సాక్షి, హైదరాబాద్: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడీ నెలకొంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు రంగ సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో దిగడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి.
ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తుంది. తెలంగాణ బీజెపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం దీనిని.. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపినట్లు సమాచారం. మేజార్టీ స్థానాలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. తొలిజాబితాలో ఎనిమిది నుంచి 10 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ కంటే ఇరువై రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాషాయ పార్టీ యోచిస్తోంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌లను తిరిగి ఎంపీలుగా పోటీలో నిలపాలని నిర్ణయించింది.
ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇక ఆదిలాబాద్‌లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment