సియోల్:రష్యా(Russia) తరపున యుద్ధం చేసేందుకు వెళ్లిన ఉత్తరకొరియా(NorthKorea) సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బందీగా తీసుకువెళ్లాయని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధం చేసేందుకు వేలాది మంది సైనికులను ఉత్తరకొరియా రష్యాకు పంపిన విషయం తెలిసిందే.
రష్యాలోని క్రస్క్ సరిహద్దు వద్ద గతంలో ఉక్రెయిన్ సైనికులు ఒక్కసారిగా రష్యాలోకి చొచ్చుకువచ్చి దాడి చేశారు.ఈ సమయంలోనే ఉత్తరకొరియా సైనికుడిని ఉక్రెయిన్ బలగాలు తీసుకువెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.రష్యాతో జరిగిన యుద్ధంలో వెయ్యి మంది ఉత్తరకొరియా సైనికులు మరణించారని ఇప్పటికే దక్షిణకొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించింది.
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉత్తరకొరియా సైనికులను రష్యా ముందుంచి పోరాడుతోందని తెలిపింది.ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం లేకపోవడంతో ఉత్తరకొరియా సైనికులు భారీగా మృత్యువాత పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment