
ఏర్పేడు (చిత్తూరు జిల్లా): తిరుపతి ఐఐటీ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం మేర్లపాక రెవెన్యూ పరిధిలో –ఉన్న తిరుపతి ఐఐటీని శుక్రవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.514 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. డీఆర్‌డీవో లాంటి డిఫెన్స్ ఆర్గనైజేషన్‌తో కలసి పనిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో కొత్త పరిశోధనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment