సీనియర్ నేతలు పరస్పరం వ్యతిరేకించుకోవటం వల్లే తెలంగాణలో గెలవాల్సిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : సీనియర్ నేతలు పరస్పరం వ్యతిరేకించుకోవటం వల్లే తెలంగాణలో గెలవాల్సిన సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎంఐఎంతో పొత్తు మేరకు హైదరాబాద్ మేయర్ పదవి తిరిగి కాంగ్రెస్ తీసుకోవాలన్నారు. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్లో మైనార్టీలకే కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.