బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు | BJP chief Sukanta Majumdar Injured Clash With Cops Bengal | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు

Published Wed, Feb 14 2024 5:09 PM | Last Updated on Wed, Feb 14 2024 5:52 PM

BJP chief Sukanta Majumdar Injured Clash With Cops Bengal - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ హింసకు దారి తీసింది. టీఎంసీ నేతల అగడాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను పరామర్శించడానికి బెంగాల్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు సందేశ్‌ఖాలీ సందర్శన బయలుదేరారు.

ఈ క్రమంలో సందేశ్‌ఖాలీకి బీజేపీ కార్యకర్తలను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమం పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో బీజేపీ చీఫ్‌ సుకాంత మజుందార్‌ స్పృహ తప్పి పడిపో​యి గాయపడ్డారు. వెంటనే అతన్ని స్థానిక అస్పత్రికి తరలించారు. అతనికి మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాకు తరలించినట్లు తెలుస్తోంది. ఇక.. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్‌, అతని అనుచరులు అక్కడి మహిళపై అఘాయిత్యాకు పాల్పడున్నారని గత కొన్ని రోజులుగా వారు మమతా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ‘ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు’.. మమతాపై స్మృతి ఇరానీ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement