ఫిరోజ్ ఖాన్కు నివాళులు అర్పించిన జగన్ | YS Jagan Mohan reddy pays tribute to slain soldier Mohd Firoz Khan | Sakshi
Sakshi News home page

ఫిరోజ్ ఖాన్కు నివాళులు అర్పించిన జగన్

Published Thu, Oct 17 2013 2:21 PM | Last Updated on Mon, Oct 22 2018 8:34 PM

ఫిరోజ్ ఖాన్కు నివాళులు అర్పించిన జగన్ - Sakshi

ఫిరోజ్ ఖాన్కు నివాళులు అర్పించిన జగన్

హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో అమరుడైన ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఫిరోజ్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి.... సంతాపం తెలిపారు. నగర మేయర్ మాజిద్ హుస్సేన్ కూడా ఫిరోజ్ ఖాన్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కాగా ఫిరోజ్‌ భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు. అనంతరం నవాబ్ సాహెబ్ కుంట స్మశాన వాటికలో అధికార లాంఛనాలతో ఫిరోజ్ ఖాన్ అంత్యక్రియలు జరిగాయి.

అంతకు ముందు మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌ భౌతికకాయాన్ని తోటి ఆర్మీ జవాన్లు ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్‌ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పాతబస్తీకి తీసుకువచ్చారు. ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంటలో ఫిరోజ్‌ఖాన్‌ కుటుంబీకులకు పార్థీవ దేహాన్ని అప్పగించారు. కన్నీళ్ళ పర్యంతమైన ఫిరోజ్‌ఖాన్ తల్లి అక్తర్ బేగం, భార్య నస్రీన్ బేగం, ముగ్గురు పిల్లలను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement