బీజేపీ నేతలపై మూక దాడి | goons attack on bjp mp Khagen Murmu in West bangal | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలపై మూక దాడి

Oct 6 2025 3:27 PM | Updated on Oct 7 2025 6:16 AM

goons attack on bjp mp Khagen Murmu in West bangal

ఎంపీ ఖగేన్‌ ముర్ము, ఎమ్మెల్యే శంకర్‌ ఘోష్‌కు గాయాలు

బెంగాల్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లగా ఘటన

నగరాకాటా: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యట నకు వెళ్లిన సమయంలో జరిగిన మూకదాడిలో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లా నగరాకాటా వద్ద సోమవారం చోటుచేసుకుంది. దుఆర్‌ ప్రాంతంలో ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, అందుతున్న సాయాన్ని పరిశీలించేందుకు బీజేపీ ఏర్పాటు చేసిన బృందంలో ఎంపీ ఖగేన్‌ ముర్ము, ఎమ్మెల్యే శంకర్‌ ఘోష్‌ ఉన్నారు. 

వరద బాధితుల దగ్గరికి వెళ్తున్న ఆ నేతల కాన్వాయ్‌ని బమన్‌దాంగా వద్ద ఓ గుంపు చుట్టు ముట్టింది. ‘దీదీ, దీ దీ..’అని నినాదాలు చేస్తూ వాహనాలపై వారు రాళ్లు రువ్వారు. వాహనాల కిటికీల అ ద్దాలు పగిలిపోయా యి. ముర్ము తలకు గాయమై రక్తం కారింది. భయంతో ఘోష్‌ వణికిపోయారు. ఇందుకు సంబంధించిన లైవ్‌ వీడియో ఫేస్‌బుక్‌లో ఉంది. దుండగులు తమను దూషిస్తూ వెనుక నుంచి రాళ్ల దాడికి దిగారని శంకర్‌ ఘోష్‌ చెప్పారు. ఖగేన్‌కు రాళ్లు తగలడంతో భయపడి సీటు వెనుక దాక్కున్నట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎంపీ ఖగేన్‌ను సిలిగురిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

ఈ ఘటన టీఎంసీ ఆటవిక పాలనకు మరో నిదర్శనమంటూ బీజేపీ మండిపడింది. ఈ ప్రాంతంలో ప్రజల్లో రాజుకుంటున్న అసమ్మతిని అణచివేసేందుకే సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి చేయిస్తు న్నారని ఆరోపించింది. పోలీసుల సమక్షంలోనే తమ నేతల బృందంపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించింది. ఒక వైపు ప్రజలు వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంటే కోల్‌కతాలో సీఎం మమత మాత్రం ఉత్సవాలు చేసుకుంటున్నారని పేర్కొంది. ఇలా ఉండగా, సిలిగురిలోని వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు వెళ్లిన తమకు టీఎంసీ శ్రేణులు పదేపదే అడ్డు తగిలారని బీజేపీ బెంగాల్‌ అధ్యక్షుడు సమిక్‌ భట్టాచార్య ఆరోపించారు. తమ బృందంలో ఎంపీలు రాజు బిస్తా, జయంత రాయ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement