కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మజుందార్ కాన్వాయ్‌లోని పోలీస్ పైలట్ కారు ఆయన ప్రయాణిస్తున్న కారును అతి వేగంగా ఢీకొట్టింది. నదియా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బీజేపీ వెంటనే స్పందించింది. ఇది అధికార టీఎంసీ కావాలని చేయించిన పనేనని, వారి ఆధ్వర్యంలోని పోలీసులు కావాలని మజుందార్ కారును ఢీకొట్టారని ఆరోపించింది.
ఈ ఆరోపణలను టీఎంసీ నేతలతో పాటు పోలీసులు ఖండించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ‘నేషనల్ హైవే 34పై మజుందార్ కృష్ణానగర్ వైపు వెళుతున్నారు. ఆయన వాహనానికి ఎస్కార్ట్‌గా ఉన్న సీఐఎస్‌ఎఫ్ వాహనం గోబిందాపూర్ సమీపంలో మజుందార్ ఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన వాహనంతో బెంగాల్ పోలీసులకు సంబంధమే లేదు.
అయినా కొందరు కావాలని వేరే ఉద్దేశాలతో మాపై ఆరోపణలు చేస్తున్నారు’అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బలూర్‌ఘాట్ వనుంచి ఎంపీగా ఉన్న మజుందార్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ టికెట్ ప్రకటించింది. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో విచారణ చేయాలని మజుందార్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment