army troops
-
వారి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మిసైల్స్ కావాలి: ఉక్రెయిన్
కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సైనిక దాడులను ఎదుర్కొవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భావిస్తున్నారు. అందులో భాగంగానే రష్యాపై క్షిపణులను ప్రయోగించేందుకు తమ మిత్రదేశాల నుంచి అనుమతి అవసరమని తెలిపారు. శుక్రవారం సాయంత్రం జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు.‘‘రష్యా ఉక్రెయిన్ భూభాగంలో ఉత్తర కొరియా సైనికులను ప్రతి స్థావరాలు, వారి అన్ని శిబిరాలను మేం గమనిస్తాం. ఈ పరిస్థితుల్లో దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. మేం రష్యా దాడులకు నివారణగా కచ్చితంగా ప్రతిదాడిచేసే అవకాశం ఉంది. ఉక్రేనియన్లపై దాడి చేయటం కోసం ఉత్తర కొరియా సైన్యం ఎదురు చూస్తోంది. రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలను దీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలి. అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరం ఉంది. మా వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంటే వారిని అడ్డుకోవడానికి వినియోగిస్తాం’’అని వెల్లడించారు.చదవండి: ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు -
సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్ ప్రాంతంలో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివాదాస్పద ప్రాంతానికి చేరువలో ఉన్న తమ తమ స్థావరాలకు రెండు దేశాలు భారీ సామగ్రి, ఆయుధ సంపత్తిని తరలిస్తున్నాయి. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోని బేస్‌ల వద్దకు చైనా శతఘ్నులను, పదాతిదళ పోరాట వాహనాలు, భారీ సైనిక సామగ్రిని చేరుస్తోంది. భారత్ సైతం శతఘ్నులు, బలగాలను అక్కడికి పంపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. పాంగోంగ్ త్సో, గాల్వాన్ లోయ తదితర ప్రాంతాల్లో మునుపటి స్థితిని నెలకొల్పే వరకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. వైమానిక దళాలు వివాదాస్పద ప్రాంతంలో కదలికలపై కన్నేసి ఉంచాయి. మే మొదటి వారంలో చైనా 2,500 బలగాలను ఈ ప్రాంతంలోకి తరలించడం, అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన మొదలైంది. తరచూ రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరిగే డెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ చైనా తన బలగాల సంఖ్యను పెంచింది. కాగా, తూర్పు లదాఖ్‌లోని సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో భారత్ సైనికులకు గాయాలయ్యాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సైన్యం స్పందించింది. ‘ఆ వీడియోకు ఎలాంటి ప్రామాణికత లేదు. అక్కడ ఎలాంటి హింస జరగలేదు’అని సైన్యం ప్రకటించింది. -
కూలిన విమానం.. 257 మంది మృతి
-
257 మంది దుర్మరణం
అల్జీర్స్: ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో బుధవారం ఘోర విమాన దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారని రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. విషయం తెలియగానే ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు తరలివచ్చాయి. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించామని అల్జీరియా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2014లో ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మరణించిన అనంతరం జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే. ప్రమాదంపై అల్జీరియా రక్షణ శాఖ ప్రకటన చేస్తూ.. ‘మొత్తం 247 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. రక్షణ శాఖ సహాయ మంత్రి అహ్మద్ సలాహ్ ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణాలపై ఆయన విచారణకు ఆదేశించారు. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇతరులతో కూడిన ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం దక్షిణ అల్జీరియాలోని బౌఫరిక్ నుంచి పశ్చిమ సహారా సమీపంలోని బెచార్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మధ్యలో టిన్డౌఫ్లో విమానం ఆగాల్సి ఉంది. పశ్చిమ సహారా ప్రాంతం ప్రస్తుతం మొరాకో అధీనంలో ఉండగా.. దాని స్వాతంత్య్ర పోరాటానికి అల్జీరియా మద్దతిస్తోంది. 