integrated courses
-
విద్యారంగానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు: బొత్స
-
AP: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, విజయవాడ: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 77 శాతం మంది ఆర్జీయూకేటీలో సీట్లు దక్కించుకున్నారు. తొలి 20 ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూలు విద్యార్ధులే సాధించారు. చదవండి: విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రారంభించిన ఆర్జీయూకేటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కొత్తగా ఒంగోలు క్యాంపస్ ప్రారంభించామన్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా పారదర్శకంగా ప్రవేశాలు చేట్టామన్నారు. ఈబీసీ కోటాలో 400 సీట్లు కేటాయించామన్నారు. -
ఇక కృత్రిమ మేధను చదివేయొచ్చు..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్ వంటి జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలే కాదు.. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లోనూ ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. దీంతో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు అందుకు ఓకే చెప్పాయి. వీటి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 కాలేజీలకు ఆమోదం తెలపగా, మరో రెండు కాలేజీలకు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలపనుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. కేంద్ర విధాన నిర్ణయాల్లో భాగంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు విద్యా సంస్థలు ముందుకు రావాలని సూచించింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మార్కెట్లో విపరీత డిమాండ్ ఉండగా, ఆ నైపుణ్యం ఉన్న వారు 2.5 శాతమే ఉన్నట్లు నేషనల్ ఎంప్లాయిబిలిటీ సర్వేలో తేలింది. 2016లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విలువ 3.2 బిలియన్ డాలర్లు కాగా, 2025 నాటికి 89.86 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదట ఐఐటీ హైదరాబాద్ ముందుకు వచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు కూడా గత 8 నెలలుగా ఆయా కోర్సులపై కసరత్తు చేశాయి. కోర్సుల డిజైనింగ్, బోధన సిబ్బంది తదితరాలపై ప్రణాళికలు రూపొందించుకుని వర్సిటీల నుంచి ఆమోదం పొందాయి. ఏడు కాలేజీల్లో కొత్త కోర్సులు.. రాష్ట్రంలోని ఏడు కాలేజీల్లో ఆరు రకాల కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి ప్రధాన అంశాలతో స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పేరుతో కొత్త కోర్సును రూపొందించింది. ఇక బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక కోర్సుగా సీవీఎస్ఆర్ కాలేజీ, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్‌ను వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సీవీఆర్ కాలేజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్)ను, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులను కిట్స్ కాలేజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కోర్సును మల్లారెడ్డి కాలేజీలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో సీవీఎస్ఆర్, విద్యాజ్యోతి, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, మల్లారెడ్డి కాలేజీల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రెండుమూడు రోజుల్లో స్టాన్లీ, కిట్స్ కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతి లభించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రతి కాలేజీకి 60 సీట్లు.. మొదటిసారిగా కోర్సును ప్రవేశ పెడుతున్నందున 60 సీట్లకే వర్సిటీలు ఆమోదం తెలిపాయి. దీంతో మొత్తంగా ఆయా కాలేజీల్లోని ఆయా కోర్సు ల్లో 480 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్ల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. 13 ఇంజనీరింగ్ కాలేజీల్లో 780 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇన్నాళ్లు బీటెక్ ఎంబీఏగా ఇంటిగ్రేటెడ్ కోర్సును రద్దు చేసి, ఆ సీట్లను బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్‌లో కలిపింది. ఇందులో గతంలో 75 సీట్లు మాత్రమే ఉండగా, ఇ ప్పుడు వాటి సంఖ్య 150కి చేరుకోనుంది. బీటెక్‌తోపాటు ఎంటెక్ కలిగిన ఈ ఐదేళ్ల కోర్సుకు డిమాండ్ ఉండటంతో జేఎన్టీయూ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది. -
బహుళ ప్రయోజనాలకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు
ఒకప్పుడు డీగ్రీ తర్వాత పీజీ చేయాలంటే వేర్వేరు కాలేజీల్లో చేరడం తప్పనిసరి. ఆ మేరకు సంబంధిత నిబంధనలు, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆవిర్భవించాయి. జాతీయ స్థాయిలో పలు యూనివర్సిటీలతోపాటు రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాల యాలు, ఐఐఎస్సీ, ఐఐటీలు కూడా ఇంజనీరింగ్ నుంచి హ్యుమానిటీస్ అంశాల వరకు ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు.. ఇంజనీరింగ్‌లోను.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాలేదు. ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ ఈ ఒరవడి కొనసాగుతోంది. ఐఐటీల విషయానికొస్తే..ఎంఎస్సీ, ఎంఎస్సీ టెక్, ఎంటెక్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి-ఐదేళ్లు. ఐఐటీ-ఖరగ్‌పూర్ ఎంఎస్సీ (స్పెషలైజేషన్స్-అప్లయిడ్ జియాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్), ఐఐటీ-బాంబే ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఐఐటీ-రూర్కీ ఎంఎస్సీ (అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఐఎస్ఎం-ధన్‌బాద్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్), ఐఎస్ఎం-ధన్‌బాద్ ఎంఎస్సీ టెక్ (స్పెషలైజేషన్స్-అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్). ఐఐటీ-రూర్కీ ఎంటెక్ (జియలాజికల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్), ఐఐటీ-వారణాసి ఎంటెక్ ( ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, జియోఫిజికల్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్) కోర్సులను అందిస్తున్నాయి. అంతేకాకుండా పలు రకాల స్పెషలైజేషన్స్‌తో బీటెక్+ఎంటెక్, ఎంఫార్మసీ డ్యూయల్ డిగ్రీ, బీఎస్, ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా ఇందులో ప్రవేశం పొందొచ్చు. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) ఎంట్రెన్స్ ద్వారా ఎంఎస్సీ- పీహెచ్డీ, ఎంఎస్సీ- పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఐఐటీల్లో చదివే అవకాశం ఉంది. ఐఐఎస్సీ బీఎస్-ఎంఎస్, ఐఐఎం-ఇండోర్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ వంటి విభిన్న కోర్సులను కూడా అందిస్తున్నాయి. జేఎన్టీయూలో కూడా: జేఎన్టీయూ-హైదరాబాద్ కూడా డబుల్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది. అవి.. బీటెక్+ఎంటెక్ (సివిల్ ఇంజనీరింగ్), బీటెక్ (సివిల్)+ఎంబీఏ , బీటెక్+ఎంటెక్ (మెకానికల్), బీటెక్ (మెకానికల్)+ఎంబీఏ, బీటెక్ (ఈఈఈ)+ఎంబీఏ, బీటెక్+ఎంటెక్ (ఈఈఈ), బీటెక్ (ఈసీఈ)+ఎంబీఏ, బీటెక్+ఎంటెక్ (ఈసీఈ), బీటెక్+ఎంటెక్ (సీఎస్ఈ), బీటెక్ (సీఎస్ఈ)+ఎంబీఏ. ఈ కోర్సుల్లో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అంతేకాకుండా అమెరికాలోని ఫ్లైట్ యూనివర్సిటీ, బ్యాంకాక్‌లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సుల్లో ఎంసెట్/జేఈఈ-మెయిన్ స్కోర్ ప్రామాణికంగా అడ్మిషన్లు నిర్వహిస్తారు. జేఎన్టీయూ-కాకినాడ, ఆంధ్రా యూనివర్సిటీలు కూడా డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందజేస్తున్నాయి. సంప్రదాయ సబ్జెక్ట్‌లలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు యూనివర్సిటీలు కూడా సంప్రదాయ సబ్జెక్ట్‌లలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందజేస్తున్నాయి. అవి..ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ, ఎంఏ (అప్లయిడ్ ఎకనామిక్స్), ఆంధ్రా యూనివర్సిటీ ఎంఏ (ఎకనామిక్స్), నాగార్జున యూనివర్సిటీ ఎంబీఏ, ఎంఎస్సీ (నానో టెక్నాలజీ). ఆయా యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇంటిగ్రేటెడ్ విభాగంలో ఎంఏ/ఎంఎస్సీ కోర్సులను బోధిస్తుంది. కాల వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సులను సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారు. 10 సెమిస్టర్లు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సెన్సైస్ సబ్జెక్ట్‌లను వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఎంఏ విభాగంలో హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులు, హ్యుమానిటీస్ కింద తెలుగు, హిందీ, ఉర్దూ భాషా కోర్సులు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ కింద ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ.. సైన్స్ అభ్యర్థులకు డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ చేసే అవకాశాన్ని కొన్ని రకాల కోర్సులు క ల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీకోర్సులుగా వ్యవహరిస్తారు. అటువంటి ఇన్స్టిట్యూట్లలో ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సును ఆఫర్ చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ -బెంగళూరు, కూడా బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తుంది. అంతేకాకుండా పలు ఇన్స్టిట్యూట్లు కూడా ఇటువంటి కోర్సులను ప్రవేశపెట్టాయి. తద్వారా పీజీ, పీహెచ్డీ కోర్సులను ఒకే చోట పూర్తి చేసే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. ప్రయోజనాలు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఎంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ ఒకే చోట చదివే అవకాశం లభిస్తుంది. తద్వారా విలువైన సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు. ఉదాహరణకు ఇంజనీరింగ్‌లో డిగ్రీని తీసుకుంటే.. బ్యాచిలర్ నాలుగేళ్లు, పీజీ రెండేళ్లు కలిపి మొత్తం ఆరేళ్లు. అదే ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ఐదేళ్లలోనే కోర్సును పూర్తి చేయవచ్చు. సంబంధిత సబ్జెక్ట్‌తోపాటు ఇతర అంశాలపై కూడా మంచి అవగాహన వస్తుంది. అంతేకాకుండా మారుతున్న పరిస్థితులు, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను రూపొందిస్తారు. తద్వారా కెరీర్లో త్వరగా స్థిరపడొచ్చు. ఐఐఎం లక్నో: ఐపీఎంఎక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-లక్నో, ఏడాది వ్యవధి గల ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కోర్సుకు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సును నాలుగు టర్మ్‌లలో బోధిస్తారు. ప్రతి టర్మ్ తొమ్మిది వారాల పాటు ఉంటుంది. ఇందులో మేనేజీరియల్ ఎకనామిక్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, జనరల్ మేనేజ్మెంట్ వంటి అంశాలను బోధిస్తారు. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రవేశ విధానం: జీమ్యాట్ స్కోర్ (2011, జూలై 1-అక్టోబర్ 30, 2014 మధ్య స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు), అనుభవం ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్వ్యూలు డిసెంబర్లో ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014. -
ఇక అన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులే!
' ఇంటర్‌తోనే ప్రవేశపెట్టేందుకు ఎన్సీటీఈ కసరత్తు ' ఐదారు రకాల కోర్సులపై అధ్యయనం ' నేడు బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌తోనే ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏడాది కోర్సులుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో రెండేళ్ల కోర్సులుగా మార్పు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులనే ప్రవేశపెట్టే అంశంపైనా దృష్టి సారించింది. అంతేకాదు పక్కాగా కళాశాలల నియంత్రణకు చర్యలు చేపట్టాలని నిర్ణయిం చింది. ఈ అంశాలన్నింటిపై శనివారం బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయాల్సిందేనన్న జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఎన్సీటీఈ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా, ప్రొఫెసన్ ఎన్కే జాన్గిరా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తమ నివేదికలను రెండు నెలల కిందట ఎన్‌సీటీఈకి అందజేశాయి. ఆ కమిటీలు ఉపాధ్యా య విద్య ప్రాధాన్యం, విద్యార్థులను తీర్చిదిద్దడంతో క్రియాశీల ంగా వ్యవహరించే ఉపాధ్యాయ పాత్ర, వారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉండాలన్న వివిధ అంశాలను చర్చించారు. పలు సూచనలు, సలహాల కోసం దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, అధికారులు కళాశాలల యాజమాన్యాలతో ఎన్సీటీఈ సమావేశాలు నిర్వహిస్తోంది. కళాశాలలను కూడా పటిష్టం చేసే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రతి కళాశాలలో 100 సీట్లు ఉంటే 50 సీట్లకు ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోం ది. 1:15 రేషియోలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బోధించేందుకు ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు ఉండగా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు అవసరమా? లేదా? అనే అంశాలపైనా చర్చించనుంది. ఎన్సీటీఈ ప్రణాళిక .. వివరాలు - రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ + గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (2+3+2) - నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2) - గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+2+2) - గ్రాడ్యుయేషన్ + మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+3) - నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఏ/బీఎస్సీ బీఈడీ) + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2) -
ఉన్నత విద్యకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు
మంచిర్యాల సిటీ : ఇంటర్ చదివాక డిగ్రీ. ఆ తర్వాత పీజీ చదవాలంటే ప్రవేశ పరీక్ష రాయాలి. ర్యాంకు రాకుంటే.. సీటు రాక ఏడాది వృథానే. అయితే ఇలాంటి కష్టాలేవీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరేవారికి ఉండవు. ఇంటర్ పూర్తయ్యాక ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరితే పీజీ అర్హత పరీక్ష ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా కాలమూ కలిసొస్తుంది. ఏడాది ఖర్చులూ మిగులుతాయి. ఇంటర్‌తో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు డిగ్రీ, పీజీ పట్టాతో రెండు కోర్సులు పూర్తి చేసుకొని యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. అంటే ఒక్కసారి చేరితే డిగ్రీ, పీజీ పట్టాలతో బయటకు రావడమే. ఇక వెతుక్కోవాల్సింది ఉద్యోగమే. కొత్తగా పలు యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ కోర్సులుగా ఇంజినీరింగ్, ఎం.ఏ., ఎంబీఏ, ఎమ్మెస్సీ అందిస్తున్నాయి. ఇంటర్ విద్యార్హతతో డిగ్రీ, పీజీ కోర్సులను ఒకేచోట యూనివర్సిటీలు అందిస్తుండడంతో విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సులవైపు ఆసక్తి చూపుతున్నారు. ఐఐటీ.. దేశంలోనే ఇంజినీరింగ్ పరిశోధనల్లో పేరున్న సంస్థ ఐఐటీ. ఎంతో విశిష్టత కలిగిన ఈ సంస్థ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందిస్తోంది. ఎన్నో కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్‌తోపాటు ఎం.టెక్ కోర్సు అందిస్తోంది. దీనిద్వారా విద్యార్థులకు ఒక ఏడాది కాలం కలిసివస్తుంది. ఇంటిగ్రేటెడ్‌లో సీఎస్ఈ, కెమికల్, బయోటెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులు అందిస్తోంది. ‘యోగి వేమన’.. యోగి వేమన యూనివర్సిటీలో బయోటెక్నాలజీ ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్‌లో ఐదేళ్ల కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ‘కాకతీయ’.. కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులున్నాయి. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీలో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ‘డీ మ్డ్’.. దేశంలోని పలు డీమ్డ్ యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందిస్తున్నాయి. సాధారణంగా ప్రతీ విద్యార్థి ఇంజినీరింగ్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదవాలి. ఎంటెక్ కోర్సుకు ప్రవేశపరీక్ష ఉంటుంది. ర్యాంకు రాని ఎడల ఒక సంవత్సర ం వృథా అవుతుంది. దీంతో డీమ్డ్ యూనివర్సిటీలైన ఎస్ఆర్ఎం, విట్, విజ్ఞాన్, కేఎల్, హిందుస్థాన్, అన్నమలై ఇంటిగ్రేటెడ్ కోర్సుల వైపు మన విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. ‘నాగార్జున’.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎమ్మెస్సీ కోర్సు అందిస్తోంది. దీంతోపాటు ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సు ఆఫర్ చేస్తోంది. ఈ రెండు కోర్సులకు ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ‘ఉస్మానియా’.. ఉస్మానియా యూనివర్సిటీలో ఐదే ళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ), ఎంఏ(ఎకనామిక్స్), ఎంబీఏ ఉన్నాయి. ఇంటర్లో సంబంధిత కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ‘హైదరాబాద్ సెంట్రల్’.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, ఎంఏ, లాంగ్వేజ్ కోర్సులు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. జేఎన్టీయూ (కాకినాడ) జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ.. ఇంజినీరింగ్ విభాగంలో ఐదేళ్ల కోర్సులను అందిస్తోంది. ఐదేళ్ల కాలంలో మూడున్నరేళ్లు యూనివర్సిటీలో, మిగిలిన ఏడాదిన్నర కాలం కోర్సు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న విదేశీ యూనివర్సిటీలో విద్యార్థి చదవాల్సి ఉంటుంది. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తిచేసినవారికి బీటెక్‌తోపాటు ఎంటెక్ సర్టిఫికెట్ యూనివర్సిటీ అందజేస్తుంది. ఈఈఈ, సివిల్, ఈసీఈ, సీఎస్ఈ, ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. ఉన్నత విద్యకు వారధులు
డిగ్రీ.. అది పూర్తయ్యాక పీజీ. సాధారణంగా ఈ రెండూ చదవాలంటే వేర్వేరు చోట్ల సాధ్యం! పైగా డిగ్రీ పూర్తయ్యాక పీజీలో చేరాలంటే.. ఏదైనా యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాయాలి. ఆ పరిస్థితి లేకుండా ఇంటర్ అర్హతతోనే డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఒకేచోట పూర్తిచేసే అవకాశాన్ని ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ కోర్సులు కల్పిస్తున్నాయి. వివిధ సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఐఐటీలు ఇలాంటి కోర్సులను అందిస్తున్నాయి. బోధనా విధానంలోనూ, కరిక్యులం రూపకల్పనలోనూ నవ్యత ఉండే ఈ కోర్సులు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన వారు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో చేరవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్/సైన్స్ డిగ్రీతో పాటు పీజీ చేయొచ్చు. లేదంటే లా, మేనేజ్మెంట్, కామర్స్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరి, ఆ తర్వాత మూడేళ్లకే మానేస్తే వారికి డిగ్రీ అందుతుంది. నాలుగేళ్లు చదివితే ఆనర్స్ డిగ్రీ, పూర్తిగా ఐదేళ్ల పాటు చదివితే పీజీ సర్టిఫికెట్ చేతికి వస్తుంది. కాకతీయ యూనివర్సిటీ- వరంగల్ వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ.. కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణులు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాసిన వారు కేయూ సెట్ రాసేందుకు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ: రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22, రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 26. రాత పరీక్షలు ప్రారంభం: మే 2 నుంచి వివరాలకు: www.kakatiya.ac.in ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.. ఐదేళ్ల కాల పరిమితితో నానో టెక్నాలజీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఐదేళ్ల కాల పరిమితి గల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు. పాలిటెక్నిక్ డిప్లొమా, రెండేళ్ల ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారూ అర్హులే. వివరాలకు: www.acharyanagarjunauniversity.ac.in యోగి వేమన యూనివర్సిటీ కడపలోని యోగి వేమన యూనివర్సిటీ బయో టెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్; ఎర్త్ సెన్సైస్‌లో ఐదేళ్ల కాలపరిమితి గల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఒక్కో కోర్సులో 20 చొప్పున సీట్లు ఉన్నాయి. అర్హత: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014 రూ.500 అపరాధ రుసుంతో రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 26-మే 3, 2014 (దరఖాస్తుల అప్‌లోడ్‌కు చివరి తేదీ: మే 8) వివరాలకు: www.yogivemanauniversity.ac.in ఐఐటీలు- ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లు.. ఇంజనీరింగ్ విద్య, పరిశోధనలో అత్యున్నత సంస్థలుగా వెలుగొందుతూ సాంకేతిక ప్రపంచానికి సుశిక్షితులైన మానవ వనరులను అందిస్తున్నాయి. ఇవి కూడా ఐదేళ్ల కాలపరిమితితో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటీ-ఢిల్లీని తీసుకుంటే బయో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయో టెక్నాలజీ (బీటెక్+ఎంటెక్); కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (బీటెక్+ఎంటెక్); కెమికల్ ఇంజనీరింగ్(బీటెక్)+ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్(ఎంటెక్); కెమికల్ ఇంజనీరింగ్ (బీటెక్)+కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ కెమికల్ ఇం జనీరింగ్(ఎంటెక్);ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(బీటెక్) +ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎంటెక్)కోర్సులను ఆఫర్ చేస్తోంది. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఓయూ సెట్-2014 ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఎంఎస్సీ- కెమిస్ట్రీ: ఈ కోర్సును ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎంఎస్సీ- ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ: ఈ కోర్సును తెలంగాణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. అర్హత: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూప్‌లతో ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు కోర్సులో ప్రవేశాలకు అర్హులు. అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్కులు సరిపోతాయి. మిగిలిన వారికి కనీసం 50 శాతం మార్కులుండాలి. ఎంఏ- అప్లయిడ్ ఎకనామిక్స్: ఈ కోర్సును తెలంగాణ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. ఎంబీఏ (ఐదేళ్లు): ఈ కోర్సును మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఎంఏఎం: ఈ కోర్సును తెలంగాణ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. {పవేశ పరీక్ష: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 ప్రశ్నలకు గంటన్నర వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. వెర్బల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ డేటా అనాలసిస్, రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అప్లయిడ్ ఎకనామిక్స్: మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఎకనామిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ: ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు మ్యాథమెటిక్స్/ బయాలజీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 9, 2014. అపరాధ రుసుంతో చివరి తేదీ: మే 16, 2014. వెబ్సైట్: ouadmissions.com శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. డెరైక్ట్ అడ్మిషన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ విద్యార్థులకు 42:36:22 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: మే 10, 2014 వివరాలకు: www.spm-vv.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల కాల పరిమితి గల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల (బీటెక్+ఎంటెక్/ఎంబీఏ)ను ఆఫర్ చేస్తోంది. కోర్సులు: కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్వర్కింగ్; ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; సివిల్, మెకానికల్, కెమికల్,ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ. జియాలజీ, ఎకనామిక్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అవి.. బీఎస్సీ+ఎంఎస్సీ జియాలజీ; బీఏ+ఎంఏ ఎకనామిక్స్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2014 వివరాలకు: www.andhrauniversity.edu.in సెంట్రల్ యూనివర్సిటీ- హైదరాబాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఐదేళ్ల కాలపరిమితితో వివిధ ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఎంఎస్సీ కోర్సులు: మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజిక్స్, కెమికల్ సెన్సైస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సెన్సైస్. హ్యుమానిటీస్ కోర్సులు: హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సెన్సైస్. ఎంఏ కోర్సులు: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ. అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ప్రవేశాలకు ఏటా డిసెంబర్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎంట్రన్స ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: acad.uohyd.ac.in