candidate list
-
బీజేపీ 29 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల
-
ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే
-
పంజాబ్ లోక్‌సభ ‘ఆప్’ అభ్యర్థుల జాబితా విడుదల
పంజాబ్ లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితా లోని వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ అమృత్సర్ నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖండూర్ సాహిబ్ నుంచి లాల్జీత్ సింగ్ భుల్లర్, జలంధర్ నుంచి సుశీల్ కుమార్ రింకు, ఫతేగఢ్ సాహిబ్ నుంచి గురుప్రీత్ సింగ్ జీపీ, ఫరీద్కోట్ నుంచి కరమ్‌జీత్ అన్మోల్, బటింఠా నుంచి గుర్మీత్ సింగ్ ఖాడియన్, సంగరూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీత్, పటియాల నుంచి డా. బల్బీర్ సింగ్‌లను లోక్ సభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించింది. -
టార్గెట్ లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ బీజెపీ అభ్యర్థుల జాబితా రెడీ?
సాక్షి, హైదరాబాద్: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడీ నెలకొంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు రంగ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తుంది. తెలంగాణ బీజెపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం దీనిని.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపినట్లు సమాచారం. మేజార్టీ స్థానాలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. తొలిజాబితాలో ఎనిమిది నుంచి 10 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ఇరువై రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లను తిరిగి ఎంపీలుగా పోటీలో నిలపాలని నిర్ణయించింది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక ఆదిలాబాద్‌లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ లో కొనసాగుతున్న సస్పెన్స్
-
వైఎస్సార్ సీపీ ఒక్కో లిస్ట్..బాబు గుండెల్లో ఒక్కో బుల్లెట్
-
అద్దంకి దయాకర్ కు బిగ్ షాక్
-
టికెట్ల తూకం తప్పిందా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో కొత్త–పాత నేతలకు సమతూకంగా సీట్లు కేటాయించి ముందుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావించినా.. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలు దాన్ని ప్రతిబింబించడం లేదనే చర్చ మొదలైంది. పార్టీలో పాతకాపుల కంటే కొత్తగా వచ్చిన వారికి, గత మూడు నా లుగేళ్లలో పార్టీలో చేరిన ముఖ్య నేతల అనుచరుల కే పెద్దపీట వేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించుకోవడంలో పార్టీ ముఖ్య నేతలు సఫలమయ్యారని.. టికెట్లు ఆశించిన పలువురు ముఖ్య నేతలకు మొండి చెయ్యే ఎదురైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక బీసీ ఎజెండాతో ఆ వర్గానికి ఎక్కువ సీట్లు ఇస్తామని పార్టీ నేతలు ప్రకటించిన అంశంపైనా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం 88 సీట్లలో 32 సీట్లను (36.36 శాతం) బీసీ వర్గాలకు కేటాయించడం ఫర్వాలేదనే స్థాయిలోనే ఉందని, కానీ అంచనా వేసినదానికంటే లెక్క తక్కువగానే ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకా 31 సీట్లను (జనసేనకు ఇచ్చేవి సహా) ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. లెక్కలు మారే అవకాశం ఉందని అంటున్నాయి. ముఖ్య నేతలకూ అందని టికెట్లు అంబర్‌పేట నుంచి మాజీ మంత్రి కృష్ణయాదవ్‌కు, చేవెళ్ల నుంచి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తదితరులకు చాన్స్ దక్కినా.. మరికొందరు ఆశావహులకు మాత్రం మొండిచెయ్యి ఎదురైంది. ముషీరాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేటలలో ఏదో ఒకచోటు నుంచి టికెట్ ఆశించిన బండారు విజయలక్ష్మికి, సికింద్రాబాద్ సీటు కోరుకున్న మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయసుధ తదితరులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ముషీరాబాద్‌ను పూసా రాజుకు, సికింద్రాబాద్‌ను మేకల సారంగపాణికి కేటాయించడంతో.. ఆ సీట్లను ఆశించిన వారికి అవకాశం పోయినట్టే. ఇక కార్పొరేటర్లలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి మాత్రమే చాన్స్ దక్కింది. ఎల్బీనగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, సికింద్రాబాద్, సనత్‌నగర్ తదితర చోట్ల టికెట్లు ఆశించిన కార్పొరేటర్లకు నిరాశే మిగిలింది. దీంతో వారు టికెట్ దక్కిన అభ్యర్థులకు సహకరిస్తారా? లేక రెబెల్స్‌గా పోటీచేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రెండు సీట్లపై పంతం హుస్నాబాద్, వేములవాడ సీట్ల విషయంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ తమ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేయడంతో అభ్యర్థుల ఖరారు వాయిదా పడినట్టు తెలిసింది. హుస్నాబాద్‌ను ఈటల తన అనుచరుడు జన్నపరెడ్డి సురేందర్‌రెడ్డికి ఇప్పించుకోవాలని ప్రయత్నించగా.. బండి తన అనుచరుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తికి ఇవ్వాలని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పట్టుబట్టినట్టు తెలిసింది. ఇక వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావుకు ఇస్తే తనకు అభ్యంతరం లేదని బండి సంజయ్ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ వికాస్‌రావుకు ఇవ్వకుంటే, ఈటలకు రెండు చోట్ల పోటీ అవకాశం ఇచ్చినట్టే.. తనకూ కరీంనగర్‌తోపాటు వేములవాడ నుంచి పోటీ చాన్స్ ఇవ్వాలని సంజయ్ కోరినట్టు సమాచారం. మరోవైపు వేములవాడ స్థానాన్ని తుల ఉమకు కేటాయించేలా ఈటల గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మూడో జాబితాపై నిరసనలు బీజేపీ మూడో జాబితాలో సీట్లు దక్కని కొందరు ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న దిలీప్‌చారి గురువారం బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పొత్తులో భాగంగా జనసేనకు నాగర్ కర్నూల్ సీటు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. మరోవైపు ముప్పై ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి విమర్శించారు. కొత్త వారికే ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ బీజేపీకి రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకు బీసీ సీఎం నినాదంతో బలహీన వర్గాలను బీజేపీ నాయకత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. అసంతృప్తిలో బండారు విజయలక్ష్మి హరియాణా గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అసంతృప్తితో ఉన్నారు. తాను ఆశించిన ముషీరాబాద్ సీటును వేరేవారికి కేటాయించడంపై ఆమె సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమెను తమ పార్టీలో చేరాలంటూ టచ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. ఇక బండా కార్తీకరెడ్డి కూడా తనకు సీటు గ్యారంటీ అని భావించినా.. టికెట్ లభించకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేటాయింపుల లెక్కలు ఇవీ.. బీజేపీ మొత్తంగా ఇప్పటివరకు 88 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 31 స్థానాలను (జనసేన పొత్తు కేటాయింపులు కలిపి) ఖరారు చేయాల్సింది. ♦ తొలిజాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒకరు, మూడో జాబితాలో 35మంది కలిపి 88 మందికి టికెట్లు ఇవ్వగా.. ఇందులో ఓసీలకు 34, బీసీలకు 32, ఎస్సీలకు 13, ఎస్టీలకు 9 కేటాయించారు. ♦ తొలిజాబితాలో 12 మంది, మూడో జాబితాలో ఒకరు (హుజూర్నగర్ నుంచి చల్లా శ్రీలతారెడ్డి) కలిపి మొత్తంగా 13 మంది మహిళలకు సీట్లు ఇచ్చారు. ♦ మైనారిటీ వర్గాలకు చెందిన ఒక్కరికి కూడా ఇప్పటివరకు టికెట్ కేటాయించలేదు. ♦ బీసీలకు ఇచ్చిన 32 సీట్లలో.. ముదిరాజ్–గంగపుత్ర 7, గౌడ 6, మున్నూరు కాపు 5, యా దవ 4, పెరిక 2, లోథీ 2, బోయ 1, లింగా యత్ 1, విశ్వకర్మ 1, పద్మశాలి 1, ఆరె కటిక 1, ఆరె మరాఠాలకు 1 సీటును కేటాయించారు. -
సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ
-
లోక్‌సభ ఎన్నికలకు త్వరలో అభ్యర్థుల ప్రకటన!
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ కార్యాచరణను వేగవంతం చేశాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తమతమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆచీతూచీ పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాల అన్వేషణపై ఇప్పటికే దృష్టి సారించింది. 160 మంది అభ్యర్థల ప్రకటన ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే బీజేపీ యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే అభర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. మొదటి విడతలో 160 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే 60 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నామని భావిస్తున్న బీజేపీ.. చాలా కాలంగా ఆ స్థానాలపై ఫోకస్ చేసింది. చదవండి: ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు ఈ జాబితాలోనే తెలంగాణ కూడా? ఇక ఈ మొదటి జాబితాలోనే తెలంగాణాలోని 12 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు డిసెంబర్ లేదా జనవరిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ముందస్తు అభ్యర్ధుల ప్రకటన కసరత్తు ఆసక్తి రేపుతోంది. బీజేపీ చరిత్రలో తొలిసారి! అయితే షెడ్యూల్ రాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. కానీ లోక్‌సభకు షెడ్యూల్ కన్నా ముందు అభ్యర్ధులను ప్రకటించండం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. దీని ద్వారా అభ్యర్ధుల విజయవకాశాలు మెరుగవుతాయని కాషాయదళం అంచానా వేస్తోంది. తెలంగాణలో కమలం కసరత్తు మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్న తరుణంలో టికెట్ల జాబితాపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. కోర్ కమిటీ భేటీ తర్వాత అధిష్టానానికి అభ్యర్థుల జాబితా అందజేయనుంది. సెప్టెంబర్ మొదటవారంలో మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. - 25 మందితో తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. -
బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే..
భోపాల్: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు కావడం విశేషం. గురువారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అత్యధికులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారే. చాలా కాలంగా బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాల్లో పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఎప్పటినుంచో కాంగ్రెస్ అభ్యర్థులు పట్టుకుపోయారు. ఈ కారణంతోనే ఈ ఎత్తుగడ వేసింది బీజేపీ అధిష్టానం. అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు తగిన సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతోనే చాలా ముందస్తుగా జాబితాను ప్రకటించింది బీజీపీ. మొదటి విడత జాబితాలో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కోసం 21 మంది అభ్యర్థులను మధ్యప్రదేశ్ అసెంబ్లీ కోసం 39 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ పార్టీ. గ్వాలియర్ చంబల్ ప్రాంతంలో 34 సీట్లకు గాను ఆరుగురు వెనుకబడిన కులాల అభ్యర్థులను ప్రకటించింది. ఇదిలా ఉండగా 2018 ఎన్నికల్లో ఓటమిపాలైన 14 మంది అభ్యర్థులకు మళ్ళీ టికెట్లు ఇచ్చింది పార్టీ అధిష్టానం. వీరిలో మాజీ మంత్రులు అచల్ సోంకర్, నానాజీ మొహద్, ఓంప్రకాష్ ధుర్వే, ఐదల్ సింగ్ కంసనా, నిర్మల భూరియా, లలితా యాదవ్, లాల్ సింగ్ ఆర్య కూడా ఉన్నారు. మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని అన్నారు. గోహాడ్ అసెంబ్లీ సీటును జ్యోతితాదిత్య సింధియా సన్నిహితుడు రణ్ వీర్ జటావ్ ను కాదని షెడ్యూల్డ్ కులాల మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యకు టికెట్ ఇచ్చారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఇంఛార్జిగా ఉన్న మాజీ మంత్రి లాల్ సింగ్ ఆ వర్గం వారిని ప్రభావం చేయగలరని పార్టీ అధిష్టానం ఆలోచన. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన రణ్ వీర్ జటావ్ కొద్దీ కాలానికి జోతిరాధిత్య సింధియా ఆశీస్సులతో బీజేపీ పార్టీలో చేరారు. 2020 లో జరిగిన ఉప ఎన్నికల్లో రణ్ వీర్ జటావ్ ఓటమిపాలవ్వగా బీజేపీ ఆయనను హ్యాండ్స్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి క్యాబినెట్ హోదాను కల్పించింది కానీ ఈసారి మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. బీజేపీ ప్రకటించిన జాబితాలో కొంతమంది నేరచరిత్ర ఉన్న నేతలు కూడా ఉండడం విశేషం. వారిలో భోపాల్ సెంట్రల్ అసెంబ్లీ అభ్యర్థి ధృవ్ నారాయణ్ సింగ్ RTI కార్యకర్త షెహ్లా మాసూద్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రెండ్రోజుల క్రితమే షెహ్లా మసూద్ కుటుంబసభ్యులు కేసు పునర్విచారణ జరిపించాలని సీబీఐని డిమాండ్ చేశారు. ఇక శివపురి జిల్లాలోని కాంగ్రెస్ కంచుకోట పిచోర్ అసెంబ్లీ సీటును ప్రీతమ్ సింగ్ లోధీకి కేటాయించింది పార్టీ అధిష్టానం. అక్కడ కాంగ్రెస్ నేత కేపీ సింగ్ కక్కజుపై ప్రీతమ్ సింగ్ లోధీ పోటీ చేయడం ఇది మూడోసారి కావడం వవిశేషం. కొద్ది రోజులక్రితం బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు లోధీని పార్టీ సస్పెండ్ కూడా చేసింది. అయినా ఇప్పుడు ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించింది. వీరితోపాటు కొంతమంది రాజకీయ వారసులు కూడా మొదటి జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్నారు. సబల్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే మెహర్బన్ సింగ్ రావత్ కోడలు సరళ రావత్, దామోహ్ మాజీ ఎంపీ శివరాజ్ సింగ్ లోధీ కుమారుడు వీరేంద్ర సింగ్ లోధి, మాజీ ఎమ్మెల్యే ప్రతిభా సింగ్ కుమారుడు నీరజ్ సింగ్ లు ఈ జాబితాలో ఉన్నారు. సాగర్ లోని బందా అసెంబ్లీ స్థానాన్ని వీరేంద్ర సింగ్ లోధీకి కేటాయించారు బీజేపీ పెద్దలు. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తర్వార్ సింగ్ లోధీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఛతర్పూర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ కుమారుడు కామాఖ్య ప్రతాప్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. ఇది కూడా చదవండి: కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్ -
విద్యారంగానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు: బొత్స
-
AP: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, విజయవాడ: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 77 శాతం మంది ఆర్జీయూకేటీలో సీట్లు దక్కించుకున్నారు. తొలి 20 ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూలు విద్యార్ధులే సాధించారు. చదవండి: విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రారంభించిన ఆర్జీయూకేటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కొత్తగా ఒంగోలు క్యాంపస్ ప్రారంభించామన్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా పారదర్శకంగా ప్రవేశాలు చేట్టామన్నారు. ఈబీసీ కోటాలో 400 సీట్లు కేటాయించామన్నారు. -
యూపీ ఎన్నికలు.. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్
లక్నో: అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా మిగతా పార్టీలన్నీ తీవ్ర కసరత్తు ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న తరుణంలో తమ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఈ క్రమంలో 125 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలి జాబితాను గురువారం విడుదల చేసింది. ఇందులో ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు టికెట్ ఇచ్చినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. 125 మందిలో 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 40 శాతం యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గౌరవ వేతనాల కోసం పోరాడిన ఆశా వర్కర్ పూనమ్ పాండే షాజహాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రియాంక చెప్పారు. మహిళలు, యువతకు కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని, తమ నిర్ణయంతో యూపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేస్తుందని ఆమె అన్నారు. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చదవండి: అయోధ్య నుంచి యోగి పోటీ! -
కాంగ్రెస్ పార్టీలో మొదలైన సందడి.. ఆ ఎన్నికల కోసం ఏకంగా..
కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు, పాతతరం కార్యకర్తలు మళ్లీపార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు సంస్థాగత కసరత్తును ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలోనే టీఆర్ఎస్కు, హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ వ్యవహారంతో జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపడంతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ల ఎత్తులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలనే ఏకైక లక్ష్యంతో హుజూరాబాద్ టికెట్ విషయంపై పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో కసరత్తునుముమ్మరం చేసింది. ఇటీవలనే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్కంఠాగూర్‌తో పాటు రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలు కరీంనగర్లో సమావేశం నిర్వహించి హుజూరాబాద్‌లో గట్టిపోటీ ఇస్తూ సీటును కైవసం చేసుకునే దిశగా కార్యకర్తలకు నిర్దేశనం చేశారు. దీంతో జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యం, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు అనుబంధ విభాగాల నాయకులంతా పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టారు. హుజురాబాద్ టికెట్‌కు దరఖాస్తుల సందడి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక కోసం మొదట మాజీ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్యే సాంబయ్యల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ పీసీసీ సమావేశంలో స్థానిక నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని వచ్చిన సూచన మేరకు ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు డీసీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో 18 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
కేరళ అసెంబ్లీ ఎన్నికలు: తొలి లిస్ట్‌ను ప్రకటించిన సీపీఐ!
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించిన అధిష్టానం, 21 మందితో కూడిన జాబితాను ప్రకటించినట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కనమ్ రాజేంద్రన్ తెలిపారు. ‘‘తొలుత 21 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించాం. మరో నాలుగు శాసన సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఎన్నిస్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టామనేది కాకుండా, ఎన్నిచోట్ల గెలిచామన్నదే ప్రధానమన్నారు. అయితే పునలూర్ నుంచి, జిఎస్ జయలాల్ చత్తనూర్ నుంచి పోటీపడనున్నారు. కాగా, ఇకే విజయన్ నాదపురం బరిలో దిగారు. కాగా ఆయా అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానాల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇక కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 ఎన్నికలు జరుగనున్నాయన్న విషయం తెలిసిందే. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. చదవండి: కొత్త సీఎంపై వీడిన ఉత్కంఠ -
కర్నూలు సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా సిద్ధం
సాక్షి, కర్నూలు(అర్బన్) : సచివాలయ ఉద్యోగుల ఎంపిక జాబితా దాదాపు సిద్ధమైంది. అధికారులు సోమవారం రాత్రి వరకు ఈ ప్రక్రియపై కుస్తీ పడుతూనే ఉన్నారు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్‌పై తేలకపోవడం, పలు శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై స్పష్టత లేని కారణంగా ఆయా శాఖల్లో ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. సోమవారం సాయంత్రానికి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన జాబితాను మాత్రం పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. మిగిలిన పోస్టులకు సంబంధించి మంగళవారం ఉదయానికల్లా అప్లోడ్ చేసే అవకాశం ఉంది. ఆయా శాఖలకు సంబంధించి జాబితాలు అప్లోడ్ చేసిన వెంటనే ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం జాబితాలను సిద్ధం చేయాలని ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ప్రయత్నం చేస్తున్నా, ‘ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్’ పై తేలకపోవడం వల్ల జాప్యం జరుగుతూనే ఉంది. 25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ... అన్ని పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితాలను పూర్తి చేసి 25, 26, 27వ తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. అన్ని పోస్టులకు సంబంధించి జెడ్పీ ప్రాంగంణంలోని కార్యాలయాల్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ పోస్టులకు ఎంపికైన వారి వివరాలు ... విలేజ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారి షార్ట్ లిస్ట్‌ను సంబంధిత అధికారులు అప్లోడ్ చేశారు. వీరంతా ఈ నెల 25వ తేదీన జరగనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంది. షార్ట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన వారి హాల్ టికెట్ నంబర్లు: 191308000145, 191308000175, 190508001602, 191308000380, 191308000430, 191308000114, 191308000269, 190908000826, 191308000277, 190908000082, 191308000262, 190908000717, 191308000669, 190908000837, 191308000137, 190908000213, 191308000068, 191308000892, 191308000097, 191308000880. -
నార్త్ ముంబై నుంచి ఊర్మిళ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ ఎన్నికల కోసం మరో 12 మంది అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. దీంతో ఆ పార్టీ ఇప్పటివరకు మొత్తం 305 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి ఊర్మిళ మతోంద్కర్‌ను ఉత్తర ముంబై స్థానం నుంచి ఆ పార్టీ బరిలోకి దింపింది. అక్కడి ప్రస్తుత ఎంపీ గోపాల్ శెట్టిని ఆమె ఎదుర్కోనున్నారు. శెట్టి 2014 ఎన్నికల్లో ఇదే స్థానంలో ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్‌ను ఓడించారు. 2004లో ఇదే సీటు నుంచి కాంగ్రెస్ బాలీవుడ్ నటుడు గోవిందను పోటీకి దింపింది. అప్పట్లో ఆయన బీజేపీ నేత, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్‌ను ఓడించి గెలుపొందారు. ముంబై వాయవ్య స్థానంలో నిరుపమ్‌ను, ముంబై ఉత్తర–మధ్య స్థానంలో ప్రియా దత్‌ను, ముంబై దక్షిణ స్థానంలో మిలింద్ దేవరాను, ముంబై దక్షిణ మధ్య స్థానంలో ఎకనాథ్ గైక్వాడ్‌ను కాంగ్రెస్ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. 2014 ఎన్నికల్లో మహారాష్ట్ర మొత్తానికి 2 సీట్లే గెలిచిన కాంగ్రెస్ భవితవ్యం ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాల్సిందే. ససరాం నుంచి మీరాకుమార్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను బిహార్‌లోని ససరాం నుంచి కాంగ్రెస్ పోటీ చేయించనుంది. అదే రాష్ట్రంలోని సుపౌల్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ రంజీత్ రంజన్‌కే మరోసారి అవకాశం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజగంజ్ స్థానంలో తమ అభ్యర్థిని కాంగ్రెస్ మార్చింది. ఈ స్థానాన్ని తొలుత తనూశ్రీ త్రిపాఠికి కేటాయించగా, ఆమె తండ్రి అమర్మణి త్రిపాఠి జైల్లో ఉండగా ఆమెకు ఎలా టికెట్ ఇస్తారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మహారాజగంజ్‌లో తనూశ్రీకి బదులుగా సుప్రియా శ్రీనాథ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. -
విజయనగరం పోరుకు సై
సాక్షి, విజయనగరం గంటస్తంభం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్లు పక్రియ పూర్తయింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అధికారికంగా అధికారులు ప్రకటించారు. దీంతో తదుపరి సమరం మిగిలి ఉంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ తేదీలు ప్రకటిచింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 18న నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. అదేరోజు జిల్లాలో ఉన్న విజయనగరం పార్లమెంట్ స్థానానికి కలెక్టర్ హరి జవహర్లాల్, 9 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేరోజు నామినేషన్లు స్వీకరించారు. ఈ పక్రియ 24వ తేదీ వరకు సాగింది. జిల్లాలో విజయనగరం పార్లమెంట్ స్థానానికి 18 మంది, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 30 మంది నామినేషన్లు పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. బుధ, గురు శుక్రవారాల్లో జరిగిన నామినేషన్లు విత్‌డ్రా కార్యక్రమంలో 16 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను రిటర్నింగ్ అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు. గుర్తుల కేటాయింపు అధికారిక సమాచారం ప్రకారం ఎంపీ, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 88 మంది బరిలో ఉన్నారు. విజయనగరం ఎంపీ స్థానానికి 14మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. మిగతా 9 అసెంబ్లీ సిగ్మెంట్ల్లో 74మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 18 మంది స్వతంత్ర అభ్యర్ధులు కాగా మిగిలినవారంతా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలతో పాటు ఇతర పార్టీలవారు ఉన్నారు. కురుపాం నుంచి ఒకరు, పార్వతీపురం నుంచి ఇద్దరు, సాలూరు నుంచి ముగ్గురు, గజపతినగరం నుంచి ఒకరు, నెల్లిమర్ల నుంచి ముగ్గురు, విజయనగరం నుంచి ఒకరు, ఎస్.కోట నుంచి ఇద్దరు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. విజయనగరం ఎంపీ స్థానానికి ఏకంగా ఐదుగురు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఇదిలాఉండగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రిటర్నింగు అధికారులు వెంటనే గుర్తులు కేటాయించారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు పార్టీ గుర్తులు లభించగా గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించారు. ఈ మేరకు ఫారం–7ఎ జనరేట్ చేసి ఎన్నికల సంఘానికి పంపించారు. దీంతో నామినేషన్లు పక్రియ ముగిసినట్లైంది. విజయనగరం ఎంపీ బరిలో నిలిచిన అభ్యర్థులు వ.సం. అభ్యర్థి పార్టీ కేటాయించిన గుర్తు 1 అశోక్‌గజపతిరాజు పూసపాటి తెలుగుదేశం సైకిల్ 2 ఆదిరాజు యడ్ల కాంగ్రెస్‌పార్టీ హస్తం 3 బెల్లాన చంద్రశేఖర్ వైఎస్సార్ సీపీ సీలింగ్ ఫ్యాన్ 4 పాకలపాటి సన్యాసిరాజు బీజేపీ కమలం 5 పీవీఏ సాగర్ సామాన్య ప్రజాపార్టీ ఎలక్ట్రికల్ పోల్ 6 చిరంజీవి లింగాల ఆంధ్ర చైతన్యపార్టీ టూత్‌బ్రెష్ 7 ముక్క శ్రీనివాసరావు జనసేన గాజుగ్లాసు 8 లగుడు గోవిందరావు జనజాగృతిపార్టీ మైకు 9 కె.సూర్యభవాని పిరమిడ్ ఫ్లూట్ 10 సియాదుల ఎల్లారావు గ్యాస్ స్వతంత్ర సిలిండర్ 11 దనలాకోటి రమణ స్వతంత్ర అగ్గిపెట్టె 12 పెంటపాటి రాజేష్ స్వతంత్ర బ్యాటరీ టార్చ్ 13 ఇజ్జురోతు రామునాయుడు స్వతంత్ర కోట్ 14 వెంకట త్రినాథరావు వెలూరు స్వతంత్ర సితార్ అసెంబ్లీ నియోజకవర్గాలు వారీగా బరిలో ఉన్న అభ్యర్థులు వ.సం. నియోజకవర్గం పోటీలో ఉన్న అభ్యర్థులు 1 కురుపాం 6 2 పార్వతీపురం 7 3 సాలూరు 8 4 బొబ్బిలి 6 5 చీపురుపల్లి 8 6 గజపతినగరం 9 7 నెల్లిమర్ల 12 8 విజయనగరం 9 9 ఎస్.కోట 9 -
బీజేపీ రెండో జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండో లిస్ట్‌ను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ప్రకటించింది. సోయం బాబూరావు (ఆదిలాబాద్), ఎస్ కుమార్ (పెద్దపల్లి), బాణాల లక్ష్మారెడ్డి (జహీరాబాద్), భగవంత్ రావు (హైదరాబాద్), బీ జనార్థన్ (చేవెళ్ల), వాసుదేవ రావు (ఖమ్మం)కి పార్టీ టికెట్లు కేటాయించింది. మెదక్ స్థానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా పదిమందితో కూడిన తొలి జాబితాను గురువారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. మెదక్ మినాహా మిగతా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు స్థానం అభ్యర్థి పేరు ఆదిలాబాద్(ఎస్టీ) : సోయం బాబూరావు కరీంనగర్: బండి సంజయ్ నిజామాబాద్: డి. అరవింద్ మల్కాజిగిరి: ఎన్ రామచంద్రరావు సికింద్రాబాద్: కిషన్ రెడ్డి మహబూబ్‌నగర్: డీకే అరుణ నాగర్‌కర్నూల్ (ఎస్సీ): బంగారు శ్రుతి నల్లగొండ: గార్లపాటి జితేంద్రకుమార్ భువనగిరి: పీవీ శ్యామ్‌సుందర్ రావు వరంగల్: చింతా సాంబమూర్తి మహబూబాబాద్: హుస్సేన్‌నాయక్ పెద్దపల్లి(ఎస్సీ) : ఎస్ కుమార్ ఖమ్మం: వాసుదేవ రావు చేవెళ్ల: బీ జనార్థన్ హైదరాబాద్: భగవంత్ రావు జహీరాబాద్: బాణాల లక్ష్మారెడ్డి -
10 కొత్తముఖాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల జాబితాపై నెలకొన్న ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెరదించారు. గురువారం రాత్రి మొత్తం 17 మంది సభ్యుల జాబితాను ప్రకటించారు. అనుకున్నట్లుగానే.. పాత వారిలో ఏడుగురికి విశ్రాంతినిచ్చి 10 కొత్తముఖాలకు చోటిచ్చారు. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించగా, గతంలో ఎంపీలుగా పనిచేసి ఇప్పుడు అసెంబ్లీకి ఎన్నికయిన రెండు స్థానాలతో పాటు మరో 8 చోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మల్కాజ్గిరి స్థానాన్ని ఆశించిన నవీన్‌రావులను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కేసీఆర్ ప్రకటించారు. ఆ ఏడు చోట్ల: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం లభించింది. కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), బోయినపల్లి వినోద్‌కుమార్ (కరీంనగర్), పసునూరి దయాకర్ (వరంగల్), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), గోడెం నగేశ్ (ఆదిలాబాద్), బీబీ పాటిల్ (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్)లకు మళ్లీ టికెట్ లభించింది. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం), జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సీతారాంనాయక్ (మహ బూబాబాద్)లకు భంగపాటు ఎదురైంది. చివరి వరకు తమ వైపు మొగ్గుచూపుతారనే ఈ ముగ్గురు ఆశలు పెట్టుకున్నప్పటికీ.. కేసీఆర్ వారికి టికెట్ నిరాకరించారు. ఇద్దరు మంత్రుల కుటుంబ సభ్యులు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజ్గిరి బరిలో దింపింది టీఆర్ఎస్. ఈయన పౌల్ట్రీ వ్యాపారి. మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌ను సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో దింపింది. ప్రస్తుత శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్న రెడ్యానాయక్ కుమార్తె మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మహబూబాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. ఖమ్మం, పెద్దపల్లి.. అనూహ్యం ఖమ్మం, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఖరారు చేశారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి అవకాశం ఇవ్వకపోతే అక్కడి నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు అవకాశమిచ్చారు. పెద్దపల్లి నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బాల్క సుమన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో అక్కడి మాజీ ఎంపీ జి.వివేకానంద టికెట్ ఆశించారు. కానీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఎక్సైజ్ మాజీ అధికారి వెంకటేశ్ నేతకానికి టికెట్ ఖరారైంది. కొండా స్థానంలో.. చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొంది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్థానంలో పౌల్ట్రీ వ్యాపారి రంజిత్‌రెడ్డిని బరిలో దించారు. ఈయన పేరుపై చాలాకాలం క్రితమే ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చనే చర్చ జరిగింది. కానీ, కేసీఆర్ మాత్రం చేవెళ్ల బరిలో రంజిత్‌రెడ్డికే అవకాశమిచ్చారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తిగా లేకపోవడంతో అక్కడ మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన వేముగంటి నర్సింహారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సివిల్ ఇంజనీర్ అయిన నర్సింహారెడ్డి 1997 నుంచి స్నేహిత అగ్రిబయోటెక్ ఎండీగా, 2012 నుంచి వీజీఎస్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మాజీ మంత్రికి చాన్స్ నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.రాములుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా టికెట్ ఆశించినప్పటికీ రాములు వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. సిట్టింగ్ ఎంపీకి టికెట్ నిరాకరించిన మహబూబ్‌నగర్ పార్లమెంటు అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డిని ఖరారు చేశారు. ఎంఎస్ఎన్ లేబరేటరీస్ లిమిటెడ్ అధినేత డాక్టర్ మన్నె సత్యనారాయణరెడ్డి సోదరుడయిన శ్రీనివాస్‌రెడ్డి కాంట్రాక్టర్‌గా ఉన్నారు. హైదరాబాద్ లోక్‌సభకు స్థానిక టీఆర్ఎస్ నేత పుస్తె శ్రీకాంత్‌ను బరిలో దించారు. మధ్యాహ్నం నుంచే కోలాహాలం టీఆర్ఎస్ అభ్యర్థులను ఈనెల 21న వెల్లడించనున్నట్టు నిజామాబాద్ సభలో కేసీఆర్ ప్రకటించడంతో గురువారం మధ్యాహ్నం నుంచే ప్రగతిభవన్ వద్ద కోలాహలం మొదలైంది. టికెట్ ఖరారైన వారు, ఆశిస్తున్న నేతలు, వారి అనుచరులు ప్రగతిభవన్‌కు క్యూ కట్టారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేసీఆర్ గురువారం సాయంత్రం కూడా భేటీ అయ్యారు. వీరితో అన్ని అంశాలు చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం వారికి బీఫారంలు కూడా గురువారం రాత్రే కేసీఆర్ చేతుల మీదుగా అందజేశారు. టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులు వీరే: 1. కరీంనగర్: బోయినపల్లి వినోద్ కుమార్ 2. పెద్దపల్లి: బోర్లకుంట వెంకటేశ్ నేతకాని 3. ఆదిలాబాద్: గోడెం నగేశ్ 4. నిజామాబాద్: కల్వకుంట్ల కవిత 5. జహీరాబాద్: బీబీ పాటిల్ 6. మెదక్: కొత్త ప్రభాకర్ రెడ్డి 7. వరంగల్: పసునూరి దయాకర్ 8. మహబూబాబాద్: మాలోత్ కవిత 9. ఖమ్మం: నామా నాగేశ్వరరావు 10. భువనగిరి: బూర నర్సయ్యగౌడ్ 11. నల్గొండ: వేమిరెడ్డి నర్సింహా రెడ్డి 12. నాగర్ కర్నూల్: పోతుగంటి రాములు 13. మహబూబ్ నగర్: మన్నె శ్రీనివాస్ రెడ్డి 14. చేవెళ్ల: డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 15. సికింద్రాబాద్: తలసాని సాయికిరణ్ యాదవ్ 16. మల్కాజిగిరి: మర్రి రాజశేఖర్ రెడ్డి 17. హైదరాబాద్: పుస్తె శ్రీకాంత్ -
పెద్దపల్లిలో వివేక్‌కు అవకాశంపై అస్పష్టత...
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. అయితే, అభ్యర్థులను ప్రక టించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ సైతం ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేదు. లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న వెల్లడిస్తామని మంగళవారం నిజామాబాద్ బహిరంగసభలో కేసీఆర్ ప్రకటించారు. అన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. సిట్టింగ్ ఎంపీలు నలుగురికి ఈసారి పోటీ చేసే అవకాశం ఉండదని తెలిసింది. ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో కొత్తవారికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్న మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుకు ఇక్కడ అవకాశం ఇవ్వాలని పార్టీ దాదాపుగా నిర్ణయించింది. మరోనేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ చాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి అభ్యర్థి ఖరారుపై టీఆర్ఎస్ ఇంకా స్పష్టత ఇవ్వడంలేదు. టికెట్ ఆశిస్తున్న జి.వివేకానందపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివేకానంద టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని, సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా సోదరుడు బరిలో ఉన్నా పట్టించుకోలేదని భావిస్తోంది. చివరి నిమిషంలోనైనా తనకు టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని వివేకానంద భావిస్తున్నారు. లోక్‌సభ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేల సూచన మేరకు ఇతర పార్టీల నుంచి వచ్చే ఒక నేతగాని వర్గం నాయకుడికి ఇక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్యలు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌కు టికెట్ ఖరారైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టికెట్‌పై ఇంకా స్పష్టత రావడంలేదు. ఈ సెగ్మెంట్లోనూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆ పార్టీ తేరా చిన్నపరెడ్డి, వ్యాపారవేత్త వేముగంటి నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. భారీగా చేరికలు... లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల ముఖ్యనేతలను భారీగా చేర్చుకునేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అధికారికంగా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్లో చేరుతారని తెలుస్తోంది. చేవేళ్ల కాంగ్రెస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డి మంగళవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన టీడీపీ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పలువురు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ నేతలు వెంకటేశ్ నేత, గోమాస శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లాకు చెందిన గండ్ర సత్యనారాయణరావు తదితరులు త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ప్రకటనకు ముందే ఈ చేరికలు ఉంటాయని తెలుస్తోంది. -
‘మమ్మల్ని నాశనం చేయడానికే 7 దశల్లో పోలింగ్’
కోల్‌కతా : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ గత ఆదివారం విడుదలయ్యింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏడు తనకు అచ్చిరాదంటూ ఆందోళన చెందుతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్‌ను నాశనం చేయాడానికి బీజేపీ కుట్ర చేస్తుందని.. అందుకే ఇలా ఏడు దశల్లో ఎన్నికలు నిర్శహిస్తుందంటూ దీదీ మండి పడుతున్నారు. మమతా మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల్లో ఐదు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామంటేనే ఒప్పుకోలేదు. అలాంటిది ఈ సారి ఏకంగా ఏడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బెంగాల్‌ను నాశనం చేయడానికే ఇలా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర. ఇందుకు తగిన సమాధానం చెప్తాం. బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ మొత్తం 42 స్థానాల్లో గెలుస్తుంది. బెంగాల్ ఓటర్లు ఇలాంటి ఎన్నికలను చాలా చూశారు. వారు చాలా తెలివిగల వాళ్లు. బీజేపీ అనుకున్నవేం జరగవు’ అని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీ(80), బెంగాల్(42), బిహార్(40) రాష్ట్రాలే కీలక పాత్ర పోషించనున్నాయని మమత తెలిపారు. అంతేకాక ‘గత ఎన్నికల్లో మా పార్టీ తరఫున 34 మంది ఎంపీలు గెలిచారు. ప్రస్తుతం వారిలో ఇద్దరిని పార్టీ నుంచి తొలగించాము. ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త వారు పోటీ చేస్తార’ని తెలిపారు. ప్రజాదరణను బట్టే టికెట్ కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే ఈ సారి ఎన్నికల్లో దీదీ 10 నుంచి 12 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన తరువాత మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని మమత తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ పశ్చిమబెంగాల్లో డార్జిలింగ్, అసన్సోల్ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఈ సారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది. -
‘లోక్‌సభ’ జాబితాను 20లోగా పంపండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఈనెల 20వ తేదీలోగా అభ్యర్థుల జాబితా పంపాలని అన్ని ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ)లకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ఈసారి స్క్రీనింగ్ కమిటీలకు బదులు ప్రత్యేక కమిటీలకు ఎంపిక బాధ్యతలు అప్పగించింది. గతంలో ఎన్నికలప్పుడు రాష్ట్రాల స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటయ్యేవి. ఈ కమిటీలే అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపించేవి. తాజాగా ఈ విధానానికి స్వస్తి చెప్పారు. లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ముందుగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీసీసీ)లు రూపొందించి రాష్ట్ర స్థాయిలోని ప్రత్యేక కమిటీలకు అందజేస్తాయి. ఈ కమిటీల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి లేదా ఆ రాష్ట్ర పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర పీసీసీకి కేటాయించిన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత సభ్యులుగా ఉంటారు. వీరు పీసీసీ జాబితాను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులతో ఏఐసీసీ స్థాయిలోని కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి పంపుతారు. తెరపైకి కొత్త విధానం గతంలో స్క్రీనింగ్ కమిటీలు పంపిన జాబితాల్లో చాలాసార్లు.. ఎవరికీ పరిచయం లేని వ్యక్తులు, రాష్ట్రంపై అవగాహన లేని వారు, అసలు స్క్రీనింగ్ కమిటీ సభ్యులకే తెలియని వారి పేర్లు కూడా ఉండేవని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇటీవల జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల పెద్దగా పరిచయం లేని వ్యక్తులు పోటీలోకి దిగగా తిరుగుబాట్లు తలెత్తడం, స్థానిక నేతల సహాయ నిరాకరణ వంటివి జరిగాయని ఆ నేత తెలిపారు. పార్టీ సీనియర్ నేతలు రాజకీయాలు చేస్తూ ఎవరికీ పరిచయం లేని వారికి కూడా స్క్రీనింగ్ కమిటీ జాబితాలో చోటు కల్పించే వారని అన్నారు. ఇలాంటప్పుడు భారీగా డబ్బు కూడా చేతులు మారేదని ఆరోపణలు వచ్చాయన్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు రాహుల్ గాంధీ కొత్త విధానాన్ని తెచ్చారని ఆ నేత తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో కీలకమైన పార్టీ బాధ్యతలను నెరవేర్చేవారు, విధాన నిర్ణయాలను అమలు చేసేవారికి ఎంపికలో బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని రాహుల్ భావిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థుల ఎంపిక సత్వరం పూర్తవడంతోపాటు, వారు ఎన్నికల ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించేందుకు కూడా సమయం దొరుకుతుందని తెలిపారు. అయితే, ముఖ్యమైన విధానపర నిర్ణయాల్లో కాంగ్రెస్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాత్ర కీలకంగా మారింది. కేరళ నుంచి లోక్‌సభకు ఎన్నికైన వేణుగోపాల్ అన్ని పీసీసీల్లోనూ సభ్యుడే. అదేవిధంగా కర్ణాటక పార్టీకి ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కూడా. రానున్న లోక్‌సభ ఎన్నికలకు గెలిచే అభ్యర్థుల జాబితా తయారీతోపాటు, ఇతర వివరాలను ఇప్పటికే రాహుల్ గాంధీ తీసుకుంటున్నారని సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో కుల సమీకరణాలు, బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, వారి గెలుపోటములపై సొంతంగా సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. -
నేడు తుది జాబితాలు ప్రకటించనున్న కూటమి పార్టీలు
-
రాజస్థాన్ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా
-
ఆశ.. నిరాశ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ టికెట్ల పంపిణీ వ్యవహారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఒకరే పోటీపడుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించిన ఆ పార్టీ.. మలి విడత జాబితాపై మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది. భాగస్వామ్య పక్షాల ఒత్తిడి, సామాజిక సమతూకం, ఇతరత్రా అంశాలు అభ్యర్థుల ఖరారుపై ప్రభావం చూపుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని మొత్తం స్థానాలకు, మేడ్చల్‌లో కేవలం కుత్భుల్లాపూర్ సెగ్మెంట్, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం రాత్రి ఖరారు చేసింది. మిగతా సెగ్మెంట్ల విషయంలో మహాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి అభ్యంతరాలు, డిమాండ్లు వస్తుండడంతో పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో పెండింగ్ స్థానాల విషయంలో ఆయా పార్టీలు పెడుతున్న మడత పేచీతో కాంగ్రెస్ తలబొప్పికడుతోంది. ముఖ్యంగా టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లపై పీటముడి నెలకొంది. నిన్నటి వరకు కేవలం మూడు స్థానాలకే తెలుగుదేశం పరిమితమవుతుందన్న చర్చలు కాస్తా తాజాగా మరిన్ని నియోజకవర్గాలకు పాకడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇబ్రహీంపట్నం కూడా.. ఇప్పటికే ఉప్పల్, శేరిలింగంపల్లి స్థానాలు టీడీపీ ఖాతాలో చేరిపోయాయి. వీటికి ఆ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాగా, తాజాగా కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ లేదా ఇబ్రహీంపట్నం సీటును కూడా సర్దుబాటు చేయాలని తెలుగుదేశం ఒత్తిడి పెంచింది. ఢిల్లీ స్థాయిలో ఆ పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ హైకమాండ్‌కు ఈమేరకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. దీంతో రాజకీయ సమీకరణలు దాదాపుగా మారిపోతున్నాయి. సీట్ల పంపకాలలో కూకట్‌పల్లిని టీడీపీకి వదలాలని మొదట్నుంచి కాంగ్రెస్ అనుకుంటోంది. మరోవైపు సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి ఆశిస్తున్న రాజేంద్రనగర్ సీటుకు కూడా టీడీపీ ఎసరు తెస్తోంది. ఇప్పటికే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ నిబంధనతో కార్తీక్‌కు ముప్పు పొంచి ఉండగా.. తాజా పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాఉండగా, ఎల్బీనగర్ స్థానంపై టీడీపీ గట్టిగా పట్టుపడుతోంది. ఈ స్థానం నుంచి సామ రంగారెడ్డిని బరిలో దించాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సెగ్మెంట్‌ను మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బలంగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో వదలుకోవద్దని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ పొత్తులో ఈ సీటు దక్కకపోతే ఇబ్రహీంపట్నం సీటును అడగాలని దేశం నాయకత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రతిపాదనలను ఏఐసీసీ ముందుంచుంది. ఈ సెగ్మెంట్ నుంచి సామ రంగారెడ్డి లేదా రొక్కం భీంరెడ్డిని బరిలోకి దించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తాజా పరిణామాలు కాంగ్రెస్ ఆశావహులను ఆత్మరక్షణలో పడేసింది. ఈ సీటును ఆశిస్తున్న డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌కు, మల్రెడ్డి బ్రదర్స్‌కు మింగుడుపడడంలేదు. ప్రతాపరెడ్డికీ డౌటేనా..? షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అభ్యర్థిత్వం కూడా కష్టమేనని తెలుస్తోంది. మొదటి జాబితాలోనే ఆయన పేరు ఉంటుందని భావించినా.. పెండింగ్ పెట్టడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. షాద్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థిగా కేవలం ప్రతాపరెడ్డే ఉన్నారు. ఒకరే పోటీపడుతున్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఈ సెగ్మెంట్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇచ్చే అంశంపై కూడా పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ వీర్లపల్లి శంకర్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. టీజేఎస్ టికెట్ కోసం తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ప్రతాపరెడ్డి పేరును పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. కిచ్చెన్నకు ఇచ్చేనా..? మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆశిస్తున్న మేడ్చల్ టికెట్‌పై ఇంకా స్పష్టత రావడంలేదు. ఈయన అభ్యర్థిత్వానికి పీసీసీ ముఖ్యులు మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనపై ఏఐసీసీకి నివేదిక సమర్పించిన పీసీసీ పెద్దలు టికెట్ రాకుండా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన తోటకూర జంగయ్యయాదవ్‌కు టికెట్ దక్కేలా సామాజిక సమతుల్యతను తెరమీదకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు వీరిరువురికి కాకుండా టీజేఎస్ కోటాలో మేడ్చల్‌ను కేటాయిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
వీళ్లకు అసలు ‘ఇస్తరా.. ఇవ్వరా’!
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల సంకేతాలు వెలువడగానే ‘తమకు టికెట్ గ్యారంటీ’ అని కొందరు నాయకులు పండగ చేసుకున్నారు. అధికార పార్టీ తొలి జాబితాలో తమ పేర్లు లేకపోయేసరికి ఒకింత కలవరపడ్డారు. త్వరలో రెండో జాబితా వస్తుందని.. అందులో తాము తప్పక ఉంటామని సర్దిచెప్పుకున్నారు. అయితే, పండగలు, పర్వదినాలు వెళుతున్నా.. టీఆర్ ఎస్ రెండో జాబితా ఊసెత్తకపోవడం నగరంలోని ముఖ్య నేతలందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ‘ఇస్తరా.. ఇవ్వరా’ అన్న విషయంపై కూడా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం టికెట్లు ఆశిస్తున్న సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. ఆదివారం నిర్వహించిన అభ్యర్థుల దిశానిర్దేశనానికి సైతం తమకు పిలుపు రాకపోవడంతో ‘మరికొన్ని రోజులు సస్పెన్స్ ఎలా భరించా’లంటూ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ముషీరాబాద్ స్థానంలో తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి గాని లేదంటే తనకుగాని టికెట్ ఇవ్వాలని హోంమంత్రి నాయిని పార్టీ అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ సీటు తనదేనన్న భరోసాతో స్థానిక నాయకుడు ముఠా గోపాల్ ఉన్నారు. మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి టికెట్ తనదంటే తనదేనన్న ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. మైనంపల్లి అయితే ఏకంగా ప్రత్యేక ఎన్నికల ప్రచార వాహనాలను సైతం తయారు చేయించి వాడవాడలా ప్రచారం చేస్తూ తిరిగేస్తున్నారు. ఇక చింతల కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతి సైతం టికెట్ దక్కుతుందన్న ఆశతో ప్రచారం మొదలెట్టారు. దీంతో మల్కాజిగిరిలో పార్టీ గ్రూపులుగా చీలిపోయింది. తమకు టికెట్ ఇస్తారో..ఇవ్వరో పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేయాలని కనకారెడ్డి పేర్కొంటున్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎంపీ మల్లారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. తాజా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డితో రాజీ చేసుకోవాలని సూచించారు. అయితే, జరిగేదేదో కేసీఆర్ సమక్షంలో జరిగితేనే తాను చర్చలకు వస్తాను తప్ప మరేచోటికి వచ్చేది లేదని సుధీర్‌రెడ్డి స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో మేడ్చల్‌లోనూ ప్రచారం అయోమయంగానే కొనసాగుతోంది. ఖైరతాబాద్‌పై కిరికిరి.. ఈ నియోజకవర్గం విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో టికెట్ ఆశిస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో అందోళన వ్యక్తమవుతోంది. తొలుత గోషామహల్ స్థానానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్న మాజీ మంత్రి దానం నాగేందర్.. మనసు మార్చుకుని ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో వినాయక చవితి, బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో పాలుపంచుకుంటూ తానే అభ్యర్థినని ప్రకటిస్తున్నారు. కానీ ‘టికెట్ నీకే’ అన్న అభయం పార్టీ అధినేత పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం దానం శిబిరంలో ఆలజడి రేపుతోంది. మరోవైపు కార్పొరేటర్ విజయారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి సైతం టికెట్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. విజయారెడ్డి కూడా ఇక్కడి బస్తీల్లో జరిగే ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో కాలేరు వెంకటేష్ పేరుపై ఏకాభిప్రాయం వచ్చినా.. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ సీటు ‘కాలేరు’కు ఇస్తే ఒప్పుకోమని, తమలో ఎవరికి ఇచ్చినా ‘ఓకే’నంటూ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన గళాలు వినిపిస్తున్నారు. అయితే, ఎవరి స్థానం ఏంటో తెలియాలంటే మాత్రం టీఆర్ఎస్ రెండో జాబితా వెలువడే దాకా వేచి చూడాలిసందే. -
మొదటి విడతలో ఐదుగురు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో 38 మందితో శనివారం రాత్రి జాబితా విడుదల చేయగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఐదు నియోజకవర్గాల నుంచి పోటీ దిగే అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేని, ఎక్కువ మంది ఆశావహులు లేని నియోజకవర్గాలకు సం బంధించి తొలి జాబితాలో స్థానం కల్పించినట్లు తె లుస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ కి దిగనున్న అభ్యర్థుల పేర్లతో రాష్ట్ర పార్టీ నాయకత్వం పార్లమెంటరీ బోర్డుకు తాజాగా జాబితా సమర్పించింది. ఇదే జాబితాలోని పేర్లను బోర్డు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి బి.కొండ య్య పేరు ఖరారు చేయగా నారాయణపేట నుంచి కె.రతంగ్ పాండురెడ్డి, కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి, గద్వాల జి.వెంకటాద్రిరెడ్డి, అచ్చంపేట నుంచి మల్లేశ్వర్ పేర్లను ఖరారు చేశారు. ఇప్పటికే ప్రచారం ఒకరు కంటే ఎక్కువ మంది ఆశావహులు ఉన్న నియోజకవర్గాలను పక్కన పెట్టి.. ఒకరు మాత్ర మే టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో నాయకులకు రాష్ట్ర నాయకత్వం నుంచి కొద్దికాలం క్రితమే సంకేతాలు అందాయి. టికెట్ ఎలాగూ దక్కుతుందని చెబుతూ ప్రచారం చేసుకోవాలని సూ చించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కల్వకుర్తి, గద్వాల, అచ్చంపేట ల్లో కొండయ్య, రతంగ్‌పాండురెడ్డి, తల్లోజు ఆచా రి, వెంకటాద్రిరెడ్డి, మల్లేశ్వర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రచారంలో మునిగిపోయారు. తాజాగా వారి పేర్లనే ఖరారు చేయడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల తరహాలో వారు కూడా ప్రచారంలో దూసుకుపోనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్న రెండో జాబితాలో వెల్లడిస్తారని తెలుస్తోంది. మరోపక్క మహాకూటమి అభ్యర్థులు తేలాక అసంతృప్తులెవరైనా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపే అంశాన్ని పరిశీలించాక రెండో జాబితా విడుదల చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. -
తెలంగాణ ఎన్నికలు: కాంగ్రెస్ తొలి జాబితా సిద్ధం
-
ఫైనల్ గేర్
సాక్షి,సిటీబ్యూరో: ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాకు టీఆర్ఎస్ ఫైనల్ టచ్ ఇచ్చింది. ఖైరతాబాద్ స్థానానికి మాజీ మంత్రి దానం నాగేందర్, మేడ్చల్‌కు ఎంపీ మల్లారెడ్డి, మల్కాజిగిరికి మైనంపల్లి హన్మంతరావు, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్, గోషామహల్‌కు ప్రేమ్‌సింగ్ రాథోడ్ల అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. మంగళవారం అమావాస్య కారణంగా జాబితా ప్రకటనకు బ్రేక్ వేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గం అభ్యర్థిత్వం కోసం దానం నాగేందర్‌తో పాటు కార్పొరేటర్లు విజయారెడ్డి, విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి పోటీ పడ్డా.. వివిధ కారణాలతో పార్టీ ముఖ్య నేతలు దానం వైపే మొగ్గు చూపినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల కథనం. నాగేందర్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించగానే విజయారెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముషీరాబాద్ స్థానంలోనూ ఆయన కోరికకు భిన్నంగా ముఠా గోపాల్‌ను ఖరారు చేశారు. గోపాల్‌కు బదులు ఆ సీటును నాయిని అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని, అదీ కుదరకపోతే తనకే ఇవ్వాలని నాయిని.. పార్టీ ముఖ్య నేతలకు విన్నవిస్తూ వస్తున్నారు. కానీ అవేవి పరిగణలోకి తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక మేడ్చల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో ఆ స్థానంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిని ఖరారు చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతున్న దృష్ట్యా మల్లారెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ పదవి హామీతో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అంత సంతృప్తికరంగా లేనట్టు తెలిసింది. ఇక మల్కాజిగిరి స్థానాన్ని ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు ఖరారు చేశారు. ఈ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, తాను మాత్రంఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, రాజీపడే ప్రసక్తే లేదని కనకారెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. తొలుత దానం నాగేందర్‌కు కేటాయించిన గోషామహల్ స్థానాన్ని మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేంసింగ్ రాథోడ్‌కు కేటాయించారు. అంబర్‌పేట నియోకజకవర్గం టికెట్ కోసం నియోకజవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌లు పోటీ పడ్డా.. చివరికి కాలేరు వెంకటేష్‌కు ఖరారు చేశారు. ఇక్కడ పలువురు కార్పొరేటర్లు వెంకటేష్ అభ్యర్థితాన్ని వ్యతిరేకిస్తున్నా సరే ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు. కాలేరు.. సరికారు.. నలుగురు కార్పొరేటర్ల అసమ్మతి సాక్షి, సిటీబ్యూరో: అంబర్‌పేట నియోజకవర్గ టీఆర్ఎస్లో అసంతృప్తి అగ్గి ఒక్కసారిగా బగ్గుముంది. ఈ నియోజకవర్గాన్ని కాలేరు వెంకటేష్‌కు కేటాంచారన్న వార్తల నేపథ్యంలో నియోజకవర్గంలోని నలుగురు కార్పొరేటర్లు తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పార్టీని గెలిపిస్తామని అంబర్‌పేట కార్పొరేటర్ పులి జగన్, నల్లకుంట కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి, బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ పద్మావతి, కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్యకన్నా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం సమావేశం పెట్టి మరీ ఈ నలుగురు తమ అసమ్మతిని ప్రకటించారు. నియోజకవర్గంలో వరుస విజయాలు సాధించిన తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఢీకొనాలంటే ఆయనకు తగిన బలమైన అభ్యర్థి బరిలో ఉండాలని వారు చెబుతున్నారు. కాలేరు వెంకటేశ్‌తో అది సాధ్యం కాదని, ఆయనకు టికెట్ ఇస్తే తాము పనిచేయమని పరోక్షంగా చెబుతున్నారు. -
ఎలక్షన్ హీట్: ఒంటరిగానే బరిలోకి బీజేపీ
-
ఫస్ట్ బ్యాచ్
సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత శాసనభ రద్దుకు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న పార్టీ, తాజా పరిస్థితులను అంచనా వేస్తూ ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనలకు తెరలేపుతోంది. తాము ఏకాభిప్రాయం వ్యక్తమైన స్థానాల్లో వారికే నేరుగా ఫోన్ చేసి ‘పని చేసుకోవాల్సింది’గా పార్టీ ముఖ్యనేతలు సూచిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ప్రగతిభవన్ నుంచి నగరానికి చెందిన పలువురు అభ్యర్థులకు ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సనత్‌నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, వివేకానంద్, కృష్ణారావు, సాయన్నతో పాటు సికింద్రాబాద్ నుంచి మరోసారి మంత్రి పద్మారావుకు నియోకజవర్గంలో ఎన్నికల మైక్పట్టుకోమంటూ ప్రధాన నేతలు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలపై కొద్ది రోజులుగా జరుగుతున్న తర్జనభర్జనల అనంతరం మంగళవారం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సూచనప్రాయంగా అభ్యర్థుల స్థానాలను ఖరారు చేసినట్లు సమాచారం. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతి పేరుపై వాడీవేడిగా చర్చ జరిగిందని విశ్వసనీయ సమాచారం. ఐతే ఈ మారు కూడా తానే పోటీ చేసేందుకు కనకారెడ్డి మొగ్గు చూపుతున్న దృష్ట్యా, ఆయనతో చర్చించిన తర్వాత విజయశాంతి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఇదే నియోకజవర్గానికి చెందిన ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు సైతం ఈసారి ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. మంగళవారం జరిగిన సమావేశానికి హన్మంతరావు హాజరు కాలేదు. ఇక మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాలపై కూడా చర్చ జరిగినప్పుటికీ అధికారిక ప్రకటనకు మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మేడ్చల్ లేదా ఉప్పల్ స్థానాలపై ఎంపీ మల్లారెడ్డి లేదా ఆయన సమీప బంధువు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో ఈ రెండు స్థానాలను ఇప్పటికిప్పుడు పేర్లను ప్రకటించకుండా మరికొంత సమయం తీసుకోవాలని, మరో సర్వే నిర్వహించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. మేడ్చల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు ఎంపీ మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్లపైనా చర్చించినట్టు తెలిసింది. ఎల్బీనగర్ నియోకజవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్‌గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వీరిద్దరి అభ్యర్థిత్వాలపైనా చర్చింది. అయితే, చివరకు రామ్మోహన్‌గౌడ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉప్పల్ నియోకజవర్గానికి సంబంధించి మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు పార్టీ ముఖ్యులు పేర్కొంటున్నారు. -
ఒకే జాబితా !
ప్రకటించిన డీఎంకే 173 స్థానాల్లో అభ్యర్థులు మళ్లీ తిరువారూర్‌లో కరుణ కొళత్తూరులో స్టాలిన్ 19 మంది మహిళలకు సీట్లు పుదుచ్చేరిలోనూ కుదిరిన ఒప్పందం ఒకే జాబితాగా అభ్యర్థులు చిట్టాను డీఎంకే ప్రకటించింది. 173 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతూ జాబితాను అధినేత కరుణానిధి ప్రకటించారు. మళ్లీ తిరువారూర్ నుంచి కరుణానిధి, కొళత్తూరు నుంచి ఎంకే స్టాలిన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ముఖ్య నేతలతో పాటు, కొత్త ముఖాలకు పెద్ద పీట వేశారు. 19 మంది మహిళలకు చోటు కల్పించారు. ఇక పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్‌తో పొత్తు సఫలీకృతమైంది. సాక్షి, చెన్నై : మళ్లీ అధికారమే లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన రాజతంత్రాన్ని ప్రయోగించి వ్యూహాల్ని రచిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్, ఇండియన్యూనియన్ ముస్లిం లీగ్, మనిద నేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, ఎండీఎండీకే, పెరుంతలైవర్ మక్కల్ కట్చి, సమూహ సమత్తువ పడై, వ్యవసాయ తొళిలార్ కట్చిలతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. మిత్రలందరికీ సీట్ల పంపకాలు ముగియడంతో, ఇక 173 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు నిర్ణయించారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కరుణానిధి బుధవారం సాయంత్రం ప్రకటించారు. తిరువారూర్ నుంచి కరుణానిధి, కొలత్తూరు నుంచి ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేయనున్నారు. ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న దురైమురుగన్ - కాట్పాడి నుంచి పోటీ చేస్తుండగా, వయోభారం దృష్ట్యా, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, సీనియర్ నేట ఆర్కాటు వీరస్వామి రేసు నుంచి తప్పుకున్నారు. ఇక, పార్టీలు ముఖ్య నాయకులుగా, మాజీ మంత్రులుగా పనిచేసిన కేఎన్ నెహ్రూ, పొన్ముడి, ఎంఆర్కే పన్నీరు సెల్వం, పూంగోదై, సురేష్ రాజన్, తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, ఐ పెరియస్వామి, ఏవీ వేలు, వంటి ముఖ్యులకు, మాజీ స్పీకర్ ఆవుడయప్పన్కు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురికి మళ్లీ సీటు కేటాయించారు. దక్షిణాది జిల్లాల్లో, కొంగు మండలం, డెల్టా జిల్లాల్లో అత్యధికంగా కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఇక, 19 మంది మహిళలకు డీఎంకేలో సీటు కేటాయించడం విశేషం. సీఎం జయలలిత బరిలో ఉన్న ఆర్కే నగర్ నుంచి మహిళా అభ్యర్థిగా సిమ్లా ముత్తు చొళన్ ఎన్నికల్లో ఢీ కొట్టనున్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల వివరాలు : చెన్నై చేపాక్కం - ట్రిప్లికేన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్భళగన్ మళ్లీ రేసులో దిగారు. పొన్నేరి- కె పరిమలం, తిరువళ్లూరు - విజి రాజేంద్రన్, పూందమల్లి- పరంథామన్, ఆవడి - నాజర్, మాదవరం - ఎస్సుదర్శన్, విల్లివాక్కం - రంగనాధన్, ఎగ్మూర్ - కేఎస్ రవిచంద్రన్, సైదా పేట - ఎం సుబ్రమణ్యన్, హార్బర్ పీకే శేఖర్ బాబు, అన్నానగర్ - ఎంకే మోహన్, థౌజండ్ లైట్స్ - సెల్వం విరుగంబాక్కం ధన శేఖరన్, వేళచ్చేరి - సినీ నటుడు వాగై చంద్రశేఖరన్, తాంబరం -ఎస్ఆర్ రాజ, పల్లావరం - ఇ కరుణానిధి, కాట్పాడి - దురై మురుగన్, తిరుచెందూరు - అనితా రాధాకృష్ణన్, తిరుకోవిలూరు - పొన్ముడి, ఆత్తూరు - ఐ పెరియస్వామి, తిరుచ్చి పశ్చిమం కేఎన్ నెహ్రు, ఆలంకులం - పూంగోదై, పాళయం కోట్టై - మైదీన్ ఖాన్, తిరుచ్చూలి - తంగం తెన్నరసు, తిరువణ్ణామలై - ఏవి వేలు, నాగర్‌కోవిల్ సురేష్ రాజన్, కురింజి పాడి - ఎం ఆర్కే పన్నీరు సెల్వంలతో పాటుగా 173 మంది ఈ ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. అలాగే, గుమ్మిడిపూండి నియోజకవర్గాన్ని డీఎండీకే నుంచి బయటకు వచ్చిన ఎండిఎండికేకు కేటాయించారు. పుదుచ్చేరిలోనూ : తమిళనాటే కాదు, పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ , డిఎంకేలు కలసి కట్టుగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలం ఎక్కువ కావడంతో ఆ పార్టీకి ఎక్కువ స్థానాల్ని కేటాయించారు. ఇక్కడ కాంగ్రెస్ 21 స్థానాల్లోనూ, డిఎంకే 9 స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. ఇందుకు తగ్గ ఒప్పంద పత్రాలపై డిఎంకే అధినేత ఎం కరుణానిధి, పుదుచ్చేరి కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి నారాయణ స్వామి తదితరులు సంతకాలు చేశారు. -
సామాజిక సమతూకం పాటించిన వైఎస్ఆర్ సీ పీ
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సమాజిక సమతూకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ జాబితాలో అన్ని వర్గాల వారికీ తగిన ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో.. కేవలం 6 స్థానాలకు మినహా మిగతా స్థానాలన్నిటికీ ఒకేసారి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో ఆయా వర్గాల ప్రాబల్యాన్ని బట్టి ఎవరినీ విస్మరించకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఎంపికలో సమతౌల్యం పాటించినట్టు కనిపిస్తోంది. జాబితాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కింది. కాపు, బలిజ సామాజిక వర్గానికి అత్యధికంగా 25 శాసనసభ, 5 లోక్‌సభ స్థానాలను కేటాయించారు. బీసీ, మైనారిటీలకు కలిపి మొత్తం 32 శాతం అసెంబ్లీ టికెట్లిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 స్థానాలు, 24 లోక్‌సభ నియోజకవర్గాల్లో 3 స్థానాలు బీసీలకు కేటాయించారు. బీసీల్లోని కాళింగ, వెలమ, తూర్పుకాపు, యాదవ, మత్స్యకార, గవర, శెట్టిబలిజ, పద్మశాలి, గౌడ, బోయ, కురువ, వన్యకాపు తదితర సామాజిక వర్గాలకు చోటు దక్కింది. ముస్లింలకు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల టికెట్లు ఇచ్చారు. ఇప్పటి వరకూ ప్రకటించిన 26 ఎస్సీ రిజర్వుడ్ శాసనసభ స్థానాల్లో 18 చోట్ల మాల సామాజికవర్గానికి, 8 నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించారు మూడు ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానాల్లో రెండు చోట్ల మాల వర్గానికి, ఒక చోట మాదిగ వర్గానికి అవకాశం కల్పించారు. 24 లోక్‌సభ స్థానాల్లో 5 సీట్లు మహిళలకు కేటాయించడం విశేషం. శాసనభ స్థానాల్లో 11 చోట్ల మహిళలకు టికెట్లు కేటాయించారు. రెడ్డి సామాజిక వర్గానికి 52 అసెంబ్లీ, 9 లోక్‌సభ సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి 11 శాసనసభ, 2 లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలకు కూడా సీట్లు కేటాయించారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచీ వెన్నంటి ఉన్న వారి విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని, పార్టీ కోసం అధికారపక్షం నుంచి పదవులను వదులుకుని వచ్చిన వారికి కూడా టికెట్ల కేటాయింపులో సముచిత ప్రాధాన్యం లభించింది. పార్టీలో క్రియాశీలంగా ఉన్న సీనియర్లు, కొత్త రక్తంతో ముందుకు వచ్చిన యువతకు సాధ్యమైనంత మేరకు జగన్ అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చినపుడు పార్టీ నిర్ణయానుసారం ప్రజల పక్షాన నిలబడి వ్యతిరేకంగా ఓట్లు వేసి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలందరికీ జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాలి రాజేశ్‌కుమార్ మాత్రం తాము స్వచ్ఛందంగా తప్పుకుని తమ కుటుంబీకులకు అవకాశం కల్పించారు. -
అభ్యర్థుల ఎంపికలో సమతౌల్యం పాటించిన వైఎస్సార్సీపీ
-
ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బిజెపి
తెలంగాణలో పోటీచేయాల్సిన ఎనిమిది సీట్లకు గాను ఏడు సీట్లకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యాలు, అనూహ్యాలు ఏమీ లేవు. రెండు సార్లు నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎండల లక్ష్మీనారాయణను నిజామాబాద్ లోకసభ అభ్యర్థిగా, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా పలు సంవత్సరాలుగా పనిచేస్తున్న డా. భగవంతరావు పవార్ ను హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించారు. దీనిలో ముగ్గురు డాక్టర్లుండటం విశేషం. హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ అభ్యర్థులు ముగ్గురూ డాక్టర్లే. బీజేపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. కరీంనగర్ - చెన్నమనేని విద్యాసాగర రావు నిజామాబాద్ - ఎండల లక్ష్మీనారాయణ మెదక్ - చాగండ్ల నరేంద్ర నాథ్ సికింద్రాబాద్ - బండారు దత్తాత్రేయ హైదరాబాద్ - డాక్టర్ భగవంత రావు మహబూబ్ నగర్ - డా. నాగం జనార్దన రెడ్డి. వరంగల్ (ఎస్ సి) డా. రామగళ్ల పరమేశ్వర్ కరీంనగర్ సీటుకు బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర రావు పోటీ పడినా, పార్టీ ఎన్నికల సంఘం పాత కాపు విద్యాసాగర రావు వైపే మొగ్గు చూపింది. అయితే మురళీధర రావు పార్టీ నిర్ణయాన్ని పూర్తిగా శిరసావహించడంతో టిక్కెట్ వివాదం సుఖాంతం అయింది. -
కాంగ్రెసోళ్లు ఖరారు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాపై నెలకొన్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రె స్ అధిష్టానం సోమవారం సాయంత్రంప్రకటించింది. సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేంసాగర్‌రావును ఖరా రు చేసింది. చెన్నూరు నుంచి జి.వినోద్, బోథ్ నుంచి అనీల్‌జాదవ్, ఖానాపూర్ నుంచి అజ్మీరా హరినాయక్, ముథోల్ నుంచి విఠల్‌రెడ్డిల పేర్లను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈసారి టిక్కెట్లు దక్కాయి. ఆసిఫాబాద్(ఎస్టీ) ఆత్రం సక్కు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల నుంచి గడ్డం అరవిందరెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ అభ్యర్థిగా అనూహ్యంగా ఎన్ఎ స్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్‌దేశ్ పాండే పేరు ను అధిష్టానం ప్రకటించింది. డీసీసీ ప్రతిపాదించిన జా బితాలో నుంచి అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. డీసీసీ అధ్యక్షునికి నిరాశే.. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించిన డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డికి, పీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాతలకు నిరాశే మిగిలింది. నిర్మల్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌లో చేరిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి కూడా టిక్కెట్ దక్కలేదు. సిర్పూర్ నుంచి కోనేరు కోనప్ప టిక్కెట్ ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఖానాపూర్ టిక్కెట్ ఆశించిన భుక్యా రమేష్‌కు, ముథోల్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన నారాయణరావు పటేల్‌లకు కూడా నిరాశే మిగిలింది. బోథ్ అభ్యర్థిత్వం కోసం కొమురం కోటేష్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఖానాపూర్ నుంచి భక్షినాయక్, భరత్‌చౌహాన్‌లు కూడా టిక్కెట్ ఆశించారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. చెన్నూరు టిక్కెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలు సొత్కు సంజీవరావు, దాసారపు శ్రీనివాస్ తదితరులకు వినోద్ రాకతో చెక్ పడినట్లయింది. జన రల్ స్థానాలు ఓసీలకే.. జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు ఐదు స్థానాలు ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన ఐదు జనరల్ స్థానాల్లో ఒక్కరికి కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు కూడా అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. మైనార్టీల ఊసే లేకుండా కాంగ్రెస్ అధిష్టానం జాబితాను ప్రకటించింది. ఎస్టీలకు రిజర్వు అయిన మూడు స్థానాల్లో రెండు స్థానాలను లంబాడా సామాజిక వర్గాలకు కేటాయించారు. ఆసిఫాబాద్ నుంచి మాత్రం గోండు సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సక్కుకు అవకాశం లభించింది.