
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండో లిస్ట్‌ను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ప్రకటించింది. సోయం బాబూరావు (ఆదిలాబాద్), ఎస్ కుమార్ (పెద్దపల్లి), బాణాల లక్ష్మారెడ్డి (జహీరాబాద్), భగవంత్ రావు (హైదరాబాద్), బీ జనార్థన్ (చేవెళ్ల), వాసుదేవ రావు (ఖమ్మం)కి పార్టీ టికెట్లు కేటాయించింది. మెదక్ స్థానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా పదిమందితో కూడిన తొలి జాబితాను గురువారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. మెదక్ మినాహా మిగతా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు
స్థానం అభ్యర్థి పేరు
ఆదిలాబాద్(ఎస్టీ) : సోయం బాబూరావు
కరీంనగర్: బండి సంజయ్
నిజామాబాద్: డి. అరవింద్
మల్కాజిగిరి: ఎన్ రామచంద్రరావు
సికింద్రాబాద్: కిషన్ రెడ్డి
మహబూబ్‌నగర్: డీకే అరుణ
నాగర్‌కర్నూల్ (ఎస్సీ): బంగారు శ్రుతి
నల్లగొండ: గార్లపాటి జితేంద్రకుమార్
భువనగిరి: పీవీ శ్యామ్‌సుందర్ రావు
వరంగల్: చింతా సాంబమూర్తి
మహబూబాబాద్: హుస్సేన్‌నాయక్
పెద్దపల్లి(ఎస్సీ) : ఎస్ కుమార్
ఖమ్మం: వాసుదేవ రావు
చేవెళ్ల: బీ జనార్థన్
హైదరాబాద్: భగవంత్ రావు
జహీరాబాద్: బాణాల లక్ష్మారెడ్డి