
కోల్‌కతా: రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె కారులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది.
ప్రతికూల వాతావరణం కారణంగా మమతా బెనర్జీ కారులో బర్ధమాన్ నుంచి తిరిగి వస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి ఎదురుగా అకస్మాత్తుగా మరో కారు వచ్చింది. దీంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. దీదీ తలకు స్వల్ప గాయాలు కాగా.. ఆమెను కోల్‌కతాకు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: ఇండియా కూటమికి డబుల్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment