Clash erupts
-
MIM MLA Vs ఫిరోజ్‌ఖాన్.. అసిఫ్‌నగర్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు. ఈ క్రమంలో ఫిరోజ్‌ఖాన్‌పై మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు నేతల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అదుపు చేశారు. -
బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ హింసకు దారి తీసింది. టీఎంసీ నేతల అగడాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను పరామర్శించడానికి బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు సందేశ్‌ఖాలీ సందర్శన బయలుదేరారు. #WATCH | Basirhat, North 24 Parganas | West Bengal BJP president Sukanta Majumdar admitted to Basirhat multi-facility hospital after he was injured during Police lathi charge as a scuffle broke out between Police and party workers. pic.twitter.com/8pBr5YxBfN — ANI (@ANI) February 14, 2024 ఈ క్రమంలో సందేశ్‌ఖాలీకి బీజేపీ కార్యకర్తలను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమం పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ స్పృహ తప్పి పడిపోయి గాయపడ్డారు. వెంటనే అతన్ని స్థానిక అస్పత్రికి తరలించారు. అతనికి మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాకు తరలించినట్లు తెలుస్తోంది. ఇక.. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు అక్కడి మహిళపై అఘాయిత్యాకు పాల్పడున్నారని గత కొన్ని రోజులుగా వారు మమతా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ‘ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు’.. మమతాపై స్మృతి ఇరానీ ఫైర్ -
బాగల్కోట్లో చెలరేగిన హింస..ముగ్గురికి కత్తిపోట్లు
సాక్షి,బెంగళూరు: కర్ణాటక బాగల్‌కోట్‌లోని కెరూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ అల్లర్లలో ఓ వర్గానికి చెందిన ముగ్గురిని కత్తులతో పొడిచారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ సమయంలో ఇరువర్గాల వారు ఆగ్రహంతో అక్కడున్న దుకాణాలు, ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. పండ్లు, కూరగాయల బండ్లను కూడా తగలబెట్టారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లతో గాయపడిన ముగ్గురూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు చెందిన 18 మందిని అరెస్టు చేశారు. నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కెరూర్ ప్రాంతంలో గురువారం ఉదయం 8గంటల వరకు 144 సెక్షన్ విధించారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే కొంతమంది యువకులు బస్టాండ్‌లో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. వారిని చూసిన మరో వర్గం వారు ఆగ్రహించడం గొడవకు దారితీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో హిందూ జాగరణ్ వేదికకు చెందిన ముగ్గురిని మరో వర్గం వారు పొడిచినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం అల్లర్లకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టినట్ల పేర్కొన్నారు.