' ఇంటర్‌తోనే ప్రవేశపెట్టేందుకు ఎన్‌సీటీఈ కసరత్తు
' ఐదారు రకాల కోర్సులపై అధ్యయనం
' నేడు బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌తోనే ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏడాది కోర్సులుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో రెండేళ్ల కోర్సులుగా మార్పు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులనే ప్రవేశపెట్టే అంశంపైనా దృష్టి సారించింది. అంతేకాదు పక్కాగా కళాశాలల నియంత్రణకు చర్యలు చేపట్టాలని నిర్ణయిం చింది.
ఈ అంశాలన్నింటిపై శనివారం బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయాల్సిందేనన్న జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఎన్‌సీటీఈ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా, ప్రొఫెసన్ ఎన్‌కే జాన్‌గిరా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తమ నివేదికలను రెండు నెలల కిందట ఎన్‌సీటీఈకి అందజేశాయి. ఆ కమిటీలు ఉపాధ్యా య విద్య ప్రాధాన్యం, విద్యార్థులను తీర్చిదిద్దడంతో క్రియాశీల ంగా వ్యవహరించే ఉపాధ్యాయ పాత్ర, వారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉండాలన్న వివిధ అంశాలను చర్చించారు. పలు సూచనలు, సలహాల కోసం దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, అధికారులు కళాశాలల యాజమాన్యాలతో ఎన్‌సీటీఈ సమావేశాలు నిర్వహిస్తోంది. కళాశాలలను కూడా పటిష్టం చేసే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రతి కళాశాలలో 100 సీట్లు ఉంటే 50 సీట్లకు ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోం ది. 1:15 రేషియోలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బోధించేందుకు ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు ఉండగా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు అవసరమా? లేదా? అనే అంశాలపైనా చర్చించనుంది.
ఎన్‌సీటీఈ ప్రణాళిక .. వివరాలు
- రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ + గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (2+3+2)
- నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2)
- గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+2+2)
- గ్రాడ్యుయేషన్ + మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+3)
- నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఏ/బీఎస్సీ బీఈడీ) + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2)
ఇక అన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులే!
Published Sat, Jul 26 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM
Advertisement
Advertisement