సాక్షి, కర్నూలు : సినీనటుడు శివాజీ తెలుగుదేశం పార్టీ రాజకీయ దళారి.. టీడీపీ ముసుగు ధరించిన పొలిటికల్ బ్రోకర్ అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ బీజేపీలో కలిసేందుకే టీడీపీ నేతలు బీజేపీ కేంద్ర కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. 6వ విడత జన్మభూమి పేరుతో టీడీపీ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వేల సంఖ్యలో ప్రజల అర్జీలు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో అసంపూర్తిగా మిగిలిపోయాయని తెలిపారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా అగ్రిగోల్డ్ కుంభకోణం ఏపీలో జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు టీడీపీ మంత్రివర్గం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ నెల 18న అమిత్‌షా రాయలసీమలో అడుగు పెడుతున్నారని, టీడీపీ వాళ్లకు దమ్ముంటే అమిత్‌షాను అడ్డుకోమనండి అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో అవినీతి జరగకపోతే టీడీపీ.. సీబీఐని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment