హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు రాయలసీమ గురించి ఆలోచించడం లేదని బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ... పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతానికి నష్టం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహృదయంతో ఆలోచించాలన్నారు. రాయలసీమకు నష్టం జరగకుండా చూడాలని కేసీఆర్ను ఆయన కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతే రాయలసీమ ప్రజలు వలసపోవాలని విష్ణువర్థన్రెడ్డి ఆందోన చెందారు.