
సాక్షి, అమరావతి: ఏబీఎన్ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో తనపై జరిగిన దాడి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్థన్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడిపై ఆయన నిప్పులు చెరిగారు. ‘‘అధికారం కోసం నాడు వైశ్రాయ్ హోటల్‌లో తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్‌పై చంద్రబాబు జరిపిన దుశ్చర్య పరంపర ఏబీఎన్ చర్చా కార్యక్రమం వరకు మీ కుట్రకోణం కొనసాగుతూనే ఉంది. భౌతిక దాడులతో బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన’’ అంటూ మండిపడ్డారు.
ప్రజల తరఫున ప్రశ్నించడంలో తాను వెనకడుగు వేసేదిలేదని, ఇటువంటి దాడులకు తాము బెదిరేది లేదన్నారు. ‘‘అణగారిన వర్గాలను అడ్డుపెట్టుకుని మీ నీచపు రాజకీయ సంస్కృతితో మా గొంతునొక్కడం అసాధ్యం. ప్రజా సమస్యలపై మరింత రెట్టింపుగా ఇక ముందూ నా వాణి వినిపిస్తానంటూ’’ ఆయన ట్వీట్ చేశారు. తన మీద, తమ పార్టీ మీద మీ అనుకూల సామాజిక మాధ్యమాల ద్వారా చేసే తప్పుడు ప్రచారం ఇకనైన మానుకుంటే మంచిదని విష్ణువర్థన్‌రెడ్డి హితవు పలికారు.
చదవండి:
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై బహిష్కరణ..
పచ్చనేతల కొత్త ఎత్తుగడ!
Comments
Please login to add a commentAdd a comment