతుండడంతో కొంతమంది రైతులు చట్ట విరుద్ధమైన పంటల్ని సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను నిషేధించినా అటువైపే మొగ్గు చూపుతుండటంతో.. రైతులను పూల సాగు వంటి వాణిజ్య పంటల వైపు మరల్చేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యాచరణను తయారు చేసినట్టు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. పూలసాగుతో లంబసింగి, అరకు మరింత ఆకర్షణీయం ఇందులో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్నే ఓ ప్రయోగ క్షేత్రంగా మార్చాలని, పెద్ద ఎత్తున పూలసాగు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణం పూల సాగుకు అనువైన స్థలంగా అభివర్ణించారు. రైతులకు ఈ మేరకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 5 రకాల గ్లాడియోలస్, 3 రకాల ట్యూబారస్, రెండు రకాల చైనా ఆస్టర్, బంతి, చామంతి, తులిప్ వంటి పూల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు వివరించారు. ఈ పూల సాగును విజయవంతం చేసి.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు మారుపేరుగా నిలపాలని సూచించారు. పూల తోటల్ని విరివిగా పెంచితే లంబసింగితో పాటు, ఏపీ ఊటీ అయిన అరకు.. పర్యాటకుల్ని మరింత ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు పాలీహౌస్‌ల అవసరం లేకుండానే పూలను సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూల సాగును ఇప్పటికిప్పుడు చేపడితే ఐదేళ్లలో గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో పూల సాగు.. వివిధ రకాల పూలు, కూరగాయల పంటల సాగుపై శిక్షణ పొందుతున్న చింతపల్లి సేంద్రియ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఈ పంటల్ని సాగు చేసేందుకు నడుంకట్టారు. గ్లాడియోలస్, తులిప్, నేల సంపంగి, చైనా ఆస్టర్, బంతి, చేమంతి సాగు చేపట్టారు. వీటితో పాటు సేంద్రియ పద్ధతిన కూరగాయల పెంపకాన్ని కూడా చేపట్టి చదువుతో పాటు రోజు వారీ ఖర్చులకు డబ్బును సమకూర్చుకుంటున్నారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రామారావు వివరించారు. -
ఏపీ బీజేపీ నేతపై విరుచుకుపడ్డ హీరో
ఈ మధ్య హీరో సిద్దార్థ్‌కు అధికార పార్టీ బీజేపీతో అసలు పడటం లేదు. కొంతకాలం నుంచి బీజేపీని విమర్శస్తూ సిద్దూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా, బయట జరిగిన సంఘటనలను అనుసంధానిస్తూ బీజేపీని విమర్శిస్తూ వస్తున్నాడు. ఇక వాటిని బీజేపీ ఖండించినప్పటికి సిద్దూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండ రివర్స్ అటాక్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని, అది బీజేపీ పనే అని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రోజురోజుకు ఈ వివాదం ముదురుతూనే ఉంది. ఈ తరుణంలో నిన్న తమిళనాడు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను కసబ్‌తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సిద్దూ. ఇదిలా ఉండగా తాజాగా మరో బీజేపీ నేతపై సిద్దార్థ్ విరుచుకుపడ్డాడు. ఏపీ బీజేపీ స్టేట్ సెక్రటరీ విష్ణువర్థన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై అతడు నిప్పులు చేరిగాడు. ‘మీరు నటించిన సినిమాలకు దావూద్ ఇబ్రహీం ఫండ్స్ ఇస్తాడట కదా.. ఇది నిజమేనా సమాధానం చెప్పండి సిద్దార్థ్’ అంటూ ఆయన ప్రశ్నించాడు. దీంతో సిద్దూ స్పందిస్తూ.. దావూద్ ఇబ్రహీం ఎప్పుడు తన టీడీఎస్ చెల్లించలేదన్నాడు. ఎందుకంటే తాను క్రమం తప్పకుండా టాక్స్ కడతానని, తనకు ఏ మాఫియాడాన్లు టాక్స్‌లు కట్టరంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా విష్ణువర్థన్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో సిద్దూ తీరుపై బీజేపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. No ra. He wasn't ready to pay my TDS. I am a perfect citizen and tax payer kadha ra Vishnu. Velli paduko. BJP State secretary anta. Siggundali. 🤦🏾 https://t.co/kF67IukEfw — Siddharth (@Actor_Siddharth) May 6, 2021 చదవండి: బీజేపీ ఎంపీ తేజస్విపై సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్ -
తిరుపతి సభలో రాళ్ల విసిరారు అంటూ చంద్రబాబు డ్రామా : విష్ణువర్ధన్ రెడ్డి
-
చంద్రబాబుపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్..
సాక్షి, అమరావతి: ఏబీఎన్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో తనపై జరిగిన దాడి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్థన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడిపై ఆయన నిప్పులు చెరిగారు. ‘‘అధికారం కోసం నాడు వైశ్రాయ్ హోటల్లో తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌పై చంద్రబాబు జరిపిన దుశ్చర్య పరంపర ఏబీఎన్ చర్చా కార్యక్రమం వరకు మీ కుట్రకోణం కొనసాగుతూనే ఉంది. భౌతిక దాడులతో బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన’’ అంటూ మండిపడ్డారు. ప్రజల తరఫున ప్రశ్నించడంలో తాను వెనకడుగు వేసేదిలేదని, ఇటువంటి దాడులకు తాము బెదిరేది లేదన్నారు. ‘‘అణగారిన వర్గాలను అడ్డుపెట్టుకుని మీ నీచపు రాజకీయ సంస్కృతితో మా గొంతునొక్కడం అసాధ్యం. ప్రజా సమస్యలపై మరింత రెట్టింపుగా ఇక ముందూ నా వాణి వినిపిస్తానంటూ’’ ఆయన ట్వీట్ చేశారు. తన మీద, తమ పార్టీ మీద మీ అనుకూల సామాజిక మాధ్యమాల ద్వారా చేసే తప్పుడు ప్రచారం ఇకనైన మానుకుంటే మంచిదని విష్ణువర్థన్‌రెడ్డి హితవు పలికారు. చదవండి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై బహిష్కరణ.. పచ్చనేతల కొత్త ఎత్తుగడ! -
డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య
చక్కగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ప్రేమ పెడదారి పట్టింది. ప్రేమించిన తోటి విద్యార్థినిపై అనుమానం పెనుభూతమైంది. విచక్షణ పోయింది. రాక్షసత్వం ఆవహించింది. ఆమెను గొంతునులిమి చంపేశాడు. గుంటూరు జిల్లాలో బుధవారం ఈ దారుణం జరిగింది. డిగ్రీ చదువుతున్న యువకుడు తోటి విద్యార్థినిని దారుణంగా హత్యచేశాడు. నరసరావుపేట రూరల్: గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం డిగ్రీ విద్యార్థిని అనూష (19) హత్యకు గురైంది. సహ విద్యార్థి మేడా విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటనను జీర్ణించుకోలేని అనూష కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థులు మృతదేహంతో సహా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రాత్రి పదిగంటల సమయంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట ప్రభాకరరావు, వనజ దంపతుల కుమార్తె అనూష నరసరావుపేటలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. రోజూ కళాశాల బస్సులో ఇంటిదగ్గర నుంచి వచ్చి వెళుతోంది. బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడా కోటిరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఆమెతోపాటే చదువుతున్నాడు. కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. వారిమధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పథకం ప్రకారమే.. రోజూలాగే బుధవారం కళాశాల బస్సులో నరసరావుపేట వచ్చిన అనూష పాలకేంద్రం సెంటర్ వద్ద దిగింది. కాలేజీకి వెళుతున్న ఆమెను విష్ణువర్ధన్‌రెడ్డి ఆటోలో రావిపాడు వైపు తీసుకెళ్లాడు. మెయిన్‌రోడ్డుపై ఆటో దిగి గోవిందపురం మైనర్ కాలువ వైపు నడిచి వెళుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే అనుమానంతో రగిలిపోతున్న విష్ణువర్ధన్‌రెడ్డి ఆవేశంతో అనూష గొంతు పట్టుకున్నాడు. పైశాచికంగా గొంతుపట్టుకున్న అతడి చేతుల్లో ఆమె విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది. ఆమె మృతదేహాన్ని కాలువలోని గుర్రపుడెక్క మధ్య పడేసిన విష్ణువర్ధన్‌రెడ్డి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అతడి నుంచి వివరాలు సేకరించిన రూరల్ సీఐ వై.అచ్చయ్య, ఎస్ఐలు రోశయ్య, బాలకృష్ణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థుల ఆందోళన నిన్నటివరకు తమ మధ్య తిరిగిన అనూష దారుణ హత్యను తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో వారు ఆస్పత్రి నుంచి అనూష మృతదేహాన్ని పల్నాడు బస్టాండ్ సెంటర్‌కు తీసుకొచ్చి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాస్తారోకోకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారి ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. నరసరావుపేట సబ్‌కలెక్టర్ శ్రీవాసు నుపూర్ అజయ్‌కుమార్, డీఎస్పీ విజయకుమార్ ఆందోళన చేస్తున్నవారితో చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాలను వారికి తెలిపారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాత్రి పదిగంటల సమయంలో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై దిశ చట్టం కింద కేసు నమోదు అధికారులను ఆదేశించిన సీఎం జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నరసరావుపేటలో కళాశాల విద్యార్థిని అనూష హత్యకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్న ముఖ్యమంత్రి.. అనూష కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచి వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. బాధ్యులపై దిశ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని, విచారణ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నేరస్తులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బాబు తీరు’
చిత్తూరు అగ్రికల్చర్: విశాఖ ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరు విజయ డెయిరీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన సొంత కంపెనీ హెరిటేజ్ అభివృద్ధి కోసం చిత్తూరు డెయిరీని మూసివేశారన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అన్న దానిపై అందరం ఏకీభవిస్తున్నామన్నారు. సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు విజయ డెయిరీని మూసివేసిన బాబుకు నేడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. -
ఎన్నికల యాప్‌పై రహస్యమెందుకు?
సాక్షి, అమరావతి: ఎన్నికల యాప్‌కు సంబంధించి తలెత్తిన అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాప్ వివరాలను ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘కేంద్ర ఎన్నికల సంఘం లాగా ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణనలోకి తీసుకుంటారా? సహజంగా ఇలాంటి వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అదీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంటుంది. మరి ఈ ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారు? ఈ యాప్ విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచారు? ఇది ఎన్నికల సెల్ పర్యవేక్షణలో తయారైందా? లేదా? అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిది. ఇది ఒక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. వాస్తవమేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది’ అని విష్ణువర్ధన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఉండవల్లి వ్యాఖ్యలు దేశభద్రతకే ముప్పు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అర్థం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల విమర్శించారు. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి వ్యాఖ్యలను ఖండించకపోతే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందన్నారు. వివేకానంద, అంబేడ్కర్ రచనలను వక్రీకరించారని.. ఈ అంశాలపై చర్చకు రావాలని ఉండవల్లికి సవాల్ విసిరారు. -
‘ఆ యాప్‌పై ప్రచారం జరుగుతోంది.. క్లారిటీ ఇవ్వండి!’
సాక్షి, అనంతపురం : పంచాయతీ ఎన్నికల యాప్‌పై ఎస్ఈసీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని, వాస్తవాలు ఏంటో బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ పంచాయతీ ఎన్నికల యాప్ గురించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గారు వివాదానికి తెరదించండి. ఈ యాప్ విషయంలో వివరాలను రహస్యగా ఉంచాల్సిన అవసరం ఏంటి? యాప్ ఎన్నికల సెల్ పర్యవేక్షణలో ఉందా?.. తయారైందా లేదా అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిది. ఒక వేళ ఈ యాప్ ఎన్నికల సెల్ పర్యవేక్షణలో ఉంటే.. ఈ ’యాప్’కు రికార్డింగ్ మెసేజ్‌లు, ఫొటోలు, ఫిర్యాదులు పంపవచ్చా? కేంద్ర ఏన్నికల సంఘం లాగా ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణిస్తారా?. ( నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా ) సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐటీసీ)గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారు? 3,249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన పోలింగ్ జరగబోతుంది. కొందరు దీని మీద ఒక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అని ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటో బహిరంగంగా ప్రజలకు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది’’ అని పేర్కొన్నారు. -
భవిష్యత్తులో తిరుపతి ఐఐటీది కీలక పాత్ర
ఏర్పేడు (చిత్తూరు జిల్లా): తిరుపతి ఐఐటీ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం మేర్లపాక రెవెన్యూ పరిధిలో –ఉన్న తిరుపతి ఐఐటీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.514 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. డీఆర్డీవో లాంటి డిఫెన్స్ ఆర్గనైజేషన్‌తో కలసి పనిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో కొత్త పరిశోధనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు తొత్తులు కమ్యూనిస్టులు
నెల్లూరు(బారకాసు): మాజీ సీఎం చంద్రబాబు ఆడించినట్లు కమ్యూనిస్టు నేతలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. తమ పార్టీ ఆస్తులను పెంచుకునేందుకే కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీపై సీపీఎం, సీపీఐ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 303 సీట్లు గెలుపొందిన బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గు చేటని తెలిపారు. ఏపీలో బీజేపీని వ్యతిరేకించండని కమ్యూనిస్టులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఇచ్చిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసి..మళ్లీ కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని తమ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిందని స్పష్టం చేశారు. -
టీడీపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది..
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీది ముగిసిన అధ్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ పార్టీయో... జాతి పార్టీయో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘టీడీపీలో కొత్త ఉద్యోగంలో చేరిన అచ్చెన్నాయుడు మాకు సలహాలిస్తున్నారు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. టీడీపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది. బీజేపీకి ఉచిత సలహాలు, సూచనలు అవసరం లేదు. చంద్రబాబు హయాంలో 40 ఆలయాలు కూల్చేశారు. (‘అప్పుడు అంతు చూస్తా, తోక కోస్తా అన్నారు’) ఇక మా భుజాల మీద మిమ్మల్ని మోసే శక్తిలేదు. బీజేపీది రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర. పూటకోమాట మాట్లాడే తీరు టీడీపీ నాయకుది. మీ పార్టీ ఏపీ దాటిపోయి తెలంగాణ చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉంటూ హైదరాబాద్ వరదలపై నోరు మెదపని నాయకుడు చంద్రబాబు. దోచేసి రెస్ట్ తీసుకుని బయటకు వచ్చిన నాయకుడు ఆయన. బీజేపీకి ఉచితం సలహాలు సూచనలు అవసరం లేదు. 50 వేల ఖరీదు చీర కట్టుకుని ఉద్యమాలు చేసే నాయకురాలు కూడా మమ్మలి విమర్శిస్తున్నారు. స్క్రోలింగ్ వీరుడు మరొకరు ఉదయం అరున్నరకే లేచి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారు. మరొకరు తానే మేధావి అన్నట్లు మాట్లాడుతారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. (మొన్న గౌతు శిరీష.. నేడు ప్రతిభా భారతి) -
బీజేపీ నేత విష్ణుకు క్వారంటైన్ నోటీసు
సాక్షి, కదిరి: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లి వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డిని హోం క్వారంటైన్ చేశారు. ఈ మేరకు బుధవారం అధికారులు ఆయన ఇంటికి నోటీసును అతికించారు. నాలుగు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. కాగా అధికారులు నోటీసులిచ్చేందుకు వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో ఉండి కూడా తాను లేనని చెప్పడంతో నోటీసు గోడకు అతికించాల్సి వచ్చిందని కదిరి తహసీల్దార్ మారుతి తెలిపారు. నోటీసు ధిక్కరించి ఎక్కడికైనా వెళ్లాలని ప్రయత్నిస్తే ఆయనపై కేసు నమోదు చేస్తామని పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు. రెడ్‌జోన్ కర్నూలు నుంచి వచ్చినందున ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. (వెంటాడుతోంది..@30) నోడల్ అధికారికి షోకాజ్ నోటీస్ కరోనా పాజిటివ్ కేసుల వివరాలు అనధికారికంగా బయటకు రావడాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు తీవ్రంగా పరిగణించారు. కోవిడ్–19 కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారిగా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడుకు గురువారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. జిల్లాలో ఒకే రోజు 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, మొత్తంగా జిల్లాలో 44 పాజిటివ్ కేసులున్నాయని పేర్కొంటూ బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ నుంచి ఓ నోట్ అనధికారికంగా బయటకు వచ్చింది. వాస్తవంగా జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా.. కేసుల సంఖ్య 42కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా అనధికారికంగా వివరాలు బయటికి వెల్లడి కావడం.. అది కూడా తప్పుడు సమాచారం కావడంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై సంజాయిషీ కోరుతూ కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!) -
ఎన్నికలకు ముందే చంద్రబాబు చేతులెత్తేశారు
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ముందే చేతులు ఎత్తేశారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారని విమర్శించారు. కోరోనా అంటూ ఎన్నికలను వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరడాన్ని విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. ఎన్నికలకు భయపడే చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో లేకపోయినప్పటికీ.. కరోనా అంటూ టీడీపీ అధికార ప్రతినిధులు విపక్షాలను బలహీన పరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. -
'నా పేరుతో అసభ్యకర పోస్టులు చేస్తున్నారు'
ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. అసభ్యకర పోస్టులు చేస్తూ.. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన రాజకీయ ప్రత్యర్థులను కఠినంగా శిక్షించాలని ఈ మేరకు ఫిర్యాదు చేశానని నెహ్రూ యువ సంఘటన వైస్ ఛైర్మన్, ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు 360, ట్విటర్, టేక్ వన్ మీడియా యూట్యూబ్ ఛానల్ పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ట్విటర్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పోస్టులు పెడుతుండడంపై వాపోయారు. ఈ మేరకు తన పేరిట ఫేక్ ట్విటర్ అకౌంట్ నడుపుతున్న వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇతర కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉండి వైరల్ అవుతోన్న కథనాలకు.. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి జత చేయడంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసు కమీషనర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. -
‘వల్లభనేని వంశీకి బీజేపీ ఆహ్వానం’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ భవిష్యత్‌లో ఏ పార్టీతోను కలవదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీజేపీతో కలవాలని ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ, టీడీపీకి బీజేపీలో గేట్లు మూసేశామని వెల్లడించారు. టీడీపీ, జనసేన లిమిటెడ్ పార్టీలని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన పార్టీకి సంస్థాగత నిర్మాణమే లేదని చురకలంటించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతున్నామని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. ప్రజాక్షేత్రంలో బలం ఉన్న నాయకులు సగానికి సగం మంది బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బుధవారం జరగనున్న ముగింపు యాత్రలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పాల్గొంటారని వెల్లడించారు. సంకల్పయాత్రలో లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. (చదవండి : టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా) వర్మని బహిష్కరించాలి ‘రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఏపీలో రిలీజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. సాంఘిక దూరాచారానికి రాంగోపాల్ వర్మ చేస్తున్న పనికీ తేడాలేదు. సంచలనం కోసం, చిల్లర ప్రచారం కోసం రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వర్మ వ్యవహరిస్తున్నాడు. వర్మని ఏపీలో బహిష్కరించాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది’ అని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. -
చంద్రబాబు లోకేష్‌లు ఏపీని భ్రష్టుపట్టించారు
-
చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వం: సత్యమూర్తి
సాక్షి, గుంటూరు: ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆయన భార్యపై సైతం విమర్శలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును భవిష్యత్తులో కూడా తమ దగ్గరకు రానివ్వమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి అన్నారు. టీడీపీతో కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. చచ్చిపోయిన పార్టీని బతికించుకోవటానికే చంద్రబాబు ఇప్పుడు మోదీపై ప్రశంసలు కురిపిస్తూ నాటకాలకు తెరతీశారని దుయ్యబట్టారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నవంబరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన పలువురు నేతలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని పేర్కొన్నారు. భారీ చేరికల భయంతోనే చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాగా 2019 ఎన్నికలకు ముందు తాను కేంద్రంతో(పార్టీ పేరు ఎత్తకుండానే) విభేదించామని, ఇదంతా ప్రజల కోసమే చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజలు బాగానే ఉన్నారు గానీ.. తాము మాత్రం నాశనమయ్యామని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా బీజేపీతో పొత్తుకు సిద్ధమనేలా సంకేతాలు వెలువరించారు. బాబు ప్రస్ట్రేషన్‌లో ఉన్నారు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు వీధి రౌడీల భాష మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఘోర ఓటమితో నైరాశ్యంలో మునిగిపోయిన బాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసు అధికారులను సైతం ఇష్టారీతిన బెదిరిస్తున్నారని... ఆయనపై కేసు పెట్టాలని పేర్కొన్నారు. అధికారంలో ఉండగా ఒకరకంగా.. లేకపోతే ఇంకోలా మాట్లాడటం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కేశినేని నానిపై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దేశ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు టీడీపీ పార్లమెంటులో మద్దతు ఇచ్చిందని అన్నారు. అయితే, ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అసహనం వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. ట్విటర్ ద్వారా నాని చిల్లర ప్రచారం పొందుతున్నారని ధ్వజమెత్తారు. జమ్మూకశ్మీర్ రాజకీయాలు ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. ఆర్థికంగా చితికిపోయిన కేశినేని ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. బెజవాడ ప్రజలు ఆయనను ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నామా అని సిగ్గుపడుతున్నారని అన్నారు. సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ పాకిస్తాన్ ఏజెంట్లలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ వేస్తున్న బిస్కట్ల కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారని చురకలంటించారు. పాకిస్తాన్, చైనాకు మద్దతుగా మాట్లాడే కమ్యూనిస్టులు దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు. కాశ్మీర్ తో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కాశ్మీరీలు చూపించే ప్రేమ, అభిమానం, వినయ ,విధేయతలు నిజంగా మనకు ఆశ్చర్యం కలుగతుంది. కాశ్మీర్ భూతల స్వర్గం. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కాశ్మీర్‌కు ,దేశానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి pic.twitter.com/axVl3A8qt0 — Kesineni Nani (@kesineni_nani) August 6, 2019 -
‘ఓటమి తర్వాత ఏపీ ప్రజల్ని తిట్టకండి’
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు ఎవరి దగ్గరికి వెళ్లినా వాళ్లందరికీ మిమ్మల్నే ప్రధాని చేస్తానని అంటున్నారు.. లాలూ ప్రసాద్ యాదవ్‌కి తప్ప దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులకి ప్రధానిని చేస్తానని మాట ఇచ్చారని ఎద్దేవా చేశారు. టీడీపీ చరిత్రలో బీజేపీ లేకుండా ఎప్పుడైనా గెలిచిందా అని విష్ణువర్దన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని రకాల సర్వే సంస్థలు చెప్పాయి.. ఇది ఓర్చుకోలేని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇంకా ప్రజల్ని మభ్యపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ దేశంలో సొంతంగా అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇంత హడావిడి చేయడం లేదు..కానీ ప్రజల సొమ్ముతో చంద్రబాబు మాత్రం ఇంకా హడావిడి చేస్తున్నారు. బాబును రాజకీయ దళారీగా అందరూ చూడాల్సిన అవసరముంది. 2014లో మాతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ని నమ్మాలని అన్నాడు. అదే వ్యక్తి ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ను తప్పు పడుతూ సర్వే సంస్థలను తిడుతున్నాడ’ని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘1984లో టీడీపీకి సర్వే చేశాను అని చంద్రబాబు అంటున్నారు. కానీ ఆయనకు మతిమరుపు అనుకుంటా.. అప్పుడు బాబు గారు కాంగ్రెస్‌లో ఉన్నారు.. అంటే అప్పటి నుంచే వెన్నుపోటు రాజకీయాలు ఆరంభించారా అని అడుగుతున్నా. ఢిల్లీలో చంద్రబాబును దేఖే వారు లేరు.. ఆయన వస్తే భయపడుతున్నారు. ఎందుకు బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అడుగుతున్నా. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా బాబు ఆగడం లేదు. ఓటమి తర్వాత ఈవీఎంలను, ఏపీ ప్రజలను తిట్టకండి అని కోరుతున్నా. మీరు పిలిచి ఏర్పాటు చేసిన మీటింగ్‌కు ఎందుకు డీఎంకే చీఫ్ స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామి రావడం లేద’ ని ప్రశ్నించారు. ‘ఎన్నికల తర్వాత ఆంధ్రాలో టీడీపీ ఆఫీసు గాంధీ భవన్‌గా మారుతుంది. చంద్రబాబు ఒక ఐరన్ లెగ్.. ఎక్కడ ఆయన అడుగుపెడితే అక్కడ అంతా నాశనం. ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మేలు అని సలహా ఇస్తున్నాం. టీడీపీ వాళ్ల ప్రెస్ మీట్లు సినిమా వినోదాన్ని అందించే విధంగా ఉన్నాయ్. లగడపాటి సర్వేలో టీడీపీ గెలుస్తుందని చెబుతూనే.. బెట్టింగ్‌లో జగన్ గెలుస్తారని టీడీపీ కిందిస్థాయి నాయకులు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఫలితాల అనంతరం టీడీపీ పెద్ద ఎత్తున అల్లర్లు చేసేవిధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ఫలితాల తర్వాత అల్లర్లు జరగకుండా ఈసీ, పోలీసులు భద్రత ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాను. ఇంత తప్పుడు పనులు చేసే బాబును దేశద్రోహి అనడంలో తప్పేం లేదని అనిపిస్తోంది. ఆయన బీజేపీ నుంచి దూరంగా వెళ్లి మాకు న్యాయం చేశారు. మీరు(బాబు) వస్తా అంటే బీజేపీ గేట్లు మూసేస్తామన’ని నొక్కి వక్కాణించి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : టీడీపీ చరిత్రలో బీజేపీ లేకుండా ఎప్పుడైనా గెలిచిందా -
టీడీపీ చరిత్రలో బీజేపీ లేకుండా ఎప్పుడైనా గెలిచిందా
-
చంద్రబాబు తానే డీజీపీ లాగా మాట్లాడటం ఏంటి..?
-
‘ఆయన చనిపోతే సీబీఐ అన్నారు..కానీ’..
సాక్షి, హైదరాబాద్ : ‘కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏపీకి రాకుండా జీవోలు ఇస్తారు.. గతంలో పరిటాల రవి చనిపోతే సీబీఐ ఎంక్వయిరీ కావాలన్నారు.. కానీ ఈ మధ్య జరిగే ఘటనలకు మాత్రం సీబీఐ దర్యాప్తు వద్దంటున్నార’ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దురదృష్టవశాత్తు హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్లలో ఎక్కడ కూడా, ఏ రాజకీయ పార్టీ హత్యా రాజకీయాలు చేయలేదన్నారు. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి కూడా అదే హత్యారాజకీయానికి బలయ్యారని తెలిపారు. రాయలసీమను స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని అనుకోవడం లేదన్నారు. ఏదో విధంగా ఈ ఎన్నికలు వాయిదా పడాలని చూస్తున్నారని, ఇదంతా కుట్రగా.. వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య వార్‌గా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న రాత్రి మీడియా సమావేశంలో తానే డీజీపీ లాగా, పోలీసులాగా మాట్లాడటం ఏంటి..? వారు మాట్లాడే అంశాలు తానే చెప్తున్నారు అంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికలు వాయిదా వేయాలనే అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అదనపు బలగాలు ఆంధ్రప్రదేశ్‌కు రావాలని. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు ఏం చేసినా సిట్ వేస్తారు.. ఓటుకు నోటు కేసులో సిట్.., లోకేష్ తెలంగాణలో డేటా దొంగిలిస్తే సిట్.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాస్త బాబు ఆఫీస్‌లో సిట్ అంటే కూర్చోవడమే అంటూ ఎద్దేవా చేశారు. నిజాయితీగా పని చేసే పోలీసులు పని చేయలేకపోతున్నారన్నారు. ఏపీలోనే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు వద్దంటే సింగిల్ జడ్జ్ విచారణ అయినా చేపించాలని కోరారు. బాబుకు, టీడీపీ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. పోలీసులు కేసును సుమోటోగా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గవర్నర్‌ను కూడా బాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. -
‘ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటోంది’
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన ఆధార్, బ్యాంక్ అకౌంట్ల డేటా అంతా తప్పుడు మార్గంలో దొంగ కంపెనీలకు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటోందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దొంగ సీఎం అని, తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కలుగజేసుకుని సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. ఒక జర్నలిస్టు సమాచార శాఖ మంత్రిగా ఉన్నా కూడా.. జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే చెందుతుందని విమర్శించారు. ప్రజల సొత్తును, ప్రజల డేటాను దోచుకునే దొంగల కేంద్రంగా తెలుగుదేశం పార్టీ తయారైందని దుయ్యబట్టారు. కాపలాదారుడే దొంగగా తయారై ఏసీబీ, సీబీఐ, ఈడీలను రాష్ట్రంలోకి రావద్దంటూ బుకాయిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తికాని భవనాలు, రహదారులకు ఓపెనింగులు చేస్తూ హిందూపురం ప్రజలను మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘సీఎంను ప్రశ్నించినందుకు చంటిబిడ్డ తల్లిని’..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినందుకు చంటిబిడ్డ తల్లిని జైల్లో బంధించారని, అంతు చూస్తా, ఫినిష్ అయిపోతారు అనే మాటలు వాడి చంద్రబాబు మరో చింతమనేని, జేసీ, బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్ స్థాయికి దిగజారారని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ నేతలను సీఎం బెదిరించిన 24 గంటల్లోనే.. కన్నా ఇంటిమీద దాడి జరిగిందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీ రాజకీయాలు చేసేవారు కాల గర్భంలో కలిసిపోతారని అన్నారు. దాడి చేసిన గూండాలను అరెస్ట్ చేస్తూ.. బీజేపీ నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల మీద దాడి చేసి, హత్యాయత్నం చేసిన జేసీ అనుచరులను ఆదర్శంగా తీసుకున్నారా.. ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగితే.. మీ కుటుంబ సభ్యులే! అన్న రాజేంద్రప్రసాద్ మీకు ఆదర్శమా.. ప్రధాని నరేంద్రమోదీని లోఫర్ అన్న నక్కా ఆనంద బాబు మీకు ఆదర్శమా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ ప్రకటన చేసిన 24 గంటల లోపే కన్నా మీద దాడి జరిగిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుని మీద పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ గుంటూరులో సాధారణ మైనారిటీలను కూడా.. ప్రశ్నించినందుకు చిత్ర హింసలు పెట్టలేదా. 40 ఏళ్ల అనుభవం ఇదేనా మీది. నాయీ బ్రాహ్మణులు ఆదుకోమని వస్తే బెదిరించారు. కేసీఆర్ మాట్లాడితే సైలెంట్‌గా నటిస్తున్నారు అంటే.. ఓటుకు నోటు కేసులో మీరు దొంగ అని తెలిపోయింది. చంద్రబాబు రైతు ద్రోహిగా మిగిలిపోతాడు. జగన్ మీద హత్యాయత్నం జరిగితే ఎయిర్‌పోర్టు మాది కాదు కేంద్రం చేతిలో ఉంది అన్నాడు. ఇప్పుడు ఎన్ఐఏకి కోర్టు ఇస్తే.. టీడీపీ నాయకులు భయపడి పోతున్నారు. అగ్రిగోల్డ్ కేసు కూడా సీబీఐకి ఇస్తారు అనగానే ఎందుకు భయపడుతున్నారు. అయేషా మీరా కేసు సీబీఐకి కోర్టు ఇచ్చింది. భూముల కుంభకోణంపై హైకోర్టు పిల్ స్వీకరించిందంటే.. తన కేసులు విచారణకు రాకుండా ఉండటానికి కోర్టు అమరావతికి రావొద్దు అన్నారు. చంద్రబాబు దోచుకుని, దాచుకుంటే.. ప్రజలు రక్షణ ఉండాలా. 2014లో బీజేపీతో కలిసే అధికారంలోకి వచ్చారు. 90 రోజుల్లో అధికారం పోతుంది కాబట్టి మీ దోపిడీ బయటకు వస్తుందని మీ భయం. అమిత్‌షా, మోదీ వస్తున్నారంటే.. శాంతి భద్రతలు సరిగా లేవని దొంగ నివేదిక ఇచ్చారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది. జనవరి 18న అమిత్‌షా రాయలసీమ వస్తున్నారు.. ఆపండి చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో సింగపూర్ తరహా జైలు కట్టుకోండి. 90 రోజుల తర్వాత మీ అడ్రస్ అక్కడే ఉంటుంద’’ని ఎద్దేవా చేశారు. -
‘టీడీపీకి దమ్ముంటే అమిత్‌షాను అడ్డుకోండి!’
