మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో 38 మందితో శనివారం రాత్రి జాబితా విడుదల చేయగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఐదు నియోజకవర్గాల నుంచి పోటీ దిగే అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేని, ఎక్కువ మంది ఆశావహులు లేని నియోజకవర్గాలకు సం బంధించి తొలి జాబితాలో స్థానం కల్పించినట్లు తె లుస్తోంది.
ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ కి దిగనున్న అభ్యర్థుల పేర్లతో రాష్ట్ర పార్టీ నాయకత్వం పార్లమెంటరీ బోర్డుకు తాజాగా జాబితా సమర్పించింది. ఇదే జాబితాలోని పేర్లను బోర్డు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి బి.కొండ య్య పేరు ఖరారు చేయగా నారాయణపేట నుంచి కె.రతంగ్ పాండురెడ్డి, కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి, గద్వాల జి.వెంకటాద్రిరెడ్డి, అచ్చంపేట నుంచి మల్లేశ్వర్ పేర్లను ఖరారు చేశారు.
ఇప్పటికే ప్రచారం
ఒకరు కంటే ఎక్కువ మంది ఆశావహులు ఉన్న నియోజకవర్గాలను పక్కన పెట్టి.. ఒకరు మాత్ర మే టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో నాయకులకు రాష్ట్ర నాయకత్వం నుంచి కొద్దికాలం క్రితమే సంకేతాలు అందాయి. టికెట్ ఎలాగూ దక్కుతుందని చెబుతూ ప్రచారం చేసుకోవాలని సూ చించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కల్వకుర్తి, గద్వాల, అచ్చంపేట ల్లో కొండయ్య, రతంగ్‌పాండురెడ్డి, తల్లోజు ఆచా రి, వెంకటాద్రిరెడ్డి, మల్లేశ్వర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రచారంలో మునిగిపోయారు.
తాజాగా వారి పేర్లనే ఖరారు చేయడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరహాలో వారు కూడా ప్రచారంలో దూసుకుపోనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్న రెండో జాబితాలో వెల్లడిస్తారని తెలుస్తోంది. మరోపక్క మహాకూటమి అభ్యర్థులు తేలాక అసంతృప్తులెవరైనా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపే అంశాన్ని పరిశీలించాక రెండో జాబితా విడుదల చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment