![mim and congress activists clash in asif nagar hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/7/asif-nagar-hyderabad.jpg.webp?itok=U5YuGXXR)
హైదరాబాద్: హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/09_9.jpg)
బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు. ఈ క్రమంలో ఫిరోజ్‌ఖాన్‌పై మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు నేతల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అదుపు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment