కోల్‌కతా: దాదాపు 1,20,000 మందితో కోల్‌కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు.
కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment