సాక్షి, హైదరాబాద్: శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్టు బోర్డు ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ధర్మకర్తలుగా తమ కుటుంబం ఉండగా ట్రస్ట్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన పిటీషన్‌లో పేర్కొన్నారు. సదరు పిటిషన్‌పై విచారించిన కోర్టు పెద్దమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై స్టే విధించింది. దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి 1993లో స్థాపించిన ఈ దేవాలయానికి దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పీజేఆర్ హయాం నుంచి ప్రస్తుత విష్ణువర్ధన్‌రెడ్డి వరకు ఆలయం క్రమశిక్షణకు, శుచి, శుభ్రతకు, పటిష్టమైన కార్యనిర్వహణకు కేరాఫ్‌గా నిలుస్తున్నది.
ఒకే వ్యక్తి పాలనలో ఉండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వివాదాలకు దూరంగా ఉంది. పెద్దమ్మ దేవాలయానికి ధర్మకర్తల మండలి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆలయ యాజమాన్యం ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చింది. అయితే 2018 మార్చి 5వ తేదీన మినహాయింపు గడువు ముగిసింది. మరోసారి ట్రస్ట్ బోర్డు వేయకుండా మినహాయింపునివ్వాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. దీంతో విష్ణువర్థన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment