
సాక్షి, కర్నూలు: పక్క రాష్ట్రాల్లో తరిమేసిన వారిని కాంగ్రెస్ అధ్యక్షులను చేసిందంటూ.. ఆ పార్టీపై బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షర్మిలను అద్దెకు తెచ్చి పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆంధ్రా ద్రోహులను తెచ్చి ఏపీపై దండెత్తుతారా? అంటూ ధ్వజమెత్తారు.
రాయలసీమకు నీరు ఇవ్వకూడదని తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన సీఎంను తెచ్చి తిరుపతిలో మునిఫెస్టో విడుదల చేయిస్తారట ధ్వజమెత్తారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాజెక్ట్‌లపై వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీ పీసీసీ.. తెలంగాణ కాంగ్రెస్‌ను కోరాలంటూ విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
Comments
Please login to add a commentAdd a comment