సాక్షి, కర్నూలు : సినీనటుడు శివాజీ తెలుగుదేశం పార్టీ రాజకీయ దళారి.. టీడీపీ ముసుగు ధరించిన పొలిటికల్ బ్రోకర్ అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ బీజేపీలో కలిసేందుకే టీడీపీ నేతలు బీజేపీ కేంద్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. 6వ విడత జన్మభూమి పేరుతో టీడీపీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వేల సంఖ్యలో ప్రజల అర్జీలు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో అసంపూర్తిగా మిగిలిపోయాయని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అగ్రిగోల్డ్ కుంభకోణం ఏపీలో జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు టీడీపీ మంత్రివర్గం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ నెల 18న అమిత్‌షా రాయలసీమలో అడుగు పెడుతున్నారని, టీడీపీ వాళ్లకు దమ్ముంటే అమిత్‌షాను అడ్డుకోమనండి అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అవినీతి జరగకపోతే టీడీపీ.. సీబీఐని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. -
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని టీడీపీ తాకట్టు పెట్టింది
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం కాంగ్రెస్‌తో చేతులు కలిపి తెలుగు వారి ఆత్మ గౌర వాన్ని తాకట్టు పెట్టిందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారమిక్కడ బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ నుంచి బయటికొచ్చామని చెబుతున్న సీఎం చంద్రబాబు..కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు కలపడంతో ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి ఖర్చు చేసిన నిధులపై కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. -
అబద్ధాల మీద టీడీపీ పాలన సాగిస్తోంది
హైదరాబాద్: ఏపీలో టీడీపీ ప్రభుత్వం అబద్ధాల మీద పాలన సాగిస్తోందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడుతూ..కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ఏపీ ప్రజలను, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసానికి పాల్పడుతోందని అన్నారు. ఉక్కు పరిశ్రమపై గతంలో నాలుగు సార్లు సమావేశం పెట్టాం..కానీ టీడీపీ ప్రభుత్వం రాయలసీమలో ఉక్కు పరిశ్రమ పెట్టకూడదని అనుకుంటుందని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ విషయంలో టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి కోర్టులో కేసు కూడా వేశారు..ఈ మధ్య సీఎం రమేశ్‌తో దీక్ష చేయించారని వ్యాఖ్యానించారు. బరువు తగ్గాలంటే దీక్షలు చేయాలని ఈ నడుమ టీడీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఇలాంటి దొంగ దీక్షలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ వేసి 10 సార్లు ఢిల్లీ వెళ్లింది.. కానీ టీడీపీ ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నం చేసిందా అని సూటిగా అడిగారు. టీడీపీ నేతలకు నిజాయితీ ఉంటే సక్రమంగా ప్రయత్నించాలి..ఉక్కు పరిశ్రమకు కేంద్రమే రూ.20 వేల కోట్లు ఇస్తుందని తెలిపారు. కానీ టీడీపీ నేతలు తుక్కు పరిశ్రమ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షాలు తిరిగే పరిస్థితి లేదని, రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిన అవసరం కనబడుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులపై ఏపీలో దాడులు జరుగుతున్నాయని, ఈ విషయమై బీజేపీ బృందం మంగళవారం గవర్నర్‌ని కలుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతుంది.. కానీ ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. టీడీపీ పాలన బాగుందని చెప్పుకుంటున్నారు కదా పంచాయతీ ఎన్నికలపై ఎందుకు పారిపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. -
అత్యుత్తమ సేవల్లో నం.1
హైదరాబాద్: ‘ఏ’కేటగిరీ పాస్‌పోర్టు కార్యాలయాల్లో (ఏడాదికి 5 లక్షలకు పైగా పాస్‌పోర్టులు అందించేవి) ఒకటైన హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అత్యుత్తమ సేవలు అందించి 2017– 18 సంవత్సరానికి మొదటి స్థానం దక్కించుకుంది. బుధవారం సికింద్రాబాద్‌లో హైదరాబాద్ ప్రాంతీ య పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి మీడి యాకు వివరాలు వెల్లడించారు. వేగంగా పాస్‌పోర్టు అందించడం, పెండింగ్‌లను తగ్గించడం, ఫిర్యాదులను పరిష్కరణ తదితర అంశాలను పరిశీలించి విదేశీ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రకటించినట్లు చెప్పా రు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ను కేవలం 4 రోజుల్లోనే పూర్తి చేస్తున్న రాష్ట్ర పోలీసులు కూడా అత్యుత్తమ సేవల్లో మొదటి స్థానం దక్కించుకున్నారన్నారు. మూడోసారి రాష్ట్ర పోలీసులు ఈ అవార్డు అందు కుని హ్యాట్రిక్ సాధించారన్నారు. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే అఖిల భారత పాస్‌పోర్టు అధికారుల సదస్సులో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఈ అవార్డును అందిం చనున్నట్లు వివరించారు. అలాగే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించిందన్నారు. దేశంలో మొత్తం 214 పీవోపీఎస్‌కేలు ఉండగా రాష్ట్రంలో 7, ఏపీలో 13 ఉన్నాయన్నారు. పీవోపీఎస్కేల్లో దరఖాస్తు తీసుకుంటున్నా.. అవి హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చాకే జారీ ప్రక్రియ జరుగుతుందన్నా రు. ఈ జాప్యాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొదట వరంగల్‌లోని పీవోపీఎస్కేను ఇలా మారుస్తున్నామన్నారు. -
పెద్దమ్మ గుడికి ధర్మకర్తల మండలి.. కోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్టు బోర్డు ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ధర్మకర్తలుగా తమ కుటుంబం ఉండగా ట్రస్ట్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన పిటీషన్లో పేర్కొన్నారు. సదరు పిటిషన్‌పై విచారించిన కోర్టు పెద్దమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై స్టే విధించింది. దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి 1993లో స్థాపించిన ఈ దేవాలయానికి దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పీజేఆర్ హయాం నుంచి ప్రస్తుత విష్ణువర్ధన్‌రెడ్డి వరకు ఆలయం క్రమశిక్షణకు, శుచి, శుభ్రతకు, పటిష్టమైన కార్యనిర్వహణకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఒకే వ్యక్తి పాలనలో ఉండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వివాదాలకు దూరంగా ఉంది. పెద్దమ్మ దేవాలయానికి ధర్మకర్తల మండలి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆలయ యాజమాన్యం ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చింది. అయితే 2018 మార్చి 5వ తేదీన మినహాయింపు గడువు ముగిసింది. మరోసారి ట్రస్ట్ బోర్డు వేయకుండా మినహాయింపునివ్వాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. దీంతో విష్ణువర్థన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. -
రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది
సాక్షి, కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన సీమ అభివృద్ధి కోసం త్వరలో కేంద్ర మంత్రులు, ప్రధాని కడప జిల్లాకు రానున్నారని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చేయకుండా టీడీపీ కంకణం కట్టుకుందని అందుకే దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని కక్ష తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ రాయలసీమ ద్రోహి పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లుగా పరిపాలిస్తున్న చంద్రబాబు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయమని ఏరోజు కేంద్రాన్ని అడగలేదని ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు అడిగినా స్పందించలేదు : బీజేపీతో పొత్తులో ఉన్నప్పడు నాలుగేళ్లుగా ఎందుకు ఉక్కు పరిశ్రమ కోసం నిలదీయలేదని విష్ణువర్ధన్ చంద్రబాబును ప్రశ్నించారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే ఓట్లు వేయయని కడప జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయాలి అన్న వ్యాఖ్యలని ఉటంకిస్తూ, టీడీపీపై నిప్పులు చెరిగారు. 2014 డిసెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని, తిరిగి 2016లో అడిగినా కూడా రాష్ట్ర ఎటువంటి స్పందన ఇవ్వలేదని వెల్లడించారు. ఇప్పటికీ కూడా జిల్లలో ఉక్కు పరిశ్రమ వద్దు అని పరోక్షంగా టీడీపీ నేతలు అంటున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు లో కేంద్రం అఫిడవిట్ దాఖలు విషయంలో అవసరమైన విషయం పక్కన పెట్టి, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు, రెండో రాజధాని పెట్టగలరా? : కడప జిల్లాలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాయలసీమలో టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేయాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. అలానే రాయలసీమలో చంద్రాబాబు హైకోర్టు ఏర్పాటు చేయగలరా అని ప్రశ్నించారు. రాయలసీమను బీజేపీ రత్నాల సీమను చేస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి దమ్ముంటే రాయలసీమలో ఒకజిల్లాను రెండవ రాజధాని చేయాలంటూ సవాల్ విసిరారు. సీమవాసులను రౌడీలుగా చిత్రీకరించారు : రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా రాయలసీమ రౌడీలు వచ్చారంటూ చంద్రబాబు సీమ ప్రజలను గుండాలుగా చిత్రీకరించారని మండిపడ్డారు. కోర్టులను మేనేజ్ చేయించుకోగల శక్తి చంద్రబాబుకు ఉందని, ఆవిషయం ప్రజలు బాగా తెలుసునని అన్నారు. అభివృద్ధి మొత్తం అమరావతిలో పెడితే సీమ పరిస్థితి ఏం కావాలంటూ ప్రశ్నించారు. ఇక్కడి పరిశ్రమలు, సాగు నీటి ప్రాజెక్టులు, ఏమై పోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు రావాలంటూ సవాల్ విసిరారు. -
పెద్దమ్మ గుడికి ధర్మకర్తల మండలి?
సాక్షి, హైదరాబాద్: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదలకు జీవో జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌రెడ్డి ఫౌండర్ ట్రస్టీగా కొనసాగుతున్న ఈ ఆలయానికి ధర్మకర్తలి మండలి వేయడం తొలిసారిగా జరుగుతుండటం గమనార్హం. దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి 1993లో స్థాపించిన ఈ దేవాలయానికి దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రయత్నిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పీజేఆర్ హయాం నుంచి ప్రస్తుత విష్ణువర్ధన్‌రెడ్డి వరకు ఆలయం క్రమశిక్షణకు, శుచి, శుభ్రతకు, పటిష్టమైన కార్యనిర్వహణకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఒకే వ్యక్తి పాలనలో ఉండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వివాదాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే ఏ మేరకు భక్తులు హర్షిస్తారో వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయానికి ధర్మకర్తల మండలి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆలయ యాజమాన్యం ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చింది. అయితే 2018 మార్చి 5వ తేదీన మినహాయింపు గడువు ముగిసింది. మరోసారి ట్రస్ట్ బోర్డు వేయకుండా మినహాయింపునివ్వాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. వీరి లేఖను మంత్రి తిరస్కరించారు. దీంతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. 14 మంది ధర్మకర్తలు... ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం త్వరలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో చైర్మన్ సహా 14 మంది సభ్యులను నియమించేందుకు ఎండోమెంట్ చట్టం వర్తిస్తుంది. ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎండోమెంట్ చట్టం ప్రకారం ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంటుంది. 6(ఏ) కేటగిరిలో ఆలయం... జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయాన్ని దేవాదాయ శాఖ 6(ఏ) కేటగిరిలో నమోదు చేసింది. ‘25 లక్షల నుంచి’ రూ.1 కోటి వరకు వార్షిక నికర ఆదాయం ఉన్న ఆలయాలకు ఫస్ట్ గ్రేడ్ ఈవోను, రూ.1 కోటి పైబడి వార్షిక ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోకి, రూ.1 కోటి నుంచి 3 కోట్లలోపు ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్ హోదా ఈవోను నియమిస్తారు. రూ.3 కోట్లు దాటితే డిప్యూటీ కమిషనర్, రూ.5 కోట్లు పైబడిన ఆలయాలకు జాయింట్ కమిషనర్‌ను నియమిస్తారు. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయం వార్షిక ఆదాయం రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హుండీ ఆదాయం నెలకు రూ.37 లక్షల వరకు ఉంటుంది. ఈ ఆలయం ఫస్ట్ గ్రేడ్ ఈవో పరిధిలో ఉంది. నగరంలోనే పెద్దమ్మ.... జంట నగరాల్లోనే అత్యంత ఆదాయం కలిగిన ఆలయాల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఒకటి. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ స్థాయిలోనే హుండీ ఆదాయం కూడా ఉంటుంది. వారానికి రెండుసార్లు ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆభరణాల్లోనే అమ్మవారు పెద్దమ్మలా నిలుస్తున్నారు. సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ఇతర రాష్ట్రాల్లోని భక్తులను కూడా ఆకర్షిస్తుంటుంది. అమ్మవారి ఆశీస్సుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. నిత్య బోనం... ఎక్కడా లేని విధంగా పెద్దమ్మ దేవాలయం నిత్య బోనాలతో కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో అమ్మవారికి బోనం సమర్పించే వారు బారులు తీరుతుంటారు. భక్తులకు చక్కటి వసతులు కూడా ఏర్పాటు చేశారు. -
వైఎస్సార్సీపీలో చేరిన మైసురా తనయుడు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లాలో సీనియర్ రాజకీయనేత ఎంవీ మైసూరారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనతో పాటు నియోజక వర్గంలోని పలువురు నాయకులు, నేతలు, మరో వంద కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఎర్రగుంట్ల సమన్వయ కర్త సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గొప్పనాయకుడని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు పరిపాలనలో జరిగిన అవినీతిపై విసుగెత్తి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని చెప్పారు. పార్టీలో చేరిన అనంతరం రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు. -
‘వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేకే బీజేపీతో కలిశారు’
-
‘వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేకే మాతో కలిశారు’
సాక్షి, విజయవాడ : 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే చంద్రబాబు నాయుడు తమతో కలిశారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్ జగన్‌పై కేసులు పెట్టారని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే పవన్ కల్యాణ్ ఆరోపణలపై సమాధానం చెప్పాలని సవాలు చేశారు. ఒక్కొక్కొటిగా నిజాలు బయట పడుతుండటంతో చంద్రబాబు ఇతరులపై బురద జల్లుతున్నారని విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు అయోమయంలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు యుటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవసరాన్ని బట్టి చంద్రబాబు నడుచుకుంటారని ఆయన అన్నారు. -
టీడీపీతో కలిస్తే బీజెపీ ఓట్లు,సీట్లు తగ్గుతాయి
-
బీజేపీతోనే 12 స్థానాల్లో గెలుపు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉత్తర భారతదేశంలో హవా నడిపిస్తూ.. దక్షిణాదిన బలపడాలని చూస్తున్న బీజేపీ అనంతలో ఉనికి కోల్పోతోంది. గతంలో బీజేపీ తరపున కదిరి ఎమ్మెల్యేగా పార్థసారధి ప్రాతినిధ్యం వహించగా.. ఇప్పుడు ఆ ప్రాభవం కాస్తా చరిత్రలో కలిసిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తరచూ టీడీపీతో దోస్తీ కట్టడం.. ఒంటరిగా పోటీ చేయలేకపోవడం.. పొత్తులో భాగంగా అనంతలో టిక్కెట్లు దక్కించుకోలేకపోవడం పార్టీ పరిస్థితి దిగజారేందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలోనూ బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటని పరిశీలిస్తే.. టీడీపీతో దోస్తీ కారణంగా మరింత బలహీనపడిన విషయం ఆ పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తు కారణంగా ఆ విషయాన్ని బాహాటంగా వెల్లడించలేకపోతున్నారు. భారతీయ జనతాపార్టీ నుంచి పార్థసారధి కదిరి ఎమ్మెల్యేగా 1999లో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా కదిరి స్థానం బీజేపీకి దక్కింది. ఆ ఐదేళ్లు కదిరితో పాటు జిల్లాలోనూ ఆ పార్టీ కాస్త హడావుడి చేసింది. స్వతంత్రంగా గెలిచే శక్తి, ఆ స్థాయి అభ్యర్థులు పార్టీకి లేకపోయినప్పటికీ కొంత ఓటు బ్యాంకును పోగు చేసుకోగలిగింది. 2004లోనూ బీజేపీ–టీడీపీ కలిసి బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పార్థసారధి బరిలో నిలిచినప్పటికీ టీడీపీ రెబల్ అభ్యర్థి కారణంగా ఓటమిపాలయ్యారు. అయితే ఆ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాత్రం టీడీపీ విజయం కోసం కృషి చేశాయి. 2004లో టీడీపీ ఓటమిపాలైంది. ఆ తర్వాత బీజేపీ–టీడీపీ మధ్య దూరం పెరిగింది. చంద్రబాబునాయుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. చివరకు ‘అనంత’లో పాదయాత్ర సమయంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామని, భవిష్యత్‌లో మళ్లీ పునరావృతం కానివ్వబోమని కూడా పలు వేదికలపై స్పష్టం చేశారు. దీనిపై అప్పట్లో బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ తిరిగి మైత్రీబంధం కొనాసాగించి కలిసి పోటీ చేశాయి. పొత్తులో భాగంగా గుంతకల్లు సీటు బీజేపీకి కేటాయించినా.. పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ తమ అభ్యర్థి కూడా బరిలో నిలపడం గమనార్హం. అయినప్పటికీ బీజేపీ మిగతా స్థానాల్లో టీడీపీకే మద్దతివ్వడం గమనార్హం. అవినీతిపై కూడా పెగలని గొంతు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కొందరు టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. హంద్రీనీవా పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో కూడా అవినీతి చోటు చేసుకుంది. అనంతపురం కార్పొరేషన్లో కూడా భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఏ ఒక్క అవినీతి ఘటనపై బీజేపీ నేతలు నోరు మెదపలేదు. ‘అనంత’ అభివృద్ధి కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ప్రశ్నించలేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో అన్యాయం జరుగుతున్న క్రమంలో, హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లోనూ నిర్లిప్తత ప్రదర్శించారు. వీటన్నింటికీ కారణం పొత్తే. అయితే ‘అనంత’కు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ నేతలు స్పందించకపోవడంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయ లాభం కోసం నిమ్మకుండిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇద్దరినీ ఒకే తీరుగా భావించారు. ఇది బీజేపీకి మరింత నష్టం చేకూర్చింది. ఈ విషయం బీజేపీ నేతలకూ స్పష్టంగా తెలుసు. దీనిపై ‘సాక్షి’ ఆరా తీస్తే టీడీపీ తీరు దారుణంగా ఉందని, దీనిపై స్పందించాలంటే మాకు పొత్తు అడ్డొస్తుందని.. టీడీపీతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా విష్ణువర్దన్‌రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బలపడని పరిస్థితి. ఈ క్రమంలో కనీసం రానున్న ఎన్నికల్లోనైనా గెలుపోటములను పక్కనపెట్టి బరిలో నిలవాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీతోనే 12 స్థానాల్లో గెలుపు.. ప్రతి నియోజకవర్గంలో బీజేపీకి 4–5 శాతం తక్కువ లేకుండా ఓటు బ్యాంకు ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. 2014 ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. చాలా చోట్ల వైఎస్సార్సీపీ నేతలు తక్కువ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఇలాంటి స్థానాల్లో కచ్చితంగా బీజేపీ ప్రభావం ఉంటుందనేది రాజకీయపరిశీలకు వాదన. అయితే ఎన్నికల తర్వాత బీజేపీని టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. కనీసం నియోజకవర్గాల్లో బీజేపీ నేతలకు ఏవైనా పనులున్నా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోని పరిస్థితి. దీంతో బీజేపీ నేతలు టీడీపీ నేతల వైఖరిపై అంతర్గతంగా తీవ్రస్థాయిలో రగలిపోతున్నారు. ఈ సారి పోటీలో ఉంటాం.. 2009 ఎన్నికల్లో ఉరవకొండ మినహా అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో పోటీ చేశాం. 2014లో టీడీపీ పొత్తులో భాగంగా గుంతకల్లు నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించి, తక్కిన స్థానాల్లో టీడీపీ గెలుపునకు కృషి చేశాం. కానీ టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరించి జితేంద్రగౌడ్‌కు బీఫారం ఇచ్చింది. దీంతో మా అభ్యర్థి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉన్నా రెండు పార్లమెంట్ పరిధిలో ఒక్కో అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం అడుగుతాం. పొత్తులో భాగంగా మూడున్నరేళ్లలో మేం నష్టపోయింది లేదు. మా వ్యూహం ప్రకారం బలపడ్డాం. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మేం ఎక్కడా రాజీపడలేదు. అంశాల వారీగా అవినీతిపై ప్రశ్నించాం. – విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ యువజన విభాగం -
దేశంమీద ఎందుకింత కోపం?
కొన్ని రోజులుగా వామపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి నేతల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు చైనాకు అనుకూలంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌కంటే చైనా గొప్ప దేశమని మన ఆర్థిక వ్యవస్థకంటే చైనా ఆర్థిక వ్యవస్థ గొప్పదని మాట్లాడుతూ ఈ దేశంలో ఉండే 125 కోట్ల మంది భారతీయులను అవమానిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ఏదో కిందిస్థాయి నాయకులు మాట్లాడితే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ సీపీఎం చీఫ్ సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ రాష్ట్ర కార్యదర్శి కె. బాలక్రిష్ణన్ చైనాను పొగడటం సగటు భారతీయులు జీర్ణించుకో లేకపోతున్నారు. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్, భారత్ కూటమి చైనాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెక్నాలజీ పరంగా అమెరికా సైతం ఇజ్రాయెల్‌పైన ఆధారపడుతుంది. వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనల ద్వారా ఇజ్రాయెల్ ముందుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇజ్రాయెల్ సహాయంతో కొత్త వంగడాలు తీసుకువచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నది కేంద్రప్రభుత్వం ఆలోచన... దేశీయంగా వ్యవసాయాభివృద్ధికి కమ్యూనిస్టులు వ్యతిరేకమో, అనుకూలమో చెప్పాలి. అమెరికా ఇన్నాళ్లు భారతదేశంలో బలహీన నాయకత్వాలను ఖాతరు చేయకుండా భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి పాకిస్తాన్‌ని ప్రేరేపించి, వారికి ఆర్థికంగా సహకరించి పరోక్షంగా భారత్‌ను ఇబ్బంది పెట్టిన దేశంగా మనకు తెలుసు. మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత అమెరికా భారత్ ఒక బలమైన దేశంగా భావించి మనతో చెలిమి చేస్తున్నది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరంగా ప్రపంచానికి చెప్పి వారికి నిధులు సైతం రద్దు చేసి ప్రపంచంలో పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాము. ఇది మోదీ దౌత్య విజయమే. ఈ సందర్భంలో పాకిస్తాన్ కొంతమంది తీవ్రవాదులను అరెస్టు చేసింది. అనేక దేశాలు అమెరికా చెలిమి కోసం సాగిలపడుతున్నాయి. కానీ అమెరికా భారత్ చెలిమి కోసం సాగిలపడుతుంది. వ్యూహాత్మకంగా అమెరికాతో సంబంధాలను భారత్ చేపడుతుంటే కమ్యూనిస్టులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. చైనా భారతదేశంకంటే గొప్ప దేశమని భజన చేస్తున్న కమ్యూనిస్టు నాయకులు వాస్తవాలను గమనించాల్సి ఉంది. చైనా భారత్‌ను ఒకసారి యుద్ధంలో ఓడించి నేటికీ పాకిస్తాన్‌కు సహకరిస్తూ మనల్ని నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నది. నిత్యం పాకిస్తాన్‌ను రెచ్చ గొడుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా పాక్‌కు సహాయం చేస్తూనే ఉన్నది. అలాంటిది.. చైనాను మనం ఆదర్శంగా తీసుకోవాలని కమ్యూనిస్టులు నీతి సూత్రాలు వల్లిం చడం ఏ దేశభక్తి? చైనా దేశీయంగా బౌద్ధులపై కొనసాగి స్తున్న దాడులు, ముస్లింలను భయభ్రాంతులకు గురిచేయడం, కార్మికులతో 10 నుండి 12 గంటలు గొడ్డుచాకిరి చేయించటం, ప్రతిపక్ష పార్టీలను కాలరాయడం, అవినీతిని ప్రశ్నించిన సొంత పార్టీ నేతలమీద వివిధ కేసులు బనాయించి వేధించడం మనం ఆదర్శంగా తీసుకోవాలా? డోక్లాంలో భారత సైన్యాన్ని ప్రతిరోజూ కవ్విం చడం, అరుణాచల్ సరిహద్దుల్లో రోజూ మన సైన్యాన్ని రెచ్చగొట్టడం, బ్రహ్మపుత్రానది మన దేశంలోకి రాకుండా దారి మళ్లించడం, మన సముద్ర జలాల గుండా సీపీఈసీ కారిడార్‌ను నిర్మించి మన దేశంపై దండయాత్ర ఆలోచనలను ఈ కమ్యూనిస్టులు ఎందుకు వ్యతిరేకిం చడం లేదో ప్రజలకు తెలియాలి. చైనా తన నిధులతో శ్రీలంకలో పోర్టు నిర్మాణం చేసేందుకు శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వెనుక భారత్‌పై దొంగచాటు దెబ్బతీయాలనే ఆలోచన లేదంటారా? మన చుట్టూ ఉన్న చిన్న దేశాలైన నేపాల్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో వ్యాపారం పేరుతో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొని మనల్ని దొంగదెబ్బ తీయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకోవాలా? పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించి స్వేచ్ఛ, పత్రికలు లేని, ప్రజాస్వామ్యంలేని నియంత పాలనను ఆదర్శంగా తీసుకోవాలా? పంచశీల ఒప్పందాల బంధాల్ని తెగదెంచిన చైనాను ఏ ప్రాతిపదికన ఆదర్శంగా తీసుకోవాలో కమ్యూనిస్టులే జవాబివ్వాలి. ఎన్.ఎస్.జి.లో భారత్‌కు వ్యతిరేకంగా చైనా ఒక్కటే అడ్డు పడుతుంటే ఈ కమ్యూనిస్టుల నోళ్లు ఎందుకు పడిపోయాయి? చైనాతో భారత్ పోరాడుతున్న సందర్భంలో ఈ దేశంలోని వామపక్ష పార్టీలు చైనాకు వంత పలికాయి. ఈ ద్రోహాన్ని ఈ దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. నిజానికి కమ్యూనిస్టులకు ఈ దేశంపై గౌరవముంటే ఈ దేశ జాతీయ నాయకుల చిత్రపటాల్ని వారి కార్యాలయాల్లో ఎందుకు ఉంచరు? చేగువేరా, కారల్‌మార్క్స్, లెనిన్, స్టాలిన్.. వీళ్లేనా వీళ్లకు హీరోలు? గాంధీజీ, పటేల్, నేతాజీ, అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ తదితరులెవ్వరూ కారా వీరికి ఆదర్శం? వారి కార్యాలయాలపై ఎందుకు జాతీయ జెండాను ఎగరే యరు? సిద్ధాంతం పేరుతో రాద్ధాంతం చేస్తూ దేశ ఔన్న త్యాన్ని కించపరచడం.. పరాయి దేశాలను, శత్రుదేశా లను కీర్తించడం భారత్‌లో కమ్యూనిస్టులకే సాధ్యం. దేశ వ్యతిరేక చర్యలు చేస్తే చైనా దేశస్తుడు ఆ దేశంలో ఉండ గలడా? అయినా గతి తప్పిన ఆలోచనలతో– భవిష్యత్తును చూడలేని కమ్యూనిస్టులు పంథా మార్చాలి. గుడ్డిగా విమర్శించడం మాని దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. - ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ శిక్షణ విభాగం కన్వీనర్, ఏపీ ఈ–మెయిల్ : mjrinfravishnu@gmail.com -
'ఇక్కడే పడేసి తంతా.. అడ్డొచ్చేది ఎవరు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై అధికార పార్టీకి చెందిన నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. మైనర్ ఇరిగేషన్ జేఈని తీవ్ర పదజాంతో నోటికొచ్చిన్టు దూషించడమే కాకుండా చెప్పుతో దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసి ప్రయత్నించిన సంఘటన తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని బురాన్‌దొడ్డి చెక్‌డ్యాం వద్ద ఎంపీపీ నాగమణమ్మతో ఈ నెల 8న జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తనను పిలవలేదంటూ అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్ మైనర్ ఇరిగేషన్ జేఈ విజయ్కుమర్పై గొడవకు దిగారు. ఫోన్లో తీవ్రంగా దూషించారు. తాజాగా శుక్రవారం గుండ్రేవలలోని క్రిష్ణం దొడ్డి ఎత్తిపోతల పథకం నీటి విడుదల కార్యక్రమానికి టీడీపీ కొడుమూరు నియోజక వర్గ ఇన్చార్జ్ విష్ణువర్థన్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా చంద్రశేఖర్ ఇరిగేషన్ జేఈ ఎమ్మెల్యే మణిగాంధీకి అనుకూలంగా పనిచేస్తున్నాడంటూ విష్ణువర్థన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎదురుపడిన జేఈ విజయ్‌కుమార్‌తో గొడవకు దిగారు. అకాణంగా ఆయనపై తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. ' ఏరా వెధవా నేను సి.బెళగల్ జెడ్పీటీసి సభ్యుడిని, నువ్వు ఇక్కడ ఏపని చేయాలన్నా.. నాకు సమాచారం ఇవ్వాలి. ప్రొటోకాల్ పాటించాలని తెలీదా.. నిన్ను ఇక్కడే పడేసి తంతా నీకు అడ్డొచ్చేది ఎవరు?' అంటూ చెప్పుతీసి జేఈని కొట్టే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న వారు కల్పించుకొని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. గతంలో కూడా ఆయన పలువురు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
'కేసీఆర్ సహృదయంతో ఆలోచించాలి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు రాయలసీమ గురించి ఆలోచించడం లేదని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ... పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతానికి నష్టం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహృదయంతో ఆలోచించాలన్నారు. రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని కేసీఆర్‌ను ఆయన కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతే రాయలసీమ ప్రజలు వలసపోవాలని విష్ణువర్థన్‌రెడ్డి ఆందోన చెందారు. -
వచ్చే నెలలో ఏపీకి అమిత్ షా
రాజమహేంద్రవరం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. మార్చి 6న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నబీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్ర సహాయంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, పార్టీ బలోపేతం చేసేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. -
విష్ణు వర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులోవాదోపవాదాలు పూర్తయిన అనంతరం విష్ణు వర్ధన్ కు బెయిల్ లభించింది. ఈ రోజు ఉదయం విష్ణు బెయిల్ కు సంబంధించి వాదనలు జరిగినా.. న్యాయమూర్తి తన నిర్ణయాన్నిమధ్యాహ్నానికి వాయిదా వేశారు. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై విష్ణు, మరికొందరు దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ ను అడ్డుకునే యత్నం చేశారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణుకు బెయిల్ మంజూరు చేసింది. -
విష్ణు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులోవాదోపవాదాలు శుక్రవారం పూర్తయ్యాయి. న్యాయమూర్తి తన నిర్ణయాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై విష్ణు, మరికొందరు దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్ ముంజూరు చేయవద్దని కోరారు. అయితే విష్ణు బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. -
'విష్ణు, వంశీల గొడవ పార్టీకి సంబంధం లేదు'
హైదరాబాద్: కాంగ్రెస్ యువ నాయకులు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిల మధ్య జరిగిన గొడవ పార్టీకి సంబంధం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గొడవ జరిగిన రోజు ఇద్దరితో మాట్లాడానని పొన్నాల చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ పెళ్లి సందర్బంగా విష్ణు, వంశీ గొడవ పడి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం విష్ణు గాంధీభవన్‌లో పొన్నాలను కలిశారు. గొడవ విషయం ప్రస్తావనకు రాలేదని పొన్నాల, విష్ణు చెప్పారు. తమ గొడవకు పార్టీకి సంబంధం లేదని విష్ణు చెప్పారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించేందుకు పొన్నాలను కలిసినట్టు వివరించారు. -
దాడి కేసులో విష్ణుకు నోటీసులు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 37మంది ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాన్ని మాదాపూర్ పోలీసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు... విష్ణు సహా కొంతమంది దాడి చేసినట్లు గుర్తించారు. దాంతో విష్ణుకు నోటీసులు ఇచ్చారు. కాగా ఈనెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
విష్ణుపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు
హైదరాబాద్ : కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి చేసిన కేసులో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విష్ణుకు నోటీసులు జారీచేయనున్న పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 37 మంది సాక్ష్యులను ప్రశ్నించారు. కాగా ఈనెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా... ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరించారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం. విష్ణు, వంశీచంద్ రెడ్డి పరస్పర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
విష్ణుపై చర్యలకు పోలీసులు సిద్ధం
-
వంశీ నా చెవిలో దూషించాడు...
హైదరాబాద్ : కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వివాదం మరింత ముదురుతోంది. వీరిద్దరి మధ్య జరిగిన పంచాయితీ ...పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లింది. నిన్న మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వంశీచంద్-విష్ణు నిన్న షుర్షణ పడిన విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరూ హైకమాండ్‌కు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విష్ణు మాట్లాడుతూ వంశీచంద్ తన దగ్గరకు వచ్చి చెవిలో దూషించాడని అన్నారు. మరోవైపు ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఈరోజు మధ్యాహ్నం వంశీచంద్ రెడ్డి నివాసానికి వెళ్లారు. గొడవలు పడవద్దంటూ హితవు పలికారు. అనంతరం వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ తాను విష్ణును దూషించలేదని...దాడి చేసిందే కాకుండా...మళ్లీ తనపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేసింది సీసీ కెమెరా పుటేజ్‌లో తెలుస్తుందన్నారు. -
కాంగ్రెస్ యువ నేతల పోట్లాట
పరస్పరం దాడి చేసుకున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ కేంద్రంలో ఘటన హైదరాబాద్: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే.. ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన యువ నేతలు.. ఓ పెళ్లిలో ఎదురుపడి చేయి చేయి కలిపారు.. అంతలోనే ఏదో గలాటా మొదలైంది.. వాదులాటలు.. తోపులాటలు జరిగాయి.. ఆ తర్వాత సీన్ పోలీస్‌స్టేషన్‌కు మారింది. నాపై దాడి జరిగిందంటే.. నాపై దాడి జరిగిందంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లింది.. ఇదంతా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మధ్య జరిగిన వ్యవహారం. మాదాపూర్ ఏసీపీ రమణకుమార్, బాధితులు తెలిపిన ప్రకారం... మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి బావమరిది లలిత్ శశాంక్‌రెడ్డి వివాహం శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. మధ్యాహ్నం పెళ్లి వేడుకకు హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మండపం దగ్గరికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు. కానీ అంతలోనే అక్కడ తోపులాట, గొడవ జరిగింది. వెంటనే వంశీచంద్‌రెడ్డి మరికొందరు పార్టీ నేతలతో కలసి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. విష్ణువర్ధన్‌రెడ్డి అకారణంగా తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి తల్లి ఇందిర, సోదరి విజయారెడ్డి, తమ అనుచరులతో కలసి అదే పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమ పెళ్లికి వచ్చిన వంశీచంద్‌రెడ్డి షేక్‌హ్యాండ్ ఇవ్వడంతోనే దాడి చేసి తన మెడపై, వీపుపై కొట్టాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. వంశీచంద్ గన్‌మన్ మజీర్ స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. వారి ఫిర్యాదుల మేరకు విష్ణువర్ధన్‌రెడ్డిపై 324, 506, 342 సెక్షన్ల కింద... వంశీచంద్‌రెడ్డిపై 341, 323, 290, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ తెలిపారు. కాగా.. టీ సీఎల్పీ నేత జానారెడ్డి వంశీ, విష్ణు మధ్య రాజీ కుదిర్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు అంశమే.. ఈ వివాదానికి కారణమై ఉంటుందని యూత్‌కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అకారణంగా దాడి చేశారు: వంశీచంద్‌రెడ్డి ‘‘వంశీ అని పలుకరించడంతో విష్ణువర్ధన్‌రెడ్డికి షేక్‌హ్యాండ్ ఇచ్చాను. కానీ ఆయన వేళ్లు విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. చెయ్యి లాక్కుం టుండగా ముఖంపై దాడి చేశాడు. నా గన్‌మన్ రక్షణగా వస్తే అతనిపైనా దాడి చేశాడు. విష్ణు వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు. ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అయినా దాడి ఎందుకు చేశారో ఆయన్నే అడగాలి.’’ ఉద్దేశపూర్వకంగా కొట్టాడు: విష్ణువర్ధన్‌రెడ్డి ‘‘షేక్‌హ్యండ్ ఇవ్వడంతోనే వంశీచంద్‌రెడ్డి నా మెడ, వీపుపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడు. అతని వెంట ఉన్న గన్‌మన్ నా వైపు తుపాకీ చూపి బెదిరించాడు. వంశీతో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నాపై దాడి ఎందుకు చేశాడో అతనే స్పష్టం చేయాలి. వంశీపై టీ పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశాను.’’ -
సీసీటీవీ చూడండి.. తప్పెవరిదో తెలుస్తుంది!
-
నా చేతి వేళ్లు విరిచి.. దాడి చేశారు: వంశీచంద్ రెడ్డి
విష్ణువర్ధన్ రెడ్డి తనను పిలిచి, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చేతివేళ్లు విరిచేశారని, దాదాపు 30-40 మంది వచ్చి తనపై దాడి చేశారని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. విష్ణు ప్రవర్తన, వ్యక్తిత్వం, ఆలోచనా విధానం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు రవీందర్ రెడ్డి, ఆయన కొడుకు సుమధుర్ రెడ్డిలపై జరిగిన సంఘటన అందర చూశామని, అవన్నీ వాస్తవాలేనని అన్నారు. శుక్రవారం నాడు తాను పెళ్లి కూతురి తరఫు ఆహ్వానంతో పెళ్లికి వెళ్తుంటే ఆయనే తనను పేరుపెట్టి పిలిచారని, దాంతో తాను సంస్కారంతో చెయ్యిచ్చి విష్ చేశానని.. కానీ అతడు తన వేళ్లను విరగ్గొట్టే ప్రయత్నం చేశాడని వంశీ ఆరోపించారు. రెండు సెకన్ల తర్వాత తనకు విషయం తెలిసి చెయ్యి లాక్కునే ప్రయత్నం చేశానని, అంతలోనే సడన్‌గా దాడి చేశారని అన్నారు. తన కళ్లద్దాలు కూడా పగిలిపోయాయని, తనకు సైట్ ఉంది కాబట్టి ఏం జరిగిందో కూడా తెలియలేదని, అంతా బ్లర్ అయిపోయిందని వంశీ చెప్పారు. తన మీద దాడి చేస్తుంటే.. ప్రభుత్వం తనకు కేటాయించిన గన్‌మన్ రక్షణగా రావడంతో అతడిని పట్టుకున్నారన్నారు. 30-40 మంది కలిసి తన మీద దాడి చేశారని, దాంతో పెళ్లికి వచ్చినవాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారని తెలిపారు. జరిగిన వాస్తవాలను తాను పోలీసులకు చెప్పి న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. ఎన్ కన్వెన్షన్‌లో సీసీటీవీ కెమెరా ఫుటేజి ఉంటుందని, దాన్ని బహిర్గతం చేస్తే ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో తేలిపోతుందని అన్నారు.ఈ సంఘటనలో కచ్చితంగా న్యాయం గెలవాలని, ఎవరిది తప్పయితే వారికి శిక్ష పడాలని ఆశిస్తున్నానని తెలిపారు. చట్టాలపైన, ప్రజాస్వామ్య విలువలపైన తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. -
వాళ్ళిద్దరి కేసులను నమోదు చేసుకున్నాం
-
పీజేఆర్ కొడుకుని.. నాకూ పౌరుషం ఉంది!
''నేను హైదరాబాద్ వాడిని.. పీజేఆర్ కొడుకుని.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులున్నాయి. మాక్కూడా పౌరుషం ఉంటుంది. గొడవ పడాలంటే చెప్పండి... మైదానంలో గొడవపడదాం'' అని జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడు, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డితో జరిగిన ఘర్షణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వంశీచంద్ రెడ్డికి తమవైపు నుంచి ఆహ్వాన పత్రిక వెళ్లలేదని, మరి ఎవరివైపు నుంచి వెళ్లిందో తనకు తెలియదని విష్ణు అన్నారు. తన బావమరిది పెళ్లి జరుగుతుండగా విష్ణు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, మెడమీద రెండు దెబ్బలు కొట్టారని, తాను ఏంటని అడిగేలోపే వాళ్ల గన్ మన్ వచ్చి తుపాకి బయటకు తీశాడని అన్నారు. తనను బెదిరించడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. వంశీ చంద్ రెడ్డి అసలు తనతో ఎందుకు గొడవపడ్డారో తెలీదని, మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఎందుకు గొడవ పెట్టుకున్నారో తెలియదని అన్నారు. బావమరిది పెళ్లిలో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. తమకూ పౌరుషం ఉంటుందని, గొడవ పడాలంటే మైదానంలో పడదామని అన్నారు. ఆయనా పోలీసులకు ఫిర్యాదుచేశారు, తాను కూడా చేశానని విష్ణు చెప్పారు. -
పెళ్లిలో విష్ణు-వంశీచంద్ రెడ్డి మధ్య ఘర్షణ
-
పెళ్లిలో విష్ణు-వంశీచంద్ రెడ్డి మధ్య ఘర్షణ
హైదరాబాద్ : ఓ పెళ్లి వేడుక ... తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణకు వేదిక అయ్యింది. కాంగ్రెస్ మాజీ, తాజా ఎమ్మెల్యేలు శుక్రవారం బాహాబాహీకి దిగారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి బావమరిది పెళ్లిలో ..విష్ణువర్థన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిల మధ్య వివాదం కాస్త ముదిరి చివరకు కొట్టుకునే వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే విష్ణు బావమరిది పెళ్లికి వంశీచంద్ రెడ్డి శుక్రవారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని ...వంశీచంద్ రెడ్డి గన్ మెన్ పక్కకు తప్పుకోవాలని సూచించాడు. ఆగ్రహించిన విష్ణు... గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. దాంతో వంశీచంద్ రెడ్డి.. విష్ణుతో వాగ్వివాదానికి దిగారు. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటనలో వంశీచంద్‌రెడ్డి గాయపడగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై విష్ణువర్థన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వంశీ ఎందుకు చెయ్యి చేసుకున్నారా అని తాను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ యూత్ కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోలేదని, అలాంటిది తానంటే ఆయనకు ఎందుకు అంత కోపమో తెలియలేదని చెప్పారు. మరోవైపు.. అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను ఇప్పుడు ఈ వివాదం మరింత ఆందోళన కలిగిస్తోందని విష్ణు తల్లి శోభ వాపోయారు. తన బిడ్డను చంపాలని కొంతమంది చూస్తున్నట్లు ఆమె ఆరోపించారు. -
మేయర్ పదవి తిరిగి కాంగ్రెస్ తీసుకోవాలి
హైదరాబాద్ : సీనియర్ నేతలు పరస్పరం వ్యతిరేకించుకోవటం వల్లే తెలంగాణలో గెలవాల్సిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎంఐఎంతో పొత్తు మేరకు హైదరాబాద్ మేయర్ పదవి తిరిగి కాంగ్రెస్ తీసుకోవాలన్నారు. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లో మైనార్టీలకే కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
బియాస్లో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం
-
బియాస్లో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం
హైదరాబాద్ : హిమాచల్ ప్రసాద్ బియాస్ నదిలో సోమవారం మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన మేడం విష్ణువర్థన్ రెడ్డిగా గుర్తించారు. అతని మృతదేహాన్ని హైదరాబాద్ తరలించనున్నారు. ఇప్పటివరకూ బియాస్ నదిలో 20 మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇంకా గల్లంతు అయిన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరి సగం చెరి సగం చొప్పున చెల్లించాలని న్యాయస్థానం పేర్కొంది. జూన్ 8వ విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
బాబు మాట తప్పితే కాంగ్రెస్ గతే
కావలి: ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజావిశ్వాసాన్ని కోల్పోవటానికి చంద్రబాబుకు తక్కువ సమయమే పడుతుందని వైఎస్సార్సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని ఆర్ఎస్సార్ కల్యాణమండపంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనివిధంగా నామరూపాలు కోల్పోయి 44 ఎంపీ సీట్లకు పరిమితమైందని అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందన్నారు. ఫలితంగా ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారన్నారు. సోనియాగాంధీ పార్లమెంటులో వెనుక వరుస సీటులో కూర్చోవలసిన దుస్థితి ఆ పార్టీకి నెలకొందన్నారు. బాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు అర్జీలు ఇవ్వడం తప్ప ఎలాంటి నిధులను రాష్ట్రానికి తేలేకపోయారన్నారు. ఇచ్చిన హామీలను ఈసారైనా నిలుపుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులు రుణాలు మాఫీ అవుతాయని భావించారన్నారు. ప్రలోభాలు పెట్టి తమ పార్టీ ఎంపీ ఎస్పీవెరైడ్డిని టీడీపీలో చేర్చుకున్నారన్నారు. వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న నెల్లూరు జెడ్పీ, కార్పొరేషన్, కావలి, ఆత్మకూరు, గూడూరు మున్సిపాలిటీల్లోనూ జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గందరగోళ వాతావరణాన్ని సృష్టించేలా పత్రికల్లో టీడీపీ నేతలు కథనాలు రాయిస్తున్నారన్నారు. అతి విశ్వాసం తమ పార్టీ ఓటమికి ఓ కారణమని చెప్పారు. మొత్తం ఓట్ల సరళిని చూస్తే రెండు పార్టీల మధ్య 5.4 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. ఉపఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందిన సమయంలో వచ్చిన మెజారిటీ ఎంత ఉందో అన్ని ఓట్లు మాత్రమేనన్నారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను గెలవాల్సి ఉండగా, చిన్న తప్పిదాల కారణంగా ఉదయగిరి, కోవూరు, వెంకటగిరిల్లో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలను డబ్బుమయం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. కోట్లాది రూపాయలను ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు పంపి ఈ ఎన్నికల్లో గెలిచారన్నారు. పార్లమెంటు పరిధిలో ఏ వ్యక్తికైనా తాను పరిష్కరించగల సమస్య ఉంటే నేరుగా తనను కలవవచ్చని చెప్పారు. 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్ సీఎం అవుతారన్నారు. అభివృద్ధిలో ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటానన్నారు. అందరి సహకారంతో అభివృద్ధి : ప్రతాప్‌కుమార్‌రెడ్డి అందరి సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానన్నారు. కావలి కాలువను ఆధునీకరించి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూడాలనేది తన లక్ష్యమన్నారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. రామాయపట్నంకు పోర్టు తీసుకొచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. దేశచరిత్రలో లేని విధంగా ఎన్నికలు: విష్ణు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన మూడు నెలల్లో ఎన్నికలు జరిగాయని, అన్ని ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రామాయపట్నంలో పోర్టు వస్తే కావలి కనకపట్నం అవుతుందన్నారు. డబ్బుతో గెలవాలని బీద మస్తాన్‌రావు అనుకున్నాడని, ప్రజలు ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అండగా నిలిచి ఎమ్మెల్యేను చేశారన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు ప్రతిపక్షం నుంచి అసెంబ్లీలో సమాధానం లేదన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడవద్దని, ఏ ప్రాంతంలో కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏడుగురు ఎమ్మెల్యేలం అక్కడికి వచ్చి వారికి అండగా నిలుస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సహకారంతో జిల్లాను అభివృద్ధిపథంలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గోసల గోపాల్‌రెడ్డి, ముసునూరు పీఏసీఎస్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు పోనుగోటి శ్రీనివాసులరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు చీదెళ్ల కిషోర్ గుప్తా, దగదర్తి, బోగోలు మండలాల కన్వీనర్లు తూపిలి పెంచలయ్య, గోగుల వెంకయ్య, అల్లూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు మన్నేమాల సుకుమార్‌రెడ్డి, కావలి రూరల్, బోగోలు, దగదర్తి జడ్పీటీసీ సభ్యులు సోమయ్యగారి పెంచలమ్మ, బాపట్ల కామేశ్వరి, దండా పద్మావతి, నెల్లూరు మాజీ కార్పొరేటర్ మదన్‌మోహన్‌రెడ్డి, నాయకులు కుందుర్తి శ్రీనివాసులు, రాంబాబు, అశోక్‌రెడ్డి, జంపాని రాఘవులు పాల్గొన్నారు. -
రుణమాఫీ త్వరగా చేయండి: విష్ణువర్ధన్‌రెడ్డి
అనంతపురం: రుణమాఫీ పథకంపై రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలల్లోపే ఆ పథకాన్ని వర్తింపజేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సూచించారు. సోమవారం ఆయన అనంతపురంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీల అమలులో టీడీపీ అలసత్వం ప్రదర్శిస్తే ప్రజా క్షేత్రంలో పోరాటానికి తాము వెనకాడమని హెచ్చరించారు. నరేంద్ర మోడీ హవా నడిచినందునే రాష్ట్రంలో టీడీపీ- బీజేపీ కూటమి విజయం సాధించిందని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని, రాష్ట్రంలోనూ నిర్మాణాత్మక పాత్రను పోషించి ఎన్నికల హామీలు అమలయ్యేలా చూస్తామని చెప్పారు. ‘అనంత’ను ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చడానికి నరేంద్ర మోడీకి తమ పార్టీ తరఫున ప్రత్యేక ప్రణాళికను అందజేసినట్లు తెలిపారు. -
అక్కడ టీడీపీ అభ్యర్ధులను ఎందుకు పెట్టారు?
హైదరాబాద్: టీడీపీ అధినేత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పొత్తు ధర్మానికి చంద్రబాబు విఘాతం కలిగించారని విమర్శించారు. బీజేపికి కేటాయించిన గుంతకల్లు, సంతనూతలపాడు, కడప అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉంటే టీడీపీ అభ్యర్ధులను సస్పెండ్ చేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ అధికారిక అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిపై వెంటనే క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల నిన్న డిమాండ్ చేశారు. ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారని రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో ఆ పార్టీ చెప్పిందని, కానీ అలా జరగలేదని విమర్శించారు. నామినేషన్లు ఉపసంహరించుకోని ఆ ముగ్గురు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని.. దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్ సిపిలోకి భారీగా వలసలు
హైదరాబాద్ : వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ గురువారం ఈ పార్టీలో చేరారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన సాధారణ కార్యకర్తలు, నేతలు కూడా పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సన్నిహితుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు (ఎచ్చెర్ల) గురువారం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నీలకంఠంను వెంట బెట్టుకుని వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేర్చారు. విశాఖపట్టణం స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు కూడా పార్టీలో చేరారు. తంగేడు రాజుల కుటుంబానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు రాజా సాగి సీతారామరాజు, రాజా సాగి రామభద్రరాజు (ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ మాజీ ఛైర్మన్) ఇద్దరూ కలిసి సూర్యనారాయణరాజును వెంట తీసుకుని జగన్ వద్దకు వచ్చారు. ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలకు కూడా జగన్ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికే పార్టీలో చేరిన విశాఖపట్టణం (పశ్చిమ) ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. విశాఖపట్టణం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ కూడా ఈ సందర్భంగా ఉన్నారు. కర్నూలు నేతల చేరిక మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెంది మహ్మద్ పాషా (రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సభ్యుడు) ఎస్.చాంద్‌పాషా(జిల్లా వక్ఫ్‌బోర్డు ఛైర్మన్), అక్బర్ సాహెబ్ (జిల్లా వక్ఫ్ కమిటీ సభ్యుడు), హెచ్.కె.మనోహర్ (జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి), మైనారిటీ నేత అమీరుద్దీన్ గురువారం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఇల్లెందు నేత చేరిక ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవిబాబు నాయక్, జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఖమ్మం లోక్‌సభా నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవిబాబును వెంట తీసుకుని వచ్చి పార్టీలో చేర్చారు. -
బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో సాక్షి వేదిక