
ఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. అసభ్యకర పోస్టులు చేస్తూ.. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన రాజకీయ ప్రత్యర్థులను కఠినంగా శిక్షించాలని ఈ మేరకు ఫిర్యాదు చేశానని నెహ్రూ యువ సంఘటన వైస్ ఛైర్మన్, ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు 360, ట్విటర్, టేక్ వన్ మీడియా యూట్యూబ్ ఛానల్ పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కేవలం రాజకీయ కక్షతోనే రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ట్విటర్‌లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పోస్టులు పెడుతుండడంపై వాపోయారు. ఈ మేరకు తన పేరిట ఫేక్ ట్విటర్ అకౌంట్ నడుపుతున్న వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇతర కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉండి వైరల్ అవుతోన్న కథనాలకు.. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి జత చేయడంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసు కమీషనర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.