ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య దోస్తీ ఏమీ లేదని కాంగ్రెస్ పెద్దలు కుండ బద్దలుకొట్టేశారు.
ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య దోస్తీ ఏమీ లేదని కాంగ్రెస్ పెద్దలు కుండ బద్దలుకొట్టేశారు. జలవిహార్లో సోమవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశం అనంతరం దిగ్విజయ్ సింగ్ సహా పలువురు నేతలు మాట్లాడారు. ఎమ్‌ఐమ్ , బేజీపీ రెండు మతరాజకీయాలు చేసేవేనని, బజరంగ్ దళ్, ఇస్లామిక్ స్టూడెంట్స్ యూనియన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా తెలంగాణ రాజధాని అయిందని చెప్పారు.
ప్రజలకు భ్రమలు కల్పించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో సీఎం కేసీఆర్ లేరని, హామీలపై మాటతప్పినందుకు తల ఎన్నిసార్లు నరుక్కుంటారో కేసీఆర్‌కే తెలియాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్‌కు జలక్ తప్పదని, ఆయన తీరుతో అన్ని వర్గాల ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని పొన్నాల అన్నారు. కేసీఆర్ తీరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.