
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన ఆధార్, బ్యాంక్ అకౌంట్ల డేటా అంతా తప్పుడు మార్గంలో దొంగ కంపెనీలకు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటోందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దొంగ సీఎం అని, తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కలుగజేసుకుని సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు.
ఒక జర్నలిస్టు సమాచార శాఖ మంత్రిగా ఉన్నా కూడా.. జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే చెందుతుందని విమర్శించారు. ప్రజల సొత్తును, ప్రజల డేటాను దోచుకునే దొంగల కేంద్రంగా తెలుగుదేశం పార్టీ తయారైందని దుయ్యబట్టారు. కాపలాదారుడే దొంగగా తయారై ఏసీబీ, సీబీఐ, ఈడీలను రాష్ట్రంలోకి రావద్దంటూ బుకాయిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తికాని భవనాలు, రహదారులకు ఓపెనింగులు చేస్తూ హిందూపురం ప్రజలను మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment