
చిత్తూరు అగ్రికల్చర్: విశాఖ ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరు విజయ డెయిరీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన సొంత కంపెనీ హెరిటేజ్ అభివృద్ధి కోసం చిత్తూరు డెయిరీని మూసివేశారన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అన్న దానిపై అందరం ఏకీభవిస్తున్నామన్నారు. సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు విజయ డెయిరీని మూసివేసిన బాబుకు నేడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment