
సాక్షి, విజయవాడ: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 77 శాతం మంది ఆర్జీయూకేటీలో సీట్లు దక్కించుకున్నారు. తొలి 20 ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూలు విద్యార్ధులే సాధించారు.
చదవండి: విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రారంభించిన ఆర్జీయూకేటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కొత్తగా ఒంగోలు క్యాంపస్ ప్రారంభించామన్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా పారదర్శకంగా ప్రవేశాలు చేట్టామన్నారు. ఈబీసీ కోటాలో 400 సీట్లు కేటాయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment