పీసీసీ అధ్యక్షురాలి వైఖరితో దూరమవుతున్న పార్టీ కేడర్
తొలివిడత ప్రచారంలో కనిపించిన తులసిరెడ్డి మలివిడతలో లేరు
బీజేపీని దూషిస్తూనే ఆదితో రహస్య మంతనాలు
పార్టీలోనూ.. కుటుంబంలోనూ ఒంటరిగానే..
సాక్షి ప్రతినిధి, కడప: రాజన్న ఉండి ఉంటే రాష్ట్రం విడిపోయే అవకాశం లేదని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వాసులు విశ్వసిస్తున్నారు. ప్రజల ఆకాంక్షతో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించింది. కాంగ్రెస్ అంటేనే ఏపీలో ప్రజలు ఏవగించుకునే పరిస్థితి. అలాంటి పార్టీకి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల వ్యవహారశైలి కూడా ఏకపక్ష ధోరణిని ప్రతిబింబిస్తోంది. జిల్లాలో, రాష్ట్రంలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులు సైతం క్రమంగా దూరమవుతున్నారు. అనతికాలంలోనే వామ్మో షర్మిలఅనే పరిస్థితి తయారైందని పరిశీలకులు భావిస్తున్నారు.
పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా నజీర్ అహమ్మద్ పేరు విని్పంచేది. షర్మిల బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే నజీర్ అహమ్మద్ ఆ పార్టీకి దూరమయ్యారు. రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించి తర్వాత తెలంగాణకు చెందిన ఎస్కే బాషిద్‌ను ఎంపిక చేశారు. కారణాలు వెల్లడించకుండానే అభ్యర్థిని మార్పు చేయడంతో నజీర్ అహమ్మద్ కాంగ్రెస్‌పార్టీకి దూరమయ్యారు. పైగా హైదరాబాద్‌లో స్థిరపడిన బాషిద్ ఎంపిక వెనుక డబ్బు మూటలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కడప నగరానికి చెందిన బండి జకరయ్య పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేసిన సందర్భంలో సైతం ఆ పార్టీ జెండాను జకరయ్య వీడలేదు. పైగా కడప అభ్యరి్థత్వం రాత్రికి రాత్రే మార్పు చేశారు. జయరాజ్ గార్డెన్స్‌లో ఓ టీడీపీ నాయకుడితో ప్రత్యేక భేటీ అనంతరం వైఎస్సార్‌సీపీ నేతగా ఉన్న అఫ్జల్‌ఖాన్ తెరపైకి వచ్చారు. షర్మిల అంటే కాస్తో కూస్తో గౌరవం ఉన్నవారు కూడా ఆమె ఏకపక్ష చర్యలపై విస్తుపోతున్నారు.
తొలి విడత ప్రచారంలో ఉన్న తులసిరెడ్డి ఎక్కడ..?
కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిల తొలివిడత ప్రచారంలో డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి వెన్నంటే పర్యటించారు. జిల్లా వాసులకు పరిచయం చేస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగారు. రెండవ విడత ప్రచారంలో తులసిరెడ్డి ఎక్కడా లేరు. తన కంటే వాగ్దాటి పటిమ ఉన్న తులసిరెడ్డిని కావాలనే దూరం పెట్టినట్లు తెలుస్తోంది. పైగా ఈ మారు షర్మిల పర్యటన కనీస సమాచారం కూడా లేనట్లు విశ్వసనీయ సమాచారం. మరో క్రియాశీలక మైనార్టీ నాయకుడు సత్తార్ పరిస్థితి కూడా అంతే అన్నట్లుగా ఉంది. వీరంతా షర్మిల కంటే ముందు కాంగ్రెస్ గళాన్ని జిల్లాలో విని్పంచిన నాయకులు. ఇప్పుడు వారంతా షరి్మల వ్యవ హార శైలి కారణంగా పట్టుమని పక్షం రోజుల వ్యవధిలో అంటీముట్టనట్లు ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ అంటే మండిపాటు.. ఆదితో రహస్య మంతనాలు..
భారతీయ జనతా పార్టీ అంటేనే పీసీసీ అధ్యక్షురాలు మండిపడుతున్నారు. కానీ జిల్లాలో జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయని, రహస్య మంతనాలు చేస్తున్నారని కాంగ్రెస్ వాదులు వాపోతున్నారు. ఇటీవల షరి్మల భర్త మొరుసుపల్లి అనిల్‌కుమార్ దేవగుడిలో ప్రత్యక్షంగా ఆదితో సమావేశమైనట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు ప్రచారానికి వెళ్లిన ఆమె దేవగుడి సమీపంలో రహదారి పక్కన ఉన్న గోడౌన్ల వద్ద రాజకీయ చర్చలు సాగించినట్లు పలువురు వివరిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరితోనే సమస్య వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కుటుంబంలో ఒంటరిగానే...
వైఎస్ కుటుంబంలో షరి్మల ఒంటరిగా కాంగ్రెస్ పార్టీలో మిగిలారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరులు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూనే మరోమారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ జిల్లా వాసుల మద్దతు కోరుతున్నారు. మేనల్లుడు యువరాజ్, మేనకోడలు దివ్య, సమీప కుటుంబ సభ్యులంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తున్నారు. షర్మిల మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌లో సైతం ఒంటెత్తు పోకడలతో కేడర్‌కు దూరమవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment