‘ఎంఐఎం’ అంటే గోడ మీద పిల్లి.. బండి సంజయ్‌ సెటైర్లు | BJP MP Bandi Sanjay Satirical Comments On MIM | Sakshi
Sakshi News home page

‘ఎంఐఎం’ అంటే గోడ మీద పిల్లి.. బండి సంజయ్‌ సెటైర్లు

Published Sun, Jul 28 2024 12:09 PM | Last Updated on Sun, Jul 28 2024 12:45 PM

BJP MP Bandi Sanjay Satirical Comments On MIM

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌. రాష్ట్రంలో ఎంఐఎం గోడ మీద పిల్లిలాంటిది.. ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుంది అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో అక్బరుద్దీన్‌ ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాకుండా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఆదివారం చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అ‍మ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారు.  ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి. గత పాలకులు ఇదే తరహాలో చేస్తే ఏమైందో అందరూ చూశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమ్మవారి టెంపుల్‌ను గోల్డెన్‌ టెంపుల్‌గా మార్తుస్తామన్నారు. నేను హిందువుల తరపున పక్కా మాట్లాడుతా. అలా అని వేరే మతానికి వ్యతిరేకం కాదు.

ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ గోడ మీద పిల్లిలాంటిది. ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీ పక్కన చేరుతారు. అధికారంపోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటారు. అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం చేస్తా అని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. రేవంత్‌, అక్బరుద్దీన్‌ అన్నదమ్ములయ్యారు. దమ్ముంటే అక్బరుద్దీన్‌ కొడంగల్‌ నుంచి పోటీ చేయాలి. ఒకవేళ ఆయన అక్కడ పోటీ చేస్తే డిపాజిట్‌ కూడా రాకుండా చేస్తాం అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement