Firoz Khan
-
MIM MLA Vs ఫిరోజ్‌ఖాన్.. అసిఫ్‌నగర్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు. ఈ క్రమంలో ఫిరోజ్‌ఖాన్‌పై మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు నేతల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అదుపు చేశారు. -
చెరువుల పరిరక్షణ... దీర్ఘకాలం కొనసాగాలి!
మునిసిపల్ కార్పొరేషన్ల వంటి వ్యవస్థలు తప్పులు జరిగాయని నిర్ధారణ జరిగినా అనేక రకాల కారణాలు చెబుతూ చర్యలు తీసుకోవడా నికి సాహసించడం లేదు. అదే కొత్తగా వచ్చిన ‘హైడ్రా’ చాలా వేగంగా పని పూర్తి చేస్తోంది. విచారణ, కోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా చెరువులు, కుంటల పరి రక్షణకు; సామాన్యులకు న్యాయం చేసేందుకు ముందుకు సాగుతోంది. అందుకే ఇప్పుడు హైడ్రాలాంటి వ్యవస్థలు కావాలని ప్రతి జిల్లా, ప్రతి మునిసిపాలిటీ నుంచి డిమాండ్లు వస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం, ప్రతినగరం, ప్రతి పట్టణంలో చెరువులు కబ్జా చేసి, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన ఘటనలు కోకొల్లలు. నీటిని మోసుకెళ్లే నాలాలను సైతం వదిలిపెట్టలేదు. చెరు వులు, నాలాలను పూడ్చివేసి బిల్డింగులు కట్టుకు న్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది చెరువులు నామరూపాల్లేకుండా మాయమయ్యాయి. వేలాది చెరువులు సగానికి పైగా కుంచించుకుపోయాయి. నాలాలు నీటిని తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చిన్నపాటి వర్షాలు వచ్చినా కాలనీలకు కాల నీలే నీట మునుగుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.తెలంగాణ మునిసిపాలిటీల చట్టం –2019ను రూపొందించిన అప్పటి ప్రభుత్వం... అందుకు అను గుణంగా ‘టీఎస్ బీపాస్’ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్ అప్లికేషన్ వ్యవస్థను తీసుకువచ్చి ఈజీ చేసింది. అక్రమ నిర్మాణాలపై కూడా ఇందులో ఫిర్యాదు చేసే అవకాశమిచ్చింది. అయితే టీఎస్ నుంచి టీజీ బీపాస్గా మారిన ఈ వ్యవస్థ ప్రస్తుతం అనుమ తులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలపై ఎవరైనా టీజీ బీపాస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు.టీజీ బీపాస్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు పొందుతున్న చాలా మంది వాటికి భిన్నంగా నిర్మా ణాలు చేపడుతున్నారు. ఎలాంటి సెట్ బ్యాక్స్ వదల కుండా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనూ నిర్మాణాలు చేస్తు న్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పర్మిషన్ తీసుకొని రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్న వారు సైతం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణా ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. టీజీ బీపాస్ అమలులో భాగంగా జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఇందులో రెవెన్యూ, పొలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ అధికారులను భాగస్వాములను చేశారు. నేరుగా, పోర్టల్, కాల్‌సెంటర్లు, మొబైల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వీరు మూడు రోజుల్లో పరిశీలన జరపాలి. అక్రమమని తేలితే ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయాలి. కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా వారి నుంచే వసూలు చేయాలి.అంతేకాకుండా స్థలం విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు. మూడేళ్ల జైలు శిక్షకు సైతం చర్యలు తీసుకునే నిబంధనలున్నాయి. నిర్మాణం/లే అవుట్ రిజిస్ట్రేషన్ కాకుండా డీటీఎఫ్సీలు, సబ్ రిజిస్ట్రార్లకు తెలియజేసి... అలాంటి స్థలాలను బ్లాక్ లిస్టులో పెట్టేలా ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇది స్పష్టంగా ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన మునిసిపల్ యాక్ట్ –2019ను సక్రమంగా, కఠినంగా అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే కమిషనర్లు అందుకు సాహసించడం లేదు. ‘గట్స్’ ఉన్న ఒకరిద్దరు అధికారులు ఉన్న చోట అంతో ఇంతో చర్యలు కొనసాగుతున్నాయి. అందుకే రంగ నాథ్ లాంటి అధికారులతో కూడిన హైడ్రా లాంటి వ్యవస్థ ఉంటేనే చెరువులు పరిరక్షించొచ్చనీ, అక్రమ నిర్మాణాలను ఆపవచ్చనీ ప్రజల్లో అభిప్రాయం ఏర్ప డింది. ప్రభుత్వం ఆ డిమాండ్‌కు అనుగుణంగా హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడం మంచిదే. అయితే తాత్కాలిక ఉపశమన చర్యలకు బదులు పట్ట ణాలు, నగరాల్లో కీలకంగా వ్యవహరించే కమిషనర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి... ఇలాంటి చర్యలు ఎల్లప్పుడూ కొనసాగేలా చూడాలి. తప్పులను నిర్ధారించిన తర్వాత చర్యలు తీసుకోలేకపోతున్న కమిషనర్లపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి.– ఫిరోజ్ ఖాన్, వ్యాసకర్త, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, మొబైల్: 96404 66464 -
సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అతడు తన చిన్ననాటి సంగతులను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తండ్రి, స్టార్ హీరో ఫిరోజ్ ఖాన్ చేసిన పని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిపాడు. 'నాన్న హీరోగా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. 1972లో అపర్ధ్ సినిమాతో నిర్మాతగా మారాడు. ఆ సమయంలో నిర్మాతలు అధిక వడ్డీకి అప్పు తీసుకుని చిత్రాలు చేసేవారు. నాన్న కూడా అలానే చేశాడు. అది చూసి మేమంతా భయపడ్డాం.ఆర్థిక ఇబ్బందులుతర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టార్ హీరో కుమారుడిని అని గల్లా ఎగరేసి చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. మా అమ్మ ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్‌గా 9 సంవత్సరాలు పని చేసింది. అమ్మానాన్న ఇద్దరూ మాకోసం కష్టపడేవారు. ప్రతి ఏడాది లాంగ్ వెకేషన్‌కు తీసుకువెళ్లేవారు. కొన్నిసార్లు ఆ వెకేషన్ కూడా ఆపేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బర్త్‌డే పార్టీ కూడా చిన్నగా జరిపేవారు. అలా అని తినడానికి తిండి లేనంత దీన స్థితిలోనైతే లేము అని పేర్కొన్నాడు.దేశం విడిచి పారిపోలేదుఇండస్ట్రీకి 14 ఏండ్లు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. నేను సినిమాలకు దూరంగా ఉన్నమాట వాస్తవమే.. కానీ దేశం విడిచి వెళ్లిపోలేదు. కొన్నాళ్లపాటు అక్కడ ఉండి మళ్లీ ఇండియాకు వచ్చేశాను.. ఇక్కడే ఉన్నాను. కొన్నేళ్ల క్రితం నేను కాస్త లావయ్యాను. నా అవతారం చూసి సినిమాలు పూర్తిగా మానేసినట్లున్నాడని అంతా అనుకున్నారు. నిజంగా 14 ఏళ్లు మూవీస్‌కు దూరంగా ఉండటం నేను చేసిన అతిపెద్ద పొరపాటు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫర్దీన్ ఖేల్ ఖేల్ మే, విస్ఫోట్ సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో -
అసెంబ్లీ నుంచి బహిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఇక రాజాసింగ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మండిపడగా.. రాష్ట్రాన్ని తగలబెట్టి శ్మశానాలు ఏలుతారా అంటూ టీఆర్ఎస్, బీజేపీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మతఘర్షణలు చేయించడానికి సీఎం కుట్ర పన్నుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ నుంచి బహిష్కరించండి శాసనసభ విలువలను దిగజా రుస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని యాకుత్‌పురా ఎమ్మెల్యే(ఎంఐఎం) సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బుధవా రం లేఖ రాశారు. ఎమ్మెల్యేగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి సభ ప్రతిష్టకు భంగం కలిగించిన రాజాసింగ్‌పై రాజ్యాంగంలోని 194వ ఆర్టికల్ నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అధికారం అసెంబ్లీకి ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 22న మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నా యన్నారు. ఈ ఏడాది అసెంబ్లీలోనూ అసంబద్ద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని ఖాద్రి గుర్తు చేశారు. రాజాసింగ్‌ను బహిష్కరించాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మతకల్లోలాలకు దారి తీసేలా, మత ఘర్షణలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సమాజ బహిష్కరణ చేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై బీజేపీ మిడతల దండులా దాడి చేస్తోందని, మత అలజడులను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం భట్టి విలేక రులతో మాట్లాడారు. బీజేపీ నేతల తీరు దేశ సమైక్యత, సమగ్రత, లౌకికవా దానికి పెనుముప్పుగా మారుతోందన్నారు. రాజాసింగ్ తన స్థాయి మరిచి జుగుప్సకర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సమాజహితం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్‌ను కట్టడి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇతర మతా లను గౌరవించాలని, కానీ రాజాసింగ్ అందుకు భిన్నంగా మాట్లాడినందున భారత రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిని జైలుకు పంపండి: రేవంత్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘మత విద్వేషాలు రెచ్చగొట్టి, తాత్కాలిక రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ ఎంతకైనా బరితెగిస్తుందని రాజాసింగ్ మాటలు ధ్రువీకరి స్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని వాస్తవాలను మరుగున పరచడా నికి టీఆర్ఎస్ కృత్రిమంగా సృష్టిస్తోన్న గందరగోళాన్ని కూడా ప్రజలు గమ నిస్తున్నారు’ అని రేవంత్ ఆ ట్వీట్లో వ్యాఖ్యానించారు. రాజాసింగ్‌ను జైలుకు పంపాలి: అసదుద్దీన్ ఒవైసీ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను జైలుకు పంపాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన దారు స్సలాంలో మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ కు బెయిల్ రావడంపై మండిపడ్డారు. పోలీసుల పొరపాటుతో ఆయనకు జైలు తప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దీనిని సరిదిద్దుతారని ఆశిస్తు న్నానని పేర్కొన్నారు. రాజాసింగ్‌పై తీవ్ర ఆరో పణలు ఉన్నాయని, సహించరాని వివాదాస్పద వాఖ్యలతో ఆయన వీడియోను విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా రాజాసింగ్ వైఖరి అసభ్యకరంగా ఉందని ఒవైసీ నిప్పులు చెరిగారు. వివాదాస్పద వాఖ్యలు చేసిన రాజాసింగ్ వాయిస్ శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. వాయిస్ శాంపిల్ నిర్ధారణ ద్వారా బలమైన కేసు పెట్టాలని ప్రభు త్వానికి సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఇలాంటి వాఖ్యలు చేయడం ఇదే చివరిసారి కావాలని పేర్కొన్నారు. నుపుర్‌శర్మ వ్యవహారం నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదని ఆయన దుయ్యబట్టారు. ఎక్కడ కనిపించినా దాడి చేయండి: ఫిరోజ్‌ఖాన్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే హైదరాబాద్ లోని ముస్లింలు రాజాసింగ్ ఎక్కడ కనిపించినా దాడి చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక మతాన్ని కించప రిచేలా మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్య మాల్లో బుధవారం ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫిరోజ్‌ఖాన్ మాట్లాడుతూ.. శాంతి, సమానతలతో ఉన్న హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకుని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. -
అధ్యక్షుడిని కలవడం కోసం వరుడి వేషంలో..
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ మీద రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆజంఖాన్‌కు మద్దతుగా రాంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాంపూర్ ప్రాంతంలో 144 సెక్షన్‌ని విధించారు. అయితే ఆ పార్టీ నాయకుడొకరు ఈ నిషేధాజ్ఞలను వినూత్న రీతిలో ఉల్లంఘించాడు. అఖిలేష్‌ను కలవడం కోసం ఏకంగా పెళ్లి కుమారుడి వేషంలో వచ్చాడు. ఆ వివరాలు.. రాంపూర్‌లో పర్యటిస్తున్న అఖిలేష్‌ను కలవడం కోసం సంభల్‌కు చెందిన ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, కార్యకర్తలతో కలిసి పెళ్లి కుమారుడి వేషంలో వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ‘యోగి ప్రభుత్వం మా పార్టీ ఎంపీని టార్గెట్ చేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఆయన మీద దాదాపు 80 కేసులు పెట్టింది. వాటిల్లో బర్రె, మేక దొంగతనం కేసులు కూడా ఉండటం గమనార్హం. ఇవన్ని నిరాధార ఆరోపణలు. ప్రభుత్వం ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు ఆజం ఖాన్పైనే విశ్వాసం ఉంచుతార’ని పేర్కొన్నాడు. (చదవండి: గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు) ఆజం ఖాన్ ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములతోపాటు పేద రైతులనుంచి వ్యవసాయ భూములను కూడా స్వాహా చేశాడంటూ అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న యూపీ ప్రభుత్వం ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించింది. అలాగే ఖాన్‌కు చెంది మహమ్మద్ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా) వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. -
ఫిరోజ్ ఖాన్‌కు నివాళులు అర్పించిన జగన్
-
ఫిరోజ్ ఖాన్‌కు నివాళులు అర్పించిన జగన్
హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో అమరుడైన ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఫిరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి.... సంతాపం తెలిపారు. నగర మేయర్ మాజిద్ హుస్సేన్ కూడా ఫిరోజ్ ఖాన్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కాగా ఫిరోజ్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. అనంతరం నవాబ్ సాహెబ్ కుంట స్మశాన వాటికలో అధికార లాంఛనాలతో ఫిరోజ్ ఖాన్ అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయాన్ని తోటి ఆర్మీ జవాన్లు ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పాతబస్తీకి తీసుకువచ్చారు. ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంటలో ఫిరోజ్‌ఖాన్ కుటుంబీకులకు పార్థీవ దేహాన్ని అప్పగించారు. కన్నీళ్ళ పర్యంతమైన ఫిరోజ్‌ఖాన్ తల్లి అక్తర్ బేగం, భార్య నస్రీన్ బేగం, ముగ్గురు పిల్లలను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.