అభిప్రాయం
ప్రాంతీయ పార్టీల ఉనికిని జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దానితోపాటు మరికొందరూ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా జమిలి ఎన్నికలే జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌నే ఓ కేస్ స్టడీగా తీసుకుందాం: ఇక్కడ జాతీయ పార్టీలు ఈ కారణంగా బలం పుంజుకున్నాయా? ప్రాంతీయ పార్టీలు ఏమైనా బలహీన పడ్డాయా? ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజలు ఎంచుకునే అంశాల ఆధారంగానే ఓటింగ్ జరుగుతుంది. అంతే కాని జమిలి ఎన్నికల వల్ల కాదని ఈ ఉదాహరణతో అర్థమవుతోంది.
‘వన్ నేషన్ – వన్ ఎల క్షన్’ను వ్యతిరేకిస్తున్న పార్టీల్లో డీఎంకే, టీఎమ్‌సీ, సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి. జమిలీ ఎన్నిక లను ఆ పార్టీలు వ్యతిరేకించడా నికి ప్రధాన కారణం బీజేపీ వ్యతి రేక ధోరణి మాత్రమే. బీజేపీ ఏ పని చేసినా వ్యతిరేకిస్తుంది టీఎమ్‌సీ. సమాజ్ వాదీ పార్టీదీ అదే ధోరణి. దేశంలో మొదటి మూడు ఎన్నికలు జమిలీనే. అప్పుడు ఎందుకు అవి దేశానికి నష్టమనీ, ప్రజాస్వామ్యానికి హానికరమనీ కాంగ్రెస్ ప్రచారం చేయలేదు?
చాలా ప్రాంతీయ పార్టీలు ఈ జమిలి బిల్లును సమర్థిస్తూండటం ఇతర పార్టీల వాదనల్లో పస లేదనడానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన, బీఆర్‌ఎస్, బీజేడీ సహా అత్యధిక పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. గతంలో లా కమి షన్‌కే తమ అనుకూలత తెలిపాయి. మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు లేని భయం... కాంగ్రెస్ మాయలో ఉన్న పార్టీలకు ఉండటానికి కారణం ఏమిటి? ఆ బిల్లును తీసుకొస్తోంది బీజేపీ, ప్రధాని మోదీ కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. కానీ వారు దేశ ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
దేశంలో ఐదేళ్ల పాటు... ప్రతి ఏడాదీ జరుగుతున్న ఎన్నికలకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయిపోతోంది. అదే పదే పదే ఎన్నికలు లేకపోతే రాజకీయ అవినీతి కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చి, దేశమంతటా ఎన్నికలు ఒకేసారి పూర్తి అయితే... అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పాలన మీద, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్ట డానికి వీలవుతుంది.
దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ కేతువులా పట్టి పీడిస్తోంది. దేశం అంతా తమ గుప్పిట్లోనే ఉండాలని చెప్పి అన్ని రకాల వ్యవస్థ లనూ చెరబట్టింది. ఎమర్జెన్సీ విధించడమే కాదు సుప్రీంకోర్టు అధికా రాలనూ తగ్గించడానికి ప్రయత్నించింది. దేశ ప్రజ లను... మతాలు, కులాల వారీగా విభజించి తమ పబ్బం గడుపుకునేందుకు అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ మాయలో ప్రాంతీయ పార్టీలు పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రా యమే బలమైన పునాది అని ప్రధాని మోదీ నమ్మతారు. అది బీజేపీ మూల సిద్ధాంతం కూడా. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపించారు. ఇప్పుడు అన్ని పార్టీలూ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. జమిలి ఎన్నికల విధానం మరింత మెరుగ్గా తీర్చిదిద్దేలా సలహాలు ఇవ్వొచ్చు. అలా చేయడం దేశభక్తి అవుతుంది. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాయ నుంచి బయటకు రావాలి. నిజం తెలుసుకోవాలి. దేశం కోసం జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతివ్వాలి.
ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment