
ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బిజెపి
తెలంగాణలో పోటీచేయాల్సిన ఎనిమిది సీట్లకు గాను ఏడు సీట్లకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యాలు, అనూహ్యాలు ఏమీ లేవు. రెండు సార్లు నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎండల లక్ష్మీనారాయణను నిజామాబాద్ లోకసభ అభ్యర్థిగా, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా పలు సంవత్సరాలుగా పనిచేస్తున్న డా. భగవంతరావు పవార్ ను హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించారు. దీనిలో ముగ్గురు డాక్టర్లుండటం విశేషం. హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ అభ్యర్థులు ముగ్గురూ డాక్టర్లే.
బీజేపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి.
కరీంనగర్ - చెన్నమనేని విద్యాసాగర రావు
నిజామాబాద్ - ఎండల లక్ష్మీనారాయణ
మెదక్ - చాగండ్ల నరేంద్ర నాథ్
సికింద్రాబాద్ - బండారు దత్తాత్రేయ
హైదరాబాద్ - డాక్టర్ భగవంత రావు
మహబూబ్ నగర్ - డా. నాగం జనార్దన రెడ్డి.
వరంగల్ (ఎస్ సి) డా. రామగళ్ల పరమేశ్వర్
కరీంనగర్ సీటుకు బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర రావు పోటీ పడినా, పార్టీ ఎన్నికల సంఘం పాత కాపు విద్యాసాగర రావు వైపే మొగ్గు చూపింది. అయితే మురళీధర రావు పార్టీ నిర్ణయాన్ని పూర్తిగా శిరసావహించడంతో టిక్కెట్ వివాదం సుఖాంతం అయింది.