West Bangal CM mamata banerjee
-
బీజేపీ ‘సురక్షిత స్వర్గధామం’ వ్యాఖ్యలపై దీదీ, పోలీస్ శాఖ ఆగ్రహం
కోల్‌కతా : రామేశ్వరం కెఫే బాంబు పేలుడు అంశం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ తరుణంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ పోలీసులు తీవ్రంగా ఖండించారు. వెస్ట్‌బెంగాల్‌లోని రామేశ్వరం కెఫే బాండు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను వెస్ట్ బెంగాల్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సురక్షిత స్వర్గధామంగా అయితే, వెస్ట్ బెంగాల్లో బాంబు బ్లాస్ట్ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంపై బీజేపీ.. అధికార పార్టీ టీఎంసీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా ..‘‘రామేశ్వరం కెఫే పేలుడులో ఇద్దరు ప్రధాన నిందితులు, బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, సహచరుడు అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాను కోల్‌కతాలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ కర్ణాటకలోని శివమొగ్గలోని ఐఎస్ఐఎస్ సెల్‌కి చెందిన వారు. దురదృష్టవశాత్తూ మమతా బెనర్జీ హయాంలో పశ్చిమ బెంగాల్ ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మారింది’’ అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతేంటి అమిత్ మాల్వియా వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ కూచ్‌బెహార్ దిన్హటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తూ.. రామేశ్వరం కేఫె బ్లాస్ట్ కేసులో అరెస్టయిన నిందితులు తమ రాష్ట్రం వారని కాదని, ఇక్కడ తలదాచుకున్నారని సూచించారు. అయినప్పటికీ ఇక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన ఇద్దరు నిందితుల్ని రెండుగంట్లలోనే అరెస్ట్ చేశారని స్పస్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో శాంతి నెలకొంటే బీజేపీ సహించదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లు ఏమైనా సురక్షితంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. పోలీసుల పనితీరు అమోఘం ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ బీజేపీ వ్యాఖ్యల్ని ఖంఢించారు. బాంబు బ్లాస్ట్ కేసు నిందితుల్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాష్ట్ర పోలీసుల సహకారం వల్లే సాధ్యమైందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విషయం మీడియాలో వచ్చిందంటూ పునరుద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు ‘దేశ వ్యతిరేక శక్తులను అణచివేయడంలో దృఢంగా ఉన్నారు’ ఇతర దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని కొనియాడారు. Falsehood at its worst! Contrary to the claims made by @amitmalviya, the fact is that, two suspects in the Rameshwaram Cafe blast case have been arrested from Purba Medinipur in a JOINT operation by the West Bengal Police and the Central Intelligence Agencies. (1/2) — West Bengal Police (@WBPolice) April 12, 2024 పశ్చిమ బెంగాల్ పోలీసులు ఏమన్నారంటే మరోవైపు అమిత్ మాల్వియా వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ పోలీస్ విభాగం స్పందించింది. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని, ఆ తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మరో ట్వీట్లో తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం కాదు. రాష్ట్ర పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు అని పోలీసులు ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. -
మమతా బెనర్జీకి తప్పిన పెను ప్రమాదం
బెంగాల్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ఉదయం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టరును అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జల్పాయిపూర్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు వెళ్తూ బైకుంఠాపూర్ అడవులు దాటుతుండగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద హెలికాప్టరును ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు సిబ్బంది. ఒక్కసారిగా వర్షం ఉధృతం కావడంతో మార్గం స్పష్టంగా లేక ముందుకు వెళ్లడం ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఈ ఘటనలో మమతా బెనర్జీ స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పారు అధికారులు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకొని మమతా బెనర్జీ కోల్‌కతా పయనమైనట్లు తెలిపారు అధికారులు. Due to low visibility, West Bengal CM Mamata Banerjee's helicopter made an emergency landing at Sevoke Airbase. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. She is safe, says TMC leader Rajib Banerjee (file pic) pic.twitter.com/IVNIPV3oJD — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే! -
విపక్షాలకు మమత షాక్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం
కోల్‌కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండనుందని బాంబు పేల్చారు. ఈ ఓటింగ్‌కు తమ పార్టీ సభ్యులు గైర్హాజరవుతారని ప్రకటించింది టీఎంసీ. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయటంలో ఇతర విపక్షాల వైఖరే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అదే సమయంలో.. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు అభ్యంతరకరం. విపక్షాల అభ్యర్థికీ మేము మద్దతు ఇవ్వం. అందుకే ఓటింగ్‌కు మా పార్టీ సభ్యులు దూరంగా ఉంటారు.’ అని స్పష్టం చేశారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున జగదీప్ ధన్‌ఖడ్ పోటీ చేస్తున్నారు. బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. మరోవైపు.. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను బరిలోకి దింపాయి కాంగ్రెస్, ఎన్సీపీ సహా ఇతర పార్టీలు. శివసేన, జేఎంఎం వంటి పార్టీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు మద్దతు తెలపటమూ టీఎంసీ ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ఇటీవలే గవర్నర్ దగదీప్ ధన్‌ఖడ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో మమతా బెనర్జీ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టు 6న ఓటింగ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే. ఇదీ చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి -
మోదీ తర్వాత ప్రధాని ఎవరు?
న్యూఢిల్లీ: ‘ఈ అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు చిత్తుకాగితాలతో సమానం’ అని గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. కొద్ది మంది మినహా వారం రోజులుగా భారతదేశం మొత్తం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తోంది. ఇటు నిత్యావసరాలైన పాల దగ్గర్నుంచి పెట్రోల్ బంకుల దాకా జనం బాధలు చెప్పుకుంటే రాంలీలా! ఇంతలోనే‘నా చర్యలతో పేదవాడు ప్రశాంతంగా నిద్రపోయాడు’ అంటూ ప్రధాని చేసిన విలోమ ప్రకటన. వీటన్నింటి నేపథ్యంలో ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుత అధికార పార్టీకి చావుదెబ్బ తప్పదు’ అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఇలా(అర్ధాంతరంగా ఎన్నికలు జరిగే) అవకాశం నూటికి నూరుపాళ్లు లేనప్పటికీ ఒక ప్రధాన పార్టీలో మాత్రం ‘భావి ప్రధాని’ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ఢిల్లీలో చకచకా చోటుచేసుకున్న పరిణాలు ఆ చర్చకు మరింత బలాన్నివ్వడమేకాక మోదీ తర్వాత ప్రధాని ఎవనే ఆసక్తిని రెట్టింపుచేశాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో నోట్ల రద్దుతో జనం పడుతోన్న ఇబ్బందులే ప్రధాన ఆయుధంగా విపక్షాలు మోదీ సర్కారుపై యుద్ధం చేయనున్నాయి. నోటు పాట్లతోపాటు సర్జికల్ దాడులు, కశ్మీర్ పరిస్థితి, ఓఆర్ఓపీ, రైతు సమస్యలపైనా ప్రతిపక్షాలు ప్రశ్నల దాడి చేయనున్నాయి. ఎన్డీఏ అధికారం చేపట్టింది మొదలు ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో.. దాదాపు అన్ని విపక్ష పార్టీలు ఒకే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఏకతాటి నిర్ణయానికి వచ్చింది ఒక్క ‘నోట్ల రద్దు’ విషయం లోనేకావడం గమనార్హం. ఆ మేరకు మోదీ వ్యతిరేక గళాలన్నీ ఒకే రాగం ఆలపించేలా చేసిన ఘనత తమ అధినేత్రికే దక్కుతుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయడంలో తలెత్తిన ఇబ్బందులపై మాత్రమే మాట్లాడుతూ, (రద్దు)నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న పార్టీగా కాంగ్రెస్‘నోట్ల రద్దు వ్యతిరేక’ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ముందుకురాలేదు. అదేసమయంలో మోదీ నిర్ణయాన్ని మొదటి రోజు నుంచే ఖండిస్తోన్న పశ్చిమ బంగా సీఎం మమత నాయకత్వానికి కాంగ్రెస్ అంగీకరించినట్లు కనిపించింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు రాష్ట్రపతిభవన్ వరకూ విపక్షాలన్నీ మార్చ్ నిర్వహించాలన్న మమత ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ మొదట తలొగ్గినా తర్జనభర్జనల తర్వాత దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇంకో రెండున్నరేళ్లు కొనసాగించాల్సిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తాత్కాలిక అవసరం కోసం మమత వలలో పడటం భవిష్యత్తుకు ప్రమాదమని భావించడం వల్లే కాంగ్రెస్ మమతతో కలిసి మార్చ్ చేయడానికి వెనకడుగు వేసి ఉంటుందని విశ్లేషకుల భావన. చివరికి పార్లమెంటులో మాత్రమే అమీతుమీ తేల్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాగా మమత నేతృత్వంలో జరగనున్న మార్చ్ కు అనూహ్యరీతిలో బీజేపీ మిత్రపక్షం శివసేన అంగీకరించింది. వీరితోపాటు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కలిసి నడవనున్నారు. కీలక పార్టీలైన జేడీఎస్, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు కూడా మమతకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. మమత అనూహ్యంగా ఢిల్లీలో మెరిసిపోతుండటంతో ఉత్సాహభరితులైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ప్రెస్ మీట్లు పెట్టిమరీ ‘కాబోయే ప్రధాని మమతానే’ అనీ, ‘మోదీ తర్వాత దీదీనే’ అనీ ప్రకటనలు చేశారు. ఆ పార్టీకే చెందిన కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ ఒక అడుగు ముందుకేసి 2019 ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లొస్తాయనే లెక్కలు చదివారు. ఆయన ఊహ ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేవు. 42 ఎంపీ స్థానాలను గెలుచుకుని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా అవతరిస్తుంది. లాలూ, నితీశ్ లు తలో పాతిక సీట్లు, నవీన్ పట్నాయక్ బీజేడీ 20, డీఎంకే లేదా ఐఏడీఎంకేకి 40 సీట్లు, ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీకి 30 సీట్లు, మాయావతి బీఎస్పీకి 30 సీట్లు వస్తాయని, మిగతా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొనిపోతే మమతా బెనర్జీ సులువుగా ప్రధానమంత్రి కాగలరని ముకుల్ రాయ్ జోస్యం చెప్పారు.