Bengal BJP chief
-
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
కోల్‌కతా: దాదాపు 1,20,000 మందితో కోల్‌కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు. కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్‌బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
బెంగాల్లో మూడేళ్లలోనే ఎన్నికలు.. ‘ముందస్తు’పై బీజేపీ హింట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టి అధినేత్రి మమతా బెనర్జీ పాపులర్ డైలాగ్ ‘ఖేలా హోబ్’(ఆట ఆడదాం)ను తిరిగి టీఎంసీపైనే ప్రయోగిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు ఆట ఆడాల్సి ఉందని పేర్కొంది. తాము అహింసను నమ్ముతామని నొక్కి చెప్పారు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకంతా మజుందర్. అయితే, తమను రెచ్చగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బర్రక్‌పోరాలో నిర్వహించిన బహిర సభలో ఈ మేరకు టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని భరోసా ఇస్తున్నా. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా నేను ఆశ్చర్యపోను.’ అంటూ ముందస్తు ఎన్నికలపై హించ్ ఇచ్చారు బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మజుందర్. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల కేసుల్లో సుమారు 300 మంది టీఎంసీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. మరింత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చిరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నంత వరకు తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీస్ బలగాలు తటస్థంగా ఉండేలా లోక్‌సభలో బిల్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ అప్డేట్.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి -
‘ప్రతీ బుల్లెట్‌ను లెక్కిస్తున్నాం’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జుల్పాయిగురి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్ ఘోష్.. ‘మా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై జరుగుతున్న దాడులను చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తలపై పేలుతున్న ప్రతీ బుల్లెట్‌ను లెక్కిస్తున్నాం. వాటితోనే తిరిగి సమాధానం చెప్తాం. ఇక్కడ బుల్లెట్లకు కరువు లేదు. మేము తలచుకుంటే ప్రతిచోటును ప్రత్యర్థుల శవాలతో నింపేయగలమంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్న దిలీప్ ఘోష్.. ఇకపై హింసాకాండను సహించేది లేదంటూ బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, గతంలో కూడా బెంగాల్ పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక అటువంటి వారందరినీ విధుల నుంచి తొలగిస్తామంటూ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడబోదంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
మరోసారి నోరుపారేసుకున్న బీజేపీ నేత
కోలకతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ మరోసారి రెచ్చిపోయారు. జాదవ్ పూర్ యూనివర్శిటీ వివాదంలో శనివారం మహిళా విద్యార్థినులపై నోరుపారేసుకున్నారు. వివేక్ అగ్నిహోత్రి ఫిలిం.. బుద్ధా ఇన్ ఎ ట్రాఫిక్ జాం ఫిలిం ప్రదర్శన సంబర్భంగా రగిలిన వివాదంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీ విద్యార్థులు సిగ్గులేకుండా, అసభ్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ రక్షణ గురించి అంత బాధ ఉన్నపుడు వివాదం జరుగుతున్న ప్రదేశానికి ఆ మహిళా విద్యార్థినులు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడిన దిలీప్ ఘోఫ్ ఏబీవీపీ నేతలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారటూ ఆరోపించిన విశ్వవిద్యాలయ విద్యార్థినులపై నిప్పులు చెరిగారు. సిగ్గులేకుండా లైంగికంగా వేధించారంటున్నారని వ్యాఖ్యానించారు. వారే ఉద్దేశ్యపూర్వకంగా పురుషులపై పడి, ఇప్పుడు కావాలనే నిందిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆయన ప్రకోపం చల్లార లేదు. వారికి మద్దతు పలకాల్సిన అవసరం లేదనీ, చెప్పులతో కొట్టాలంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. విద్యార్థులకు నిజంగా రాజకీయాలు తెలిసి ఉంటే ప్రజాస్వామికంగా పోరాడాలని, అలా కాకుండా రాజకీయాలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. సానుభూతి సాధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యూనివర్శిటీలో ఈనెల ఆరవ తేదీన బుద్ధా ఫిలిం ప్రదర్శన సందర్భంగా వామ పక్ష విద్యార్థి సంఘానికి, ఏబీవీపీకి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఏబీపీవీ, తమపై లైంగికంగా వేధించిందంటూ కొంతమంది విద్యార్థినులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్తాన్ జిందాబాద్' అన్న వారిని కుత్తుకులు కత్తిరించామని వ్యాఖ్యానించి గత మార్చిలో వివాదాన్ని రగిలించిన సంగతి తెలిసిందే. అటు దిలీఫ్ ఘోష్ వ్యాఖ్యల్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు, మహిళా సంఘ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.