sukanta majumdar
-
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్‌పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్‌నంద్‌గావ్ (ఛత్తీస్‌గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్‌ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్‌కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్‌సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్‌పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్‌నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌రావ్ అడ్సుల్‌పై నెగ్గి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్‌రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్‌సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్‌పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్‌ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్‌స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్‌సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. -
బెంగాల్ బీజేపీ చీఫ్‌కు రోడ్డు ప్రమాదం.. వారిపైనే ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మజుందార్ కాన్వాయ్‌లోని పోలీస్ పైలట్ కారు ఆయన ప్రయాణిస్తున్న కారును అతి వేగంగా ఢీకొట్టింది. నదియా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బీజేపీ వెంటనే స్పందించింది. ఇది అధికార టీఎంసీ కావాలని చేయించిన పనేనని, వారి ఆధ్వర్యంలోని పోలీసులు కావాలని మజుందార్ కారును ఢీకొట్టారని ఆరోపించింది. ఈ ఆరోపణలను టీఎంసీ నేతలతో పాటు పోలీసులు ఖండించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ‘నేషనల్ హైవే 34పై మజుందార్ కృష్ణానగర్ వైపు వెళుతున్నారు. ఆయన వాహనానికి ఎస్కార్ట్‌గా ఉన్న సీఐఎస్ఎఫ్ వాహనం గోబిందాపూర్ సమీపంలో మజుందార్ ఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన వాహనంతో బెంగాల్ పోలీసులకు సంబంధమే లేదు. అయినా కొందరు కావాలని వేరే ఉద్దేశాలతో మాపై ఆరోపణలు చేస్తున్నారు’అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బలూర్ఘాట్ వనుంచి ఎంపీగా ఉన్న మజుందార్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ టికెట్ ప్రకటించింది. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో విచారణ చేయాలని మజుందార్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. రేపు నా రాజీనమా జస్టిస్ అభిజిత్ -
బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ హింసకు దారి తీసింది. టీఎంసీ నేతల అగడాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను పరామర్శించడానికి బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు సందేశ్‌ఖాలీ సందర్శన బయలుదేరారు. #WATCH | Basirhat, North 24 Parganas | West Bengal BJP president Sukanta Majumdar admitted to Basirhat multi-facility hospital after he was injured during Police lathi charge as a scuffle broke out between Police and party workers. pic.twitter.com/8pBr5YxBfN — ANI (@ANI) February 14, 2024 ఈ క్రమంలో సందేశ్‌ఖాలీకి బీజేపీ కార్యకర్తలను రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమం పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ స్పృహ తప్పి పడిపోయి గాయపడ్డారు. వెంటనే అతన్ని స్థానిక అస్పత్రికి తరలించారు. అతనికి మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాకు తరలించినట్లు తెలుస్తోంది. ఇక.. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు అక్కడి మహిళపై అఘాయిత్యాకు పాల్పడున్నారని గత కొన్ని రోజులుగా వారు మమతా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ‘ప్రజలు ప్రేక్షకులుగా ఉండరు’.. మమతాపై స్మృతి ఇరానీ ఫైర్ -
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
కోల్‌కతా: దాదాపు 1,20,000 మందితో కోల్‌కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
బెంగాల్లో మూడేళ్లలోనే ఎన్నికలు.. ‘ముందస్తు’పై బీజేపీ హింట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టి అధినేత్రి మమతా బెనర్జీ పాపులర్ డైలాగ్ ‘ఖేలా హోబ్’(ఆట ఆడదాం)ను తిరిగి టీఎంసీపైనే ప్రయోగిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు ఆట ఆడాల్సి ఉందని పేర్కొంది. తాము అహింసను నమ్ముతామని నొక్కి చెప్పారు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకంతా మజుందర్. అయితే, తమను రెచ్చగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బర్రక్‌పోరాలో నిర్వహించిన బహిర సభలో ఈ మేరకు టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని భరోసా ఇస్తున్నా. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా నేను ఆశ్చర్యపోను.’ అంటూ ముందస్తు ఎన్నికలపై హించ్ ఇచ్చారు బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మజుందర్. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల కేసుల్లో సుమారు 300 మంది టీఎంసీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. మరింత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చిరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నంత వరకు తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీస్ బలగాలు తటస్థంగా ఉండేలా లోక్‌సభలో బిల్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ అప్డేట్.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి -
West Bengal: పశ్చిమ బెంగాల్ బీజేపీలో అనూహ్య పరిణామం
Sukanta Majumdar: పశ్చిమ బెంగాల్ బీజేపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బలూర్ఘాట్ బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్‌ను. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా సోమవారం నియమించింది. దిలీప్ ఘోష్ స్థానంలో నూతనంగా సుకాంత్ను నియమించినట్లు బీజేపీ అధిష్టానం పేర్కొంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుకాంతను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. చదవండి:Sonu Sood: ప్రతి రూపాయి ప్రజల కోసమే: సోనూ సూద్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షులుగా పార్టీ ప్రమోట్ చేసింది. పశ్చిమ బెంగాల్లో మరో పది రోజుల్లో భవానిపూర్‌లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 41ఏళ్ల సుకాంత మజుందార్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2014లో ఆయన బీజేపీలో చేరారు. చదవండి: 24న మోదీ– బైడెన్ భేటీ 2019లో బీజేపీ తరఫున బలూర్ఘాట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలుపొందారు. సెప్టెంబర్ 30న భవానీపూర్‌తో పాటు సంసర్‌గంజ్, జంగిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలను సుకాంతకు ఇటీవల అప్పగించిన విషయం తెలిసిందే. అదే విధంగా భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ప్రియాంక టిబ్రేవాల్ బరిలోకి దించిన విషయం తెలిసిందే.