కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సైనిక దాడులను ఎదుర్కొవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ భావిస్తున్నారు. అందులో భాగంగానే రష్యాపై క్షిపణులను ప్రయోగించేందుకు తమ మిత్రదేశాల నుంచి అనుమతి అవసరమని తెలిపారు. శుక్రవారం సాయంత్రం జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు.
‘‘రష్యా ఉక్రెయిన్ భూభాగంలో ఉత్తర కొరియా సైనికులను ప్రతి స్థావరాలు, వారి అన్ని శిబిరాలను మేం గమనిస్తాం. ఈ పరిస్థితుల్లో దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. మేం రష్యా దాడులకు నివారణగా కచ్చితంగా ప్రతిదాడిచేసే అవకాశం ఉంది. ఉక్రేనియన్లపై దాడి చేయటం కోసం ఉత్తర కొరియా సైన్యం ఎదురు చూస్తోంది.
రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలను దీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలి. అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరం ఉంది. మా వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంటే వారిని అడ్డుకోవడానికి వినియోగిస్తాం’’అని వెల్లడించారు.
చదవండి: ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు
Comments
Please login to add a commentAdd a comment