
సాక్షి, విజయవాడ : 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే చంద్రబాబు నాయుడు తమతో కలిశారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్ జగన్‌పై కేసులు పెట్టారని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే పవన్ కల్యాణ్ ఆరోపణలపై సమాధానం చెప్పాలని సవాలు చేశారు. ఒక్కొక్కొటిగా నిజాలు బయట పడుతుండటంతో చంద్రబాబు ఇతరులపై బురద జల్లుతున్నారని విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు అయోమయంలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు యుటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవసరాన్ని బట్టి చంద్రబాబు నడుచుకుంటారని ఆయన అన్నారు.