300 మంది అత్యవసర సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, విమానమే మంటల్లో కాలిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఇల్యుషిన్ 2–76 రవాణా విమానం రష్యాలో తయారైంది. గతంలోనూ.. గత ఆరేళ్లలో అల్జీరియాలో అనేక సైనిక, పౌర విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. డిసెంబర్ 2012న రెండు సైనిక విమానాలు ఆకాశంలో ఢీకొనడంతో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 2014న టమన్రస్సెట్ నుంచి కాన్స్టాంటిన్కు ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న సీ–130 హెర్క్యులస్ ఆర్మీ విమానం కూలడంతో 77 మంది మరణించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాదం జరిగిందని అప్పట్లో రక్షణ శాఖ ప్రకటించింది. జూలై, 2014న బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వెళ్తున్న ఎయిర్ అల్జేరీ విమానం ఉత్తర మాలిలో కూలిపోవడంతో 116 మంది మరణించారు. వీరిలో 54 మంది ఫ్రెంచ్ జాతీయులున్నారు. -
ఏడుగురు ఉగ్రవాదులు హతం.. జవాను మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక జవాను వీరమరణం పొందగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా, బందిపోరా, కుప్వారా జిల్లాలో గత రెండు రోజులుగా ఈ ఎన్కౌంటర్ జరుగుతోంది. పలువురు ఉగ్రవాదులను భారత సైనికులపై దాడులు చేసేందుకు నియంత్రణ రేఖ వెంబడి ఉండే పాక్ బలగాలు కుట్రలు చేస్తున్నాయని, వాటిని తాము సమర్థంగా విఫలం చేశామని ఉదంపూర్ కు చెందిన కల్నల్ అధికారి ఎన్ఎన్ జోషి చెప్పారు. -
ప్రత్యేక పోలీసు అధికారులై ఉండి ఉగ్రవాదంలోకి..
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు గత నెల రోజుల వరకు భారత బలగాల్లో ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీవో) పనిచేసినట్లు డిఫెన్స్ పీఆర్వో ఎస్ఎన్ ఆచార్య తెలిపారు. వీరిద్దరు దోడా జిల్లాలో గత సెప్టెంబర్ 6, 7న పోలీసు విధుల నుంచి ఆయుధాలతో సహా తప్పించుకుని వెళ్లి ఉగ్రవాదులతో చేతులు కలిపి అందులో చేరినట్లు వెల్లడించారు. గతంలోనూ వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అప్రూవర్‌గా మారడంతో ఆర్మీకి సహాయం చేసే ప్రత్యేక పోలీసు అధికారుల బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. గురువారం ఉదయం దోడి జిల్లాలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్ కౌంటర్ లేకుండా దోడా జిల్లా గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉండగా గురువారంనాటిదే తొలి సంఘటన. కాల్పుల అనంతరం మృతదేహాలను గులాం నబీ మాంగ్ నూ అలియా మౌల్వీ అలియాస్ గుల్లా టైలర్, మరొకరు రియాజ్‌గా గుర్తించారు. వీరిలో మౌల్వీ లష్కరే తోయిబా జిల్లా కమాండర్‌గా ఉన్న సమయంలో 2010లో పోలీసులకు లొంగిపోయి ఎస్పీవోగా మారాడు. ఇక రియాజ్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ టెర్రరిస్టుగా ఉండి 2010లో ఆర్మీకి లొంగిపోయి ఎస్పీవోగా చేరాడు. లష్కరేతోయిబాలో 2003లో మౌల్వీ చేరగా, హిజ్బుల్ సంస్థలో రియాజ్ 1999 చేరాడు. గత నెలలోనే తిరిగి వారు ఎస్పీవో బాధ్యతల నుంచి తప్పించుకుని ఆయుధాలతో సహా వెళ్లి మళ్లీ ఉగ్రవాద సంస్థలో చేరిపోయినట్లు సైన్యం గుర్తించింది. ఈ క్రమంలో వారి అలికిడి దోడా జిల్లాలో ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్లో వారిద్దరు హతమయ్యారు. ఏకే 47, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్‌ను, ఇతర మందుగుండు సామాగ్రిని పోలీసులు, సైన్యం స్వాధీనం చేసుకుంది. -
ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దోడా జిల్లాలో ఈ ఘటన గురువారం వేకువ జామున చోటుచేసుకున్నట్లు మిలటరీ అధికార ప్రతినిధి తెలిపారు. దోడా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు బలగాలకు సమాచారం అందడంతో స్థానిక పోలీసుల సహాయంతో సైన్యం ఉగ్రవాదులను వేటాడే కార్యక్రమం ప్రారంభించింది. వారిని వెతికే క్రమంలో కొందరు ఉగ్రవాదులు తారసపడగా ఎన్ కౌంటర్ చోటుచేసుకుని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.